16, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3134 (శుష్కకార్యము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుష్కకార్యము పుస్తకావిష్కరణము"
(లేదా...)
"వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్"
(ఈరోజు గుండు మధుసూదన్ గారి పుస్తకావిష్కరణ సందర్భంగా...)

78 కామెంట్‌లు: 1. సాఫ్టు కాపీల నంపుడు చౌక! ఖర్చు
  లేల చేసెదవు కవీశ ? లెస్స యనుచు
  చదివెడి జనులేరయ్య? ప్రచారమేల?
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము!


  ఏ పొత్తము వస్తోందండి ?/శంకరాభరణపు‌ కైపదకెంజారమా?  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈరోజు గుండు మధుసూదన్ గారి 'బాలల పద్యకథలు, హరి శతకము' పుస్తకాల ఆవిష్కరణ వరంగల్లులో... ఒక పుస్తకానికి ఆవిష్కర్తగా వెళ్తున్నాను.
   అన్నట్టు 21-9-2019న డోన్ లో, 22-9-2019న హోసూరులో పుస్తకావిష్కరణ సభలకు హాజరు కానున్నాను.

   తొలగించండి

  2. హోసూరు లో కలుద్దాం ఫోటో తీసుకుంటాం‌
   టాం టాం టాం :)   జిలేబి

   తొలగించండి
 2. సంఘ మభివృద్ధి గోరని సత్కవిత్వ
  మెంత ఘనముగా వ్రాసిన నేటి విలువ?
  దేవ దేవుని బొగడన దేమిఫలము?
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 3. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తనువున్ మోపుచు శయ్యనున్ కవులిటన్ ధైర్యమ్ము కోల్పోవగా...
  కనగా కావ్యము వ్రాయువార లిటనున్ కన్పించరే నాంధ్రమున్...
  మనమున్ కూరిమి నిచ్చు కార్యమును భల్ మర్యాదయే యిట్లనన్:
  "వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్"?

  రిప్లయితొలగించండి
 4. భాషయన గౌరవములేని వారలంత,
  సభలు సేయంగనూరూర సంతలట్లు,
  రసికు డొక్కండు లేకున్న రామ రామ,
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము..

  రిప్లయితొలగించండి
 5. నేటి కాలపరిస్థితిన్ మేటి గాను
  భావి తరముల కందించు వారధులని
  మరచి పోరాదు మానవా, మహిని కాదు
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము.

  రిప్లయితొలగించండి
 6. చదువు వారుండరెటులైన చదువకుండ,
  చదువ నట్టివారలుకొని చదువరయ్య,
  సాఫ్టు కాపీలె పంపుము చాలు చాలు,
  శుష్క కార్యము పుస్తకావిష్కరణము..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఒకటో రెండో పుస్తకాలు ముద్రింపబడితేనే రచయితగా, కవిగా గుర్తింపు నిస్తున్న సమాజంలో ఉన్నాం.

   తొలగించండి


 7. వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్
  మునుముందైన హుషారు గాంచదగు సామోసాల పొట్లాముకై
  తునకల్ చేసెద రయ్య పొత్తమును! యేదోనాకు తోచింది మీ
  కు నమస్కారము పెట్టి చెప్పితినయా కుంకాయి నన్కోకుమా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పైన రామ్ గారికి ఇచ్చిన సమాధానం చూడండి.

   తొలగించండి
 8. జ్ఞాన మొసగెడి గ్రంథరాజమ్ము మేలు
  ప్రజల సేమ మరసి జేయు రచన,రచన
  శుష్కప్రియమని తెలియ మస్తిష్కమందు
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము!!

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ


  మనవాడౌ మధుసూదనుండు కృతియుగ్మంబున్ ప్రకాశింపజే...
  యును నేడే ., మనమిత్రులున్ కవులు మాన్యుల్ వోవనచ్చోటికిన్
  గనగా నీ సభ బోసిపోవును గదా! కష్టమ్మిదే రోజునన్
  వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్"


  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 10. తనదైనట్టిది శైలి గుండు మధుసూదన్ వారిదమ్మా జిలే
  బి! నఖాసుల్ సరిదీర్చినట్టి కవితల్ వీక్షింపకన్ మన్గడే
  వినుమా వ్యర్థమె సుమ్ము; పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్
  వెనువెంటన్ కొని వారి బాలలకథల్ వేగమ్ముగానేర్వుమా


  గుండు వారి బాలల పద్య కథల పుస్తకములో మా కామింటు కందాలు కూడా వున్నాయా :)


  శుభాకాంక్షలతో
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   డిటిపి చేసింది నేనే అయినా మీ కామెంట్ పద్యాలు ఉన్నాయో లేవో గుర్తు లేదు.

   తొలగించండి
 11. కప్పు కొనను మోజున పట్టు శాలు వలను
  ఒకరి వీపును మరొకరు గోకు చుండ
  చప్పటులు వినవలె నని తిప్ప తప్ప
  శుష్క కార్యము పుస్త కావిష్కరణము

  రిప్లయితొలగించండి
 12. కలముచేబూని వ్రాసె బల్కవినటంచు
  పుస్తకముకాదు నములును మస్తకమును
  పొల్లుమాటలు పసయేమి పొసగదందు
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము

  మధురఫలములబోలెడు మాటలమర
  సుధలుజిల్కెడు కవితల మధురకవికి
  చెల్లునన్యులకేరీతిఁజేయనగును
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము?

  రిప్లయితొలగించండి

 13. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చనుచున్ రైలున వంద మైళ్ళు పరుసున్ జాగ్రత్తగా దాచుచున్
  తినుచున్ మెండుగ చిప్పులన్ కుడుచుచున్ తీర్థమ్ముగా కాఫినిన్
  కునుకుల్ తీయుచు కమ్మగా దడబడన్ కోల్పోవుచున్ సెల్లునున్
  వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   నామీదే సెటైరా? మనోరంజకమైన పూరణ. అభినందనలు.
   ఏం చేయను? నా అరికాలిమీద పుట్టుమచ్చ ఉన్నది. అందుకే ఈ తిరుగుళ్ళు.

   తొలగించండి


  2. అరికాలి మీది మచ్చయె
   పరుగు బతుకు నిచ్చెనయ ప్రభాకర శాస్త్రీ !


   మిగతా మీరే పూరించుడీ :)   జిలేబి

   తొలగించండి
  3. ఆర్యా,అనేక పుస్తకములకు డిపిటి చేయుచు,స్వయముగ పుస్తకములను వెలువరించి,అనేక పుస్తకావిష్కరణలు చేయుచున్న మీరిట్లు నుడువదగునా?మీ వ్యాఖ్యలు మాబోంట్లను అయోమయమున బడవేయుచున్నవి!

   తొలగించండి

  4. అరికాలి మీది మచ్చయె
   పరుగు బతుకు నిచ్చెనయ ప్రభాకర శాస్త్రీ !
   కరివదనుని దయ తోడుత
   పరుగులు సడలగనె నీకు పండుగ హెచ్చెన్!

   తొలగించండి

 14. ... శంకరాభరణం... . 16/09/2019 ...సోమవారం

  సమస్య:

  "వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్"

  నా పూరణ. మత్తేభము
  ***** *** ***

  కనగా నేటి సమాజ రుగ్మతలలన్ కాసింత నిర్మూలమే

  యొనరింపంగ సహాయమున్ సలుప దయ్యో! నేటి గ్రంథమ్ములే!

  ఘన గౌరీ ప్రియ నాథు కార్యములు ప్రఖ్యాతంబు కీర్తించునే?

  వినుమా! వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్ 


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రుగ్మతలనే...సలుపవయ్యో...' అనండి.

   తొలగించండి
 15. సభ్య సంఖ్య సామాజిక మభ్య గాదె?
  గుర్తు పేరున యాత్మ నే మర్తు వేల
  కడుగు కలుపు లన్నీ భయపడకు మయ్య
  శుష్క కార్యము పుస్త కావిష్కరణము

  రిప్లయితొలగించండి

 16. "స్వానుభవమున చాటు సందేశ మిదియె..." అన్న ఎన్ . టి . ఆర్ గారి ఆనాటి 'పెళ్ళిచేసి చూడు' చిత్రం లోని పాట స్ఫూర్తి తో ..


