25, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3143 (నకులునితోడ రాఘవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్"
(లేదా...)
"నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

46 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చకచక వ్రాయ బూనితిని చక్కని పూరణ వేకువన్ భళా
  వికలపు మానసమ్మునను వింతగు కైపద మిందు జూడగన్
  పకపక నవ్వు వచ్చెనిక ప్రార్థన చేయగ నెచ్చటయ్యరో
  నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్?

  😢

  రిప్లయితొలగించండి
 2. ప్రభాకర శాస్త్రి గారూ,
  మీ అధిక్షేపాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. నకులురిరవురు గద రాఘవు

  నకు,లవుడొకడు,కుశుడొకడు,నడగడు పట్టన్

  నకులిరువురు,కోపముతో

  నకులునితో రాఘవుడు రణం బొనరించెన్


  నడగడు = గుర్రము నకులుడు = పుత్రుడు

  రిప్లయితొలగించండి

 4. మరొక సరదా పూరణ:

  చకచక లెక్క పెట్టగను చక్కగ నిద్దరు మాద్రి పుత్రులౌ
  నకులునితోడ;...రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్
  వికలపు మానసమ్మునను వింతగ కట్టుచు సేతువున్ భళా
  నికరపు లంక జేరుచును నిక్కపు రీతిని రావణాసురున్

  నికరము = శ్రేష్ఠము

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. సుకమునె యెంచువాడు., పరసుందరి
   గోరెడివాడు , లోకకం...
   టకుడు., మదాదిమత్తుడు , వినమ్రత యించుక లేనివాడు , పా...
   తకుడు , విచారదూరుడగు దైత్యుని రావణునెంచి శీల హీ...
   నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

  2. మి లార్డ్ శీల హీనుడు అంటే ఒప్పుకుంటాము గాని మధ్యలో కుల ప్రసక్తి తెస్తే ఒప్పుకోము :) మా ద్రవిడ రాట్టు సద్బ్రాహ్మడు వాడు

   గమనించవలె


   ఇట్లు
   జాల్రా జిలేబి

   తొలగించండి
  3. 🙏🙏పద్యాంతములో....

   యాతుధా....
   న కులుని.... అని ఉంటే బాగుండేది.. అని శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు సూచించారు. (యాతుధాన... అంటే. రాక్షస)
   శీల హీన.. రావణుడు పులస్త్యవంశజుడు కదా.. బ్రహ్మవంశం కదా.. శీలహీన అంటే అంత బాగుండదేమో.. అనే వారిసూచనతో నా పద్యం ఇలా మార్చుకొంటున్నాను.. మన్నించి అవధరించండి..

   శంకరాభరణం.. సమస్యాపూరణం

   నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ !!

   సుకమునె యెంచువాడు., పరసుందరి
   గోరెడివాడు , లోకకం...
   టకుడు., మదాదిమత్తుడు , వినమ్రత యించుక లేనివాడు , పా...
   తకుడు , విచారదూరుడగు దైత్యుని రావణునెంచి యాతుధా...
   నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

  4. అదురహో !

   कसौटी पर परखने से महदेवमणि निकल पडा !


   జిలేబి

   తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   ****
   జిలేబి గారూ,
   :-)

   తొలగించండి
  6. అవునండి రావణుని వంశము సాక్షాద్బహ్మ వంశము. అత్యున్నత కులము. పూరణార్థ మైనను దానినిఁ గించఁ బఱచఁ దగదు.
   రావణుఁడు మహా పండితుడు, పరమ శివ భక్తుఁడును కాని కామాంధుఁడు కులఘాతకుఁడు.

   తొలగించండి


 6. నా పూరణ. చం.మా.
  ***** *** ***

  సకలపు రామగాథ మరి చక్కని భారతమున్ వచించి దే

  శికుడొక ప్రశ్న వేయగను జెప్పెద వాసిగ నంచు లేచి తా

  దికమక చెంది పల్కెనయొ! తిక్కగ ఛాత్రు డొకండు నివ్విధిన్!

  " నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ "

  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 7. సకలము నెఱిఁగిన పరమా
  త్మ, కులముల కతీతుడు, హయమను వీడని యా
  త్మ కులజులు కుశలవుల యే
  నకులునితో రాఘవుడు రణంబొనరించెన్?

  నకులుడు .. కుమారుడు

  రిప్లయితొలగించండి
 8. ప్రకటముజేయనేమగును? ప్రాభవమందును మెప్పుగానిలన్!
  సకలము శాస్త్రసమ్మతము,సాధ్విని దెచ్చిన రావణాసురిన్
  వికలముగాగ మానసము, వీరుడు నాహనుమంతుని తోడు హీ
  నకులునితోడరాముడు,రణంబొనరించె బుధుల్ నుతింపగన్.

