సందర్భము: చదువు కొలువు ధనము పదవి ఇలా ఎన్నింటికోసమో కృషిచేస్తున్నాం కాని భగవదనుగ్రహంకోసం ఏమి కృషి చేస్తున్నామో తమను తాము ప్రశ్నించుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ఎందుకంటే అన్నింటికంటే జీవితంలో అదే ముఖ్యం అని విజ్ఙు లంటారు. ఇక సాహిత్యం మొదలైన కళలూ భగవత్కృప పొందడానికే అని వేరే చెప్ప నక్కర లేదు. భగవత్కృపతోనే ఆత్మ తత్వాన్ని ఎఱుంగడానికి వీలౌతుంది కాని పాండిత్యంతో మాత్రమే కాదు గదా! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ పంతముఁ బట్టి పొత్తములు వందలు వేలు పఠింప నేమి? తా వింతగఁ బద్యముల్ వరుస వేనకు వేలు రచింప నేమి? ఆ వంత దయారసంబుఁ బర మాత్ముడు జిల్కక యాత్మ తత్వ మెం తెంతటి పండితుం డయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 26.9.19 -----------------------------------------------------------
సందర్భము: ఒక నవాబు వద్ద నిద్దరు వేద పండితులు సన్మానితులై అక్కడనే యుండిరి. వారు విద్యా గర్వంతో "పర్యటించి వేద పండితు లందరినీ గెలిచి వస్తా" మని బయలుదేరారు. దత్తాత్రేయుని యవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామికి త్రివిక్రమ భారతి యనే శిష్యు డుండేవాడు. అతనికి వాదన యిష్టం లేదు. వేద పండితులు తమతో వాదించితీరా లన్నారు. అతడు స్వామి యనుమతి కావా లన్నాడు. స్వామి దారిన పోయే ఒక దళితుని బిలిచి యేడు గీతలు నేలపై గీయించి ఒక్కొక్కటీ దాటు మన్నాడు. అత డట్లే చేశాడు. ఏడవ గీత దాటగానే "నీ వెవ" రని యడిగినాడు స్వామి."వేద శాస్త్ర పారంగతుడనైన బ్రాహ్మణుడ" నన్నాడు వాడు. స్వామి వాదించు మన్నాడు. ఆత డద్భుతంగా వాదించి వేద పండితుల గర్వ మణచినాడు. వారు స్వామికి పాదాక్రాంతులైరి. దత్త తత్వాన్ని ఎంతటి పండితుడైనా అర్థం చేసుకోగలడా! ఒక పామరుని సస్వర వేద మంత్రాలను విని ప్రజ లాశ్చర్యపడి స్వామిని కొనియాడిరి. "విద్యా విహీనులైనా సాటి బ్రాహ్మణుల పట్ల ద్వేషం పనికిరా దని, వినయ విధేయతలు గురు భక్తి గలవాడు ఏ కులంవాడైనా క్రమంగా బ్రాహ్మణత్వం పొందడానికి అర్హుడే అవుతా" డని స్వామి పలికినాడు. శక్తి పాత మంటే యిదే నేమో!.. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ పంతముఁ బట్టు పండితులు వాదముఁ జేయు డటన్నఁ బంచమున్ జెంతకుఁ బిల్చి విప్రునిగఁ జేసి క్షణాన నృసింహు డంప వే దాంతపు చర్చలో గెలిచె నాతడు వింతగ.. దత్త తత్వ మెం తెంతటి పండితుం డయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే!
తేటగీతి: ఎంత భక్తుడు పండితు డెంత బలుడు ఎంత తాపసి రావణు డెంత ఘనుడు సుంత హీనత జూపెను సీత బట్టి ఎంత నేర్చిన కర్మల నెన్న దరమె ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిసంతను బీరకాయ వలె చక్కని వస్తువు కాదుకాదయో
వింతది మాయరో తెలియ విజ్ఞుల కైనను చేత చిక్కదే
పంతము మీర నేననుచు వ్యాకుల మిచ్చెడి రోగమే ప్రభూ!
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే?
'మాయ'ను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదీనినే ముస్లిములు షైతాన్, క్రైస్తవులు 'సాతాను' అంటారు.
