15, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3133 (శ్రీనాథుండు చరించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్"
(లేదా...)
"శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా"
(మొన్న శ్రీకాకుళంలో ఆముదాల మురళి గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

88 కామెంట్‌లు:



  1. ఆ నీ చిన్నప్పటి నగ
    రానికి పోదామయ కొమరాయని బోవన్
    నా నాటికి దిగ జారగ,
    శ్రీనాథుఁడు, రోసెనంట శ్రీకాకుళమున్!

    శ్రీనాథుడెవరి కుమారుడు తెలుసుకొనుడీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    మీనంబుల్ కడు నిండి మార్కెటునటన్ మీరంగ దుర్గంధమే
    కూనల్ పిల్లులు కూయ నాదటనహో క్రూరమ్ముగా వీనులన్
    వానల్ మెండుగ వ్రాలి తప్ప తడియన్ భాద్రంపు మాసమ్మునన్
    శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా

    రిప్లయితొలగించండి
  3. *ఇక్కడ శ్రీ నాథుడనగా మహావిష్ణువు*

    తానే స్వయముగ వెలసిన
    స్థానమ్మిదియె కదరా! విచారించిన య
    జ్ఞానుల పలుకిది, యెప్పుడు
    శ్రీనాథుడు రోసెనంట శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి

  4. శ్రీకాకుళం వారెవరైనా వుంటే మన సభలో వాయ గొట్టెదరు కాబట్టి ఇంతటి తో పరార్ ఇవ్వాళ్టికి :) వున్నారా "చీకాకోలే" వాారెవరైనా సభలో ? :)


    మానాన్నే! మన పుణ్య దేశమునకో మారైన రమ్మా యనం
    గా నానమ్మయె వచ్చి పేర్మిని గొనన్ గావంచ ధోతీయుడై
    శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా
    యేనాడైనను బుద్ధి వున్న మరినే యేమారనీభూమిలో !



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మూడెనమ్మరొ విట్టుబాబు కొటికౌ! మోకాలు వాయింపులే :)

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వున్న' అన్న ప్రయోగం సాధువు కాదు. "బుద్ధి యున్న..." అనండి.
      (శ్రీకాకుళంలో నేనీ సమస్యను ఇచ్చిన రోజున విట్టుబాబు గారు ఆముదాలవలస లోనే ఉన్నారు. కాని కలిసే అవకాశం దొరకలేదు)

      తొలగించండి

    3. మా మిత్రులు, బందరు వాస్తవ్యులు, శ్రీ మామిళ్ళపల్లి ఆదినారాయణ మూర్తి గారు bank officer గా ఎనిమిది రాష్ట్రాలలో పనిచేసి retire అయ్యారు. వారి శ్రీమతికి అన్ని చోట్లకన్నా శ్రీకాకుళమే నచ్చినదట...నాకు భాగ్యనగరం (చీమలు, సాలీళ్ళూ, చెమటలూ ఉండవు;...శంకరయ్య గారు ఉంటారు) 😊

      తొలగించండి


  5. మీనాక్షీ విన్నావటె
    శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్?
    మానాథుడె మేలమ్మా
    యేనాడైన జవదాటడే నామాటన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    నానాభక్ష్యములుండె , చిక్కదిట జొన్నన్నమ్ము , నిందింపగా
    లేనిచ్చోటును., శైవభక్తుడనిటన్ శ్రీకూర్మముండెన్ , గనన్
    కూనల్ చీమలదండులౌనిచట , సిక్కోల్ ప్రాంతమంచెంచుచున్
    శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. ఏనాడైనా నెమ్మది
    తో నాగోడు వినుమంచు తోందల్ కూర్మున్
    చానా రోజులు వేడిన
    శ్రీనాథుడు రోసెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోందల్ కూర్మున్'? 'చానా' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  8. ఏనాడైనా నెమ్మది
    తో నాగోడు వినుమంచు తోందల్ కూర్మున్
    నానా రోజులు వేడిన
    శ్రీనాథుడు రో సెనంట శ్రీకాకుళమున్

    తోందల్ .. లావైన/దొడ్డు

    రిప్లయితొలగించండి
  9. అరసివెల్లి కూర్మావతారుణ్ణి తలుస్తూ

    రిప్లయితొలగించండి
  10. నానాటికి నాగావళి
    పానీయము కలుషితముగ ప్రవహింపంగన్
    తానా దుస్థితిగాంచన్
    శ్రీనాథుడు రోసెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
  11. చీనాంబరములు నీకును
    మానావతికి మరి మరి మానము తోడన్
    బాణాలు నాకా? యనంచు
    శ్రీనాథుడు రోసెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "బాణమ్ములు నాకా యని" అనండి.

      తొలగించండి
    2. 🙏🙏 ధన్యవాదాలు గురువు గారూ

      చీనాంబరములు నీకును
      మానావతికి మరి మరి మానము తోడన్
      బాణమ్ములు నాకా? యని
      శ్రీనాథుడు రో సెనంట శ్రీకాకుళమున్

      తొలగించండి

  12. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నానాదేశము లెల్లఁ గ్రుమ్మరుచు నానాక్షేత్రముల్ జూచుచున్
    వీనుల్ నిండగ వీధి గోలలనిటన్ వీక్షించి, నందమ్మునన్
    చానల్ యాసల ప్రీతి నొందగ నెటుల్
    జంబమ్మునన్ పల్కితే:
    "శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా"?

    (ప్రథమ పాదము తస్కరింపు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "వీధి గోల" "వినాయక చవితి" వలెనే దుష్ట సమాసం కాబోలు!

      తొలగించండి
    2. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీథి గోల' అనవచ్చు. ఈకారాంత స్త్రీలింగ పదం వీథీ. అది వీథి అని తద్భవం అయింది. 'వీథీ గోల' అంటే దుష్ట సమాసం అవుతుంది.

      తొలగించండి
  13. ఏనాటికి నా దుస్థితి
    గానంగ జనవని యెరిగి ఖచ్చితముగ నా
    ప్రాణా లిక వీడెద నని
    శ్రీనాథుడు రో సెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
  14. తేనెలు జిలికెడి తెలుగే
    వీనుల విందుగనుసాగి వింతను గొలుపన్
    జ్ఞానుల యాసిది గాదని
    శ్రీనాథుడు రోసెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యాస + ఇది' అన్నపుడు సంధి లేదు. "యాసయె కాదని" అనవచ్చు.

      తొలగించండి
  15. తానోపడుఁ నేలోపము
    ఖానావళి కేగ నచట గానడు రుచులన్
    మీనంబుల వాసనగా
    శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తానోపం డేలోపము' అనండి. 'ఖానావళి'?

      తొలగించండి
    2. సరిజేసితిని. ధన్యవాదములు🙏

      తానోపండే లోపము
      ఖానావళి కేగ నచట గానడు రుచులన్
      మీనంబుల వాసనగా
      శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్!

      ఖానావళి-భోజనశాల

      తొలగించండి
  16. గురువు గారికి నమస్సులు
    మీనామమే తెలుగు గని
    ఏ నాటి వధాను లైన యెపుడున్ తలతుర్.
    మానాటి పద్య రీతిన్
    శ్రీనాథుడు రోసె నంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
  17. తానేమెచ్చి స్వయమ్ముగా నిలిచె నీ స్థానమ్ములో కాదుటే
    శ్రీనాథుండు, చరించి రోసెనట యీ శ్రీకాకుళమ్మున్ గటా
    జ్ఞానమ్మించుక లేని ధూర్తుడొకడజ్ఞానమ్ముతోనచ్చటన్
    హీనుల్ నీచ గుణాత్ములన్ వెదకగా నెవ్వండులేడయ్యెనే.

    రిప్లయితొలగించండి
  18. తానా కళింగమున గల
    నానా తీర్థముల భక్తి నడయాడె గదా
    ఈ నాడిటులన దగునే
    శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
  19. మానిత కవియై వెలసి యు
    రాణి o చెను సభల యందు రమ్య ము గాగా
    నేనా డూ విన లే దే
    శ్రీనా థు డు రోసె నంటఁ శ్రీకాకు ళ ము న్

    రిప్లయితొలగించండి
  20. నే నిత్యముతామరపై
    తానుండెదననితెలిపిన తరుణము,పనిగా
    లోనికి జనియటు చూడగ
    శ్రీనాథుఁడు రోసెనంట శ్రీ,కా,కుళమున్.

    నోట్:- (తానూ ఇకపై ఎల్లప్పుడూ తామరపైనే ఉంటానని అనగా ఎవరా అని చూసినంత విష్ణువు కి లక్ష్మీదేవి కొలనులో కనిపించి విసుక్కున్నాడు అన్న భావనలో). ఇక్కడ శ్రీకాకుళం ని చిన్న విరుపుతో 'శ్రీ '=లక్ష్మి, కా= కదా ,'కుళము ' =కొలను అన్న అర్ధము.

    రిప్లయితొలగించండి
  21. నానా గడ్డి కరిచి నే
    నీనాటికి అరసివెల్లి క్షేత్రము చనగా
    నానా గోత్రేభ్య! యనుచు
    శ్రీనాథుడు రో సెనంట శ్రీకాకుళమున్

    రిప్లయితొలగించండి
  22. నానీ! యేమని యంటివి!
    శ్రీనాధుడు రోసెనంట శ్రీకాకుళమున్
    శ్రీనాధు డనెన నటులని
    నేనాడును జరుగదటుల యీజగమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనెన యటులని యేనాడును...' అనండి.

      తొలగించండి
  23. హా నాథా యే మందును
    గూన పడెడు నిడుము లకట కుయ్యో యని తా
    నే నాథుఁడు లే కే,గఁగ
    శ్రీనాథుఁడు రోసెనంట, శ్రీకాకుళమున్


    నానా బాధలు తప్ప వక్కట సురామ్నాయైక సంరక్షికిం
    జానా యేల విచార మందగను స్వచ్ఛంబుం గనుంగొంటినే
    నే నన్నంబున కింక లోటు కలదే నీవింక లెమ్మా యనన్
    శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీ కా కుళమ్మున్ గటా

    [శ్రీ కి + ఆ కుళమ్మున్ = శ్రీ కా కుళమ్మున్; కుళము = కొలను,
    ఆలి, ఆళి వలె కులము, కుళము రూపాంతరము]

    రిప్లయితొలగించండి
  24. ఆనాటి కరువు సీమను
    శ్రీనాథుఁడు రోసెనంట ; శ్రీకాకుళమున్
    వేనోళ్ళను కవులు జనులు
    నీనాటికి బొగడు చుందు రెప్పటి వలెనే !

    రిప్లయితొలగించండి
  25. నానాటికి యరులు పెరిగి
    శ్రీనాథుడు రో సెనంట, శ్రీ, కాకుళమున్,
    యే నాటికి మళ్లీ? మరి
    రానా నేనూ? యని పలుమారడిగెనహో

    కాకుళము .. గందరగోళం
    శ్రీ .. అమ్మవారు

    రిప్లయితొలగించండి
  26. నానాదేశములన్ భ్రమించి రసశూన్యంబంచు పల్నాడునున్
    శ్రీనాథుండు చరించి రోసెనట;యీ శ్రీకాకుళమ్మున్ గటా
    యేనాడున్ ప్రచరించినట్లు గనమే,యెద్దేవజేయంగ దా
    సూనాస్త్రున్ వలె చానలన్ యశనమున్ శుష్కంపు వాచాలతన్


    రిప్లయితొలగించండి
  27. నానీ!యెవ్వరు చెప్పిరిట్లనిమరిన్నమ్మంగశక్యంబునే
    శ్రీనాధుండు చరించి రోసెనట యీశ్రీకాకుళమ్మున్గదా
    శ్రీనాధుండు చరించలేదటగదా శ్రీకాకుళంబున్సుమా
    వీనుల్నచ్చవు నీదుమాటలుసుమావేయేలవాచాలకా

    రిప్లయితొలగించండి
  28. ఏనాడెరుగముమేమిల
    శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్
    కానగలేదోమీరిల
    శ్రీ నాథుడె వెలసెనాడె శ్రీ కాకుళమున్!

    రిప్లయితొలగించండి
  29. కందం
    పూనుచ కన్నడ రాయలుఁ
    దా నాడాముక్త మాల్యదన్ రచియించెన్
    పూనంగ నాముదాలను
    శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్

    శార్దూలవిక్రీడితము

    తానానాడొగి బూన్చ రాయలును గోదా కావ్యమున్ గూర్చెనే
    పూనన్ జూడఁగఁ గానిపించరని నైపుణ్యుండటంచెంచుచుం
    దానైవచ్చియు నాముదాల యవధాన ప్రాంగణమ్మందగన్
    శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా!!

    (శ్రీనాథుఁడు = శ్రీకాకులాంధ్రమహావిష్ణువు)

    రిప్లయితొలగించండి
  30. వీనులవిందుగ పాడే
    నానాదేశములయందు నారీమణులన్
    తానెందుకొ కుందని యీ
    శ్రీనాధుడురోసెనంట శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాడే' అనడం వ్యావహారికం. "పాడెడు" అనవచ్చు.

      తొలగించండి


  31. జ్ఞానియు నైనట్టి సుకవి
    శ్రీనాథుడు రోసెనంట శ్రీకాకుళమున్
    చీనాంబరము లొసంగెడు
    శ్రీ నాథుడె లేడటంచు సిడిముడి తోడన్.

    సిడిముడి=చిరాకు

    రిప్లయితొలగించండి
  32. నేనారసికుడనౌటన్
    ఆనాడామత్స్యగంధియాశలురేపన్
    నా యాశలు చిగురించక
    శ్రీనాధుడురోసెనంట శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి
  33. ఆనాటి రసిక సిం హము
    ఈనాడిట మూతివిరిచి ఈర్ష్యనుబొందన్
    రేనాటి జొన్నతిండి
    శ్రీనాధుడురోసెనంట, శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  34. మీనాక్షుల దను జుట్టగ
    నానా పొగలున్న కంపు క నాసికదాకన్!
    ఆనాటి యడ్డచుట్టన్
    శ్రీనాధుడురోసెనంట, శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి
  35. నానావిధముల వనితన్
    శ్రీనాధుడు కీర్తిజేయు సిగ్గిల తానే
    ఈనాడదేమి కర్మమొ!
    శ్రీనాధుడురోసెనంట, శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి
  36. మీనాక్షుల దను జుట్టగ
    నానా పొగలున్నకంపునాసికదాకన్!
    ఆనాటి యడ్డచుట్టన్
    శ్రీనాధుడురోసెనంట, శ్రీకాకుళమున్.

    రిప్లయితొలగించండి
  37. కందము:
    నానారాజుల జూచియు
    పో నా రాయల కవితల పోషణ గాంచన్
    దా నా రత్నపు వీధుల
    "శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్"

    తానా శృంగార రసిక
    మేనా లేకను నడువడు మేదిని యందున్
    నానా దర్పము లొప్పెడు
    "శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్"

    రిప్లయితొలగించండి
  38. నానా జాతుల నాగరీకులట నానా రీతులన్ మెల్గుచున్
    నానా భాషల యాసలన్ బలుకఁదానా ప్రాంత మందున్గనెన్
    వేనోళ్ళంబొగడంగనాప్రజలదౌవిన్నాణమున్ విద్యలన్
    శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా

    రిప్లయితొలగించండి