  రిప్లయితొలగించండి


 9. పకపక నవ్వెదరోయ్! యే
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్?
  లకలక సుప్రీంకోర్టున
  తకరారున తలమునకల తను వ్యస్తుడయా

  సమయమెక్కడ రణమున్ చేయుటకు హయ్యారే తెగని కోర్టు కేసులాయె :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. మెకముగ మారి రక్కసుఁడు మిక్కిలి సుందర రూపమొంద జా
  నకి గని భర్తనంపె భువనైక మనోహర శంబరంబుకై
  తకిలుడు రావణుండు కుముదాక్షిని గైకొని పోవ నా దృషా
  నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి


 11. పకపక నవ్వు వచ్చె! పరివారము లేకయు కోర్టు చావిడిన్
  లకలకలాడి వేచి అలొ లక్ష్మణ యంచు నుసూరు మంచు తా
  నొక ధణి యంచు విస్మృతిని నోలగ మేమియు లేని వాడు, యే
  నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. చంపకమాల
   సకలము రామచంద్రుడని జానకి మౌనియు నేర్ప జ్ఞానులై
   ప్రకటిత మశ్వమేధమున పట్టుచు రాము తురంగ రాజమున్
   చకచక లక్ష్మణున్ నిలిపి సాగు కుశాది లవుండుగాఁ దగన్
   నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్

   తొలగించండి
 13. చకచక పారెడు గుఱ్ఱము
  తికమక లేమియును లేక దీటుగ నిలవన్
  పకపక నవ్వుచు పిలిచిన
  నకులునితో రాఘవుడు రణంబొనరించెన్

  రిప్లయితొలగించండి
 14. శ్రీగురుభ్యోన్నమః🙏
  రాజసూయ యాగాశ్వాన్ని ఆపిన కొడుకుతో రముడుద్దము చేయుట.

  చకచక సాగెడి నశ్వము
  నిక కుశలవులు నిలుపంగ నిపుణత దోడన్
  ఒకరొకరు దమ్ము లోడగ
  నకులునితో* రాఘవుఁడు రణం బొనరించెన్

  *పుత్రుడు

  రిప్లయితొలగించండి
 15. చకితుడు ధర్మజు డనెనిటు
  నకులునితో "రాముడు రణంబొనరించెన్
  వికటులు రాక్షసు లరుగగ
  తికమకతో యముని కడకు దివిజులు మెచ్చన్"

  రిప్లయితొలగించండి
 16. రాముడు బదులు రాఘవుడు అని చదువ ప్రార్ధన

  రిప్లయితొలగించండి
 17. పకపక నవ్వుచు హయమును
  సుకుమారులు లవకుశులట సూత్రింపంగా
  నెకసెక్కెము గాదటనుచు
  నకులునితో రాఘవుండు రణమొనరించెన్

  రిప్లయితొలగించండి
 18. వికసిత పత్ర నయన జా
  నకిఁ జెరబట్టిన ఖలుండు నక్తంచరుడున్
  నకులుని భక్తుడు కైకసి
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్.


  నకులుడు= శివుడు, కుమారుడు, మాద్రిపుత్రుడు....

  రిప్లయితొలగించండి
 19. వికల మనస్కుని రావణుఁ
  న కల o కుడు ధర్మ చరితు డా హ వమందు న్
  సకలము మెచ్చగ తా హీ
  న కులు ని తో రాఘవుడు ర ణ o బొ న రిం చెన్

  రిప్లయితొలగించండి
 20. సకల మెరంగినట్టి సహ జన్ముడు మాద్రి కనిష్ఠ పుత్రుడే
  వికసిత మందహాసమున ప్రేమగ బల్కుచు జెప్పెనివ్విధిన్
  నకులుని తోడ, రాముడు రణంబొనరించె బుధుల్ నుతింపగన్
  వికృత మనస్కుడౌ దనుజుఁ విశ్రవసున్ సుతుఁ గూల్చె ధీరుడై.

  రిప్లయితొలగించండి
 21. ( అరణ్యవాససమయంలో పాండవులకు రామకథ తెలుపుతున్న వారి పురోహితుడు ధౌమ్యుడు )
  సకలము రాజ్యమున్ విడిన
  సద్గుణధుర్యులు పాండవేయులన్
  ముకుళితహస్తులన్ గనుచు
  మోదహృదుండగు ధౌమ్యు డిట్లనెన్
  నకులునితోడ " రాముడు ర
  ణం బొనరించె బుధుల్ నుతింపగన్
  వికసితశౌర్యుడై దనుజ
  వీరుని రావణు నేల గూల్చుచున్ . "

  రిప్లయితొలగించండి
 22. జనకుని యానతి మేరన
  వనమున కేగ తన సతిని వంచన తోడన్
  గొనిపోవంగ పులస్త్యుని
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్

  రిప్లయితొలగించండి
 23. తికమకగలిగినదీయది
  నకులునితో రాఘవుండు రణంబొనరించెన్
  సకలము నెఱిగిన మీరే
  పకపక పదిమంది నవ్వభావ్యమె? యీయన్

  రిప్లయితొలగించండి
 24. సకల మెరింగితి నను శ్రా
  వకు భారతమందొక చిరు ప్రశ్నను యడుగన్
  తికమక పడి నిటు జెప్పెను
  "నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్"

  రిప్లయితొలగించండి
 25. సుకులము నందు జనించి ని
  జ కులమును జెఱచెను నలినజ కులాసురుఁడే
  యకట యతని సుతు తో ధర
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్

  [ధరన్ +అకులుని ధర నకులుని; అకులుఁడు = నీచకులుఁడు; రాఘవుఁడు = లక్ష్మణుఁడు]


  సకల ధరా నివాస జన సంతతి నింపుగఁ గావ నెంచి హా
  టక వర గర్భ వంశజుఁడు డంబుఁడు రావణ నామ దైత్యు తో
  సు కవి సురా సురఘ్న వర సుధ్యవివేక మనశ్చర క్షపా
  నకులుని తోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్

  [సుధీ + అవివేక; నకులము = ముంగిస; క్షపా నకులము = రాత్రిపూట తిరుగు ముంగిస వంటి వాడు, క్షపాచరుఁడు]

  రిప్లయితొలగించండి
 26. వికసిత పద్మనేత్ర రఘువీరుని శౌర్యము జెప్పెనివ్విధిన్
  నకులునితోడ,"రాముడు రణంబొనరించె బుధుల్ నుతింపగన్
  బకురపు దండకాటవిని వైభవమొప్పగ నొంటిచేతితో
  చకచక చంపివేసెను కుశా! పదునాలుగువేల దైత్యులన్ "

  రిప్లయితొలగించండి
 27. గురువు గారికి నమస్సులతో ...

  నికలో భయ్యా జల్దీ
  మకాను సే! శంకర! అభయంకర! రా! నీ
  తకలుఫు కు వేచె పూరణ
  *నకులునితో రాఘవుడు రణంబొనరించెన్*

  రిప్లయితొలగించండి
 28. నికముగ సీతను గాంచితి
  మకరాకరమునకటంచు మారుతి దెలుపన్
  సుకరముగ దాటి కైకసి
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్
  (నకులుడు అనగా కొడుకు అనే భావముతో)

  రిప్లయితొలగించండి
 29. కందము:
  సకల కళానిధి రాముం ।
  డొక భామయు,నొక్క బాణ, మోరిమి యందున్
  సకల జన కష్టకర, హీ
  నకులునితో, రాఘవుఁడు రణం బొనరించెన్"

  చంపకమాల :
  సకల ధరిత్రి ధర్మముఁ నుసంస్కరణంబొనరించ విష్ణువున్
  వికట మరీచ రక్కసుల వీరత జిత్తును జేసి జంపఁగన్
  చకచక నేగె మౌని యన చాపము దాలిచి వేగ, దాటకీ
  నకులునితోడ, రాముఁడు రణం బొనరించె, బుధుల్ నుతింపఁగన్ "
  (నకులుడు అనగా కొడుకు అనే భావముతో)

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్

  సందర్భము: తీర్థ యాత్రలు చేసివచ్చిన రామునికి ఒక రకమైన వైరాగ్యం పెంపొందినది. ఏ రాజ్య భోగాలపైనా కాంక్ష లేకుండా పోయింది. కృశించసాగాడు.
  కామునితో మానసికంగా యుద్ధం చేసి గెలువా లనుకున్నాడు రాముడు. చేసి క్రమంగా రాముడు ఇంద్రియాల నన్నిటినీ జయించినాడు. కామాది అరి షడ్వర్గాన్నీ ఓడించినాడు.
  ఆ తర్వాత విశ్వామిత్రుడు రావటం రామ లక్ష్మణులను కొనిపోవటం జరిగింది. పురుషకారం అవలంబించడం నేర్పినాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇక రాముడు తలచెను జం
  కక.."మానసిక రణమె" యని..
  కాముడుఁ దా లొం
  గక తలపడెఁ గామ భుజగ
  నకులునితో... రాఘవుఁడు
  రణం బొనరించెన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  26.9.19
  -----------------------------------------------------------
  (శ్రీ యోగ వాసిష్ఠము.. ఆరంభంలోనే ఈ సన్నివేశా లున్నవి)

  రిప్లయితొలగించండి
 31. అకట దురాత్ముడే యసురుడంగన నెత్తుకు పోవ నుగ్రుడై
  ప్రకటము జేసి యుద్ధమును పాపిని జంపగ జేరి లంక హీ
  *నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్*
  నికరము జచ్చెరావణుడు నెమ్మది గల్గెను సీతకయ్యడన్

  రిప్లయితొలగించండి
 32. అకలంకులయిన మౌనుల
  సకలము దోచు కొనుచును యజములఁ జెఱప నా
  వికటమనస్కుడయిన హీ
  నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్

  రిప్లయితొలగించండి
 33. వికటపు బుద్ధితోడ చని వేదవతిన్ గొని పోవ దుష్టుడై
  వికలము చెంద మానసము వేచని లంకకు, మెచ్చ దేవతల్
  ప్రకటిత యుద్దరంగమున బాణములన్ కదియించి యాతుధా
  నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి