రామ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. 'బ్రతుకు + అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ "బ్రతు కటంచు" అనవచ్చు. 'బోల్డు' శబ్దం కూడ సాధువు కాదు.
సందర్భము: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్రా తీరంలోని వేణీ(ణి) సోంపురం ఒక ప్రత్యేకత గలిగిన చిన్న పుణ్యక్షేత్రం. వేణుగోపాల స్వామి కొలువైన వేణీ సోంపురం మాధ్వ సంప్రదాయం వర్ధిల్లిన ప్రాంతం. మహిమాన్వితులైన వ్యాస తత్వజ్ఙ తీర్థుల వా రిక్కడి వారే! వారికి కలలో కృష్ణుడు కనిపించి ఫలానా చోట తవ్వితే నా విగ్రహం దొరుకుతుంది. వేణిసోంపురంలో ప్రతిష్ఠించు మన్నాడు. వారలాగే చేశా రట! అప్పటినుంచి అదొక పుణ్యక్షేత్ర మయింది. ప్రస్తుతం వారి చూపించిన ఒకానొక మహిమను పద్యంలోకి అవతరింపజేశాను. గద్వాల ప్రాంత మెక్కడ? కొన్ని వందల మైళ్ళ దూరంలో వున్న హంపీ ఎక్కడ? వ్యాస తత్వజ్ఙ తీర్థుల వారు ఇక్కడే వుండి హంపీలో ఉవ్వెత్తుగా చెలరేగుతున్న మంటల నార్పి వేశారు. స్థలానికీ కాలానికీ అతీతులై అఘటన ఘటనా సమర్థులైన యోగీశ్వరుల కసాధ్య మే మున్నది? గద్వాల ప్రాంతపు పన్నెండుగురు కవు లిటీవల రచించిన పద్య సంకలనం "ద్వాదశ పుణ్యక్షేత్రాలు" లో శ్రీ ఊర ఈశ్వర్ రెడ్డి గా రీ క్షేత్రంపై కొన్ని పద్యాలు రచించినారు. మరింత సమాచారానికై అంబటి భాను ప్రకాశ్ అనిమోని మహేందర్ గారలు పొందుపరిచిన "క్షేత్ర పరిచయాలు" చూడవచ్చు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఆ హంపిలో విరూపాక్ష దివ్య రథోత్స వము.. దివిటీలతో భక్త వితతి ప్రక్కన నడువగా నొక్క దివిటి తాకి యంటుకొన్నది స్వామి యంబరంబు.. వాసిగా వ్యాస తత్వజ్ఙ తీర్థులు తుంగ భద్రా తటిని సంధ్య వార్చుచుండె వేణి సోంపురములో.. వింతగా నీరము లెగజిమ్మె మీది.. "కి దేమి?" యనుచు శిష్యు లడుగ ననిరి "చెలరేగె హంపిలో నగ్ని కీల.. లిపుడె యారిపోయె జలముఁ జల్లినంత..'జ్వాల లెగసె నయ్యొ!' యనుచు బెదరిపోయి రచటి వారు.."
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 19.9.19 -----------------------------------------------------------
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిIIT Kharagpur, 1985:
లలనలు లాబు నందునను లాలన పాలన పాత్రులౌచు భల్
పలుకుచు ముద్దు మాటలను ఫక్కున నవ్వుచు వింతవింతగా
కులుకుచు పెట్టెనున్ తెరిచి కూరిమి మీరగ సోడియమ్ముపై
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో
http://gpsastry.blogspot.com/2014/04/onion-tomato-garlic-1.html?m=0
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఫిజిక్స్ ప్రొఫెసర్ అనిపించుకున్నారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిబోల్డు మక్కువనను గోడ వెనుక ప్రేమ
రిప్లయితొలగించండిజలము జల్లినంత జ్వాలలెగసి
తల్లి చెంత చేరె మెల్లిగా కూతురు
బావ తోనె తనదు బ్రతుకు యనుచు
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. 'బ్రతుకు + అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ "బ్రతు కటంచు" అనవచ్చు. 'బోల్డు' శబ్దం కూడ సాధువు కాదు.
🙏 ధన్యవాదాలు గురువు గారూ!