  కవులకున్న వ్యసనమది కవిత లల్ల
  తీర్చు కొందురు తమతమ తీండ్ర నెల్ల
  పుంజములకొద్ది రచనలు పూర్తి జేసి
  యింటివారికె చదువుటకిచ్ఛ లేదు
  అన్యు లెందరిచ్ఛించెద రాకళించ
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము.
  వింత యేమున్నదిందున విప్పిజూడ !
  యిట్టి పదము సమస్యగ నీయ దగునె ?

  రిప్లయితొలగించండి
 17. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  శుష్క కార్యము పుస్తకావిష్కరణము

  సందర్భము: కవులు జగద్ధితార్థమై కవిత్వం వెలయించేవారు. అది వాగ్దేవీ సమర్చనం.
  కవులు పండితులు శబ్దంమీద ఆధారపడుతారు. కాబట్టి శబ్దబ్రహ్మము నారాధించేవారు. గాయకులు వాద్యకారులు నాదంమీద ఆధారపడుతారు కాబట్టి నాదబ్రహ్మము నుపాసించే వా రని విజ్ఞులు చెబుతారు.
  సంగీతమైనా సాహిత్యమైనా వాగ్దేవీ సమర్చనమే! అక్కడ ధన ప్రసక్తి లేదు. వున్నా నామకార్థమే! కాబట్టి అది నిష్కామ కర్మగా పరిణమిస్తుంది. తరింపజేసే యోగంగా తయారౌతుంది.
  అందువలన పుస్తకావిష్కరణం శుష్క కర్మ ఎలా ఔతుంది?
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కవులు పండితుల్ జేయు నిష్కామ కర్మ
  యై తనర్చుచు శబ్ద బ్రహ్మమును జేర్చు
  నింపయిన యోగ మగుగాని.. యే విధముగ
  శుష్క కార్యము పుస్త కావిష్కరణము?

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  16.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 18. పరుల వంచించి బాధించు పలుకు లక ట
  శుష్క కార్యము : పుస్తకా వి ష్క ర ణ ము
  మంచి దని విశ్వ సింతు రు మనుజు లెల్ల
  పాఠకాళి కి మేలౌ ను భవ్య ముగ ను

  రిప్లయితొలగించండి 19. పొత్తమును వేయుటొకపని; పూనుకొనుచు
  దాని సరిసమానముగ ప్రధాన మగు న
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము
  చేయవలె నెఱిని జిలేబి చేర జనుల!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. శుష్క కార్యము పుస్తకావిష్కరణము
  చక్క జెప్పిరి యార్యులు శంకరయ్య
  చదువు వారలు లేరుగ జగమునందు
  నాకుదోచినదిద్దియ మీకు? చెపుడు

  రిప్లయితొలగించండి
 21. మంచి గ్రంథమ్ము నకుమించి మహిని గలదె
  హితము గూర్చునది జనుల కేది యైన?
  నట్టి పుణ్య కార్యము గననెట్టు లౌను
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము ?

  రిప్లయితొలగించండి
 22. హాలు రెంటుకు గుండెలదిరిపోయే ఖర్చు
  పూలదండలపైన ఫుల్లు ఖర్చు
  అత్తరు పన్నీరు అగరొత్తులకు ఖర్చు
  అద్దె కుర్చీలకు నధిక ఖర్చు
  సోకుగా మాటాడ మైకుసెట్టుకుఖర్చు
  ఛీఫుగెష్టుకుబెట్టు స్వీటుఖర్చు
  తోరణాలకుఖర్చు దుశ్శాలువలఖర్చు
  పనివాండ్ర కిచ్చేటి పైనఖర్చు

  ఇంత హైరాన పడియును హితములేదు
  సరసులైనట్టి శ్రోతలు సభల లేరు!
  కడకు కవిగారి జేబుకు క్రంతమిగులు
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోటేశ్వర శాస్త్రి గారూ,
   వాస్తవ పరిస్థితులను వర్ణించిన అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.

   తొలగించండి
  2. ఖర్చుఖర్చు యనుచు కంగారు పడనేల?
   కావ్యమన్న యెడల ఖర్చుగాదె?
   పాతకాలమునాడు భరియించు రాజులు
   నేడు వెతికిజూడ నెందుగనము
   చదువు వారెప్పుడు కొదువయే గనుగొన
   రసికత యొప్పెడు రచనలయ్యు
   పోషకులుండగ శోషలేకుండెను
   ప్రోత్సాహమివ్వంగ రొక్కమిచ్చి

   పుస్తకముగాదె మనిషికి బుద్ధినిచ్చు
   సాధనం,బిట్టు దలచిన సరసరచన
   లెట్టు చేరును పాఠకాళి?తగునె యన
   శుష్కకార్యము పుస్తకావిష్కరణము?

   తొలగించండి
 23. తే.గీ.
  వ్రాత యేదైన రమ్యత పట్టు విడక
  పొత్త మాదిగ నాసక్తి పుట్టు రచన
  తగును ప్రచురణ కర్హత, తగని యెడల
  శుష్క కార్యము పుస్తకావిష్కరణము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి

 24. నా పూరణ ప్రయత్నము—

  నేడు జరుగును నగరాన వేడుకగను
  మత్కృతమ్మైన గ్రంధము మాన్యులార
  "శుష్క కార్యము" పుస్తకావిష్కరణము
  రండు రండహో రండయ రండురండు!

  🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 25. మున్ను తాళ పత్ర చయమ యెన్న దిక్కు
  పిదప పుస్తకమ్ములు దిక్కు విశ్వ మందు
  నవని నింక నంతర్జాల మగుట దిక్కు
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము

  కన శక్యంబె పఠించ నేఁ డకట సత్కావ్యాళి ముద్రించ కు
  న్నను హా! భారత కావ్య రాజమును నానా దేశ చారిత్రముల్
  ఘన రాజన్య పరాక్రమ ప్రభలు సత్కారమ్ము కా దిట్లనన్
  వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్

  రిప్లయితొలగించండి
 26. మంచి గ్రంథమ్ము నకుమించి మహిని గలదె

  హితము గూర్చునది జనుల కేది యైన?

  నట్టి పుణ్య కార్యము గననెట్టు లౌను

  శుష్కకార్యము పుస్తకావిష్కరణము ?

  ****}{}{****

  పుస్తకావిష్కరణ సందర్భంగా శ్రీ గుండు మధుసూదన్ గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలతో.

  రిప్లయితొలగించండి
 27. తప్పుల తడక తోడ శతకము వ్రాసి
  ముద్ర ణమ్మును చేయుట మూర్ఖ తనమె
  దానికై వ్యయపరచుట ద్రవ్యము నిల
  శుష్క కార్యము,పుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. తేటగీతి:
   వృక్షముల గొట్టి బెంచక వృద్ధి యగున
   యాంత్రిక యుగమాయెను గద యాత నేల
   జదువరికిని సమయమేది జదువఁ దెఱచి
   "శుష్క కార్యము" పుస్తకావిష్కరణము

   గూగులమ్మ నడుగ యది గురుతు జేయు
   కానరానిదేది నిచట గనుల ముందు
   విలువ సమయము బెంచగ విహిత మందు
   "శుష్క కార్యము" పుస్తకావిష్కరణము

   వ్రాసిరే సత్కవులు విష్ణు పదము బొగిడి
   బోయ వాల్మీకి రాముని బోధ జేసె
   నిజము దెలుప నెంచిరి వారు నిక్క ముగను
   "శుష్క కార్యము" పుస్తకావిష్కరణము

   తొలగించండి
 29. పఠనమందు రుచియెలేని వారిఁబిలచి
  సురుచి పూర్ణ కావ్యములను పరిచయమ్ము
  చేయ ముళ్లపై కూర్చొను చేష్ట చూడ
  శుష్క కార్యము పుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 30. వినుమా వ్యర్ధమెసుమ్ము పుస్తకమునావిష్కారమున్జేయగన్
  వినువాడుండడు నొక్కడచ్చటను వేవేలంజనంబుండినన్
  జనువన్బల్కితి నిట్లుగా నిచట యీశానేవాచాలనే
  గనుచోనట్లనిగోపమున్గొనుచు బక్కాగానుశిక్షించుమా

  రిప్లయితొలగించండి
 31. కనుమా వాణిని గట్టిగాదలచికన్ కావ్యాంశమున్ దెల్పగా
  ఘనమౌ కార్యము చేసినావనుచు నా గ్రంధంబుతా మెచ్చగా!
  ధనమా ఖర్చులుబెట్టుటెందులకు ఈ ? ధాత్రిన్సదా గొప్పగా
  వినుమా వ్యర్ధమె సుమ్ము, పుస్తకము నావిష్కారమున్ జేయగన్.

