3, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3121 (మకరినిఁ జంపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యు"
(లేదా...)
"మకరినిఁ జంపి సత్కృప నుమాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్"

73 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వికలపు మానసమ్మునను వింతగ బుద్ధిని కోలుపోవగా
    తికమక హైందవత్వమున తీండ్రిలి నవ్వుచు కన్నుగొట్టుచున్
    చకచక రాహులాదటను చంకలు గొట్టుచు పల్కెనివ్విధిన్:
    "మకరినిఁ జంపి సత్కృప నుమాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్"

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ సరదా కోసం ప్రాతఃకాలాన పాపం రాహుల్ బలి అయ్యాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇప్పటిదాకా అందరూ ఇటువంటి పూరణలో శకారునో, త్రాగుబోతునో, పిచ్చివాడినో ఆశ్రయించేవారు. ట్రెండ్ మారుతున్నది!

    రిప్లయితొలగించండి
  3. *ఉమాపతి అను వానికి అతని తండ్రి రమాపతి చెప్పుమాటలు*

    శక్తి యె యుడిగి బాధతో సామజమ్ము
    దీన బాంధవ నను బ్రోచు దీక్ష తోడ
    వేగ రమ్మంచు పిలవగా విష్ణు వపుడు
    కరుణతో, నుమాపతి, గాచెఁ గరివరేణ్యు.

    రిప్లయితొలగించండి

  4. Two ladies ముచ్చట్లు :)


    యూనొ? మైహజు బెండండు యువరు బ్రదరు
    సచ్చె నైసు జెంటిల్మేను ! సత్వర మెలి
    ఫెంటు వెన్ సరెండర్డండు, వెప్టు, వెడలి
    కరుణతో నుమా! పతి గాచెఁ గరివరేణ్యు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఒకపరి సద్గురుం డొకరు డొప్పుగ శిష్యుని జీరి సత్కథల్
    ప్రకటిత భక్తిభావమున భవ్యగతిన్ వినిపించుచుండి బా
    లక! వినుమంచు దెల్పె సకలంబున నిండిన చక్రపాణి యా
    మకరినిఁ జంపి సత్కృప నుమాపతి! గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    రిప్లయితొలగించండి
  6. కేనోపనిషత్ సారము గజేంద్ర మోక్షణము🙏

    మాపతిఁ నుమాపతి యొకడె మనకు నెపుడు
    గర్వ మణగిన వాడెగా ఘనుడు యిలను..
    ద్యుతి నెరిగిన నింద్రద్యుమ్ను ధూర్త మణగ
    కరుణతోను మాపతి గాచెఁ గరివరేణ్యు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘనుడు + ఇలను' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "ఘనుడు భువిని" అనండి.

      తొలగించండి
    2. శ్రీ గురుభ్యోన్నమః🙏
      సరి జేసికొందును.
      మాపతిఁ నుమాపతి యొకడె మనకు నెపుడు
      గర్వ మణగిన వాడెగా ఘనుడు భువిని..
      ద్యుతి నెరిగిన నింద్రద్యుమ్ను ధూర్త మణగ
      కరుణతోను, మాపతి గాచెఁ గరివరేణ్యు!

      తొలగించండి

  7. లచ్చిందేవి శంకరి తో పెన్మిటి గురించి Two ladies talk ;)


    సకలము విష్ణుమాయ! విధి! చాకలి బట్టల మూట పూట మై
    నికటము చేరు కర్మ యదె నిత్యము సత్యము! గర్వమున్ మద
    మ్ముకడచి కాపుకోరగ సముచ్చయ రక్షణ చేయ జెచ్చెరన్
    మకరినిఁ జంపి సత్కృప నుమా! పతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్!


    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
  8. భాగవతమున హరిజేసె భక్త రక్ష
    కరుణతోను మా-పతి గాచెఁ గరివరేణ్యు
    ముక్తినొసగెను శ్రీ-కాళములకు తోడు
    కరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యు..

    రిప్లయితొలగించండి
  9. (శ్రీదేవి ,భూదేవి పార్వతీదేవికి మహావిష్ణువు గజేంద్రుని కాపాడిన విషయం వెల్లడిస్తున్నారు)
    వికసితపద్మసంపదల
    వీక్షకు లందరి మోముదమ్ములన్
    జకితమొనర్చు నా సరసు
    సంతసమీయగ నేన్గురాయడే
    చకచక కాలిడన్;మకరి
    చయ్యన బట్టుచు లోని కీడ్వగా
    మకరిని జంపి సత్క్పపను ,
    మాపతి గాచె గరీంద్రు బ్రాణమున్ .

