9, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3127 (వనవాసమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వనవాసమె సంపదను శుభంబు నొసంగున్"
(లేదా...)
"వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా"

88 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  ఘనమగు రీతి విద్యలను గాడిద చాకిరిగా తలంచుచున్
  వినయము భక్తి భావనలు వీధుల తొట్టుల పోసి నవ్వుచున్
  పనులును పాట వీడుచును భారత దేశపు పాలిటిక్సనన్
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా

  రిప్లయితొలగించండి
 2. ( ఆమ్రపాలి అర్పించిన జేతవనంలో మహారాజుల , జనుల
  జేజేల నందుకొంటున్న సత్యసంకల్పుడు గౌతమబుద్ధుడు )
  ఘనతరమైన భావనల
  కారుణికత్వపు దివ్యమూర్తియై
  జనులకు జీవితమ్ము నిల
  జంకక యర్పణ జేసి జ్ఞానియై
  మనముల మార్చు సాత్విక స
  మంచిత మార్గము జూప దీక్షతో
  వనములలో వసించిన శు
  భంబు ధనంబు యశంబు దక్కురా !

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  వనగతుడై వరించెను సుభద్రను క్రీడి .,గనంగనెర్రచం.....
  దనధనవృద్ధి కన్పడదె ధారుణి నేడు , ఋణంపు బాధలన్
  వనముల జేరుచో జనులు భావన జేయరె సాధువంచు నిన్ !
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుమిత్ర... లక్ష్మణునితో....

   రామం దశరథం విద్ధి.....

   తనయ! వనమ్మునన్ దశరథాఖ్యునిగా రఘురామునెంచుమా !
   జనకజ నన్ను గా దలచి సాగుమ ! కాననమెల్ల యీ అయో...
   ధ్యనుగ దలంచుమా ! యిక యథాసుఖమేగుమ ! యన్నగారితో
   వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. అయోధ్యగను దలంచు మా యనుట సాధువు కదా.అప్పుడు ప్రాస భంగము.
   కాననమెల్ల నయోధ్యగ.

   తొలగించండి
 4. ధనమును కీర్తియు రక్షణ
  మను భావన వీడుచు పరమాత్ముని గాలిం
  పను స్వీయ జ్ఞానమనుయౌ
  వన వాసమె సంపదను శుభంబు నొసంగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్వీయజ్ఞాన' మన్నచోట 'య' గురువై గణదోషం. '...పను స్వీయజ్ఞానపు యౌ...' అనండి.

   తొలగించండి
  2. 🙏🙏 ధన్యవాదాలు గురువు గారూ ..

   ధనమును కీర్తియు రక్షణ
   మను భావన వీడుచు పరమాత్ముని గాలిం
   పను స్వీయజ్ఞానపు యౌ
   వన వాసమె సంపదను శుభంబు నొసంగున్

   తొలగించండి
 5. అనుపమకష్టసంతతుల నందుచు కుందుచు నున్నవా డొకం
  డనియెను మిత్రునిం బిలిచి "యంతట దౌష్ట్యము లీభువిన్ ధరల్
  కనుమిదె యాకసంబునకు నంటుచునున్నవి" దీనికంటె నా
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా.

  రిప్లయితొలగించండి
 6. అల్లన సంస్కృతాధ్యనమ్మున శిష్యుడుసంస్మరించి తా
  నుల్లమునందు దేశికుని, యూర్జితుడై పలుమాఱు వేయుచున్
  వల్లెను పాణినీయమగు వ్యాకరణమ్మును, మ్రొక్కి తండ్రికిన్
  దల్లికిఁ బ్రీతి, సూత్రమును ధారణఁ జేసెను పుత్రుడంతటన్.

  నిన్నటి పూరణ.

  రిప్లయితొలగించండి


 7. మా అయ్యరు గారు మహా ఫోర్సు చేసి రాయమన్నారు తన మాట గా


  అనకొండవలె విడువక న
  ను నీవు కబళించినావు నుకసానపడం
  గ! నెలత నలతలు వలదిక!
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. వనములు కందమూలములు , వాతము పిత్తము లన్ హరించులే
  గొనకొని రామమూర్తియట, కోరివరించిన సీతదెచ్చెనే!!
  వినుమది మంచికేయనుచు, విజ్ఞులుజెప్పగ వింటినో సఖా!
  వనములలో వసించిన, శుభంబు ధనంబు యశంబుదక్కురా!

  రిప్లయితొలగించండి
 9. ఘనమగు భారతాంబకిట, గాయముజేసెను రాహులొక్కడే!
  వినుటకు యెంతజెప్పినను, విజ్ఞుడుగా దలపోయరెవ్వరున్
  పనుపున కొందరాధములు,పాటుగనాతని మూఢుజేయ, తా
  వనములలోవసించినశుభంబు ధనంబు యశంబు దక్కురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పురుషోత్తమ రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "వినుటకు నెంత..." అనండి.

   తొలగించండి

 10. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అమిత్ షా ఉవాచ:

  చనుచును వీధులందునను చాటుచు హైందవధర్మమున్ సదా
  తినుచును రాజభోగులను తీవ్రపు రీతిని దీదిఁ దిట్టుచున్
  వినకయె మార్క్సువాదులవి వింతగు కూతలు,...భాజపాల భా
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా

  భావనము = విశ్వాసము
  రాజభోగ్ = బెంగాలీ స్వీటు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ,
   మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


  2. అమిత్ షా రాజభోగ్ తింటే యేమగును :)   జిలేబి

   తొలగించండి
  3. 🙏🙏🙏


   ****************************************

   మరింత లావగును

   తొలగించండి
  4. Jilebijee:


   Next to Chandrayan 2, the Great Indian Thriller will be the upcoming West Bengal Assembly Elections...keep watching this space; and wish me life till 2021 :)

   తొలగించండి


  5. All the best बेंगालैटु :)


   दीदी तेरा जीपीयेस् दिवाना

   हाय राम एलेक्शन् मे ना हार जाना
   हाय राम एलेक्शन् मे ना हार् जाना :)   जिलेबी

   తొలగించండి
 11. అనయము శాంతిచర్చలని, ఆశగజెప్పును వట్టి మాటలన్
  కనికరమేమిజూపకనె కాల్పులె, మేలగు వారిపట్ల యా
  పనితనమంత శూన్యమయె, పాకును విశ్వమునంత ఛీయనన్
  వనములలో వసించుట, శుభంబు ధనంబు యశంబు దక్కురా.

  రిప్లయితొలగించండి


 12. అనవరతమ్మ నాగరిక మైన జిలేబుల మై సిటీల వెం
  ట నలతలన్ బడంగ వికటంబయె జీవితమే సభర్తృకా!
  మనమిక శాంతికోరుచు సమాశ్రితమై గడుపంగ మేలగున్!
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కు! రా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. మనమున దీనత నిండన్
  వనజాతేక్షణుని హరిని పాయకఁగొల్వన్
  ఘనతరమైనది యా పా
  వనవాసమె సంపదను శుభంబునొసంగున్

  రిప్లయితొలగించండి


 14. నా పూరణ. చం.మా.
  ***** *** ***

  ఇనకుల రాఘవుండు మరి యేగుచు ఘోర వనంబుకున్ ,విరో

  చన కుల పాండు నందనులు సానువు కున్ చని వారలందరున్

  ఘనముగు పేరునొందిరయ కాంచగ నీ భారతావనిన్

  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వనంబునకున్, సానువునకున్' అనడం సాధువు.

   తొలగించండి
 15. వినయము సద్వర్త న తో
  న న యము నెల్లరి సమము గ నాదర మొ ప్ప న్
  గను చు ను స త తంబు ను పా
  వ న వాసమె సంపదఁ ను శుభ o బు నొస o గున్

  రిప్లయితొలగించండి
 16. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  వనవాసమె సంపదల శుభంబు నొసంగున్

  సందర్భము: విశ్వేశ్వరుడు కాశీ క్షేత్రము నెన్నడూ విడిచిపెట్టడు. కాబట్టి "అవిముక్త" మని ఆ పట్టణానికి పేరు. (బ్రహ్మ వైవర్తము)
  కాశిలో కన్ను మూసినవారికి పునర్జన్మ లేదు. (లింగ పురాణం)
  "ఈ పవిత్ర నగరాన్ని ఆమరణాంతం విడువరా" దని బృహస్పతి ప్రశ్నించగా యాజ్ఞవల్క్యుడనే మహర్షి చెప్పెను.
  కాశీ వాసం ఆవిధంగా సంపదలు శుభాలనే గాక మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "వినుమా! అది యవిముక్తముఁ..
  గనుమూసెడుదాక వీడగా రా.. దిడు ము
  క్తిని..వారణాసి పుర పా
  వన వాసమె సంపదల శుభంబు నొసంగున్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  9.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 17. ఘనుడగు శ్రీ మన్నారా
  యణుడే మన యత్తి వరదు డగుపించు నదే
  కనుడో మనలకు నాతని
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్.

  రిప్లయితొలగించండి
 18. కొనుటకు నింటికై స్థలము, గూడును గట్టుకొనంగ నీయగా
  ననుమతి, ప్లానుకై, పిదప నందున నీటికి, ముర్గు కాల్వకున్,
  చనియెడి దారికై యిటుల సర్వము సుంకము లింతకన్న నా

  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా.

  రిప్లయితొలగించండి
 19. విను మిటుల వృక్ష శాస్త్రమె
  అనుకూలంబగును ప్రకృతి యన్వేషణకున్
  అనువుగ చదివిన వారికి
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రకృతి + అన్వేషణ = ప్రకృత్యన్వేషణ' అవుతుంది. అక్కడ "ప్రకృతి నన్వేషింపన్" అనండి.

   తొలగించండి
 20. కందము:
  మనమున దోఁచెఁగ తలపును
  తనపర యనుచు బలుకు తరతమ భావంబుల్
  వినగను విరిగిన మనసున
  వనవాసమె సంపదల శుభంబు నొసంగున్"

  రిప్లయితొలగించండి
 21. కనులకు విందు హరితమును
  జనులది తెలియగ నుచితము చప్పున పెంచన్
  మనమిద్దెలపై మొక్కలు
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్!

  రిప్లయితొలగించండి
 22. మనుజున కెట్లయిననునా
  వనవాసమె సంపదనుశుభంబునొసంగున్
  మనుగడకిచ్చును శాతిని
  ననవరతముహాయినిచ్చి యాయువుపెంచున్

  రిప్లయితొలగించండి
 23. ఘనమగు యోగశాస్త్రమున గారవమందుచు రామదేవుగన్
  సునిశిత శోధనంబుగొని జొచ్చుచు వర్తకమందు ధీరుడై
  తనువుకు నాయువివ్వగ పతంజలియై ప్రజలంత మెచ్చగా
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా!

  రిప్లయితొలగించండి
 24. కనబడు సంపద లన్నియు
  కనుమరుగౌరా కడకును కాలము తోడన్!
  విను బ్రహ్మపదాంతర్భా
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్!

  రిప్లయితొలగించండి
 25. పెనువరద మూలమున పుర
  జనావళి వెతలను దీర్చి చక్కగ జేయన్
  మినుకెగసియుండినట్టి భ
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్

  రిప్లయితొలగించండి
 26. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీరిచ్చిన లింకుతో 'నవ్వితే నవ్వండి' చదివాను. కాని ఈ 'అడ్డాట' ఏమిటో నాకు తెలియదు. పేకాటలో ఒక్క రమ్మీ మాత్రమే నాకు తెలుసు.

  రిప్లయితొలగించండి
 27. పద్మాసనుఁడు పద్మనాభుని రామావతార విషయమును సురాళికిఁ జెప్పు సందర్భము:

  దను జేంద్ర రావణాసుర
  హన నైక నిమిత్త రాఘ వావతరణ సం
  జనిత స దార సలక్ష్మణ
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్


  అనయ విహీన పాలన రతైక మనమ్మున స్వీయ దేశ పా
  లన మొనరించు చుండి పర రాజ్యము లందిడ నెమ్మి భూతల
  మ్మున విలసిల్లు దేశముల పుణ్య సమస్త ధరా నరాధి పా
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా

  [నరాధిప + అవనముల =నరాధిపావనముల]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   "సదారా లక్ష్మణ.." అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   దార అకారాంత పుంలింగ శబ్దము కదా. అర్థము మాత్రము భార్య. స్త్రీలింగముగా గ్రహించిన ఆ కారాంతము కలదు.
   అమరము:
   (౨.౫.౫౩౯) భార్యా జాయాథ పుంభూమ్ని దారాః స్యాత్తు కుటుమ్బినీ
   పుం (పుంలింగము); భూమ్ని (బహువచనము) దారాః రామాః వలె. పుంలింగములలో నా కారాంత పదములు లేవు.

   నిజ దార సుతోదర పోషణార్థమై.

   అదియును గాక “సదారః, సభార్యః కృతదారః అకృత దారః హృత దారః” అని సమాసమున దార కలవాఁడుగా పుంలింగాంతమైనది.

   జటీ తాపసరూపేణ సభార్యశ్శరచాపధృత్.
   ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షససేవితమ్৷৷3.17.13৷৷

   కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ.
   త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా ససపత్నతా৷৷3.18.2৷৷

   అనుజస్త్వేష మే భ్రాతా శీలవాన్ప్రియదర్శనః.
   శ్రీమా నకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్৷৷3.18.3৷৷

   సభార్యః + శర = సభార్యశ్శర
   కృతదారః + అస్మి = కృతదారోస్మి
   అకృతదారః + చ = అకృతదారశ్చ

   తొలగించండి
  3. నా తొందరపాటును మన్నించండి. మీకెంతో శ్రమ కలిగించాను.

   తొలగించండి
 28. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు జ్వరము తగ్గి నట్లు తలఁచెదను.
  అబ్బో యది చాలా యిష్టమైన యాటండి. దానినే తురఫాట యని కూడా నందురు. అందు జాకీ మణేలాలు (తొమ్మిది) తురఫున నధికములు.
  వర్ష కాలములో మేము చిన్నఁదనమున నుదయము నుండి సాయంత్రము వఱకు నాడుచునే యుందుము. 4, 6 లేక 8 మంది కలసి రెండు జట్లుగా నాడెదరు. ఇందు డబ్బున కవకాశము లేదు.

  రిప్లయితొలగించండి
 29. మనుమలతో రమించుచు సమానముగాడుచు పాడు చుండు ఆ
  తన తలిదండ్రు వీడక ముదమ్మున పుట్టిన దేశమందు తా
  తనయులతో వసించుచు పదమ్ములు పాడుచు నుండలేక యే
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా

  రిప్లయితొలగించండి
 30. కందం
  వినయమ్మున నటుకులతో
  జనార్ధనునిఁ జెలువుఁడంది సంపదఁ బొందెన్
  మనసెరిగెడు నగధరు పా
  వన వాసమె సంపదల శుభంబు నొసంగున్

  చంపకమాల
  వినుతుల భారతమ్మున వివేకముఁ గల్గుచు రాజకీయమున్
  సునిశిత దృష్టితో గనుచు శోకము బాయఁగ వృద్ధి కారకుం
  డనఁగ ప్రజాహితంపు పరిపాలన జేయుచు వారి నిత్య జీ
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా

  రిప్లయితొలగించండి
 31. వనములలో వసించినశుభంబు ధనంబుయశంబుదక్కురా
  వినుమురబాబి!నాపలుకు వీనులవిందగునట్లుగా నికన్
  వనముననేవసించితి నిబంగరుభూమగు డొంకరాయిలో
  ననువగుగ్రామమద్దియ మహర్షులువాసముజేయగోరుచో

  రిప్లయితొలగించండి
 32. కనకాంబరాయ వదనా!
  అనుకంప్య వరద ఋషభస మౌని నియమమున్
  మునులాచరించె దరిటుల్
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్

  పరమాత్మ స్వరూపమగు మరియు 4 వ అవతారమైన ఋషభ దేవుడు సర్వాశ్రమ నమస్కృతుడునూ వానప్రస్థాది ఆశ్రమ ధర్మాలను సృజించిన వాడునూ, జ్ఞానులంతా ఎట్లా ప్రవర్తించాలో మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు. మునులకు జ్ఞానమే సంపద, మోక్షమే శుభప్రదము అందుకు వానప్రస్థమే సరైనది అని తెల్పు సందర్భము.
  పృథు చక్రవర్తి అజానాభమును జనావాసముగా, చరాచరులలో ఎవరికి కావల్సినవి వారికి అవి సమకూరునట్లుగా వీరి సూత్రములను ఆధారము చేసుకొని భూమిని తీర్చి దిద్దాడు.

  రిప్లయితొలగించండి
 33. వినదగునెవ్వరేమనిన వేగిరపాటు వహింపకుండగన్
  కననగు లోటుపాటులను కర్జముగాదది తొందరించగన్
  అణకువబూనియెల్లెడలనందరి మన్ననలొందునట్టి భా
  వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా

  రిప్లయితొలగించండి
 34. వినయము నియమముగా మది
  ననయము బాటించి సతతమానందముగా
  మనుగడనెరపెడు కడు పా
  వనవాసమె సంపదల శుభంబు నొసంగున్

  రిప్లయితొలగించండి
 35. మనమున రామచంద్రునిడి, మన్ననజేయుచు జానకమ్మయే
  శనివలె వెంటబడ్డనట శక్తిగ రావణు లెక్కజేయకన్
  వినుమిక పావనీ!! విషయ విజ్ఞత రాముని సేవలోనె, యే
  వనములలోవసించినశుభంబు ధనంబు యశంబు దక్కురా??

  రిప్లయితొలగించండి
 36. గురువు గారికి నమస్సులు
  ధనమే సుయోధన బలము
  తనవారని దయతలచక ధర్మం మరచెన్
  వినయమతుల పాండవులకు
  వనవాసమే సంపదను శుభంబు నొసంగున్

  రిప్లయితొలగించండి
 37. వినయాన్విత పాండవులకు మూడవ పాదము గా చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 38. మనమున కోరిక లేకయు |
  ధ్యానము చేయుచు గడిపెడు తాపసి కెపుడున్ |
  మానికమిహ పరము నయిన |
  "వనవాసమె సంపదల శుభంబు నొసంగున్"

  రిప్లయితొలగించండి
 39. కనుమా! భారతమందున
  వినుమా! చక్కని కథనము ప్రేరణ గలుగున్
  వినుమది యరయగ పాండవ
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్!

  రిప్లయితొలగించండి
 40. కం.

  వినయము గూడిన విద్యన
  యనితర సాధ్యము మనకిక యగుపడ దెపుడున్
  మనమున యెదుగుచు చనుజీ
  వన వాసము సంపదను శుభంబు నొసంగున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి

 41. ఔరా!/

  పదవ తారీఖు సమస్య ఇంకా రాలేదేమి‌ చెప్మా‌ ?  జిలేబి

  రిప్లయితొలగించండి


 42. మెల్లగ విక్రముని తలము
  నల్లని యుత్పలము దోచె నభమున, శశియై
  తెల్లగ వికసింప శివుం
  డల్లన ప్రాజ్ఞుల ముఖమ్మ డరెను జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి

 43. అనయము హరునే దలచుచు
  వినయము సౌశీల్యములను వీడకనెపుడున్
  మనసెరుగు నాతియున్న భ
  వన వాసమె సంపదల శుభంబు నొసంగున్

  తనువది విడిచిన పున్నెము
  మనసే శివమయముగాను మార్చెడి ధామం
  ఘన కాశీ నగరపు పా
  వన వాసమె సంపదల శుభంబు నొసంగున్

  రిప్లయితొలగించండి
 44. అనయము పెద్దల మాటల
  వినుచు నెదురు పల్కకుండ వినయము తోడన్
  ఘనులౌ పాండుసుతుల కా
  వనవాసమె సంపదల శుభంబు నొసంగున్

  జనకుడొసంగిన మాటను
  వినయముతోడచన నెంచ వేగమె వనికిన్
  యినవంశాంబుధి సోముకు
  వనవాసమె సంపదను శుభంబు నొసంగున్


  రిప్లయితొలగించండి