2, సెప్టెంబర్ 2019, సోమవారం

న్యస్తాక్షరి - 65


కవిమిత్రులారా,
'వి - నా - య - కా'
పై అక్షరాలు వరుసగా పాదాంతంలో వచ్చే విధంగా 
వినాయకుని స్తుతిస్తూ 
కందం లేదా ఏదైనా వృత్తపద్యం వ్రాయండి. 

74 కామెంట్‌లు:

  1. ఆలింపుము మాదు మనవి ;
    కూలములెరుగని యిడుముల గూర్చుట తగునా ?
    మేలిమి గిరిపుత్రి తనయ !
    ఫాలము పదముల నిడెదము పాలితలోకా !

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    *న్యస్తాక్షరి*

    *'వి - నా - య - కా'*
    పై అక్షరాలు వరుసగా పాదాంతంలో వచ్చే విధంగా 
    వినాయకుని స్తుతిస్తూ 
    కందం లేదా ఏదైనా వృత్తపద్యం వ్రాయండి. 

    మనము పవిత్రభావనల మందిరమై విలసిల్ల, సర్వవి..
    ఘ్ననివహముల్ నశింప , మది నవ్వులపువ్వుల పూయజేయ నా...
    కనయము నీకృపారసమహౌషధమొక్కటె చాలునవ్యయ...
    మ్మని నిను మ్రొక్కెదన్ కరివరాస్య ! గణాధిప ! భాగ్యకారకా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. శరణము జొచ్చితి నో వి
    ఘ్నరాజ, నీదు చరణముల కరివదనా, నా
    మొరలను వినుమిక భవభయ
    హరుడా, వలదంటి మాపై హరసుత యలకా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాపై' అన్నచోట గణభంగం. "హరుడా! మాపైన నీకు హరసుత! యలకా?" అనండి.

      తొలగించండి
  4. గజముఖ!సంకట హర!*వి*
    ప్ర,జనానందాభిధాన!ప్రాభవ సద*నా*
    సృజనాత్మక!వర నుత!*య*
    య్య!జగద్భాస ప్రతాప!అమరానీ*కా*!

    రిప్లయితొలగించండి


  5. శుభాకాంక్షలతో



    పాయంగ విఘ్నములిక వి
    నాయక! దయచూపుము కరుణన్ కరివదనా!
    మాయామోహము హరిహయ!
    మా యాతనలయ్యె స్వామి మహిని యెడపకా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరిహయ'? "మహి నెడపకుమా" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి

    2. నమో నమః

      హరిహయుడు - విఘ్నేశ్వరుడు - ఆంధ్ర భారతి ఉవాచ !



      జిలేబి

      తొలగించండి


  6. వందనములయ గణేశా!
    మందగతి యెకానమీయె మార్పును గానన్
    తొందరగా తొండముతో
    అందరి పై చూపుమయ్య అనుకంపనమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. పలు విధ ప త్ర o బు లు ను వి
    రు ల సే క ర ణ ము న నిను మ రు లు గ ను నానా
    చెలు వ పు రూ పం బు ల జ య
    ము ల నిమ్మ ని పూజ జేతు మోయి వినాయకా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాల్గవ పాదం చివరి గణం రగణం అయింది. అక్కడ సగణం కాని గగం కాని ఉండాలి. సవరించండి.

      తొలగించండి
    2. చివరి పాదము లో చేతుము సురు ల గ ణ కా అని స వ ర ణ చే య డ మై న ది

      తొలగించండి


  8. నా పూరణ. కందము
    ***** **** *
    ఘనకాయ! గజానన! భువి

    జన పాలక! వక్రతుండ! శశిమధ హర! నా

    వినతుల చెవిగొనుచును భయ

    మును బాపుచు మోక్ష మొసగు పూజితలోకా!

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  9. గుణ సంపన్న ప్రదాతవి
    గణజనములఁ కీవొసంగుఁ గరిముఖ వదనా
    గణగణ గజ్జెల గణపయ
    ప్రణతులు గుంజీలతోడఁ బార్వతి తనయా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముఖము, వదనము' రెండూ ఒకటే. అక్కడ "కరివర వదనా" అనండి.