  రిప్లయితొలగించండి
 32. అనుమానంబిసుమంతలేదు మనకున్ ఆనంద మందించ నే
  డనివార్యంబుగపొత్తముంజదువగానావశ్యకంబేమిలే
  దనుమాటన్ ప్రతిసాఫ్టుఫోనుతనలోనందించు నుద్గ్రంధముల్
  వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్

  రిప్లయితొలగించండి
 33. తెనుగే వద్దని యాంగ్లభాష యొకటే ధీటైన దంచున్ జనుల్
  వినియోగించక మాతృభాషనిల నిర్వీర్యమ్ము నేచేసిరే
  జనులెవ్వండును గోరకున్న నిక నీ సాహిత్యమే యేలరా
  వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్

  రిప్లయితొలగించండి
 34. గురువు గారికి నమస్సులు
  పరుల చరితను మాటాడుట పరమ హేయ
  శుష్కకార్యము,పుస్తకావిష్కరణము
  కంది శంకర గురువుల కళల సొబగు
  సాహితీ సంభ్రమమునకు సమయ మిదియు.

  రిప్లయితొలగించండి
 35. సొగసుగత్తెల సరసన సోయగముగ
  కవిగ శ్రీనాధు రచియించె కావ్యములను
  అట్టి శృంగారసీమల నంటుకొనని
  శుష్క కార్యము పుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 36. రసికులందరు ఆశించు రచనలెన్నొ
  చాటువల్లిరి కవులంత చతురముగను
  అంత శృంగార మొలికించ నాశపడని
  శుష్క కార్యముపుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 37. నిష్కపటి యైన సత్కవిని వలదంచు
  పుష్కలముగ ధనము గోరి పొరలు వారి
  దుష్కరంబగు రచనల దొరలి యాడ
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 38. తేటగీతి:
  శుష్క కార్యమనగ మీరు సొక్కి సోలి
  ముష్కరు వలే నరక జెట్ల ముప్పు గాదె
  పుష్కలముగ దిరిగి నాట పున్నె మేగ
  "శుష్క కార్యము" పుస్తకావిష్కరణము

  రిప్లయితొలగించండి
 39. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  శుష్క కార్యము పుస్తకావిష్కరణము

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పరతత్వ సంబంధ భావనా మకరంద
  పూర్ణ పుష్పము బోలు పొత్త మొకటి..
  జాతీయ చైతన్య జాగృతి గుణగణ్య
  మూలమైనట్టిదౌ పొత్త మొకటి..
  జననీ జనక గురు ముని దేవ ఋణ భార
  మోచక మైనట్టి పొత్త మొకటి..
  పాప సంహారక పుణ్య సంపాదక
  పూత మనం దగు పొత్త మొకటి..
  భుక్తినో ముక్తినో గూర్చు పొత్త మొకటి..
  పుడమి బ్రతుకు ధన్య మొనర్చు పొత్త మొకటి..
  దాని వెలయించు కార్యము కానె కాదు
  శుష్క కార్యము.. పుస్తకావిష్కరణము

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  16.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 40. నా ప్రయత్నం :
  భార్యామణి పండితుడైన పతికి బాధ్యత గుర్తుచేస్తూ...

  తేటగీతి
  పుస్తకావిష్కరణములఁ బొద్దు పుచ్చి
  మీరు వెచ్చించినదిచాలు మేలుకొనుడు
  పెళ్లిఁ జేయంగఁ పెద్దలైరి పిల్ల, లింక
  శుష్కకార్యము పుస్తకావిష్కరణము.

  మత్తేభవిక్రీడితము
  ఘనులై వ్యాకరణాంచితమ్ముగ మహా గ్రంధాలనే గూర్చి ము
  ద్రణ చేయించెడు పోషకుల్ దొరకరై ద్రవ్యమ్ము వెచ్చించ మి
  మ్మనలేకుంటి మహాశయా!సవపు కల్యాణాల యోచించినన్
  వినుమా! వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్

  రిప్లయితొలగించండి