22, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3140 (తమిళులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి"
(లేదా...)
"తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా"
(ఈరోజు తమిళనాడులోని హోసూరులో శ్రీమతి జయలక్ష్మి గారి పుస్తకావిష్కరణ సభలో నేను పాల్గొంటున్న సందర్భంగా...)

39 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తమిళుల చెన్న పట్టణము ధైర్యము మీరగ రాజధానిగా
  మమతలు చిందు నాంధ్రులట మాకిక రావలెనంచు ప్రీతినిన్
  సమరము చేసి స్రుక్కకయె జంకును వీడిన రాము చావగా
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా :)

  రాము = మా నెల్లూరోడు పొట్టి శ్రీరాములు

  రిప్లయితొలగించండి
 2. ద్రవిడ భాషల యందున రమ్యమైన
  భాష యనుచు సుబ్రహ్మణ్య భారతి యను
  తమిళ కవియె పొగిడె తెల్గు నమితముగను
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి.

  రిప్లయితొలగించండి


 3. అరె జిలేబిని చూడుడి! అస్తమాన
  ము తెలుగు తెలుగోయని తాను మున్కలేయు
  నరకొరగ నైన వ్రాయుచు! నమ్ము డయ్య
  తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. తత్త్వ విజ్ఞాన మూర్తి యా త్యాగరాజు
  రామ మహిమను తెల్గున రచనఁజేసె
  గానమొనరించె తమిళులు కరము భక్తి
  తమిళులకు తెల్గు భాషపై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి


 5. సమతులితమ్ము గాను సరి సాటిగ డెంకణి కోట లక్ష్మి యా
  యముదపు తోడిగా తెనుగు నద్దరి చేర్చిరి గ్రోలెదమ్మికన్
  తెములుము తెన్గు నాది యను తేకువ వెర్రితనమ్ము వీడుమా!
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా!


  హొసూరు తమిళనాడని యెవరన్నారండి :)

  శుభాకాంక్షలతో
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. సుమములఁ బోలు మార్దవపు శుభ్రపుఁ మాటల మాలలల్లితాఁ
  రమణుడు రామచంద్రుని సరాగపు నర్చన జేసెఁ దెల్గునన్
  విమలుడు త్యాగరాజ సుకవీంద్రుడు,నాతని భక్తబృందమౌ
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా!

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. ఆటవిడుపు సరదా పూరణ:
   (జిలేబి గారికి అంకితం)


   తమిళులు మాటలాడరుగ తక్కిన భాషలు భారతమ్మునన్
   విమలపు రీతి త్రోలగను వీడుము మమ్మని యక్కినేనినిన్
   భ్రమమును వీడి శంకరయ! పల్కుట మానుమునిట్టి మాటలన్:
   "తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా"

   తొలగించండి

  2. :) ఇది కదా సరి యైన మాట :)

   మరండీ శోభన్ బాబు గారికి విగ్రహమెట్లా పెట్టేరండి మద్రాసు లో :)


   చేసుకున్న వారికి చేసుకున్నంత :)


   జిలేబి

   తొలగించండి
 8. తేటగానుండి తీయనౌ తేనెలూరు
  దేశ మంతయు మెచ్చెడి తెనుగు భాష
  తెలుగు వారది యేలనొ తెలుసు కొనరు
  "తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి"
  ***)()(***
  (తమిళులైన ఉద్ధండ కవులు అప్పయ్య దీక్షితులు,సుబ్రహ్మణ్య భారతి మొ౹౹వారి
  మెప్పు పొందిన భాష తెలుగు.ప్రతియేట
  పుష్యమాసం బహుళ పంచమిన త్యాగరాజు
  ఆరాధనోత్సవాలు ఘనంగా జరిపేది తమిళులే)

  రిప్లయితొలగించండి


 9. జీపీయెస్ వారికి అంకితం :)  భ్రమ గొని నార కంది వర ? భారతి సుందరతెన్గనన్ వెసన్
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా
  ఉమ యని నారు ? పాడుదురు ఊతపదమ్ముగ "రొంబ నల్ల"దం
  చు, ముసుగు వేసి గుద్దుదురు జోతల తోడు నమీతు షా కతన్ !


  సుబ్రహ్మణ్య భారతి సుందర తెనుంగని పొగిడేడని మురిసి పోకుడీ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి
  గనుక వసియించిరట నాంధ్ర ఘనులు గాదె
  చలన చిత్రాలనెన్నియో చెలువు మీర
  చూడ ముచ్చటై వెలిగెనా నాడు యెంతొ!

  రిప్లయితొలగించండి
 11. అరవ భాష యనిన పేర్మి యధిక మయ్య,
  వేరు భాషలనిన సుంత వెక్కిరించు
  తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి
  యనుట తగనిది , తప్పక హాస్య మగును

  రిప్లయితొలగించండి
 12. తమిళులకు తెలుగుబాసపై తగనిప్రీతి
  యాంగ్ల భాషలవారలు నమితముగను
  నిష్టపడుదురు తెలుగును నెందుకతన
  దేశభాషల యందున దెలుగు లెస్స

  రిప్లయితొలగించండి
 13. తీయతేనియతేటంచు తెనుగుబాస
  ఆంధ్రభోజుడు లెస్సగానగ్గలించె
  త్యాగరాయాఖ్యు కృతులకు తలలనూపు
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 14. కవిత లల్లుచు చక్కని కథల రచన
  చేయు వారలు హోసూరు చెలిమి కాండ్రు
  తెలియు నిజమ ది చూడంగ తెల్ల మగును
  తమిళు ల కు తెల్గు బాస పై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ

  ప్రమదయె డేంకణీపురవిభాసితవేంకటనాథదివ్యపా...
  దమునెద భక్తి నిల్పి కవితారససృష్టిని చేసినట్టి యీ...
  యమ జయలక్ష్మియే యనగనందరు పల్కిరిటుల్ హొసూర్ పురిన్
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. డెంకణీ పుర విభాసిత వేంకట నాథ !


   చాలా బాగుందండీ మైలవరపు‌ వారు   జిలేబి

   తొలగించండి
 16. భాష లన్నియు దొడవులు భార తికిని
  పంచ ద్రవిడు లెల్లరుజేరి బాండు పుత్రు
  లవలె కలసి యుండుటజేత ప్రౌఢ మొప్ప
  తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 17. అవనిఁ గృష్ణరాయు పలుకు లలరి వినమె
  దేశ భాష లందుఁ దెలుఁగు తీపి లెస్స
  యెందు నంచు మఱి యనంగ నేమి యొక్క
  తమిళులకుఁ దెల్గుబాసపైఁ దగని ప్రీతి (న్)


  గుమగుమ పప్పుచారనినఁ గోరి భుజించెడు పుణ్య కోటికిన్
  సముదము త్యాగరాజ సరస స్వనురాగ విమోహ గానముల్
  విమల మనో౽న్నమయ్య రస విస్తృత కీర్తన లెల్ల మెచ్చఁగాఁ
  దమిళులకున్ దెలుం గనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా

  [ పప్పు చారు = సాంబారు; అన్నమయ్య నామము యథాతథము సిద్ధ సమాసమున గ్రాహ్యము]

  రిప్లయితొలగించండి
 18. సుమధుర గాయకోత్తముల శుద్ధ సుగాత్ర స్వరార్ణవంబునన్
  విమల మనస్కులై మునిగి వీనుల విందగు గానమంచు నా
  ప్రముఖ కళావతంసులను భాష కతీతముగా దలంతురా
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా

  రిప్లయితొలగించండి
 19. తే.గీ.

  తెల్గు తమిళులు స్వాతంత్ర్య దినము లందు
  సంఘ జీవన మలరుచు సంత సింప
  భాష భేదము లెంచక బల్కు శైలి
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 20. త్యాగరాయ కృతులు సంపద తమకంచు
  నన్నమయ్య పాట లమృతమ్మని దలంచు
  బాల మురళి గాన మనగ పరవశించు
  తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 21. అమలముభాషయన్ననదియాంధ్రమొ కన్నడమో మరేదియో
  విమల మనస్కులెన్నడును భేదము లెంచరు భాష భాషకున్
  తమిళము కాని బాసనిన తాలిమిఁ జూపరుగాని యేలనో
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా"

  రిప్లయితొలగించండి
 22. తమిళమె మాతృభాష యది ద్రావిడ భాషలలోన మేటి యం
  చు, మధుర మంచు నమ్మినను చోద్యమదేమన పండితుండె యౌ
  తమిళ కవీంద్రుడొక్కడట తాఁ వచి యించిన మాట విన్ననా
  తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా

  రిప్లయితొలగించండి
 23. తమదగు తమిళమన్నను మమత మెండు
  తమిళులకు, తెల్గు బాసపై తగని ప్రీతి
  తెలుగు వారల కుండగ వలయు గాని
  యాంగ్ల మన్నను మోజయ్యె నాంధ్రునకును.

  రిప్లయితొలగించండి
 24. తమిళులకున్దెనుంగనిన దద్దయుప్రీతియటన్ననమ్ముమా
  తమిళులు వారిభాషనుదదాత్మనుబొందుచుబల్కుచుండియీ
  సుమధురభాషనెప్పుడును జూడరుప్రీతిగ దెల్గునెప్పుడున్ భ్రమలనుబొందకుండుడిక భాషలువేరుగ రెండుచోటులన్

  రిప్లయితొలగించండి
 25. తే. దివిన త్యాగయ్య జనియించె తిరువయూరు
  తెలుగు చిత్రసీమతమిళచేరువలరె
  అన్నదమ్ములైవీడిరి యొకరినొకరు
  తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి.

  రిప్లయితొలగించండి
 26. మాతృభాష యుటన్నను మమత హెచ్చు
  తమిళులకు; తెల్గుబాసపై తగని ప్రీతి
  నిల కనబరచుచుందుర దేల యనగ
  నాదరించిరి పూర్వీకు లవని ననుచు

  త్యాగ రాజాదిగ కవులు తమిళ దేశ
  ముందు వాసమున్నను గాని యాంధ్ర భాష
  యన్న మక్కువ నధికమౌ నట్టు లున్న
  తమిళులకు తెల్గు భాష పై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  సందర్భము: సులభము...
  "అరుణాచలస్తుతి పంచకము" ను రమణమహర్షి రచించగా శ్రీ గి.నరసింగరావు గారు అనువదించిరి. దానిని కూడ రమణులు తెలుగు లిపిలో వ్రాసికొన్నారు.
  అట్లే "అప్పడపు పాట" కూడ.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  చెలువారగ "భగవాన్ శ్రీ రమణ స్వర్ణ
  హస్తాక్షరి" యటన్న పుస్తకమున
  తెలుగులో రచియించి తెలుగులో లిఖియించె
  రమణ మహర్షి యౌరా! యనంగ..
  "నక్ష రమణ మాల" నామీద "నేకాత్మ
  పంచకము"ను నందుఁ గాంచవచ్చు..
  దనవైన రచనలఁ దగు రీతి మరొకరుఁ
  దెనిగించినను వ్రాసెఁ దెనుగు లిపిని..
  నట్టి రమణుల దివ్య పాదారవింద
  మాశ్రయించెద.. జన్మము సార్థక మగు..
  భాష దేమి? వినిర్మల భావుకులకుఁ
  దమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  22.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 28. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  శ్రీ దేవి భూదేవి సేవించు నాఖేట
  వేంకటేశ్వరునిపై విమల భక్తి
  వరుసగా రచియించె ద్వాదశ శతమణి
  మాలలన్ శ్రద్ధతో మాన్య చరిత
  చెలగి డేంకణి కోట శ్రీమతి జయలక్ష్మి ;
  యిందలి మణిమాలలందు నాల్గు
  దక్కఁ దక్కిన వన్ని చక్కనౌ తెలుగులోఁ
  బొలుపారు; నా తల్లి పుత్ర రత్న
  మనగ దగు రామమూర్తి తా నమల కీర్తి
  తల్లి పొత్తముల్ వెలయించి ధన్యతఁ గన
  నేర్చె; తలి దండ్రుల ఋణముఁ దీర్చికొనెడు
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  22.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 29. తమిళులకు భాషాభిమానము హెచ్చు అను భావము తో...

  చంపకమాల

  శ్రమపడి చెన్నపట్నమున లాలసమొప్పగ తెన్గు వాడివై
  "దమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న" నమ్ముమా
  భ్రమలుఁ దొలంగ వారలట "వచ్చితె యింటను జెప్పి మీరు వా
  యి ముడ శుభమ్ము మీక"నుచు నేర్పడఁ జెప్పుచుఁ బంప కష్టమే!

  రిప్లయితొలగించండి
 30. కలిసి గద్వాల చీరలు కట్టునపుడు
  మెచ్చి గోంగూర పచ్చడి మింగునపుడు
  గాన మాధురీ సౌరభం గాంచు నపుడు
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 31. Blockchain support is needed to fix the errors and resolve the queries that are difficult and out of the reach of a user. Errors while upgrading the Blockchain or installing/uninstalling errors are hard to fix. Under such situations, you can dial Blockchain customer support number and get in touch with the professionals who’re always active to fix the users query in less span of time. The customer professionals are genius and have the wide range of solutions and recovery steps to handle all the errors. Grab the ultimate solutions or process that help in accessing of the account.

  రిప్లయితొలగించండి