11, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3129 (కంబు సుమీ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్"
(లేదా...)
"కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్"

69 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    అంబను వోలెడిన్ సుదతి! హాయిని పొందుము నాదు కౌగిటన్!
    జంబుక మైన యత్తయహ జాప్యము లేకయ తిట్టుచుండగా
    చెంబున నీటితో కడుగ చెన్నుగ తీరును శ్యామలమ్మ! శో
    కంబు సుమీ;...ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

    రిప్లయితొలగించండి
  2. అంబుజనేత్రితాననుచు , ఆశగ యామెకుతాళిగట్టితిన్ !
    చుంబనమేమివద్దనుచు,చుక్కలజూపును పక్కనెక్కుచున్
    అంబరవీధిజేరుటయె,హాయనిపించును నింతకన్న శో
    కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆశగ నామెకు' అనండి. 'పక్క నెక్కుచున్ అంబర...' ఈ విధంగా పద్యం మధ్య అచ్చు రాకుండా జగ్రత్త పడండి.

      తొలగించండి
    2. అంబుజనేత్రితాననుచు , ఆశగనామెకుతాళిగట్టితిన్ !
      చుంబనమేమివద్దనుచు,చుక్కలజూపును పక్కనెక్కి వా
      గంబరవీధిజేర్చనది ,హాయనిపించదు యింతకన్న శో
      కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.

      ధన్యవాదములు గురువర్యా!!
      మీసూచన అనవరతము నాకు శిరోధార్యము..


      కృతజ్ఞతలు..సవరణపాఠము ప్రచురించితిని

      తొలగించండి



  3. అంబువు లార్గురి కడు దుః
    ఖంబును దాటుట మరియు భయంబును వీడన్
    అంబుజ నాథుని జపమే
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును పొందన్

    ముఖము .. ప్రయత్నము, మోము
    రతి ... అనురాగము

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    అంబుజలోచద్వయమనంగుని సాయకపంక్తి., కంఠమా
    కంబుసమానమౌ మధురగానవిపంచి., కపోలయుగ్మమా
    చుంబనకేళికిన్ బిలుచుచుండె మనోహరి ! నీవె స్వర్గలో...
    కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.

      తొలగించండి
    2. అంబుజవాసినీప్రియ.! వృషాద్రినివాస ! త్వదీయ దివ్యపా...
      దాంబుజసేవనమ్మె పరమావధిగా దలపోసి పుణ్యనా..
      మంబు జపించి తృప్తిగొను మామకచిత్తము., నీవె నాకు లో...
      కంబు సుమీ ముఖంబతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్ !!

      (నీ ముఖము..(దర్శనము) అతిసుఖము.. అనురాగముతో. పరవశించుటకు....)

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. సంబరమందె నొక్కరుడు చక్కని చుక్కను బెండ్లియాడి తా
    నంబరవీధి నేగువిధి, నాత్మ దలంచుచు దానియంద మీ
    కంబుసమానకంఠి నిట గంటిని సత్యము పంచదార పా
    కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్"

    రిప్లయితొలగించండి
  6. రంభనుబోలియున్నదని,రాణినిజేసితి నెంతొ ప్రేమగా!
    అంబరమంతజూపినది,ఆశలనన్నిటినీరుగార్చుచున్
    సంబరమంత మాసినది,సాధ్యముగాదనితెల్సె ఘూ
    కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెల్సె' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  7. (అవక్రవిక్రముడు అర్జునునితో అప్సరస ఊర్వశి)
    అంబుజనేత్ర వచ్చి ముద
    మారగ రమ్మని నిన్ను కోర ;నా
    డంబరభంగులన్ తగద
    టంచును బల్కెదవేల ఫల్గుణా?
    సంబరమొప్ప నా సొగసు
    చక్కగ గాంచుము ;దివ్యమైన నా
    కంబు సుమీ ముఖం ;బతిసు
    ఖంబు సుమీ రతి నోలలాడగన్!!
    (నాకంబు -ఆనందదాయకం ;ఫల్గుణుడు -అర్జునుడు )

    రిప్లయితొలగించండి


  8. డంబము! కంఠము తనదట
    కంబు సుమీ; ముఖము రతి; సుఖంబును బొందన్
    జంబముగా నయ్యరుతో
    జంబలకడిపంబముగ సుజఘనయె చేరెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  9. ఆ మొగుడి బాధ

    సంబరమే! మనువాయె, భ
    యంబును వీడవె! మగడిని యారడి పెట్టకె
    అంబుజ విను! తేనియ పా
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును పొందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. 'మగడిని నారడి' అని ఉండాలి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారూ 🙏

      సంబరమే! మనువాయె, భ
      యంబును వీడవె! మగడికి యాతన వలదే
      అంబుజ విను! తేనియ పా
      కంబు సుమీ ముఖము రతి సుఖంబును పొందన్

      తొలగించండి
  10. అంబరమంటుగ నానం
    దంబు పడతి మోము సొగసు తగవర్ణింపన్
    అంబుజము సాటి యిల నా
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్

    రిప్లయితొలగించండి


  11. అంబురుహాక్షి! రావె రమణా! నను వీడకు నీవు నాకు మై
    కంబు సుమీ! ముఖం బతి సుఖంబు సుమీ! రతి నోలలాడ గం
    జంబిక చూపకోయి వనజాక్షి జిలేబి ! సుహాసినీ! ప్రియా!
    డంబమ దేల కంజముఖి!డాయుచు రావె ప్రతీపదర్శినీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  12. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తుంబురు నారదాదులిట తుమ్ముచు దగ్గుచు పాటపాడగా
    సంబర మాయె జూబిలిని సౌఖ్యము మీరెను తొల్త రాత్రినిన్;...
    కంబళి కప్పు! దోమలవి కాటుల మాపుము! రాదురాదు శో
    కంబు సుమీ! ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

    జూబిలి = Jubilee Hills, Hyderabad

    రిప్లయితొలగించండి
  13. ప్రవరా!

    ఉత్పలమాల

    రంభసమాన చప్పల విలాసపు కౌగిటఁ దేలియాడుచున్
    దంబ కుచాగ్ర సోయగము తాకగ నీ హృది దాహమారగన్
    జుంబన మాధురీ సుధల జుర్రగ గానవె మోవి దోయి సూ
    కంబు సుమీ! ముఖం బతి సుఖంబు సుమీ! రతి నోలలాడగన్

    రిప్లయితొలగించండి
  14. కొత్తగా పెళ్లి అయిన భార్య గోడు

    జంబుకము వలె బలాత్కా
    రంబును సేయ వలదుర! వరము గాదుర! నా
    యంబన లేముర! అతి దుః
    ఖంబు సుమీ ముఖము రతి సుఖంబును పొందన్

    రిప్లయితొలగించండి
  15. అంబుజ దళనేత్రీ! మద
    నాంబుకములు సోకి విరహ మధిక మ్మయ్యెన్
    బింబోష్ఠి నీవె నాలో
    కంబు సుమీ, ముఖము రతి సుఖంబును బొందన్.

    రిప్లయితొలగించండి
  16. సాంబుఁని రాణిని యా జగ
    దంబను చెడు దృష్టి దగని దరయ దశగళా!
    శంభుని చాపపు శాతసృ
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్.

    రిప్లయితొలగించండి
  17. మగ నెమలి కంటినుండి కారే నీటి చుక్కను తాగడం వలన ఆడ నెమలికి సంతానోత్పత్తి కలుగుతుంది. కాబట్టి శ్రీ కృష్ణుడు నెమలి బ్రహ్మచర్యానికి మెచ్చుకొని తలపై నెమలీకను అలంకరించుకోడానికి ఇష్టపడతాడు


    అంబరగము నాడెను మే
    ఘంబులురమ నపుడుగురిసె కన్నులలోబా
    ష్పంబులు శిఖి సఖి యనె నా
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్

    రిప్లయితొలగించండి


  18. అంబా! బెంగ్లూరుద క
    న్నాంబా! కుశలంబకొ మన నమ్మదె మెట్రో?
    తుంబా చెన్నాగిదె మై
    కంబు సుమీ! ముఖము రతిసు, ఖంబును బొందన్‌:)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. అంబుజ నయనా మదను ని
    యంబక ములు తవిలి ప్రేమ మధికం బయ్యెన్
    సంబర మగు నీ దగు లో
    కంబు సుమీ ముఖము రతి సుఖంబు ను బొందన్

    రిప్లయితొలగించండి
  20. అంబుజ నేత్రము లా సిత
    కంబుకమును వర సుమ రజ గండక స్థలమున్
    బింబాధర మాసేచన
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గండక స్థలమున్' అన్నపుడు 'క' గురువై గణదోషం. "గండస్థలమున్" అనవచ్చు.

      తొలగించండి
  21. అంబుజపత్రనేత్రిధవళాంబరముల్ ధరియించి చెచ్చెరన్
    యంబుద కూబరమ్ముపయి నంబరవీధినిపోవుచుండె డెం
    దంబున నామెయవ్వనము దందడిజేసెనికేమనందు నా
    కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెచ్చెరన్ + అంబుద' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  22. రిప్లయిలు
    1. అంబుజ నాభాంబుజ నే
      త్రంబులు గల బాలకృష్ణు రండారయ నీ
      లాంబుజ నవీన కలికౌ
      కంబు సుమీ ముఖము, రతి సుఖంబును బొందన్

      [కలికా + ఓకంబు = కలికౌకంబు; కలిక = మొగ్గ; ఓకము = ఇల్లు; రతి సుఖము = అనురాగపు టానందము]


      జంబుక తుల్య మానవ విశాల జనాటవి లోన నున్న హీ
      నాంబరుఁ జేరి యుండి కడు నండగ బంధు జనాప్త కోటి కా
      లంబన కార కేద్ధ గుణ రత్న నిధానుని నిర్మలేక్షు పా
      కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

      [ హీనాంబరుఁడు = వ్యసనములు లేని వాఁడు; ముఖము = మాట; రతిన్ = అనురాగములో; అనురాగములో నోలలాడిన యతి సుఖము కల్గును]

      తొలగించండి


    2. వావ్!


      జంబుక తుల్య మానవ విశాల జనాటవి !

      బంధుజనాప్తకోటికాలంబనకారకేద్ధగుణరత్ననిధానుడు!


      నమోనమః
      జిలేబి

      తొలగించండి
    3. నమస్సులు మఱియు ధన్యవాదములండి జిలేబి గారు.
      మీ సాహిత్యాభిలాష ప్రశంసనీయము.

      తొలగించండి
  23. కందం
    బింబాధరమధురిమలన్
    చుంబించఁగ మోహినీ! రసోదయమంబౌ
    సంబరమిడ శివునకు సూ
    కంబు సుమీ! ముఖము రతి సుఖంబును బొందన్

    రిప్లయితొలగించండి
  24. కందము:
    సంబురమే గన సుదతిని
    అంబుజ ముఖి జూడ దాను యందద దేలన్
    అంబర మంటగ మది, నా
    కంబు సుమీ ముఖము ! రతి సుఖంబును బొందన్"

    రిప్లయితొలగించండి
  25. శంబర సూదనుండు విరి శల్యము నాపయి వేసెనేమొ యో
    యంబుజ పత్రనేత్రి విరహమ్మిక తాళను చెంతజేరుచున్
    చుంబన మందజేయుమదె చోద్యము కాదె లతాంగి పొందె నా
    కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

    రిప్లయితొలగించండి

  26. సెన్సారు కత్తెరబడునా ? :)


    హుం! బౌబౌయని నావెను
    కంబడ నేల వృకరాతి కలహంసనకో?
    జంబమకో? రుచి నీ మ
    ర్కంబు సుమీ, ముఖము రతి సుఖంబును బొందన్!





    రిప్లయితొలగించండి
  27. అంబుజ నేత్రులు సొగసుల
    కంబుసుమీముఖము,రతిసుఖంబునుబొందన్
    చుంబనముగౌగిలింతలు
    సంబరముగజేయుడనుచుజలపతి చెప్పెన్

    రిప్లయితొలగించండి
  28. అంబరమంటు సౌఖ్యమున, ఆశలతీరముజేర్చు నామెయే!
    సంబరమంత తానెయయి ,సాధ్యముజేసెను కాపురమ్ములో
    కుంభపు వృష్టిగా వలపు,కూడికయాయెను జీవితమ్ము నా
    కంబుసుమీ ముఖంబతి, సుఖంబుసుమీ రతినోలలాడగన్

    రిప్లయితొలగించండి
  29. శంబరసూదనుడు విడువ
    నంబకముల్ వడి, పురుషుల నాకర్షింపన్
    అంబోరుహ నేత్రలకం
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్

    రిప్లయితొలగించండి
  30. అంబుజనేత్రిరా,యిటకు,ఆంక్షలు బెట్టకు మెప్పుడేనియున్
    నింబపు వృక్షమై నిలువు,నీదగు మేదకు సాటిరాగ డెం
    దంబది వెచ్చగా నవగ, దవ్వున కౌగిలినివ్వజూడు మై
    కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.

    రిప్లయితొలగించండి
  31. అంబుదళాయ తాక్షి! మెయి యందముతో మది దోచినావె! యా
    శంబరసూదనుండు వెస సాయకముల్ విడి వెంటనంటి ప్రే
    మాంబుదిలోనఁ ద్రోచెను రయమ్మున, నాతుక! నీదు పొందు నా
    కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

    రిప్లయితొలగించండి
  32. తాను కావలె నన్న తపస్సు చేయమన్న భార్యతో..

    అంబ! జగడమారి! పినా
    కంబు సుమీ ముఖము! రతి సుఖంబును పొందన్
    శంభుని తపమా? ఏమి? న
    యంబున చేకొనగ లేన? అవునా? మరెలా???

    రిప్లయితొలగించండి
  33. లంబోదరునిన్ వేడగ
    అంబుజనాభుని దరిసెనమయ్యెన్ నిర్విం
    ఘ్నంబునయేరీతిననే
    కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్!

    రిప్లయితొలగించండి
  34. అంబరచుంబియైముదము ఆంక్షలు దాటగ నొక్క తీరుగా
    సంబరమాయె నామదికి,సంతదిలేదనుబాధదీర్చకా
    మాంబుధిలోన నీదుదును,మాన్ పుదు గాయము, చెంతజేర, మై
    కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.

    రిప్లయితొలగించండి
  35. అంబువు కార కనుల శో
    కంబు సుమీ ముఖము,రతిసుఖంబును పొందన్
    అంబరము తాకు నంతటి

    రిప్లయితొలగించండి