14, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3132 (పడమటి దిక్కులో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్"
(లేదా...)
"పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

49 కామెంట్‌లు:

 1. విడువగ పాఠశాలనట వేసవి కాలపు తాపమందునన్
  జడియక బాలుడాటలను సంతస మొందుచు సూర్యబింబమున్
  పొడవగు చేతి యద్దమున ప్రొద్దున సాయము చూచుచుండగన్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 2. విడువక నెల్లవేళలను విశ్వము తిర్గును తూర్పుదిక్కుకున్

  బడమటి నుండి గాదె, మరి ప్రాగ్దిశ నుండి ధరిత్రియే సదా

  సుడివడు చుండినన్ జరుగు చోద్యమదేమన జెప్పుచుంటినే

  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పుదిక్కులో

  రిప్లయితొలగించండి
 3. మడి కట్టుక రమ్మీ దరి
  సడి చేయక చేయు మికను సంధ్యాస్తుతులన్
  వడివడిగా జను నదె కను
  పడమట, నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ, గ్రుంకెన్.

  రిప్లయితొలగించండి


 4. అడడా! జిలేబి పద్యం
  బుల తాకిడి సృష్టి గతియె బుచికీ గా మా
  రి లకలక తిరగబడగా
  పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. ఉడుపతియె యస్తమించగ
  పడమట, నుదయించె నినుడు ప్రాగ్దిశ, క్రుంగెన్
  పుడమిని నిండిన తిమిరము
  బెడగది వెల్లివిరిసెగద విశ్వము లోనన్.

  రిప్లయితొలగించండి
 6. వడివడిదిక్కులన్గనగ భారత చిత్రమునూహజేయగా
  కడలియరేబియాఎచట?కారణ మెవ్వడు కాంతిజిమ్మ తా
  పడమటిదిక్కునేమగును?పావన కృష్ణయు చేరునేదిశన్?
  పడమటి దిక్కులో పొడిచె ,భానుడు ,గ్రుంకెను తూర్పు దిక్కులో
  కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్,రంగారెడ్డి

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  యుద్ధభూమిలో మృతుడైన కర్ణుని చూపిస్తూ... కృష్ణుడు...

  నడతయె ముఖ్యమౌనితడు నమ్మెనధర్మము , దుష్టవర్గమం...
  దడుగిడె , దానశౌర్యసుగుణాంచితుడయ్యు రవంత మేలు గాం...
  చడు ! కనుమర్జునా ! యసజమ్మగు మృత్యువు పొందెనాజిలో
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో !!

  (పడమటిదిక్కులో... కౌరవవర్గములో
  పొడిచె... ప్రకాశించినాడు)

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 8. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గడబడచేసి మేఘములు కప్పగ సాయము సూర్యబింబమున్
  తడబడకుండ వేచియట దాచెడి మబ్బులు తేలిపోవగా
  పడమటి దిక్కులో పొడిచె భానుడు ;...గ్రుంకెను తూర్పు దిక్కులో
  చిడిముడిచేసి చంద్రుడట చీకటి రాత్రిని కృష్ణవేణినిన్ 😊

  రిప్లయితొలగించండి


 9. అడరి జిలేబి పద్యపు సయాటల ధాటికి దిక్కు లెల్ల మా
  రె! డమ డమాల్మటంచును సురీల్మని రీతిని మార్చి జెచ్చెరన్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో
  వడివడి గా కవీశ్వర చివాలున బాళియు మారె చిత్రమే


  జిలేబి

  రిప్లయితొలగించండి


 10. ఆకాశవాణికి పంపినది  లొడలొడమాటలాడు భడిలుండొక డచ్చట వల్లె వేయుచుం
  డ డవిణ సద్దు తో గడగడాయని మాటలు తారుమారుగా
  వడివడి పల్కగా నరరె వాక్యము వచ్చెనిటుల్ కవీశ్వరా
  "పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో"


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈసారి బెంగుళూరునుండి చదువబడినది😊
   4 Down...👏

   వచ్చే వారానికి సమస్య:

   "వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్"

   తొలగించండి


  2. నెనరుల్స్! పంపించితిమి‌ :)   జిలేబి

   తొలగించండి
 11. తడబడకుండ వ్రాసెదను తథ్యముగాగ పరీక్షలందు నే
  డడిగిన ప్రశ్నలన్నిటికి నంచు వచించిన మందబుద్ధి యా
  యెడ నొకదాని కొప్పయిన యుత్తర మంచు దలంచి వ్రాసె నా
  పడమటి దిక్కులో బొడిచె భానుడు క్రుంకెను తూర్పు దిక్కులో.

  రిప్లయితొలగించండి
 12. తడబడు మాటల చేరుచు
  మడి కుడుమున్ వలె పరయధరము నెఱుఁగని యా
  జడిమ తనుగ పొందు నడుగ
  పడమట నుదయించె నినుడు ప్రాగ్దిశ గ్రుంకెన్

  రిప్లయితొలగించండి


 13. వడివడి విమాన మెక్కితి
  పడమట, నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ, గ్రుంకెన్
  జడి బెంగుళూరు నే చే
  రెడు వేళన్ గీము వెడల రివ్వున సుమ్మీ !  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. చెడెనప్రాచ్యపు భాషయె
  "సడనుగ "సంటరు" టిఫినులు" సారీ" లనుచున్!
  కడకిట్లు"మర్డ"రాయను
  పడమట నుదయించె నినుడు ప్రాగ్దిశ క్రుంగెన్!!

  రిప్లయితొలగించండి
 15. అడడా! ఎప్పుడు కూడను
  అడిగిన ఫోనున్ యెడ కనపడని బడుప నా
  కొడుకడు వాడే చేయగ
  పడమట నుదయించె నినుడు ప్రాగ్దిశ గ్రుంకెన్

  రిప్లయితొలగించండి
 16. వడిగల మేము సేయమిక భారత దేశపు కొల్వు నెప్పుడున్
  కడపటి మాట లేదికను కావలె నన్నచొ వేరు పోవుదమ్
  కొడుకుల యెగ్గు మాటవిని కోపము వచ్చెను తల్లిదన్ద్రికిన్
  లొడలొడ మంచు యేడ్చుచు పొలోమని లేచిరి యక్క చెల్లెలున్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 17. చంపకమాల:
  గుడిసెల చూరు లందు చిలుకొంకెల జిక్కిన యాంధ్ర సాహితిన్
  పడమటి పాలకుండొకడు"బ్రౌనుడు" పండిత మేధ సాయమున్
  తడిమి పరిష్కరించి కడు ధన్య నిఘంటువు గూర్చె దెనుంగునన్
  పడమటి దిక్కు లో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పుదిక్కులో !

  రిప్లయితొలగించండి
 18. పడమట నస్తమించు రవి బంగరు రంగుల సౌరు జూపగన్
  వడివడిగానె యంత్రమును వారలు దెచ్చిరి గాని జూడగా
  తడబడి వెన్క ముందుగ ప్రదర్శితమై లఘు చిత్రమందునన్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 19. మిడిమిడి తెల్వితేటలను మేదిని యందున జూపు బాలునిన్
  వడివడి బిల్చి జెప్పుమ ప్రభాకరుడేదిశ బుట్టి గ్రుంగునో
  తడబడి జెప్పె వాడిటుల తక్కిన మిత్రులు చూచుచుండగా
  పడమట దిక్కులో బొడిచె భానుడు గ్రుంకెను తూర్పుదిక్కునన్!!!

  రిప్లయితొలగించండి
 20. చంపకమాల:
  కుడిఎడమైననేమి యది కూరిమి యేపొరపాటుకాదనన్
  పొడిపొడిమాటలే బలుకు పోకడ జూపిన తప్పుకాదనన్
  తడిపొడి తాపమే గనగ తర్కపు బ్రేమయు నమ్మ కెట్లనఁన్
  పడమటిదిక్కులో పొడిచె భానుడు క్రుంగెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 21. గడ బిడగ పల్కు చొక్క డు
  తడ బడి పొంతన ము లేని తప్పుడు కరణి న్
  వ డి వడిగా నిట్ల ని యెను
  పడ మట నుదయించె నినుఁడు ప్రాగ్డిశ గ్రుంకె న్

  రిప్లయితొలగించండి
 22. కడలికి నావల యడుగిడి
  అడిగిన తప్ప తానుగ వినపడని యా
  కడు శుంఠ తనుగ రాగా
  పడమట నుదయించె నినుడు ప్రాగ్దిశ గ్రుంకెన్

  రిప్లయితొలగించండి
 23. కడకు నప్రాచ్యులు సహితము
  నడవడి భారతిని జూచి నలువురు మెచ్చన్
  చెడితిమి మనమిక తుదకున్
  పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్

  రిప్లయితొలగించండి


 24. ఈ మధ్య అమెరికా అబ్బోడొకడు పిలగాడు తెలుగు నాట హోరెత్తిస్తున్నాడని చదివా !  వడినేర్చిరా యమెరికా
  బుడతలు తెలుగుని వధాన పూర్ణులయిరి; మా
  దుడుకలు మరిచిరి తెలుగుని
  పడ మట నుదయించె నినుఁడు ప్రాగ్డిశ గ్రుంకెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. పడమటిదేశమేగినప్రభాకరశాస్త్రులుభార్యతోననెన్
  బడమటిదిక్కులోపొడిచెభానుడుగ్రుంగెనుదూర్పుదిక్కులో
  పడమరతూర్పుదూర్పునగుబశ్చిమదిక్కుగమారునచ్చటన్
  గడిబిడయైతివేలలన,గాలముమార్పులుసాజమేగదా

  రిప్లయితొలగించండి
 26. పడమటి కనుమల నందున
  నడరిన గోదా వరి నది యంతిమ మందున్
  కడలిని చేరుట జూడగ
  "పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్"

  రిప్లయితొలగించండి
 27. వడివడిగ మాటలాడుచు
  నడపా సుబ్బన్న శాస్త్రి యందరి యెదుటన్
  గుడియెడమగ నిటు పలికెను
  బడమట నుదయించెనినుడుప్రాగ్దిశ గ్రుంకెన్

  రిప్లయితొలగించండి
 28. ఆకాశవాణిలో ప్రసారం:
  వడివడి లేచి వేకువనె వార్చగ సంధ్యను క్రొత్తయూరిలో
  నడుగగ తూరుపేదియనియాప్తుని చేరఁగబిల్చి నంతటన్
  తడబడి తూరుపుందెలిపె తప్పుగపశ్చిమ దిక్కటంచహో!
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో!!

  దొడవ యొకండు దిక్కులను తోచినరీతిగ మార్చిచెప్పగా
  బడమరతూరుపంచుతడబాటును మోమునఁగాననీక, పెం
  పడరగఁ దల్చె నంతటను పాపమమాయక చక్రవర్తియున్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో!

  రిప్లయితొలగించండి
 29. బడి యన గడబిడ జేసెడి
  బుడతడు వడివడి నేడిటు బుద్ధిగ రాగా
  తడబడిరందరు దలచుచు
  "పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్"

  రిప్లయితొలగించండి
 30. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
  సమస్యాపూరణ కార్యక్రమంలో...
  14/09/2019 శనివారం ప్రసారం కాబోతున్న సమస్య

  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పుదిక్కులో

  నా పూరణ. చం.మా.
  **** *** ***
  బడి చను బాల లందరికి భాస్కర పాఠము జెప్పుచున్ గురుం

  డడుగగ ప్రశ్న వారలను,యత్నము జేయగ లేచె నొక్కడును;

  తడబడి ఛాత్రు డివ్విధము దప్పుగ బల్కెను దారుణంబుగా

  " పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పుదిక్కులో "

  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి
 31. ఆకాశవాణి వచ్చే వారపు సమస్య

  వచ్చెను మార్గ శీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్

  రిప్లయితొలగించండి
 32. ధర వాసుదేవు లిద్ద ఱ
  డర రవి సన్నిభ తనులు పడమరయు నింకం
  బురుహూత దిశలఁ జిత్రము
  పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్

  [ఇనుఁడు పడమట నుదయించె, ప్రాగ్దిశఁ గ్రుంకెన్]


  తడయక కూల్చి యస్త్రముల దద్దరిలంగ ధరాతలమ్ము నే
  నడరి కురూగ్ర సేన నని నావులఁ దెత్తును జూడుఁ డంచు నా
  గడుసరి యుత్తరుండు వలుకన్ మదిఁ దోఁచు గదయ్య యెట్లనం
  బడమటి దిక్కులో పొడిచె భానుఁడు గ్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 33. కందం
  పొడముచు శంకర 'రవి' కా
  లడిఁ గంచికిఁ జేరె మతము రక్షించుటకై
  వడిగన్, దక్షిణ ప్రాంతపు
  పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్

  చంపకమాల
  పొడముచుఁ గుంతికిన్ బరుల ముంగిలి సాకిన దాన కర్ణుడే
  విడుమని కౌరవేయులను వెన్నుడు బల్కుచు పాండవాళితో
  ముడివడ మేలు మేలనిన మొండితనమ్మును వీడకుండగన్
  బడమటి దిక్కులో పొడిచె భానుడుఁ గ్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 34. ఒడిదుడుకుల్ ఘటిల్లక మహోదయమొందు తెరంగు చూపుచున్
  కడు యశమున్ గొనెన్ భరత ఖండము, వైదిక విద్య దన్నుతో
  వడి జగమంతయున్ కడిఁది వ్యాప్తిని పొందె, నడంగ నిచ్చటన్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు క్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 35. వడిఁగల చంద్రయానమును బంపిన భీతిలి చంద్రుడయ్యెడన్
  దడబడి శత్రుశంకఁ గొని దాగెను తూరుపుకొండమాటు నా
  తడవునఁ దావులేమిఁ గని, తద్గతహేతువెఱుంగ లేక తాఁ
  బడమటి దిక్కులో పొడిచి భానుడు గ్రంకెను తూర్పు దిక్కులో.

  రిప్లయితొలగించండి
 36. బుడిబుడి నడకల బుడుతడు
  వడివడిగా నడుగులేసి పరుగులుదీయన్
  తడబడి పూరణ జేసితి
  పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్!

  రిప్లయితొలగించండి
 37. మడమనుదిప్పబోననుచు మాటలుజెప్పినముఖ్యనేతయే!
  వడిచడివోటువేయ ప్రజ వాసినిబొందినరాజధానినే
  తడబడిమార్చుచుందుమన, తధ్యము రైతుల కంటిమంటకున్
  పడమటి దిక్కులో బొడిచె ,భానుడు,గ్రుంకెను తూర్పు దిక్కునన్

  రిప్లయితొలగించండి
 38. నుడువుటమేలు సత్యమును ,నూరది,యారుగమారనైన తా
  సుడివడిస్రుక్కిసోలి యట,సూరుడితాపము తాటదీయగా
  వడివడినిచ్చి వాక్కులను ,వాలునెరుంగుచు మార్చగనెంచగా
  పడమటి దిక్కులో బొడిచె ,భానుడు,గ్రుంకెను తూర్పు దిక్కునన్

  రిప్లయితొలగించండి
 39. పడిపడి పాతనేతలట,పట్టుగ గట్టిన రాజధానినే!
  తడబడి, బొత్సమంత్రియట,తధ్యము మార్పును జేతుమిద్దనన్
  సుడివడి రైతుసోదరులు, సూత్రము,దెంచగ బాధజెందగా
  పడమటిదిక్కులోబొడిచె,భానుడుగ్రుంకెను తూర్పుదిక్కులో

  రిప్లయితొలగించండి
 40. వడివడియాత్రజేయుచును, వాక్కులదానముజేసెనాతడే!
  సుడివలె పీఠమెక్కగనె,సూనృతవాక్యములన్ని తప్పగా
  వడివడినీరుగార్చగను, వాణిని మార్చుట జూసినింగినన్
  పడమటిదిక్కులోబొడిచె,భానుడుగ్రుంకెను తూర్పుదిక్కులో

  రిప్లయితొలగించండి
 41. వడివడి వచ్చు వానలకు,వాగులువంకలు నిండిపొర్లగా!
  నడకనుమార్చివేయుచును నాట్యముజేయుచు పంటముంచగా
  తడబడు రైతు క్షేత్రములు, దారుణ మై కనుపించదీనుడై
  పడమటిదిక్కులోబొడిచె,భానుడుగ్రుంకెను తూర్పుదిక్కులో

  రిప్లయితొలగించండి
 42. ఈరోజు ఆకాశవాణిలో చదివిన నా పూరణ
  ******************************
  పుడమికిపూర్వదిక్కునకు,పూర్తిగభానుడుపూర్ణ బింబమున్
  పడగలుచాచికాంతులతొ,ప్రాక్దిశదాటుచు పశ్చిమంబునన్
  వెడలఁగ, జాబిలడ్డుపడి వెచ్చని కాంతిపరిగ్రహించె,బల్
  విడువఁగచంద్రుడాదినమువీక్షణజేసితిమయ్య,స్యోనునిన్
  పడమటిదిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పుదిక్కులో.

  రిప్లయితొలగించండి
 43. చంపకమాల
  వడివడి నేగ భూసురుడు వందన మంచు వరూధినే గనన్
  తడవదిలేదు గన్నియ మితంబు గతే మరచే గృహంబుకై
  వెడలఁగఁ సంధ్య వార్చ దడవే మరి దిక్కును గాననీ గిరిన్
  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో

  రిప్లయితొలగించండి
 44. కడవలకొద్దికష్టమును, గార్చెను దేహము ఉష్ణతాపమున్
  కుడియెడమాయె జీవనము, కూలగజేయగ శక్తినంతయున్
  వడివడి తిట్లకే ఝడిసి, వాడిగవేడగు దూషణాల్వినెన్
  పడమటిదిక్కులోబొడిచె,భానుడుగ్రుంకెను తూర్పుదిక్కులో

  రిప్లయితొలగించండి
 45. అడిలయి డందొకం డనియె "నావల భారత వాసులందరున్

  బడలిక వీడుచున్నిదుర ప్రక్కల లేవగ జూచు చుండగా

  గడియల వేయచు న్నమెరికా ప్రజ లేమొ పరుండ గోరిరే,

  పడమటి దిక్కులో పొడిచె భానుడు, గ్రుంకెను తూర్పు దిక్కులో!"

  (అడిలైడ్ అనునది ఆస్ట్రేలియా దేశ మందలి యొక నగరము)

  రిప్లయితొలగించండి