🙏
తొలగించండిచావు పుట్టుక లిలలోన సహజమంచు
రిప్లయితొలగించండిచెప్పుచుండుటె కద్దు నే శిష్టుడైన
మరణ మెప్పు డదే రీతి మనను జేరు
టెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశకునములు చెప్పు బల్లికిన్ జావు తెలియ
రిప్లయితొలగించండిబోదు, జ్యోతిష్య శాస్త్రము పుక్కిటనిడు
డెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె"
తనదు మరణసమయమును ధరణి లోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(జవహర్ పండితుడు చౌయన్ లైని నమ్మి "పంచశీల" ప్రవచించి మోసపోయాడు )
రిప్లయితొలగించండిఅంతటి గాంధిజీకి మది
కంతగ నచ్చిన శిష్యమూర్తియే !
వింతగ గ్రంథముల్ జెయిలు
వీధుల వ్రాసిన గణ్యమూర్తియే !
సుంతయు చీనిమోసమును
చోద్యముగా గ్రహియింపలేడుగా !
నెంతటి పండితుండయిన
నేర్పడ దా నెరుగంగలేడుగా !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సుంతయు కష్ట మెంచకయె సూటిగ పోతివి వెండికొండకున్
పంతము పట్టి మోడినహ పార్లియ మెంటున కౌగిలించితే!
వింతది వోటరున్ మనసు విడ్డుర మియ్యది రాహులయ్యరో!
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిపొంతన లేని ప్రేమఁ దన పుత్రుని కాదని ముద్దుముచ్చటన్
జెంతకుఁ జేర్చి లాలనల సేమముఁ జూచెడు కైక రామునిన్
వింతగఁ గానలన్ బనిపి వేదనఁ బెంచఁగ జాన మానసం
బెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే?
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివింతయె గోరుముద్ద దినిపించును పిల్లలకెల్ల , భర్తకున్
చెంతనె చేరి ముద్దులిడు., సేవలు చేయుచు తృప్తి పొందునెం...
తెంత శ్రమించునో కద కవీ ! సతి యోపిక తూచి యెంతయో
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నమోనమః
తొలగించండిమైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచీమ నే తీరు బరువుతో దీన బోదు?
రిప్లయితొలగించండిశలక మే విధి మేడల నలక గలదు?
దేవ దేవుని సృష్టిలో తీరు లెన్నొ
ఎంత పండితుడైన దా నెఱుఁగగలడె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దీన బోదు'....?
రిప్లయితొలగించండితాళికట్టి మగనిగా వితతియు గాన
నేమి యింతి మానసమున నేమి యోచ
న గలదని నేమి యదిచేయు నని జిలేబి
యెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...గలదని యేమి' అని ఉండాలనుకుంటాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅప్ప్రసూతి శ్మశానపు టప్పురాణ
పూర్వకంబుగ వైరాగ్యముల్ గదల్చ
మౌనులై యాదట మఱచు మానసంబు
నెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె?
వైరాగ్యత్రయంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. ఉ.మా.
***** ***
వింతయె గాదు మానవుడ వీక్షణజేయగ ధాత్రినందునన్
చెంతన జ్ఞాన సంపదను శ్రేష్టపు పాండితి యెంత యున్ననున్
కాంతల చిత్తమున్ మరియు కాయము
వీడుచు నేగు ప్రాణమున్
ఎంతటి పండితుండయిన నేర్పడ దా నెఱుగంగ శక్యమే
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసుంతయు నింటి సంగతులు చూడడు-చెప్పును ప్రక్కవారికిన్
రిప్లయితొలగించండివింతలుఁగొల్పు ప్రశ్నలకు పెద్ద పరిషృతి సాధనంబుల్
చెంతకు వచ్చు ఖేదముల జిక్కీ,కృశించి ,తపించు, వాడునై
యెంతటి పండితుండయిన నేర్పడఁదా నెఱుగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివింతలు వేలుగా గలుగు విశ్వము నంతట మానవాళికిన్
రిప్లయితొలగించండిఅంతయు తానెనౌచు మరి యంతకు జ్జ్ఞానము బోధ జేయుచూ
ఇంతయు జేసియుండినను- యింతి మనంబున నేమి నున్నదో
ఎంతటి పండితుండయిన నేర్పడ దా నెఱుంగ శక్యమే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తానె యౌచు ... బోధ జేయుచున్... యుండినను నింతి..' అనండి.
రిప్లయితొలగించండి"కాంతకు తాళికట్టితిని గండరగండడ నర్మకీలుగా
వింతగ పేరుగాంచితిని విశ్వము నాదను దానినే సృజిం
పం తగడెత్తినాడ గద" పారుడ నంగ జిలేబి నవ్వెగా
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సృజింపన్ + తగడు = సృజింపం దగడు, సృజింపఁ దగడు, సృజింప న్దగడు' అవుతుంది.
సుంతగనైన జ్ఞానమును శుద్ధమునేర్వనివాడు సూరియా?
రిప్లయితొలగించండివింతగ శాస్త్రమంతటిని,వేదన బొందగ జేయ ధర్మమా?
పంతము భార్యతో డనిక పాన్ పునుజేరగ సంశయించువా
డెంతటిపండితుండయిన నేర్పడదానెఱుగంగ శక్యమే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువర్యా!
తొలగించండిదైవ ఘ ట న ల వే రీతితా ర సి ల్లు
రిప్లయితొలగించండినెవరి తలరాత లెట్లు o డు నవనియందు
ననెడు విషయాలు నూహింపఁ నలవి యగు నె
ఎంత పండి తుండైన దా నెఱుగ గలడె ?lu
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తలవ్రాత... విషయము లూహింప...' అనండి.
చంద్రు మీదను నౌకను పంప గలడు
రిప్లయితొలగించండితార లెన్నొ లెక్కలు పెట్ట దగిన వీడు
ఎంత పండితుడైన దా నెఱుఁగగలడె
ఇంతి మనసున సాగెడి పంథ మేదొ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పంథ యేదొ' అనండి.
సవరణ తో
తొలగించండిచంద్రు మీదను నౌకను పంప గలడు
తార లెన్నొ లెక్కలు పెట్ట దగిన వీడు
ఎంత పండితుడైన దా నెఱుఁగగలడె
ఇంతి మనసున సాగెడి పంథ యేదొ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి... శంకరాభరణం... . 26/09/2019 .....గురువారం..
రిప్లయితొలగించండిసమస్య:
ఎంతటి పండితుడైన దా నెఱుగ గలడే
నా పూరణ. తే.గీ
***** ***
కాయము వీడి ప్రాణము పోవు కారణమును
కాంత యంతరంగపు లోతు సుంత యైన
ధీమతుడయి జ్ఞానంబుచే తేజరిల్లు
ఎంతటి పండితుడైన దా నెఱుగ గలడే*
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణదోషం. సవరించండి.
ఇంతి మనసున సాగెడి పంథ మొదులు
రిప్లయితొలగించండిఎంత పండితుడైన దా నెఱుఁగగలడె
క్షణములో నీ మదే తెరచాటు దాగు
రేపు నీపాటి యూపిరే రీతి నుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పంథము' అన్న పదం లేదు. ఒదులు అనడం సాధువు కాదు. 'మది + ఏ, ఊపిరి + ఏ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
దిక్కు,సమయము, తావుల ధిక్కరించి
రిప్లయితొలగించండివిశ్వ మంతట వెలిగెడి విష్ణు రూపు
నెవ్వ రెరుగ గలరు గన నీజగతిని
"ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె"?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంతత శాస్త్రచర్చలు,విచారణ జేయుచు శిష్యకోటికి
రిప్లయితొలగించండిన్నెంతటి క్లిష్టపాఠమున కేనియు వ్యాఖ్యను జేయనేర్పరౌ
యెంతటి పండితుండయిన నేర్పడ దా నెరుంగ శక్యమే
సుంతయు జెప్పిరానిదగు చోద్యపపు చావది లెక్కతప్పకన్
చోద్యపు చావది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నేర్పరి + ఔ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. 'తప్పక' అన్నది కళ. ద్రుతాంతం కాదు.
చెంతకుఁ జేరఁవత్తుననిఁ జెప్పకఁ వచ్చును మృత్యువెప్పుడో
రిప్లయితొలగించండివింతగఁ దేహగేహమునఁ వెల్గెడుఁ బచ్చని జీవచేతనా
కాంతుల దీపమున్ గరచి కట్టెను సేయు,దీని వా
డెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణదోషం. సవరించండి.
చర్చ లెన్నియో చక్కగ సలుప గలడు
రిప్లయితొలగించండిసూక్తు లెన్నియో జనతకు చొనుప గలడు
గాధ లెన్నిటి నోవ్రాయ గలడు గాని
ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని ఎఱుగలేనిది ఏదో చెప్పలేదు.
తాను = తనకుతాను, oneself ఆం.భా(తనగురించి తానే) 🙏🏽
తొలగించండికాంత మదిని దెలియ లేడు కంతుడైన
రిప్లయితొలగించండినెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
చెంత చింతామణియె జేరినంత దనకు
చింత మిగిలె నడగె ధర్మ చింతనమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచింత యదేల? మానుమిక, చెప్పిన దెవ్వడు? తెల్పుమంటి నీ
రిప్లయితొలగించండికింతటి ఘోర వార్తను, మహీతల మందున నెవ్వడేని యా
హంతువ దెప్పుడే విధిని యాగత మౌనని చెప్పఁ ధాత్రిలో
నెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విధిని నాగతమౌనని...' అనండి.
శివుని యాజ్ఞతో సాగును జీవితమ్ము
రిప్లయితొలగించండిపాపపుణ్యముల్ గని విధి వ్రాయునట్టి
కర్మ ఫలమున నగు చావు మర్మ మవని
నెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముక్తి కోరుచు భక్తిలో మునగ గలడు
రిప్లయితొలగించండిచెంగులో భస్మ మవలీల నింప గలడు
ఝటితి లోప్రవచన మీయగలడు గాని
ఎంత పండితుడైన దా నెఱుఁగగలడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మునుగ గలడు' అనండి.
సవరణతో
తొలగించండిముక్తి కోరుచు భక్తిలో మునుగ గలడు
చుంగులో భస్మ మవలీల చూప గలడు
ఝటితి లోప్రవచన మీయగలడు గాని
ఎంత పండితుడైన దా నెఱుఁగగలడె
ఎవరుచేసెడి పనులువారెఱుఁగ గలరు
రిప్లయితొలగించండిఖరముయోండ్రింపు శునకము తరముగాదు
పామరులు జేయు కులవృత్తి పనుల సరణి
ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి. *శ్రీ గురుభ్యో నమః*
రిప్లయితొలగించండిశంకరాభరణం-సమస్యాపూరణం
సమస్య ::
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుగంగ శక్యమే?
సందర్భం ::
గోగోపకుల దాచిన బ్రహ్మ అన్నిరూపాలను పొందిన బాలకృష్ణుని మాయను తెలిసికొనలేక క్షమించమని ప్రార్థించిన సందర్భం.
పూరణ ::
భ్రాంతుడు బ్రహ్మ దాచె వరవత్సములన్ వరగోపబాలురన్.
వింతగ నన్ని రూపముల వేగమె దాల్చిన కృష్ణు జూచి నీ
వింతల నే నెఱుంగననె, వెన్నుని లీల యనూహ్యమౌ గదా!
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుగంగ శక్యమే?
కోట రాజశేఖర్ నెల్లూరు.26-9-2019
అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిశ్రీ గురుభ్యో నమః
తొలగించండిసూర్యు బలమెద్ది విశ్వము చుట్టు దిరుగ
రిప్లయితొలగించండితార లంతరిక్షమ్మున మూరె నెట్లు
భూమి కాధారమై నిల్చె నే మగండొ
యెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
అంతట నింపుగా క్షరుఁడు నక్షరుఁ డంచు వచింప విశ్వమం
దెంతటి వారు నేర రయ యిమ్మెయినిం బరమాత్ముఁ డుండు నం
చింతయుఁ జిత్తమం దకట యీతఁడె మాడవ వాఁడు బ్రహ్మమే
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
నా శ్రీ కృష్ణ సూక్తి సుధాకరము నుండి:
తొలగించండితే.గీ.
జగము నందు నక్షరుఁడును క్షరుఁ డనంగ
నిద్దఱు పురుషులుండఁగ నెల్ల భూత
ములు క్షరము లని యక్షరముగ నుడువ బ
డు మఱి దేహ మందున్న వాఁడు సతతమ్ము
శ్రీ కృష్ణ. సూ. సు. పురుషోత్తమ విభాగము. 16.
తే.గీ.
ఇంక నొకఁ డుత్తముఁడు గలఁ డిచ్చటఁ బురు
షుండు పిలువఁబడుఁ బరమాత్ముండని యెవఁ
డవ్యయుం డవినాశుఁడు నఖిల జగము
ల వెలసి భరించు వాఁడు దలంచఁ బతియె
శ్రీ కృష్ణ. సూ. సు. పురుషోత్తమ విభాగము. 17
మీ రెండు పూరణలు, కృష్ణ సూక్తికి చెందిన రెండు పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమూడవ వాఁడు
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా
నెఱుఁగంగ శక్యమే
సందర్భము: చదువు కొలువు ధనము పదవి ఇలా ఎన్నింటికోసమో కృషిచేస్తున్నాం కాని భగవదనుగ్రహంకోసం ఏమి కృషి చేస్తున్నామో తమను తాము ప్రశ్నించుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి..
ఎందుకంటే అన్నింటికంటే జీవితంలో అదే ముఖ్యం అని విజ్ఙు లంటారు.
ఇక సాహిత్యం మొదలైన కళలూ భగవత్కృప పొందడానికే అని వేరే చెప్ప నక్కర లేదు. భగవత్కృపతోనే ఆత్మ తత్వాన్ని ఎఱుంగడానికి వీలౌతుంది కాని పాండిత్యంతో మాత్రమే కాదు గదా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
పంతముఁ బట్టి పొత్తములు
వందలు వేలు పఠింప నేమి? తా
వింతగఁ బద్యముల్ వరుస
వేనకు వేలు రచింప నేమి? ఆ
వంత దయారసంబుఁ బర
మాత్ముడు జిల్కక యాత్మ తత్వ మెం
తెంతటి పండితుం డయిన
నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
26.9.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివింతగు దీరులన్ పుడమి వేల విధమ్ముల వర్ణ శోభలన్
రిప్లయితొలగించండిపంతుగ నొప్పు పుష్ప పరివాస విశేష మనోజ్ఞ సృష్టి నా
ద్యంత మనోహరాకృతి విధాత లిఖించు విచిత్ర చిత్రముల్
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంతట నివ్వటిల్లు పరమాత్ముని లీలల నెవ్వరేనియున్
రిప్లయితొలగించండిసుంతయు నేర్వజాలరొక సూచన మాత్రమునైననిద్ధరన్
సంతతమెల్ల శాస్త్రముల సాంతమునధ్యయనంబొనర్చియున్
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివింతగు చిన్ని స్కర్టులవి వీపును తెల్లము జేయు టాపులిం
రిప్లయితొలగించండితింతగు పోనిటేల్సు కట!తిల్కము దిద్దని బోడిమోములన్
భ్రాంతియె కల్గు పూరుషుడ! భామ!యటంచును శంకతోడ తా
*నెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివింత *యడాగమమ్ము* మదివేదన బెట్టును పద్యమందు ని
రిప్లయితొలగించండిర్ఘాంతము నొందజేయునదె కంటకమౌచు *నుగాగమమ్ము* నా
స్వాంతము నందు నెంచితిని *శంకర!* రెంటిని మీరుదక్క హే
*యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఅంతము లేనియా గగన మందగ వచ్చును వింతగాదు ని
రిప్లయితొలగించండిశ్చింతగ నబ్ధిలో మునిగి శీఘ్రమెఱుంగగ వచ్చులోతు హా
కాంత మనస్సులోతు నెఱుఁగంగనసాధ్యము నిశ్చయమ్ముగా
*నెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మంతన మెంతొజేసి భువి మర్త్యుడెఱింగెను వింతలెన్నియో
రిప్లయితొలగించండిపంతముబట్టి చేరియట ప్రాజ్ఞుడు చంద్రుని చెంత వేడుకన్
వింత యదేమొగాని మరి వీడగ ప్రాణము లెందుబోవునో
*యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఎంతటి కార్యమైన కడునింపుగ చేయు సదా గృహమ్ములో
రిప్లయితొలగించండిసుంతయు శ్రాంతమున్ గొనదు చూపును ప్రేమను కాపురమ్ముపై
పంతము పట్టెనేని వెస భైరవి యౌ సతి మానసమ్ము తా
నెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎంతటి ధర్మరాజుయిన నేరుగ జూదపు నాటలో మదిన్
రిప్లయితొలగించండిసుంతయు కోలుపోక తను చూచియు చూడక పందెమొడ్డకన్
అంతటి పాండుపుత్రులుయు నంతను ఆటల నోడినంగతిన్
ఎంతటి పండితుండయిన నేర్పడ దా నెఱుగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాజయిన... జూదపు టాటలో ... పందెమొడ్డకే... పుత్రులును నంతట నాటల...' అనండి.
ధన్యవాదాలు గురువు గారూ...
తొలగించండిసవరణలతో ...
ఎంతటి ధర్మరాజయిన నేరుగ జూదపు టాటలో మదిన్
సుంతయు కోలుపోక తను చూచియు చూడక పందెమొడ్డకే
అంతటి పాండుపుత్రులును నంతట నాటల నోడినంగతిన్
ఎంతటి పండితుండయిన నేర్పడ దా నెఱుగంగ శక్యమే
చింతలు వంతలంచు నిటు జీవన బంధములందు జిక్కి యా
రిప్లయితొలగించండివంతయు శ్రద్ధ లేక భగవంతుని చిత్తమునందు నిల్పకన్
అంతము నందు జింతిలుచు నార్తిగ శాంతిని గోరు దైన్యమున్
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిల్పకే' అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా
నెఱుఁగంగ శక్యమే
సందర్భము: ఒక నవాబు వద్ద నిద్దరు వేద పండితులు సన్మానితులై అక్కడనే యుండిరి. వారు విద్యా గర్వంతో "పర్యటించి వేద పండితు లందరినీ గెలిచి వస్తా" మని బయలుదేరారు.
దత్తాత్రేయుని యవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామికి త్రివిక్రమ భారతి యనే శిష్యు డుండేవాడు. అతనికి వాదన యిష్టం లేదు. వేద పండితులు తమతో వాదించితీరా లన్నారు. అతడు స్వామి యనుమతి కావా లన్నాడు.
స్వామి దారిన పోయే ఒక దళితుని బిలిచి యేడు గీతలు నేలపై గీయించి ఒక్కొక్కటీ దాటు మన్నాడు. అత డట్లే చేశాడు. ఏడవ గీత దాటగానే "నీ వెవ" రని యడిగినాడు స్వామి."వేద శాస్త్ర పారంగతుడనైన బ్రాహ్మణుడ" నన్నాడు వాడు. స్వామి వాదించు మన్నాడు.
ఆత డద్భుతంగా వాదించి వేద పండితుల గర్వ మణచినాడు. వారు స్వామికి పాదాక్రాంతులైరి.
దత్త తత్వాన్ని ఎంతటి పండితుడైనా అర్థం చేసుకోగలడా!
ఒక పామరుని సస్వర వేద మంత్రాలను విని ప్రజ లాశ్చర్యపడి స్వామిని కొనియాడిరి.
"విద్యా విహీనులైనా సాటి బ్రాహ్మణుల పట్ల ద్వేషం పనికిరా దని, వినయ విధేయతలు గురు భక్తి గలవాడు ఏ కులంవాడైనా క్రమంగా బ్రాహ్మణత్వం పొందడానికి అర్హుడే అవుతా" డని స్వామి పలికినాడు.
శక్తి పాత మంటే యిదే నేమో!..
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పంతముఁ బట్టు పండితులు
వాదముఁ జేయు డటన్నఁ బంచమున్
జెంతకుఁ బిల్చి విప్రునిగఁ
జేసి క్షణాన నృసింహు డంప వే
దాంతపు చర్చలో గెలిచె
నాతడు వింతగ.. దత్త తత్వ మెం
తెంతటి పండితుం డయిన
నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
26.9.19
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిఎంత భక్తుడు పండితు డెంత బలుడు
ఎంత తాపసి రావణు డెంత ఘనుడు
సుంత హీనత జూపెను సీత బట్టి
ఎంత నేర్చిన కర్మల నెన్న దరమె
ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి1.జనన మరణము లిప్పుడే జరుగు ననుచు
జాతకములను చూచుచు జగతి యందు
పేరు గాంచినట్టి త్రికాల వేది యైన
నెంత పండితుడైన తా నెరుగు గలడె.
2.తాను చెప్పిన విషయమే ధరణి యందు
సత్యమని వాదనములను సతము చేయ
దాని కుచితరీతిని సమాధానమిడుట
నెంత పండితుడైన తా నెరుగు గలడె.
3.వాన రాకడ యును మరి ప్రాణములవి
పోవుట యను విషయములు ముందుగానె
నెంత పండితుడైన తా నెరుగు గలడె.
యనెడి ప్రశ్నలకు జవాబు లసలు గలవె.
4.మొండితనమును చూపుచు ముందు గాను
తాను చేసిన తప్పులన్ ధరణి యందు
సక్రమమటంచు వాదనల్ సలుపు వాడు
నెంత పండితుడైన తా నెరుగ గలడె.
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'ఎరుగ గలడె' టైపాటు.
వానరాకడ ప్రాణమువదలుటార్య!
రిప్లయితొలగించండియెంతపండితుండైనదా నెఱుగగలడె
జీవమున్నత వరకును జీవియికను
మోక్షకామియై మెలగుట ముఖ్యమిలను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొంతలొ కొంతమేలనుచు కోరివరించెను మేనకోడలున్
రిప్లయితొలగించండిపంతముబట్టి నాపడతి భర్తను బ్రష్టునిజేసె నాపెయే
సుంతయు శాంతిలేదనుచు,శూన్యము జేసెను యామె బంధమున్
ఎంతటిపండితుండయిన నేర్పడదానెఱుగంగ శక్యమే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...బట్టి యాపడతి' అనండి. 'చేసెను + ఆమె' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "జేసె వివాహ బంధమున్' అనండి.
ఎంత శాస్త్రము జదివిన నేమి ఫలము?
రిప్లయితొలగించండిలోక జ్ఞానములేకున్న లోపమేను !
మగువ మనసును రంజిల్లు మార్గ ములను
ఎంతపండితుడైన తా నెఱుగ గలడె?
శాంతిని ధర్మమున్నిలుప సాహసమెంతయొ జేసెమోడియే
రిప్లయితొలగించండిప్రాంతము కాశ్మిరమ్మునిక ప్రాభవమందగజేయు యోచనన్
సాంతము పాతచట్టమును సాహసరీతిన రద్దుజేయగన్
ఎంతటిపండితుండయిన నేర్పడదానెఱుగంగ శక్యమే.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఇందువు పయికి ఎగయుచు నెక్కగలడు
రిప్లయితొలగించండిధేనల గమనమును సరిదిద్ద గలడు
కాగలది గణించుచు చెప్పగలడు గాని
ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె
తాను = తనకుతాను, oneself ఆం.భా(తనను)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఇందువు, ధేనల'?
ఇందువు = చంద్రుడు, ధేన = నది
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుంతలదారినన్నడచిపోవుచునుండగ మార్గమందున
రిప్లయితొలగించండిన్నింతలుగన్నులున్గలిగియింద్రునిబోలుచునుండగామఱి
న్నెంతటి పండీతుండయిననేర్పడదానెఱుగంగ శక్యమే
వింతటిరూపమున్నడరిభీకరశబ్దముగల్గువానినిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దారిలో నడచిపోవుచు.. దారి మధ్యలో నింతలు... బోలుచు నుండగా నయో యెంతటి...' అనండి.
సుంతయుబుద్ధిలేదనుచు,సూత్రముజేసిరి లోకమంతయున్
రిప్లయితొలగించండిపంతముబట్టి పాక్కునిల, పాపులజేసెనుయుగ్రవాదమే
అంతకు నంతయున్, యనుభవించక తప్పున యెప్పుడేనియున్
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'..జేసెను + ఉగ్ర.., అంతయున్ + అనుభవించక' అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం.
సుంతయుబుద్ధిలేదనుచు,సూత్రముజేసిరి లోకమంతయున్
తొలగించండిపంతముబట్టి పాక్కునిల, పాపులజేసెను ఉగ్రవాదమే
అంతకు నంతయున్ననుభవించక తప్పున యెప్పుడేనియున్
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.
------------------------------
[సవరణ పాఠము ధన్యవాదాలతో]
ఎంతయుజెప్పిజూచినను, యేమియుబుద్ధియెరాదు వారిలో
రిప్లయితొలగించండిపంతముబట్టి దేశమును, పాడుగజేసిరి పాక్కుపాలకుల్
సుంతయు మేధయున్ననిక , శూన్యముజేతుర? శాంతిచర్చలన్
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిభార్య గయ్యాలి తనమున పట్టు విడక
మగని వేధింప ప్రతిరోజు మాటలనుచు
దైవ నిర్ణయ మనుకొన తనదు విధిని
ఎంత పండితుండైన దా నెఱుఁగ గలడె
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపంతముబట్టి దేశమును, భ్రష్టుగజేసిరి పాక్కునేతలే
రిప్లయితొలగించండిసాంతము వారికోశములు, సాగిలగాబడె సద్దుజేయకన్
వింతగమారె జీవనము, వీధికినీడ్వగ నుగ్రవాదమే
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.