తొలగించండిచాల ప్రేమ మీర చాటుగ తన మీద
జలము జల్లినంత జ్వాలలెగసి
తల్లి చెంత చేరె మెల్లిగా కూతురు
బావ తోనె తనదు బ్రతుక టంచు
బలమును గల్గువారమని, భారతమందున పెచ్చరిల్లుచున్
రిప్లయితొలగించండికులమును యడ్డుపెట్టుకుని, కూల్చగజూసిరి దేశభద్రతన్.
చిలుమును చిద్రమున్ వదల, చీకునుచింతగమార్చు చట్టమై
జలమును దెచ్చిజల్లగనె , జ్వాలలురేగెనదేమి చిత్రమో!
రావెల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కులమును + అడ్డు = కులము నడ్డు' అవుతుంది. యడాగమం రాదు. "కులముల నడ్డుపెట్టుకొని" అనండి.
అలనొక మౌనివర్యుడు జనాధిపు జేరగబోయి నిల్చినన్
రిప్లయితొలగించండిపలుకకనూరకుండ నట వానిమదంబు నణంచగా నతం
డలఘుమహత్వసత్వు డపు డంది కమండల ముగ్రమూర్తియై
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికలుషితచిత్తవృత్తినినొకండు ద్రుమమ్మున మంత్రపూతమౌ
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
లలితమనస్కుడొక్కడు జలంబులు జల్లగ పూతపూసెడిన్ !
ఖలునకు, శీలవంతునకు కల్గు ఫలమ్మిది విద్యనేర్పుచో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం...
తొలగించండిజలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో !
కలువలఱేడు నింగినదె కన్పడె నిప్పులకుప్ప వోలె , శీ...
తలమలయానిలమ్ములు నిదాఘమహోష్మసమమ్ములయ్యె , నే...
నలసితి నల్లనయ్యవిరహమ్మున., చందనమిశ్రితమ్మునౌ
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
అలాదీనుకు జీనీ జిక్కుట
రిప్లయితొలగించండిచిలుము పట్టె నంచు చిన్న దీపపుసెమ్మె
నేడు గంటి నంచు నెగసి బడుతు
తోమనెంచి తాను మోము మెరయు నట్లు
జలముఁ జల్లినంత జ్వాల లెగసె!
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎగసి పడుచు' అనండి.
ధన్యవాదములు🙏
తొలగించండిచిలుము పట్టె నంచు చిన్న దీపపుసెమ్మె
తొలగించండినేడు గంటి నంచు నెగసి పడుచు
తోమనెంచి తాను మోము మెరయు నట్లు
జలముఁ జల్లినంత జ్వాల లెగసె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొత్త వంట నేర్చు కోడలే మారున
రిప్లయితొలగించండిజలము జల్లినంత జ్వాలలెగసి
అత్త వెళ్లగ పరిగెత్తుచూ నక్కడ
సిగ్గు పడుచు నామె దిక్కు జూసె
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పరిగెత్తుచు' అనండి.
శాంతి గూర్చనెంచి చక్రియే సభలోన
రిప్లయితొలగించండిపాండవుల బలమ్ము వాసి యంచు
నెఱుక జేసినంత నెగసెనాగ్రహహేతి
జలముఁ జల్లినంత జ్వాల లెగసె
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి... శంకరాభరణం... . 19/09/2019 ...గురువారం
సమస్య
జలమును దెచ్చి చల్లగనె జ్వాలలు రేగె నిదేమి చిత్రమో
నా పూరణ. చం.మా.
***** *** ***
అల ఘను డింద్రజాలికుడు నబ్బరబోవు విధంబు మాయలన్
సలుపి జనాళిచే బహు ప్రశంసల నొందెను ; నొక్క సారి తా
బలుకుచు నేవొ మంత్రములు వాసిగ, నిప్పుల పైన జల్లనౌ
జలమును దెచ్చి చల్లగనె జ్వాలలు రేగె నిదేమి చిత్రమో
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రశంసల తా గనె నొక్కసారి...' అనండి.
వలలనుబన్ని జీవితము వక్రముజేసిరి పాక్కు పాలకుల్
రిప్లయితొలగించండితలలనుదించి పండితులు దారిని బట్టుచు పారిపోవగా!
విలువలు మార్చివేయుచును,వీలుగ దెచ్చిన చట్టమంత్రపున్
జలమును దెచ్చిజల్లగనె , జ్వాలలురేగెనదేమి చిత్రమో!
రావెల వారూ,
తొలగించండిచక్కని కాలానుగుణమైన పూరణ. అభినందనలు.
