ప్రాతః కాలపు సరదా పూరణ: దంభమ్మున్ వడి కూలద్రోయు విధినిన్ తంటాలు పెట్టించుదౌకంభమ్మందున దాగియుండు మనదౌ గారమ్మునే త్రుంచెడిన్ గంభీరమ్మగు కైపదమ్మిదియెరో కందీశ్వరున్ మాయరో: 👇"స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"కంభము = కంబము (ఆంధ్ర భారతి)
ప్రభాకర శాస్త్రి గారూ,మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
అంభోరుహ నేత్రుడసురు స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్ శంభుని సుతుడై శరవణుడంభములో నుద్భవించి యంతము జేసెన్
విరించి గారూ,విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంభోజుడు భక్తునికైస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్దంభంబడచగ చంపెన్సంభావ్యము విభుని ధర్మ సంస్థాపనకై!జిలేబి
జిలేబి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అంభోజుడు' అంటే చంద్రుడు, అగ్ని అనే అర్థాలు మాత్రమే ఉన్నాయి.
:) A=B B=CTherefore A=C :)విష్ణువు = అగ్ని దేవుడు ; అగ్నిదేవుడు = అంభోజుడు ; Therefore :)jeke :)మార్చవలెను :)జిలేబి
Jilebe = SweetLaddu = Sweettherefore Jilebe = Laddu
డింభకు పితరుని హరియేస్తంభంబునబుట్టి చంపె, స్కందుండసురున్దంభంబణచుటకిలసంరంభంబుగ తాజనించె శంకరసుతుడై.
ఫణీంద్ర గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రంభను బోలినయువతినిడంభముతో మీదబడగ ఢమ,ఢమ రాగా!శంభుని యాజ్ఞన సుతుడేస్తంభంబునబుట్టిజంపె స్కందుండసురున్!
రావెల వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'శంభుని యాజ్ఞను' అనండి.
డంభం బణచగ శ్రీహరిస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్శంభుని యానతిపై సంరంభంబున జంపెను సమరంబున వేడ్కన్
రామ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంభోజుండట నారసింహముగ భక్తాగ్రేసరున్ రక్ష కైస్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభియైదంభంబున్ తుదమార్చ చంపెనసురున్ దాష్టీకమున్ద్రోలగాసంభావ్యంబిది నీతినెక్కొలుపగా సర్వేశ్వరున్ లీలగా!జిలేబి
జిలేబి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అంభోజుడు' శబ్దానికి విష్ణువన్న అర్థం లేదు.
భం భం బోలో! హరియాస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్అంబరమున జంపెను. లోకంబునఁ సుర అసుర గోల కంతము లేదా?
రామ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'లోకంబున' తరువాత అరసున్న అవసరం లేదు. 'సుర + అసుర = సురాసుర' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.
భం భం బోలో! హరియాస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్అంబరమున జంపెను. లోకంబున నసుర సుర గోల కంతము లేదా?
భం భం బోలో! హరియాస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్అంబరమున జంపెను. లోకంబున నసురాసుర కథ కంతము లేదా?🙏 ధన్యవాదాలు గురువు గారూ
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) జంభమ్మొప్పి నృసింహ దివ్యుడచటన్ జైత్రమ్మునన్ గర్జుచున్ స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్;...స్కందుండు సంరంభియైరంభమ్మందున మేళవించెనయయో లాభమ్ము కోల్పోవుచున్ సంభారమ్ములు పారిపోవగ కటా సంచీల నాణ్యాలతో జంభము = pomp (బ్రౌణ్యం) గర్జు = గర్జించు (శ్రీహరి)స్కందుడు = కుమారస్వామి (H. D.)రంభము = దుమ్ము లాభము = majorityసంభారము = సమూహము
__/\__
🙏
అంభోజాక్షుడు కశిపునిస్తంభంబున బుట్టిజంపె;స్కందుం డసురున్ డింభకుడై దునిమెను సంరంభమున దివిజులు బొగడ రక్షకుడనుచున్
సీతాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
( స్కూల్లో సత్యమూర్తి మాస్టారు విద్యార్థినిని ప్రశ్నించారు .అమ్మాయి మధుమతి సమాధానం చెప్పింది .)" స్తంభం బందక తెల్పుమా మధుమతీ !సచ్చిష్యవై ; దేవసం స్తంభాత్ముండు హిరణ్యు శ్రీహరి యెటుల్ సంహారమున్ జేసెనో ?జృంభుండౌ ఖలు తారకాసురు నుమా సత్పుత్రు డే రీతినో ? " " స్తంభంబందున బుట్టి చంపె నసురున్ ;స్కందుండు సంరంభియై . "
మూడవపాదంలో " జంభారాతిని తారకాసురు " అని చదువ మనవి .)
జంధ్యాల వారూ,మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డింభకు దండ్రిని హరియేస్తంభంబునఁ బుట్టి చంపె; స్కందుం డసురున్ దంభంబున తారకుఁ నాశంభుజుడే మట్టి గరిపె శరవణ భవుడై!
యజ్ఞేశ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ శంకరాభరణం.. సమస్యాపూరణం.. స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"అంభోజాక్ష కథాసుధాపఠన దివ్యాసక్తితోనుండ , నారంభంబయ్యెను దూరదర్శినిఁ గుమారస్వామి వృత్తాంతమున్ ., జృంభాసంకలితేక్షణుండనయి నిద్రింపన్ గలన్ గంటి నే స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అంభోధిసుతధవుడచట స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్దంభంబడచగ చంపెన్సంభావ్యము విభుని ధర్మ సంస్థాపనకై!సరియేనాండి ?జిలేబి
అంభోజాక్షుడు నారసింహముగ భక్తాగ్రేసరున్ రక్ష కైస్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభియైదంభంబున్ తుదమార్చ చంపెనసురున్ దాష్టీకమున్ద్రోలగాసంభావ్యంబిది నీతినెక్కొలుపగా సర్వేశ్వరున్ లీలగా!అంభోజాక్షుడు కాపీ పేస్టు ఈ పదమునకు విష్ణువని అర్థము లేదు ఆంధ్ర భారతి లోఅంభోజము పద్మముఅక్షుడు కన్నులు కలవాడు అంభోజాక్షుడు- పద్మ నయనుడు కాబట్టి విష్షవనుకొనవలెనా ? తెలియచేయగలరు జిలేబి
సవరించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'అంభోజాక్షుడు' విష్ణువే. సందేహం లేదు.
జిలేబి గారు భక్తాగ్రేసరున్ రక్ష కై భక్తాగ్రేసరుని రక్షకై యనఁ దలఁచిన భక్తాగ్రేసరు రక్ష కై సాధువు.భక్తాగ్రేసరున్ వాడఁ దలఁచిన భక్తాగ్రేసరుం గావఁగన్ సాధువు.
నమో నమః ఇరువురికిన్ను జిలేబి
అట్లే సర్వేశ్వరున్ లీలగా!
అంభో రుహ నయను డ సు రుని స్తంభ మున బట్టి చంపె : స్కo దుండ సురు న్ శంభుని సుతు డా హ వ మున శ o భో యని పించి చంపె శౌ ర్య ము తోడన్
మొదటి పాద o చివర ని లేదని మనవి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: దంభకుడౌ కశిపుని హరి స్తంభం బందున పుట్టి జంపె; స్కందుం డసురున్ సంభవ మొందని రీతిని శంభుని పంపున వధించి జగతిని తేర్చెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'స్తంభంబున బుట్టి...' టైపాటు.
డంభుడు రాక్షస రాజునుస్తంభంబున బుట్టిచంపె,స్కందుండసురున్ శంభునీ యాఙ్ఙను జంపగరంభాదులుమెచ్చి పూలురయమున జల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'డంభుడు'? 'రంభాదులు' బహువచనం, చల్లెన్ ఏకవచనం.
అంభోజాక్షుఁడ యుండడె యంభోద్యుక్ష్మా చ రాచ రాసు నిచయ భృత్సంభారమ్ములఁ గావున స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్ [స్కందుని లో గూడ నున్నది విష్ణువే యని] శంకరుని భార్యతోనాడు సరస సల్లాపములు:అంభోజాక్షుఁడె యక్కుమారునకు బ్రహ్లాదుండు నా మేటికిన్ స్తంభాంతస్థితుఁ డయ్యె స్వామి యనఁగా స్కందుండె దంభార్థమేరంభా గాంచుమ స్కందుఁ డన్నను గుమారస్వామి తథ్యంబుగాస్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
జంభారి నుతుండౌ హరిస్తంభంబునఁ బుట్టి చంపె ;స్కందుం డసురున్జృంభణమున జంపెను తాశంభుని సుతుడై జనించి సంగరమందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.హరి జంభారి సుతుడెలా అయ్యాడు. జంభారికి సోదరుడు కదా?
నమస్కారం
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు: దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దైత్యారిన్ గేలించుచున్ సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదం చివర గణదోషం. సవరించండి.
ధన్యవాదములు గురువుగారు. పొరబాటును సవరిస్తాను. దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దామోదరున్ కేరుచున్ సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువేస్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియైశంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!
ఉద్యోగార్థ శాస్త్ర విద్యలు జీవనోపాధికి నవసరమైన మాతృభాషా పరిజ్ఞానము హృదయానందము నొసఁగు కళ యగును: కావున రెండు నత్యావశ్యకములే.ఆధునిక శాస్త్ర విద్యా బోధము క్షుద్భాధఁ దీర్చుఁ బూర్ణ రుచిర భాషా ధారణమ్ము జన చిత్తాధీ నానంద మొసఁగు నంచిత కళయై
దంభములాడకుమోయీస్తంభంబున బుట్టెనంటు స్కందుండకటాడింభక పలుకంగ దగదుస్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్!!***గురువు శిష్యుని తో....
అంభుజనాభుడు దనుజునిస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్జృంభించి తా వెసఁ దునిమెనంభోభృత్పథము నుండి యమరులు పొగడన్
క్రొవ్విడి వెంకట రాజారావు: సవరించిన పూరణ: దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దామోదరున్ కేరుచున్సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువేస్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియైశంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!
అంభోరుహ నేత్రు డసురు స్తంభంబునఁ బుట్టి చంపె; స్కందుం డసురున్శంభుని తేజంబై నా లంభించె; సుజనుల గాచి రక్షించుటకై
అంభోజాక్షుడు దానుగోపముదనన్ హర్యక్షరూపంబుతోస్తంభంమందున బుట్టిచంపెనసురున్,స్కందుండు సంరంభియైశంభున్నాఙ్ఞకు మోద మందుచువెసన్ జాపంబుజేబూని యాడంభంబొందిన తారకాసురుననిన్ ఢంకాలుగొట్టెంచెగా
అంబా! కనక కశిపుఁ హరిస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్ దంభమణచగా బుట్టెను శంభుని సుతుడై సిద్ధ శయనుండతడై
దంభంబుల్ కఠినోక్తులన్ పలుకగా నౌద్ధత్యతన్ శౌరియేస్తంభంబందునఁ బుట్టి చంపెనసురున్, స్కందుండు సంరంభియైసంభాలించుచు దేవతా గణమునెల్లన్ సంభవంబొందెతానంబాపుత్రునిగా గుహుండు చదలన్ హాహారవమ్మంటగా
కం.బింబము కాదది హరియేస్తంభంబున బుట్టి చంపె, స్కందుండసురున్ డింబము నేర్పడ కుండగశంభముచేకూర్చు నెపుడు శాంభవి కృపగన్వై. చంద్రశేఖర్డింబము=ఉపద్రవము
..............🌻శంకరాభరణం🌻.................................🤷🏻♂సమస్య 🤷♀.................... స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్ సందర్భము: సులభము~~~~~~~~~~~~~~~~~~~~~~~జృంభణమున హరి యసురునిస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్స్తంభింప జేసి చంపెను..దంభము లిరువురు పలుకరు తగ హరి గుహులున్ ✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 20.9.19-----------------------------------------------------------శ్రీ శేష కుమార్ గారి ప్రేరణతో..
అంబా! లోకము లేలువాడె గద యా యజ్ఞేశ్వరుండాతడే యంభోజాక్షుడు, భక్తపోషకుడు, ప్రహ్లాదున్ మొరాలించుచున్ స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభి యై దంభమ్మెంతయొ కల్గినట్టి ఖలుడా దైతేయునిన్ గూల్చెనే.
శార్దూలవిక్రీడితముసంభాషించక ధ్యానయోగ నియతిన్ స్తంభమ్ముగన్ వెల్గెడున్శంభున్ వేడఁగ నస్సురాదులు మరున్ సంధించి హైమావతిన్రంభన్ భార్యగ తారకాసురుని పాలార్చంగఁ జేబట్టఁ దద్స్తంభంమందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై(రంభ = పార్వతి, స్తంభము = స్థిరము, స్థైర్యము)
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
దంభమ్మున్ వడి కూలద్రోయు విధినిన్ తంటాలు పెట్టించుదౌ
కంభమ్మందున దాగియుండు మనదౌ గారమ్మునే త్రుంచెడిన్
గంభీరమ్మగు కైపదమ్మిదియెరో కందీశ్వరున్ మాయరో: 👇
"స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"
కంభము = కంబము (ఆంధ్ర భారతి)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
అంభోరుహ నేత్రుడసురు
రిప్లయితొలగించండిస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
శంభుని సుతుడై శరవణు
డంభములో నుద్భవించి యంతము జేసెన్
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅంభోజుడు భక్తునికై
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
దంభంబడచగ చంపెన్
సంభావ్యము విభుని ధర్మ సంస్థాపనకై!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంభోజుడు' అంటే చంద్రుడు, అగ్ని అనే అర్థాలు మాత్రమే ఉన్నాయి.
తొలగించండి:) A=B
B=C
Therefore A=C :)
విష్ణువు = అగ్ని దేవుడు ; అగ్నిదేవుడు = అంభోజుడు ; Therefore :)
jeke :)
మార్చవలెను :)
జిలేబి
Jilebe = Sweet
తొలగించండిLaddu = Sweet
therefore Jilebe = Laddu
డింభకు పితరుని హరియే
రిప్లయితొలగించండిస్తంభంబునబుట్టి చంపె, స్కందుండసురున్
దంభంబణచుటకిలసం
రంభంబుగ తాజనించె శంకరసుతుడై.
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రంభను బోలినయువతిని
రిప్లయితొలగించండిడంభముతో మీదబడగ ఢమ,ఢమ రాగా!
శంభుని యాజ్ఞన సుతుడే
స్తంభంబునబుట్టిజంపె స్కందుండసురున్!
రావెల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శంభుని యాజ్ఞను' అనండి.
డంభం బణచగ శ్రీహరి
రిప్లయితొలగించండిస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్
శంభుని యానతిపై సం
రంభంబున జంపెను సమరంబున వేడ్కన్
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅంభోజుండట నారసింహముగ భక్తాగ్రేసరున్ రక్ష కై
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభియై
దంభంబున్ తుదమార్చ చంపెనసురున్ దాష్టీకమున్‌ద్రోలగా
సంభావ్యంబిది నీతినెక్కొలుపగా సర్వేశ్వరున్ లీలగా!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంభోజుడు' శబ్దానికి విష్ణువన్న అర్థం లేదు.
భం భం బోలో! హరియా
రిప్లయితొలగించండిస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్
అంబరమున జంపెను. లో
కంబునఁ సుర అసుర గోల కంతము లేదా?
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లోకంబున' తరువాత అరసున్న అవసరం లేదు. 'సుర + అసుర = సురాసుర' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.
భం భం బోలో! హరియా
తొలగించండిస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్
అంబరమున జంపెను. లో
కంబున నసుర సుర గోల కంతము లేదా?
భం భం బోలో! హరియా
తొలగించండిస్తంభంబున బుట్టి జంపె, స్కందుండసురున్
అంబరమున జంపెను. లో
కంబున నసురాసుర కథ కంతము లేదా?
🙏 ధన్యవాదాలు గురువు గారూ
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
జంభమ్మొప్పి నృసింహ దివ్యుడచటన్ జైత్రమ్మునన్ గర్జుచున్
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్;...స్కందుండు సంరంభియై
రంభమ్మందున మేళవించెనయయో లాభమ్ము కోల్పోవుచున్
సంభారమ్ములు పారిపోవగ కటా సంచీల నాణ్యాలతో
జంభము = pomp (బ్రౌణ్యం)
గర్జు = గర్జించు (శ్రీహరి)
స్కందుడు = కుమారస్వామి (H. D.)
రంభము = దుమ్ము
లాభము = majority
సంభారము = సమూహము
__/\__
తొలగించండి🙏
తొలగించండిఅంభోజాక్షుడు కశిపుని
రిప్లయితొలగించండిస్తంభంబున బుట్టిజంపె;స్కందుం డసురున్
డింభకుడై దునిమెను సం
రంభమున దివిజులు బొగడ రక్షకుడనుచున్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండి
రిప్లయితొలగించండి( స్కూల్లో సత్యమూర్తి మాస్టారు విద్యార్థినిని ప్రశ్నించారు .
అమ్మాయి మధుమతి సమాధానం చెప్పింది .)
" స్తంభం బందక తెల్పుమా మధుమతీ !
సచ్చిష్యవై ; దేవసం
స్తంభాత్ముండు హిరణ్యు శ్రీహరి యెటుల్
సంహారమున్ జేసెనో ?
జృంభుండౌ ఖలు తారకాసురు నుమా
సత్పుత్రు డే రీతినో ? "
" స్తంభంబందున బుట్టి చంపె నసురున్ ;
స్కందుండు సంరంభియై . "
మూడవపాదంలో " జంభారాతిని తారకాసురు " అని
రిప్లయితొలగించండిచదువ మనవి .)
జంధ్యాల వారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డింభకు దండ్రిని హరియే
రిప్లయితొలగించండిస్తంభంబునఁ బుట్టి చంపె; స్కందుం డసురున్
దంభంబున తారకుఁ నా
శంభుజుడే మట్టి గరిపె శరవణ భవుడై!
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం..
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"
అంభోజాక్ష కథాసుధాపఠన దివ్యాసక్తితోనుండ , నా
రంభంబయ్యెను దూరదర్శినిఁ గుమారస్వామి వృత్తాంతమున్ .,
జృంభాసంకలితేక్షణుండనయి నిద్రింపన్ గలన్ గంటి నే
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅంభోధిసుతధవుడచట
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
దంభంబడచగ చంపెన్
సంభావ్యము విభుని ధర్మ సంస్థాపనకై!
సరియేనాండి ?
జిలేబి
రిప్లయితొలగించండిఅంభోజాక్షుడు నారసింహముగ భక్తాగ్రేసరున్ రక్ష కై
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభియై
దంభంబున్ తుదమార్చ చంపెనసురున్ దాష్టీకమున్‌ద్రోలగా
సంభావ్యంబిది నీతినెక్కొలుపగా సర్వేశ్వరున్ లీలగా!
అంభోజాక్షుడు కాపీ పేస్టు
ఈ పదమునకు విష్ణువని అర్థము లేదు ఆంధ్ర భారతి లో
అంభోజము పద్మము
అక్షుడు కన్నులు కలవాడు
అంభోజాక్షుడు- పద్మ నయనుడు కాబట్టి విష్షవనుకొనవలెనా ? తెలియచేయగలరు
జిలేబి
సవరించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'అంభోజాక్షుడు' విష్ణువే. సందేహం లేదు.
జిలేబి గారు
తొలగించండిభక్తాగ్రేసరున్ రక్ష కై
భక్తాగ్రేసరుని రక్షకై యనఁ దలఁచిన భక్తాగ్రేసరు రక్ష కై సాధువు.
భక్తాగ్రేసరున్ వాడఁ దలఁచిన భక్తాగ్రేసరుం గావఁగన్ సాధువు.
తొలగించండినమో నమః ఇరువురికిన్ను
జిలేబి
అట్లే సర్వేశ్వరున్ లీలగా!
తొలగించండిఅంభో రుహ నయను డ సు రుని
రిప్లయితొలగించండిస్తంభ మున బట్టి చంపె : స్కo దుండ సురు న్
శంభుని సుతు డా హ వ మున
శ o భో యని పించి చంపె శౌ ర్య ము తోడన్
మొదటి పాద o చివర ని లేదని మనవి
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదంభకుడౌ కశిపుని హరి
స్తంభం బందున పుట్టి జంపె; స్కందుం డసురున్
సంభవ మొందని రీతిని
శంభుని పంపున వధించి జగతిని తేర్చెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'స్తంభంబున బుట్టి...' టైపాటు.
డంభుడు రాక్షస రాజును
రిప్లయితొలగించండిస్తంభంబున బుట్టిచంపె,స్కందుండసురున్
శంభునీ యాఙ్ఙను జంపగ
రంభాదులుమెచ్చి పూలురయమున జల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'డంభుడు'? 'రంభాదులు' బహువచనం, చల్లెన్ ఏకవచనం.
అంభోజాక్షుఁడ యుండడె
రిప్లయితొలగించండియంభోద్యుక్ష్మా చ రాచ రాసు నిచయ భృ
త్సంభారమ్ములఁ గావున
స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్
[స్కందుని లో గూడ నున్నది విష్ణువే యని]
శంకరుని భార్యతోనాడు సరస సల్లాపములు:
అంభోజాక్షుఁడె యక్కుమారునకు బ్రహ్లాదుండు నా మేటికిన్
స్తంభాంతస్థితుఁ డయ్యె స్వామి యనఁగా స్కందుండె దంభార్థమే
రంభా గాంచుమ స్కందుఁ డన్నను గుమారస్వామి తథ్యంబుగా
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిజంభారి నుతుండౌ హరి
రిప్లయితొలగించండిస్తంభంబునఁ బుట్టి చంపె ;స్కందుం డసురున్
జృంభణమున జంపెను తా
శంభుని సుతుడై జనించి సంగరమందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరి జంభారి సుతుడెలా అయ్యాడు. జంభారికి సోదరుడు కదా?
నమస్కారం
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దైత్యారిన్ గేలించుచున్
సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే
స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై
శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదం చివర గణదోషం. సవరించండి.
ధన్యవాదములు గురువుగారు. పొరబాటును సవరిస్తాను.
తొలగించండిదంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దామోదరున్ కేరుచున్
సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే
స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై
శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!
ఉద్యోగార్థ శాస్త్ర విద్యలు జీవనోపాధికి నవసరమైన మాతృభాషా పరిజ్ఞానము హృదయానందము నొసఁగు కళ యగును: కావున రెండు నత్యావశ్యకములే.
రిప్లయితొలగించండిఆధునిక శాస్త్ర విద్యా
బోధము క్షుద్భాధఁ దీర్చుఁ బూర్ణ రుచిర భా
షా ధారణమ్ము జన చి
త్తాధీ నానంద మొసఁగు నంచిత కళయై
__/\__
తొలగించండిదంభములాడకుమోయీ
రిప్లయితొలగించండిస్తంభంబున బుట్టెనంటు స్కందుండకటా
డింభక పలుకంగ దగదు
స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్!!
***గురువు శిష్యుని తో....
అంభుజనాభుడు దనుజుని
రిప్లయితొలగించండిస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
జృంభించి తా వెసఁ దునిమె
నంభోభృత్పథము నుండి యమరులు పొగడన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసవరించిన పూరణ:
దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దామోదరున్ కేరుచున్
సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే
స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై
శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!
అంభోరుహ నేత్రు డసురు
రిప్లయితొలగించండిస్తంభంబునఁ బుట్టి చంపె; స్కందుం డసురున్
శంభుని తేజంబై నా
లంభించె; సుజనుల గాచి రక్షించుటకై
అంభోజాక్షుడు దానుగోపముదనన్ హర్యక్షరూపంబుతో
రిప్లయితొలగించండిస్తంభంమందున బుట్టిచంపెనసురున్,స్కందుండు సంరంభియై
శంభున్నాఙ్ఞకు మోద మందుచువెసన్ జాపంబుజేబూని యా
డంభంబొందిన తారకాసురుననిన్ ఢంకాలుగొట్టెంచెగా
అంబా! కనక కశిపుఁ హరి
రిప్లయితొలగించండిస్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
దంభమణచగా బుట్టెను
శంభుని సుతుడై సిద్ధ శయనుండతడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదంభంబుల్ కఠినోక్తులన్ పలుకగా నౌద్ధత్యతన్ శౌరియే
రిప్లయితొలగించండిస్తంభంబందునఁ బుట్టి చంపెనసురున్, స్కందుండు సంరంభియై
సంభాలించుచు దేవతా గణమునెల్లన్ సంభవంబొందెతా
నంబాపుత్రునిగా గుహుండు చదలన్ హాహారవమ్మంటగా
కం.
రిప్లయితొలగించండిబింబము కాదది హరియే
స్తంభంబున బుట్టి చంపె, స్కందుండసురున్
డింబము నేర్పడ కుండగ
శంభముచేకూర్చు నెపుడు శాంభవి కృపగన్
వై. చంద్రశేఖర్
డింబము=ఉపద్రవము
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
జృంభణమున హరి యసురుని
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
స్తంభింప జేసి చంపెను..
దంభము లిరువురు పలుకరు
తగ హరి గుహులున్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.9.19
-----------------------------------------------------------
శ్రీ శేష కుమార్ గారి ప్రేరణతో..
అంబా! లోకము లేలువాడె గద యా యజ్ఞేశ్వరుండాతడే
రిప్లయితొలగించండియంభోజాక్షుడు, భక్తపోషకుడు, ప్రహ్లాదున్ మొరాలించుచున్
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభి యై
దంభమ్మెంతయొ కల్గినట్టి ఖలుడా దైతేయునిన్ గూల్చెనే.
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిసంభాషించక ధ్యానయోగ నియతిన్ స్తంభమ్ముగన్ వెల్గెడున్
శంభున్ వేడఁగ నస్సురాదులు మరున్ సంధించి హైమావతిన్
రంభన్ భార్యగ తారకాసురుని పాలార్చంగఁ జేబట్టఁ ద
ద్స్తంభంమందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై
(రంభ = పార్వతి, స్తంభము = స్థిరము, స్థైర్యము)