    రిప్లయితొలగించండి
  10. సకలము నీవె నాకనెడు సామజమున్ దనుఁ గావ నెంచి తాఁ
    సకలము నచ్చటన్ మరచి సాగెను శౌరియెఁ నార్తబంధువై
    సకలము వెంట రాగనట చక్రము చేతను బట్టి వ్రేటునన్
    మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    రిప్లయితొలగించండి

  11. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నైమిశారణ్యమున రాహుల మహర్షి ఉవాచ:

    "ఒకపరి వెండికొండనట హోరున వానలు దంచుచుండగన్
    మకరము హస్తినిన్ దవిలి మాటికి మాటికి మొత్తుచుండగన్
    నికటము నుండగా కనుచు నీరము జేరుచు శూలధారియై
    మకరినిఁ జంపి సత్కృప నుమాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్"

    రిప్లయితొలగించండి
  12. వికసితపద్మమౌనుగద, వీధికినెట్టనినీదుప్రేమయే
    సకలము భక్తసమ్మతమె ,సాజముజేతువునీవదెప్పుడున్
    ప్రకటితమైన భావనకు, పద్మవిభూషణుడౌటచేతనే
    మకరినిజంపి సత్కృపను ,మాపతిగాచెగరీంద్రుప్రాణమున్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    వికలమనస్కుడౌ కరి వివేచనతోడ" జగమ్ములెల్ల దా
    నొకపరి సృష్టిజేయునెవడో మరి లోపలనుండి యెవ్వడో
    యొకపరి లోనికిన్ గొనునొ., యొద్దిక నాతడె దిక్కు నాకనన్ "
    మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  14. నా పూరణ. చం.మా.
    ***** ***
    చకచక వచ్చె దప్పిగొని సామజమే జలరాశి చెంతకున్

    మకరము బట్టె యా కరిని మంచిగ దా తిన నెంచి;యంతటన్

    వికలము జెంది కుంజరము వేడుకొనెన్ కడు సామగర్భునిన్

    మకరిని జంపి సత్కృపను మాపతి గాచె గరీంద్రు ప్రాణమున్

    (మాపతి..విష్ణువు)

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  15. అకటకటప్రభుత్వమది కల్లు దుకాణము పాఠశాల వ
    ద్దకనుమతించ వాడది నదాటున దూరెను పాకలోపలన్
    తికమక జెందె నాతడు మతిభ్రమియించగ పల్కుచుండె నో
    మకరినిఁ జంపి సత్కృప నుమాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అకట ప్రభుత్వ' మన్నపుడు 'ట' లఘువే.

      తొలగించండి
  16. దైత్యు కోరిక మన్నించి ద యను జూపి
    శిరము సుతునకు నతికించు వరము నొసగి
    కరుణ తో నుమా పతి గాచె క రి వరేణ్యు
    గ జ ముఖు నికి పూజలు గలుగ జేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. "గజ వదనునకు పూజలు..." అంటే సరి!

      తొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మకరి నోటికి జిక్కిన మదగజమ్ము
    గర్వమెడలి నిస్సత్త్వమై కైటభారి
    నెంతయు నుతించి వేడగ సంతసమున
    కరుణతోను మాపతి గాచె కరివరేణ్యు

    రిప్లయితొలగించండి
  18. కమల తన పుత్రునికి జెప్పె కరిని హరియె
    మకరి జంపియు రక్షించు మధుర గాథ !
    చవులు పుట్ట నుడివి పల్కె " చక్రపాణి
    కరుణతో, నుమాపతి ! గాచెఁ గరివరేణ్యు"
    ****)()(****
    (ఒక తల్లి తన పుత్రుడైన ఉమాపతికి జెప్పిన హరికథ)

    రిప్లయితొలగించండి
  19. భక్తులెల్లర గాచును బరమశివుడు
    కరుణతోను,మాపతిగాచెగరివరేణ్యు
    మకరి నోటికీ చిక్కుచుమరణ మునకు
    సిద్ధమగుదరి వేడగ శీఘ్రమేగి

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    ( క్రమాలంకార పూరణ.)

    జనులెటుల మెలగవలె జగతిలోన?
    కోర వరములిడు నెవరు భూరిగాను?
    హరి యెవరిని రక్షించె మకరిని జంపి?
    కరుణతో...నుమాపతి...గాచె కరివరేణ్యు.

    రిప్లయితొలగించండి
  21. భక్తి పరవశమునకరి పాహిపాహి
    మకరిబారినుండియభయంబనుచువేడ
    గరుణతోను మాపతిగాచె ,గరివరేణ్యు
    శిరమునేదెచ్చియతికించె శివుడుగరుణ

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    హరిగ నటనలో నుమాపతి యారి తేరె
    నగ్గజేంద్ర మోక్షమ్మున నాడిపాడఁ
    దనరి వీరాభిమాని తాఁ దడబడి యనె
    "గరుణతో యుమాసతి గాచెఁ గరివరేణ్యు "

    చంపకమాల
    సకల చరాచరాదులకు సాయము శ్రీహరి జేయునంచుఁ దా
    వికలిత చిత్తుడై మకరి పీడితుడౌచును దిక్కు నీవనన్
    చకచక వచ్చి శ్రీసతిని సైతము వీడక, దీనబంధువై
    మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    రిప్లయితొలగించండి
  23. కుక్షి వసియించి కోరఁగ నక్షతుండు
    తిరిగి తీర్చంగఁ గోరిక పరమశివుఁడు
    చర్మ మనిశమ్ము ధరియించి భర్మ మనఁగఁ
    గరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యు


    సకలము నీవ నాఁ దలఁచి సన్నుతి సేసిన నన్ను భక్తితోఁ
    బ్రకటిత మౌదు నంచుఁ దెలుపంగ జనాళికి నిశ్చయమ్ముగన్
    వికలము సేయ శాపమును విష్ణుఁడు దీన జనావనమ్ము నా,
    మకరినిఁ జంపి సత్కృప, నుమా పతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    [ఉమాపతి = కీర్తి కాంతకు పతి; ఇక్కడ విష్ణువు]

    రిప్లయితొలగించండి
  24. మకరము బారినంబడిన మత్తగజేంద్రుని రక్షజేసెగా
    మకరినిజంపి సత్కృపను మాపతి, గాచెగరీంద్రుప్రాణమున్
    వికలమునైన గాయమును,వేదనతోడనువిశ్వనాయకున్
    మకరము బారినంబడిన మత్తగజేంద్రునివేడుకోలుచే

    రిప్లయితొలగించండి
  25. కఠిన తపమొనరించిన శఠునికోర్కె
    కడుపులోన వసింపగ,నొడుపుగాను
    హరియె రప్పింప బయటకు,వరమునిడుచు
    శిరసు నతికించి సుతునకు జీవమిచ్చి
    కరుణతో నుమాపతి గాచె గరివరేణ్యు!

    రిప్లయితొలగించండి
  26. అసురుడాతఁడు శివునిపైనమితభక్తి
    కుక్షిలోనుంచె తా నిటలాక్షు, నతని
    శిరము లోకపూజ్యమ్ముగ జేసి తుదకు
    కరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యు

    రిప్లయితొలగించండి
  27. తరుణమునకు జేరి మృకండు తనయు నంత
    కరుణతో నుమాపతి గాచెఁ; గరివరేణ్యు
    మొరను విని రమాపతి రయమున పరువిడి
    శరణ మొసగె; సరిగ భక్తి శ్రద్ధ తోడ
    మనెడి వారి కెపుడు దైవమౌను తోడు

    రిప్లయితొలగించండి
  28. తాను మెసలు ప్రతి క్షణము తనదు పాటు
    తోడు నుండ దీవించెను తొడిమ వోలె
    కరుణతోను మాపతి గాచె గరివరేణ్యు
    భక్తు కోరిక దీరెను బ్రాపు తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం భావం అస్పష్టంగా ఉంది. 'ప్రతి క్షణ' మన్నపుడు 'తి' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి

  29. సకల జగత్తు నా హరియె చల్లగ గాచును తండ్రి వోలె నే
    డిక నిది వింత యేమి నిను హీన గజాసురు నుండి బ్రోచుటల్
    వికల మనస్కుడై శరణు వేడగ నాడు హరీ యటంచు నా
    మకరినిఁ జంపి సత్కృప, నుమాపతి! గాచెఁ గరీంద్రు ప్రాణమున్.

    రిప్లయితొలగించండి
  30. అల మృకండు సుతుడు వేడ, యముని నుండి
    కరుణతో నుమాపతి గాచెఁ, గరివరేణ్యు
    మకరినిఁ దునిమి రక్షించె మాధవుండు
    మడుగులో చిక్కి బెదరు సమయము నందు

    రిప్లయితొలగించండి
  31. చెక చెక లాడుచున్ మడుగు చేరి చెలంగుచు నుండ, చిక్కితా
    మకరము నోట, వెల్వడెడి మార్గము కానక, వేడె శ్రీ హరిన్
    లుకలుక లాడ మానసము, క్రూరపు దంష్ట్రము నుండి కావగన్
    మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    రిప్లయితొలగించండి
  32. తన శరీర శిరసులకు ధన్యమీయ
    గోరినంత గజాసుర గోర్కె తీర్చె
    కరుణతో నుమాపతి ; గాచెఁ గరివరేణ్యు
    బద్మినీశయుడు మకరి బారి నుండి

    రిప్లయితొలగించండి
  33. సకల మెఱంగునట్టి సిరిసామియె రక్షకుడంచు నమ్మి యా
    వికసిత పద్మనేత్రుని పవిత్రుని బ్రోవమటంచు నార్తిగా
    వికల మనస్కుడై న కరి పిల్చిన వెంటనె వేగ జేరుచున్
    మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్

    రిప్లయితొలగించండి
  34. సతము మోమును జూచుచు సమ్ముఖమున
    కొలువు తీరెడి వరమును కోరినంత
    కరుణతో నుమాపతి గాచె కరివరేణ్యు
    భక్త వత్సలు డన్న నా పరమ శివుడె.

    మరొక పూరణ
    కారడవి యందు బాలుడు కావుమనగ
    కరుణతో నుమాపతి గాచె ,కరివరేణ్యు
    డార్తితోమొరలిడినంత నాలకించి
    మకరి పట్టును విడిపించె మాధవుడు.

    రిప్లయితొలగించండి