      తొలగించండి
    2. 🙏
      సరి జేసికొందును. ధన్యవాదములు

      తొలగించండి
  10. గురువు గారికి కవి మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
    మనసారా మొక్కెదకవి
    వినాయక యీ జగమున విఘ్నంబుల్ నా
    శనమగు,వర్షము లేదయ,
    వినిపించెద నామొరన్ సుదినమువి డువకా

    రిప్లయితొలగించండి
  11. రెండవ పాదము
    వినాయకా యీ జగమున విఘ్నంబుల్ నా
    గా చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో యతి తప్పింది. అంతేకాక 'విడువకా' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శప్రాస ఒక్క పాదానికే పరిమితం. మూడు పాదాల్లో స, ఒక పాదంలో శ లేదా మూడు పాదాల్లో శ, ఒక పాదంలో స ఇది పద్ధతి.

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కరివదన! పరశుధర! (వి)
    ఘ్నరాజ! హేరంబుడ! నను కావు మనెడి (నా)
    మొర నాలింపుమురా! జ(య)
    కర శుభకర శూర్పకర్ణ! గౌరీతన(యా)!

    రిప్లయితొలగించండి
  14. వినుమురదేవా!యీయవి
    ఘనమగు మావినతులివియగజకరవదనా!
    వినతులువినియిక మాభయ
    మునుమఱిబోగొట్టుమయ్య పుత్రిక కొడుకా!

    రిప్లయితొలగించండి
  15. శశ్వత్కృ తాఘ హర! వి
    శ్వేశ్వర కర దత్త మూర్థ! హేరాంబా! నా
    నైశ్వర్య దాంతరాయ
    ఘ్నేశ్వర! రక్షింపు మయ్య యిభ వక్త్రాంకా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విఘ్నారణ్య కుఠార! భక్తజన దుర్భే ద్యావనీ వాస పా
      పఘ్నా! నిర్జర పూజితాంఘ్రి యుగ! దుర్వా రోగ్ర దుర్దాంత శ
      త్రుఘ్నోదార దయా రసామృత మహోత్తుంగాత్మ! షడ్వక్త్ర గ
      ర్వఘ్నా! విఘ్నపతీ! నుతింతు నిను గాపాడంగ రావే దయన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అత్యుత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      రెండవ పద్యము విఘ్నేశ్వర స్తుతి మాత్రమే నండి.

      తొలగించండి
  16. వికటోత్కట సుందర, చవి
    తికి నిను కొలిచెదను సన్మతి కలుగవలె నా
    కిక, కావుమో శివ తనయ
    సకల శుభకర, గణపాయ సన్నుతి జనకా

    రిప్లయితొలగించండి
  17. వందే వినాయక గణాధిప పాశ హస్త
    వీరాధివీర కరుణాకర భక్త పాల
    ఉచ్ఛిష్ట, నృత్య బహు రూప విచిత్ర దేవ
    నీ బంటు వీడు వికటోత్కట కావుమయ్య

    రిప్లయితొలగించండి
  18. వాసిగ నీదు నామముఁ జపమ్ముగ జేతు నిరంతరమ్ము, వి
    ఘ్నేశుని వంచు నమ్మి కడు నిశ్చల భక్తిని గల్గియుంటి, నా
    యాసల దీర్చువాడవని యంబసుతుండవటంచు గొల్తు, య
    క్షా! సురవందితా! కరిముఖా! మము బ్రోవుమురా! వినాయకా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జప మ్మొనరింతు నిరంతరమ్ము వి।ఘ్నేశుడ వంచు' అనండి.

      తొలగించండి
  19. అనయము భజియించిన భవి
    తనొసగిరక్షించు కరివదనుడా! కొని నా
    దునమస్సులు దయఁ గనుమయ
    వినాయకా! మాత శాంభవి గృహపు తిలకా

    రిప్లయితొలగించండి
  20. శార్దూలము
    భారంబౌ పెను బొజ్జ నూపుకొనుచున్ పర్వమ్ము రావయ్య!వి
    ఘ్నారంభంబుల నొజ్జవై దునుముచున్ నారాయణీ నందనా!
    పారాతీతముగా జగజ్జననికిన్ వాత్సల్య మొప్పార య
    జ్ఞారంభంబిది సజ్జనాళిహృదయానందానుసంధాయకా!