ధన్యుడనైతిని శంకరార్యా
తొలగించండి
రిప్లయితొలగించండిఅలమలము కుమార! అంత వేగమదేల
జలముఁ జల్లినంత జ్వాల లెగసె;
తెలిప నిదియె వీరు తేకువ కలవారు
నీకు బంధు వులయ నిశ్చయముగ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విలువలుగల్గుజీవితము, వెన్నుడు యిచ్చిన దానధర్మమే
రిప్లయితొలగించండిసలలితమైన భావనలు, సన్నుత కీర్తిని దెచ్చు నెప్పుడున్
కులమును గోత్రమున్ బెరికి, కుట్రలు బన్నగజూచువారిపై
జలమును దెచ్చిజల్లగనె , జ్వాలలురేగెనదేమి చిత్రమో!
రావెల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెన్నుడు + ఇచ్చిన = వెన్ను డిచ్చిన' అవుతుంది. యడాగమం రాదు. "వెన్ను డొసంగిన" అనండి.
బేగి లెవ్వమంచు వేకువ ఝామున
రిప్లయితొలగించండిజలము జల్లినంత జ్వాలలెగసె
తాను లేచు బదులు తరుణితో కూడగ
తన్మయమ్ము నొందె తనువు నాదు
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బేగి లెవ్వు' అనడం వ్యావహారికం. "వేగ లెమ్మటంచు" అనండి.
రిప్లయితొలగించండిపాపం పసివాడు :)
వలపున వేగమాయె తనువంతయు మాపున గోముగోముగా
కిలకిల నవ్వి దోచి మది కెందొగ బుగ్గల చంద్రకాంతయే
తలుపుల చాటు వేసి పరిదానపు వేళని విస్మయమ్ముగా
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(ఆలుబిడ్డలతో అడవిదారి పట్టిన హరిశ్చంద్రుని భయపెట్ట టానికి కార్చిచ్చును సృజిస్తున్న విశ్వామిత్రుడు )
రిప్లయితొలగించండిలలనను బుత్రునిం గొనుచు
లక్ష్యము సత్యము నిల్ప ధీరుడై
సలలితరాజ్యమున్ విడచి
చయ్యన నేగెడి రాజచంద్రునే
యలసుని జేయ గాధిసుతు
డంత కమండల మెత్తి క్రోధపుం
జలమును దెచ్చి చల్లగనె
జ్వాలలు రేగె నిదేమి చిత్రమో !!
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
నా మధుర స్వప్నము:
మిలమిల లాడు దీది యహ మ్రింగుచు గర్వము దిల్లికేగుచున్
వలపులు మీర కుర్తనట వాగుచు భళ్ళున గిఫ్టునివ్వగా
కలకల నవ్వి మోడి భలు గారము మీరగ దీదినెత్తిపై
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
"While going to meet PM Modi, Mamata Banerjee was seen carrying a kurta and sweets to meet and greet the prime minister."
https://www.google.co.in/amp/s/www.india.com/news/mamata-banerjee-meets-pm-modi-gifts-kurta-and-sweets-calls-the-meet-courtesy-call-3777234/amp/
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసమస్య :-
జలముఁ జల్లినంత జ్వాల లెగసె
*ఆ.వె**
ద్రౌపది పగచేత రగిలి పోవుచు కంటి
జలముఁ జల్లినంత,జ్వాల లెగసె
భీమసేనుని మదిలో, మౌనమును వీడి
శఠ సుయోధనుడను చంపెదననె
....................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుయోధనుడను'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివలదు సుయోధనా! వినుము వారసులే కద! పాండుపుత్రులున్
రిప్లయితొలగించండికొలదిగ నైదు నూర్లనిటఁ గోరిరి, తప్పు రణమ్మ నన్ హరిన్,
దులువలు బంధిఁ గైకొనగఁ దోడఁ గడంగిరి కుప్తకౌరవుల్
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో?
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'కుప్త'?
శంకరకవిగారిసూచనతో సవరణ
తొలగించండివలదు సుయోధనా! వినుము వారసులే కద! పాండుపుత్రులున్
కొలదిగ నైదు నూర్లనిటఁ గోరిరి, తప్పు రణమ్మ నన్ హరిన్,
దులువలు బంధిఁ గైకొనగఁ దోడఁ గడంగిరి కుప్తకౌరవుల్
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
బావి నందు మూల్గు భామకు జేయిచ్చి
రిప్లయితొలగించండిదేవయాని జూచి దేవతనగ,
నళిన నయన చెలియ నాయయాతిని గాంచి
జలముఁ జల్లినంత జ్వాల లెగసె!
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేవత + అనగ' అన్నపుడు సంధి లేదు. "దేవత యన" అనండి.
బలవర గర్వితుల్సగర పార్థివ బుత్రులు త్రవ్వుచున్ రసా
రిప్లయితొలగించండితలమును జేరుచున్కపిల తాపసి చెంతను జూచి గుఱ్ఱమున్
తలబడ జూచినంత గని దగ్ధము జేయగ నెంచి మౌని తాఁ
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో
ఫణికుమార్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
చంపకమాల:
రిప్లయితొలగించండివలపును గొన్న యక్షిణియు వాలుగ జూడగ నా సురోత్తమున్
కలపగ జేయి భూసురుడు గన్నెను గాదని వైదొలంగఁగాఁ
చెలఁగిన మోహమే గలుగ చేడియ నేలకొరంగ, మోమునన్
జలమును దెచ్చిజల్లగనె , జ్వాలలురేగెనదేమి చిత్రమో!
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలు మగల మధ్య నలజడి చెలరేగి
రిప్లయితొలగించండివాదు లాడు చుండ వఛ్చి నట్టి
వనిత సమయ మెరిగి వాదుకున్ క్రోధమ న్
జలము జల్లి నంత జ్వాల లెగసె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెధవ! శుంఠ! యనుచు వేకువనే దల్లి
రిప్లయితొలగించండిజలము జల్లినంత జ్వాలలెగసె,
అమ్మ! ఏమి గోల?ఆదివారం కూడ!
పుత్రు డమ్మను గని బుస్సు మనెను
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆదివారము గూడ' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిchesanu..
తొలగించండికలువబోలు చెలియ గనలేడ నియనుచు
నలుగ, చెలియతోడ, నా విరాగి
వలపు లేదు, ప్రేమ వలదన, గోర్కెపై
జలముఁ జల్లినంత జ్వాల లెగసె
రిప్లయితొలగించండిజీపీయెస్ వారు పూరించుడీ
కలడా శేషాద్రి విభుడు కరుణామయుడా ?
వెలసియు సప్తగిరులపై
తొలగించండికలడా శేషాద్రి విభుఁడు కరుణామయుఁ డా
స్థలము పవిత్రక్షేత్రము
పిలిచిన పలికెడి విభుండు వేంకటపతియే.
🙏
తొలగించండితిలకించుచు భేషనుచును
విలువగు బంగరు తొడవులు విచ్చల విడిగా
సులువుగ మాయెమ్మవగా
కలడా శేషాద్రి విభుడు కరుణామయుడా?
https://www.google.co.in/amp/s/www.indiatoday.in/amp/india/story/bjp-cries-foul-after-gold-silver-ornaments-go-missing-from-tirupati-temple-1592333-2019-08-27
తొలగించండికలిసెన్ దీదీ మోడిన్
కలడా శేషాద్రి విభుడు; కరుణామయుడా
కలకత్తా యేర్ పోర్టున
కలిపె జశోదను మమతను; కలడు జిలేబీ !
జిలేబి
కలకలము రేపు మదకరి
తొలగించండిచలనపు గతి వనికి మార్చ చంచల మతులై
కలయో నిజమో దల్చెను
కలడా శేషాద్రి విభుడు కరుణామయుడా ?
బలజము మాన్పి శాంతినిల వాసిగ కూర్పదలంచి కృష్ణుడే
రిప్లయితొలగించండియలుగుట యే యెఱుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే
యలిగన నాడటంచనగ నాగ్రహ కీలలె హెచ్చె గాంచగన్
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రసిద్ధ పద్యాన్ని చక్కగా వినియోగించుకున్నారు.
మంటలారెజూడు మందిరాగ్రమ్మున
రిప్లయితొలగించండిజలముజల్లినంత,జ్వాలలెగసె
మండుచున్నతెరకు మరుత్తుతోడురా
భయముగొల్పెజూడ వహ్నికీల
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "...తెరకు మరి గాలి తోడురా" అనండి.
పూజ జేయు ద్రవ్యముల పయిన మురుగు
రిప్లయితొలగించండిజలముఁ జల్లినంత జ్వాల లెగసె
బామ్మ మనసు నందు , బాధతోడ గసర
పౌత్రు డపుడు వేగ బారి పోయె
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🏽 ధన్యవాదములప
తొలగించండితాపసి మది నమ్మి దైవము నా మంత్ర
రిప్లయితొలగించండిజలముఁ జల్లినంత జ్వాల లెగసె
రక్కసులను దరిమి రక్షించెను దపము
తామస మణగారి ధరణి వెలిగె
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాండవులకు నేల పంచియివ్వననుచు
రిప్లయితొలగించండిపట్టుబట్టగాను పాడుబుద్ధి
మనమునందు క్రోధ మాత్సర్య విద్వేష
జలము జల్లినంత జ్వాలలెగసె
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ధ్రుతరాష్ట్రుఁడు యుద్ధమునఁ దన సుత శతమునుఁ జంపిన భీమునిఁ జంపుటకుఁ బన్నిన యెత్తుగడకుఁ గృష్ణుఁడు పైయెత్తుగడఁ బన్నిన సందర్భము]
కలనినిఁ జంపె సూన శతకమ్మునటంచును గ్రుడ్డి రాజు సం
జ్వలన నియుక్త క్రోధ కువిచారుఁడునై బకవైరిఁ జంపఁ గౌఁ
గిలి వెసఁ జేర్పఁబోవఁ దొలఁగించి మురారియె బొమ్మ నుంపఁ దా
నులుమగ నుగ్గునుగ్గగుడు నొక్కియుఁ బొక్కుచు బంటు రాజుపై
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిజలమునందుజేరె జాతవేదసుఁడును
రిప్లయితొలగించండియింధనంపు రూపు తాధరించి
ఎగసిపడెడుమంటతగనార్పగానెంచి
జలముఁ జల్లినంత జ్వాల లెగసె
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు. "జాతవేదసుడు తా । నింధనంపు..." అనండి.
ధన్యవాదములు గురువుగారు!
తొలగించండిభర్త గాంచి మోము ప్రక్కకు వడిఁ ద్రిప్పి
రిప్లయితొలగించండిమూతి విఱిచి యింతి మూగ వోయె
నగుచు నాఁడపడుచు నగఁ జూపి వన్నెలఁ
జలముఁ జల్లినంత జ్వాల లెగసె
[వన్నెలన్ + చలము = వన్నెలఁ జలము]
కలకల నవ్వు చాడుచును గాంతలు గూడి చరించ నంతలో
జెలఁగఁగ హాస్య వాక్యములు శీఘ్రమ వాద వివాద మయ్యె భా
మలు దమ రోష సంజనిత మత్సర నామ వరాజ్య ధార ని
ర్జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికలవరమాయె నామదిని కల్వలరేడలనాకసంబుపై
రిప్లయితొలగించండివెలుగులుజిమ్ముచున్ హృదిని వేదన మంటలురేపె నయ్యయో
చెలికనరాక మన్మథుని చేష్టలు సైపగలేక మేనుపై
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండియాగ మెంచు మునికి నడ్డగింతలు దెచ్చి
అరుస మొందు నట్టి నసురు నెఱిగి
వాని జంప ఋషియె భవుని దల్చుచు మంత్ర
జలము జల్లినంత జ్వాల లెగసె.
కీల లన్ని తగ్గి పాలుమాలెను మంట
జలము జల్లి నంత; జ్వాల లెగసె
నిప్పుకు పవనమ్మె నెరవైన వడిలోన
గాడ్పు జలము నగ్ని ఘనత నెంచు.
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"జలముఁ జల్లినంత జ్వాల లెగసె"*
సందర్భము: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్రా తీరంలోని వేణీ(ణి) సోంపురం ఒక ప్రత్యేకత గలిగిన చిన్న పుణ్యక్షేత్రం.
వేణుగోపాల స్వామి కొలువైన వేణీ సోంపురం మాధ్వ సంప్రదాయం వర్ధిల్లిన ప్రాంతం. మహిమాన్వితులైన వ్యాస తత్వజ్ఙ తీర్థుల వా రిక్కడి వారే!
వారికి కలలో కృష్ణుడు కనిపించి ఫలానా చోట తవ్వితే నా విగ్రహం దొరుకుతుంది. వేణిసోంపురంలో ప్రతిష్ఠించు మన్నాడు. వారలాగే చేశా రట! అప్పటినుంచి అదొక పుణ్యక్షేత్ర మయింది.
ప్రస్తుతం వారి చూపించిన ఒకానొక మహిమను పద్యంలోకి అవతరింపజేశాను.
గద్వాల ప్రాంత మెక్కడ? కొన్ని వందల మైళ్ళ దూరంలో వున్న హంపీ ఎక్కడ? వ్యాస తత్వజ్ఙ తీర్థుల వారు ఇక్కడే వుండి హంపీలో ఉవ్వెత్తుగా చెలరేగుతున్న మంటల నార్పి వేశారు.
స్థలానికీ కాలానికీ అతీతులై అఘటన ఘటనా సమర్థులైన యోగీశ్వరుల కసాధ్య మే మున్నది?
గద్వాల ప్రాంతపు పన్నెండుగురు కవు లిటీవల రచించిన పద్య సంకలనం "ద్వాదశ పుణ్యక్షేత్రాలు" లో శ్రీ ఊర ఈశ్వర్ రెడ్డి గా రీ క్షేత్రంపై కొన్ని పద్యాలు రచించినారు.
మరింత సమాచారానికై అంబటి భాను ప్రకాశ్ అనిమోని మహేందర్ గారలు పొందుపరిచిన "క్షేత్ర పరిచయాలు"
చూడవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆ హంపిలో విరూపాక్ష దివ్య రథోత్స
వము.. దివిటీలతో భక్త వితతి
ప్రక్కన నడువగా నొక్క దివిటి తాకి
యంటుకొన్నది స్వామి యంబరంబు..
వాసిగా వ్యాస తత్వజ్ఙ తీర్థులు తుంగ
భద్రా తటిని సంధ్య వార్చుచుండె
వేణి సోంపురములో.. వింతగా నీరము
లెగజిమ్మె మీది.. "కి దేమి?" యనుచు
శిష్యు లడుగ ననిరి "చెలరేగె హంపిలో
నగ్ని కీల.. లిపుడె యారిపోయె
జలముఁ జల్లినంత..'జ్వాల లెగసె నయ్యొ!'
యనుచు బెదరిపోయి రచటి వారు.."
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
19.9.19
-----------------------------------------------------------
వెలుదండ వారూ,
తొలగించండిఒక పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
సలసలకాగి పైకుబుక చల్లబడున్ దనంతనెబాలుసూ
రిప్లయితొలగించండిజలమునుదెచ్చిచల్లగనె,జ్వాలలురేగెనిదేమిచిత్రమో
లలనలు మేడపైన గడులాస్యములాడుచు నుండనత్తరిన్
విలవిలలాడుచుండిరటభీతీనిజెందుచు నెల్లవారలున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
కరుణ లేక పలుక కాఠిన్యమొదవును
రిప్లయితొలగించండివిందు నందు మందు విషము జిమ్ము
జనుల హితము గొనక చనియంగనా మత్తు
జలముఁ జల్లినంత జ్వాల లెగసె!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంబు దములు చేరి యమరావతి నధిక
రిప్లయితొలగించండిజలముఁ జల్లినంత, జ్వాల లెగసె
నెంచె నాదు కొంప ముంచ జగననుచు
పలుక చంద్రుడు కడు స్పర్ధ తోడ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమంట లారి పోయె మానుగా దానిపై
జలముఁ జల్లినంత; జ్వాల లెగసె
వంటచెరుకు పైన వడిగ తైలమువేసి
యగ్గి పుల్ల గీచి నంత నచట
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జంతికలను చేయ చక్కగా మది నెంచి
రిప్లయితొలగించండిమూకుడందు నూనె ముందు పోసి
పొయ్యి పైన పెట్టి పొరపాటుగా నందు
జలము జల్లి నంత జ్వాల లెగసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపెళ్లిలో మాయా శశిరేఖ లీలలకు లక్ష్మణ కుమారుని తత్తరపాటు....
చంపకమాల
వలపులు రంగరించి మనువాడగ నా శశిరేఖ నెంచితిన్
జెలువము జూడఁబోవ ముఖ శృంగము రక్కసి వోలె జూపెనే
తొలుతనె పాద తాడనము దుర్భర, మాచమనమ్ముఁ జేయ తా
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅత్త కలుగ జేయ నారళ్ళు మాటున
రిప్లయితొలగించండికోడ లదర గొట్టె కొమరు బలిమి
వీరి సఖ్య పరుచ వేవే ల విధముల
జలము జల్లినంత జ్వాల లెగసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి