23, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3141 (కులమును గుర్తించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్"
(లేదా...)
"కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ"

63 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కురుక్షేత్రము:

  తలనున్ భారము నొందుచున్ వడివడిన్ ధైర్యమ్ము కోల్పోయెడిన్...
  జ్వలనం బొందెడు మానసమ్ము గనుచున్ శారీరమౌ కంపమున్..
  చలితంబై కడు వేదనల్ పడయుచున్ జంజాట మొప్పారు వ్యా
  కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ

  రిప్లయితొలగించండి
 2. పలురీతుల బాధలతో
  విలపించెడు ఛాత్రునిగని పేరిమి తోడన్
  దలనిమురుచు నాతని వ్యా
  కులమును గుర్తించువాఁడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
 3. కలమే బలమనెఱిగితర
  కులముల లెక్కింపక తన కులమధిక మనన్
  మలమేదియు మది నుంచని
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు
   అని+ఎరిగి+ఇతర.... అన్నపుడు సంధి లేదు యడాగమం వస్తుంది

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువు గారూ..సవరణ తో..

   కలమే బలమనుచు నితర
   కులముల లెక్కింపక తన కులమధిక మనన్
   మలమేదియు మది నుంచక
   కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్

   తొలగించండి

 4. అబ్ కీ బార్ ట్రంప్ కీ బార్ :) హర్ హర్ ట్రంప్ జీ :)


  ఇల నమెరికాకిక మహో
  జ్వల భవిత గలదు వినండి జనులారా ట్రం
  పిలలో మై బెస్ట్ ఫ్రెండ్! రా
  కులమును గుర్తించువాఁడె గురువన నొప్పున్!


  హ్యూస్టన్
  జిలేబి :)

  రిప్లయితొలగించండి
 5. విలసిత మార్గంబులలో
  కలకాలము నిల్చునట్టి గాధల నిడుచున్
  కలతలు రేపెడు చెడు వ్యా
  కులమును గుర్తించువాడె గురువననొప్పున్.

  రిప్లయితొలగించండి
 6. తలపక మదిలో నెన్నడు
  కులమును గోత్రమును వాని గుణదోషములన్
  కలవళపడు ప్రశితుని యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  తప్పదు మరి..!

  లలితాస్యా ! హరినామగానరత ! ప్రహ్లాదా ! నిజంబౌను నీ
  పలుకుల్ మాకిడు తృప్తి., గాని జనకున్ బాధింపగా యుక్తమే ?!
  బలవంతుండగు రాజు, వానిగుణముల్ వర్ణించుచున్ దైత్యరా...
  ట్కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 8. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మనుస్మృతి:

  విలువౌ ఛాత్రుడు బాపనయ్య కికనున్ వేదమ్ములన్ నేర్పుచున్...
  బలుపౌ క్షత్రియ బాలకుండు దొరకన్ వైరమ్మునున్ నేర్పుచున్...
  లలితో కూడెడి కోమటయ్య కిటనున్ లాభమ్ములన్ నేర్పుచున్...
  వలపుల్ తోడుత శూద్రుడయ్య కసలౌ వాత్సల్యమున్ పంచుచున్...
  కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ

  రిప్లయితొలగించండి
 9. కం.
  మలినాలకు తావియ్యక l
  బలయుత ఘనుడై చదువరి పరిశీలకుఁడై l
  వడుపుగ మనుజులలో, వ్యా l
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్ ll

  రిప్లయితొలగించండి


 10. బలమున్ చూపెను వారి రాష్ట్రపతి ప్రాబల్యమ్ము మిత్రత్వమున్
  పలురీతిన్ తన దైన బాణి పొగిడెన్ "బారబ్బు ట్రంప్కీ" యనెన్
  భళి దామోదర దాసు మోడి! జన దర్బార్ నందు తీరైన రా
  కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. కలముకు నెలవై యుండుచు
  కులజు నకులజు లనెపు డన కుండని, అతి కా
  కులమున ఛాత్రుల దీర్చెడి
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
 12. ( భర్తృదానవ్రతంతో మాధవుని నిరంతరసత్యభామాధవు
  నిగా మార్చవచ్చునని సత్యతో అంటున్న నారదమహర్షి )
  అలినీలాలక ! సత్యభామ ! వినుమా
  " యాహా " యనం జేయు నా
  పలుకుల్ ; మాధవు శాశ్వతంబుగ నికన్
  "భామాధవున్ " జేయగా
  గలదమ్మా ! పతిదాననామక మహా
  గణ్యంపు నోమొండు ; వ్యా
  కులమున్ గాంచియు బోధసేయు గురువే
  క్షోణిన్ గడున్ బూజ్యుడౌ .

  రిప్లయితొలగించండి
 13. కలతల భవసాగర మెటు
  సులువగ నీదెదననుచును శోకమునందున్
  విలపించెడు శిష్యుని వ్యా
  కులమును గుర్తించువాడె గురువననొప్పున్

  రిప్లయితొలగించండి
 14. జలములు,వెన్నెల సూర్యుడు
  యిలలో నందరివి గావె? ఎందుకు మరినీ
  వలయములు, గువల యమునన్
  కులమును* గుర్తించు వాఁడె గురువన నొప్పున్!

  *వంశము

  రిప్లయితొలగించండి
 15. పలువిధ బోధలు జేయుచు
  ఫ లి త ము లాశించి తాను వక్ర మతుల లో
  గల య జ్ఞాన మనెడి వ్యా
  కులమును గుర్తించు వాడె గురు వన నొప్పున్

  రిప్లయితొలగించండి
 16. కులమున్ గోత్రమటంచు శిష్యులను సంక్షోభంబు బెట్టంగ నా
  డలుకన్ కర్ణుడు నేకలవ్యులను ద్రోణాచార్య రామన్నలే
  విలువన్ గోల్పడి నిందలన్గొనిరి,సంప్రీతిన్ సుఛాత్రాళి సం
  కులమున్ గాంచియు బోధజేయు గురుడే క్షోణిన్ గడున్ బూజ్యుడౌ

  రిప్లయితొలగించండి
 17. సులువగు ప్రశ్నల కిట్టుల
  కలవర పడరాదు తగదు కంగారిటులన్
  వలదని విద్యార్థుల వ్యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి


 18. అలుక వలదే సఖియ ! వ్యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్
  చెలిమికి నే రతగురువును
  పిలిచిన బిగువేల రావె వేళయిదె ప్రియా!  జిలేబి
  పరార్ :)

  రిప్లయితొలగించండి
 19. చెలువము మీరగ పద్యము
  లలవోకగ చెప్పలేక నారడి తోడన్
  గల గల పలికెడు కవి-వ్యా
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్.

  రిప్లయితొలగించండి
 20. పలు ప్రాంతమ్ముల నుండి విద్య గుడువన్ బంతమ్ము తో చేరెడిన్
  పలు విద్యార్థుల దిద్దితీర్చు నెపమున్ బాండిత్యమున్ బంచుచున్
  విలువిద్యల్ పలు శాస్త్రముల్ ద్విజులకున్ వేదమ్ము నేనేర్పగన్
  గులమున్ గాంచియు బోధసేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ.

  రిప్లయితొలగించండి
 21. మత్తేభవిక్రీడితము
  తలపుల్ ద్రోణుని నొజ్జగా నొదుగ సంధానించి యేకాగ్రతన్
  విలు విద్యన్గన నేకలవ్యుఁడడవిన్, వ్రేలిన్ వివక్షన్ గొనన్
  బలు రీతుల్ దగదంచు ప్రాజ్ఞులనరే స్వార్థంపుటా ద్రోణు! నా
  కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ

  (ఆకులము = పనిలో లీనమైనది)

  రిప్లయితొలగించండి
 22. కలకలము రేపుప్రజలకు
  కులమును గుర్తించువాడె,గురువన నొప్పున్
  బలురకములసూక్ష్మములను
  కులభేదములరయకుండ కూర్చెడునతడే

  రిప్లయితొలగించండి


 23. వలపుల తేరున కాముని
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్!
  చెలువము మీరగ చెంగట
  బిలువగ నలకల కొలికికి బిగువేలనకో!

  కులము కుళము కొలను ఆంధ్ర భారతి ఉవాచ  జిలేబి

  రిప్లయితొలగించండి

 24. పిన్నక నాగేశ్వరరావు.

  విలువల జ్ఞానము పంచుచు
  కలిగెడు శంకలను దీర్చు ఘన కోవిదుడై
  వలపును చూపించుచు వ్యా
  కులమును గుర్తించు వాడె గురువన
  నొప్పున్.

  రిప్లయితొలగించండి
 25. కుల విద్యలు నేర్వరెవరు
  కులములు వీడుటయు కల్ల కులమును బట్టే
  నిలలో ర్యాంకులని తెలిసి
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్  రిప్లయితొలగించండి
 26. చలమును వహించి చదువుచు
  పలుమార్లుగ నాపరీక్ష వ్రాసిన కూడన్
  ఫలిత రహిత ఛాత్ర వ్యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
 27. లలితపు భంగి నిజ చ్ఛా
  త్రులకుం గఱపుచుఁ జదువులు తోరము విద్యా
  కలితమ్మగు శిష్య వ్యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్


  కలరే నేఁ డిటఁ గాంచ శిష్యుల సుతాకారంపు సద్వీక్షణన్
  లలి తార్ద్రాత్మ కృపార సేక్షణములన్ లాలించు నధ్యాపకుల్
  చెలువం బొప్పఁగ గొప్ప విద్యలు మహా శిష్యోప శిష్యవ్రజ
  త్కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడుం బూజ్యుఁడౌ

  [వ్రజత్ = చరించుచున్న; కులము = సమూహము]

  రిప్లయితొలగించండి

 28. ... శంకరాభరణం... . 23/09/2019 ...సోమవారం

  సమస్య

  " కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ"

  నా పూరణ. చం.మా.
  ***** *** ***
  కులగోత్రంబులు గాంచడున్ మతమునున్ గొప్పంగ దా నెంచడున్

  దెలుపున్ విద్యలు ఛాత్రులందరికినిన్ దేజంబు నాచార్యుడున్

  సెలవిచ్చెన్ గద హెచ్చు మూర్ఖుడగుచున్ ఛీకొట్టు నట్లివ్విధిన్

  " కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ"


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 29. కులమున్గాంచియుబోధసేయుగురువేక్షోణిన్గడున్బూజ్యుడౌ
  లలనా!యేమనియంటివీ?గురువుదాపాఠంబుబోధించునా?
  కులమున్గాంచుచుచూసితేయచటయేకోణంబునైనన్మఱిన్
  బలుకన్నేర్వుముమంచిగాసరళ!వాక్ప్రాధాన్యమింపారగన్

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కులమును గుర్తించు వాఁడె
  గురు వన నొప్పున్

  సందర్భము: కృష్ణుడు అక్రూరుని వెంబడి మధురానగరానికి వెళ్ళగా కృష్ణ వియోగంవల్ల గోపిక లిలా అంటున్నారు.
  (వా ళ్ళిదివరకే కృష్ణుడు రాబోయే కాలంలో జగద్గురు వౌతా డని భవిష్యత్ ద్రష్టలైన ఋషులవల్ల విని వున్నారు.)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "ఇల భావి మానవాళిని

  నలవుగఁ దీర్పంగఁ గన్నులందున బ్రాణ

  మ్ముల నిడుకొని వేచెడు గో

  కులమును గుర్తించు వాఁడె
  గురు వన నొప్పున్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  23.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 31. కందము:
  చిలుక పలుకు బాలలకును
  పలుకుల మధురపు విలువను బంచగ నేర్పున్
  దెలియనివి జెప్పుచును, వ్యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్"

  కందము:
  పలుకుల జేతల శుచియన
  వెలుగుల మార్గము గురువుయు వేడుక జూపున్
  మలినము గడుగుచు జ్ఞానపు
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్"

  రిప్లయితొలగించండి
 32. కం.
  కలిసిన ధాన్యపు రాశిన
  తెలిసిన సస్యపు రకమును తేలిక నెఱుగన్
  బలమగు నేర్పును గల సం
  కులమును గుర్తించు వాడె గురువున నొప్పున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి

 33. 1కులమత భేదము లెంచక
  నలవోకగ విద్యలెల్ల యక్కర తోడన్
  పలువిధముల నేర్పుచు వ్యా
  కులమును గుర్తించు వాడె గురువును నొప్పున్

  2అలయక బోధన చేయుచు
  తలచుచు ఛాత్రుల భవితను ధరలో నెపుడున్
  తొలగించుచు వారల వ్యా
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్


  3విలువలు కలిగిన చదువుకు
  వెలకట్టకనవరతమ్ము విద్యయు గరుపున్
  కులమేదనియడుగక వ్యా
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్.

  రిప్లయితొలగించండి
 34. విలువలతో చను శిష్యుడు
  కలవరపడుచుండ కాంచి కరమగు దృతితో
  సలుపగ సుశిక్షణము, వ్యా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
 35. తలిదండ్రుల యొత్తిడితో
  వెలయింపగ పైచదువులు విద్యార్థులలో
  కలకలము  రేప, నా వ్యా
  కులమును గుర్తించు వాడె గురువన నొప్పున్!

  గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణ ను కూడా పరిశీలించ ప్రార్థన.
  త్యాగరాయని కీర్తన లాలపించ
  జన్మ ధన్యమౌనన నెంచి సాగుచుండ
  వీనులకు విందు చేసెడి వేళలందు
  తమిళులకు తెల్గు భాషపై తగని ప్రీతి!

  రిప్లయితొలగించండి
 36. కలిసి గద్వాల చీరలు కట్టునపుడు
  మెచ్చి గోంగూర పచ్చడి మింగునపుడు
  గాన మాధురీ సౌరభం గాంచు నపుడు
  తమిళులకు తెల్గు బాసపై తగని ప్రీతి

  రిప్లయితొలగించండి
 37. కలగని నారో యేమో
  ఇలలో నెరుగమిసుమంత నెలమిన్ కనగా
  కలమున,నధిపుండేలా
  కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్!!

  రిప్లయితొలగించండి