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂న్యస్తాక్షరి 🤷‍♀...................
    *'వి - నా - య - కా'*
    పై అక్షరాలు వరుసగా పాదాంతాలలో రావలె.
    వినాయక స్తుతి. కందం లేదా ఏదైనా వృత్తం

    సందర్భము: దేశంలో గాని దేశాల నడుమగాని జనాల్లో గాని కయ్యాలు భేదాభిప్రాయాలు లేకుండా స్నేహ పూరిత వాతావరణం వుండేలా కరుణించ మని గణపతి ప్రార్ధన.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అయ్యా! నా దొక్క మనవి..
    రయ్యిన నిట కెలుక నెక్కి రమ్ము గునగునా..
    నెయ్యములు నిల్పిపోవయ!
    కయ్యమ్ములు మానిపించి గణప! చకచకా..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    2.9.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. సకల గణముల కధిపతివి
    సకల భువన జనని కాత్మ జన్ముడవే నా
    అకముల నణచుము నీ దయ
    నికముగ నొసగుము గొలిచెద నిను సుశ్లోకా 🙏

    రిప్లయితొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కరివదన! పరశుధర! (వి)
    ఘ్నరాజ! హేరంబుడ! నను కావు మనెడి (నా)
    మొర నాలింపుమురా! జ(య)
    కర శుభకర శూర్పకర్ణ! ఘన సుశ్లోకా!

    రిప్లయితొలగించండి
  24. అంబాపార్వతిపుత్ర వి
    లంబమునే సైపజాల లక్షింపగ నా
    లంబన నీవే గావుము
    శంభునికొమరా శరణము సన్నుతలోకా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో 'నీవేగావుము' బదులు 'నాకిల నీదయ' గా చదువ ప్రార్థన

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శంభు కుమారా శరణము' అనండి.

      తొలగించండి
    3. మూడవ పాదంలో నీవేగావుము బదులు నాకిలనీదయ -గా చదవగలరు

      తొలగించండి


  25. నా పూరణ. ఉ.మా.
    ***** ****

    సాంబుని పుత్ర!దివ్య సురజాల సురక్షక!యేకదంత! వి

    ఘ్నంబుల గూలద్రోయు ఘన కాయ వినాయక!శూర్పకర్ణ! నా

    రంబుల పాలకా!సక లలౌకిక విద్య లొసంగు దేవ! య

    త్నంబుల దీర్చు భవ్య గణనాయక! బ్రోవవె లోకపాలకా!


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  26. హేరంబా!నీకు మనవి
    ఆరంభించితిని పద్యమార్భటిని ఘనా
    కారా!మారారితనయ!
    చేరాతను తీర్చిదిద్దు చేవను తిలకా!
    తిలకా=శ్రేష్ఠుడా

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. తొలుదొలుతన గణపతి భు *వి*
      దలచెదరుగ నిను కురియగ దయ, కరివద *నా!*
      నిలువుము దొర! యగజ తన *య!*
      కలుషము లణిచి నను నడుపు, కరుణను జన *కా!*

      తొలగించండి
  28. సదమలచరితా! వినుము(వి)
    శదమయ త్వచ్ఛక్తి సుముఖ!శంకరసుత! (నా)
    మదికిన్ సంతస మిడుమ(య)
    వదలను నీపాదసేవ వరమిడ నలు(కా)?

    రిప్లయితొలగించండి
  29. కందము
    ఓయి గణాధ్యక్ష శుభవి
    దాయక సుందరగజాస్య తాపసనుత నా
    మా!యమునాత్మజ సహృదయ
    బాయక భజియింతునయ్య పాలితలోకా
    ఆకులు శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  30. కన్నులు చెమర్చు చున్నవి
    నిన్నే నమ్మితి గణపతి! నీరజ నయనా!
    తిన్నగ గావగ రావయ?
    నన్ను గరుణ జూడవేల?నాపై యలుకా?

    రిప్లయితొలగించండి
  31. అభవుని మద్దుల సుతుడివి
    శుభముల నిడుమా సతతము సుందర వదనా
    ఇభరాజవదనుడివయా
    నభయమొసంగుము మరువక నగజా తిలకా/కొడుకా.

    హితముల నొసగెడి సామివి
    సతతము కావుము విడువక చలిమల సదనా
    వెతలను బాపుచు నీదయ
    నతి వేగముగా నొసగుము నతి కారుణికా

    ఇడుములు బాపెడి స్వామివి
    కుడుములు నైవేద్య మిగులు కుంజరవదనా
    వడిగా చూపుము నీదయ
    కడుడస్సితి బ్రతుకు నందు కావుము బెనకా.


    రిప్లయితొలగించండి
  32. కందం
    ఆనతి నిచ్చి బ్రతుకు వి
    జ్ఞాన భరితమై మెరయఁగ సామజ వదనా!
    దీనావన! మము భవభయ
    సానువులన్ దాటఁ జూడు సద్గుణ తిలకా!

    రిప్లయితొలగించండి
  33. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి