12, సెప్టెంబర్ 2019, గురువారం

ఆహ్వానం!2 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు మనవి... ఈరోజు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం బయలుదేరుతున్నాను. రేపు ఉదయం ఆముదాలవలస ద్వారా శ్రీకాకుళం చేరుకుంటాను. అక్కడ రేపటి నుండి శ్రీ ఆముదాల మురళి గారి శతావధానం ఉంది. ఆముదాలవలసలో కాని, శ్రీకాకుళంలో కాని మన సమూహ మిత్రులెవరైనా ఉన్నారా? శ్రీకాకుళంలో రేపు ఒక్కరోజే ఉండి అదేరోజు రాత్రి మళ్ళి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‍లో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం...

  రిప్లయితొలగించండి
 2. జయోऽస్తు... విజయోऽస్తు 💐🙏🙏💐💐🙏🙏

  సరసమనోహరమ్మయిన శాబ్దిక పుష్టిని గల్గి.., భారతీ
  వరపదభావనాగరిమ భావసమృద్ధిని పొంది., సత్కవీ...
  శ్వరులు శిరమ్ములూచునటు పద్యములల్లుచు నాముదాల శ్రీ
  మురళి శతావధాననవమోహనరాగములన్ ధ్వనించుతన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి