7, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3125 (అజ్ఞానమ్ము వికాస...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్"
(లేదా...)
"అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

80 కామెంట్‌లు:

 1. విజ్ఞానమ్మది నాకు సొంతమనుచున్ బీరాలనే పల్కుటే

  యజ్ఞానమ్ము, వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్

  విజ్ఞానమ్మును భూరిగా కలిగినన్ వియ్యమ్ము తో మెల్గెడిన్

  ప్రాజ్ఞుండే గద లోకపూజ్యుడగుచున్ ప్రాశస్త్యమున్ బొందడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నెయ్యముతో మెలగడం' ఉంది. మరి 'వియ్యమ్ముతో మెలగడం'?

   తొలగించండి
 2. శార్దూలవిక్రీడితము

  ఆజ్ఞాచక్రము నందు దృష్టి నిడి బాహ్యంబందనాసక్తుడై
  ప్రజ్ఞానమ్మున చిత్తవృత్తులకు విశ్రాంతిన్ ప్రసాదించి స
  ర్వజ్ఞుండయ్యెడు ధ్యాన మందు నియతిన్ రంజిల్లుచున్ వీడగా
  నజ్ఞానమ్ము ,వికాసదాయక మహో! హ్లాదమ్ముఁ బండించెడిన్

  రిప్లయితొలగించండి
 3. ప్రాతః కాలపు సరదా పూరణ:


  అజ్ఞానమ్మును దుఃఖదాయకముగా
  హైరాననున్ గాంచుచున్
  విజ్ఞానమ్మున జ్ఞానమార్గముననున్ భీతిల్లకే సాగుచున్
  సుజ్ఞానమ్మును గ్రోలి హంసవలె తా శోభిల్లి వీక్షింప నా
  యజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పరమాత్మలో సాయుజ్యమైన పరమహంసకు అజ్ఞానపు సంసార మంతయును భగవానుని "లీల"గా తోచునట :)

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జ్ఞానమార్గమున తా భీతిల్లకే...' అనండి. ఇంకా బాగుంటుంది.

   తొలగించండి
 4. విజ్ఞానివి నీవని నే
  నజ్ఞానముతో తలచితి నధిపా! తగునే
  విజ్ఞుడవై యిట్లు పలుక
  అజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అజ్ఞానమ్మది బీడి కాల్చుటనహా హ్లాదమ్ము పండించెడిన్...
  అజ్ఞానమ్మది బీరు త్రాగుటనహా హ్లాదమ్ము పండించెడిన్...
  అజ్ఞానమ్మది పెండ్లి యాడుటనహా హ్లాదమ్ము పండించెడిన్...
  అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్ 😊

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'బీడి, బీరు, పెండ్లి' ఇవన్నీ తాత్కాలిక హ్లాదకారకాలే కాని వికాసదాయకాలు కావు కదా!

   తొలగించండి
  2. నేనొప్పను సార్!

   వికాసము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
   n.

   2. cheerfulness, joy, brightness;

   తొలగించండి
 6. ఆకాశవాణి కి నేను పంపినది

  బొగ్గరం ప్రసాదరావు,డల్లాస్,అమెరికా

  విజ్ఞానమ్ము మహోన్నతంబుగ సుధావిష్కారమే; వీడుమా!
  అజ్ఞానమ్ము;వికాస దాయకమహో హ్లాదంబు పండించెడిన్
  సుజ్ఞేయమ్ముగ సత్య ధర్మ పధమే;శుష్క ప్రలాపంబులన్
  విజ్ఞుల్ మాని చరింపరే వినుత దైవీ భావ సంపన్నులై.

  రిప్లయితొలగించండి
 7. ప్రజ్ఞావంతులు లోకరక్షణకునై భవ్యానురాగమ్ముతో
  విజ్ఞానమ్మును ఖర్చుచేయవలయున్ విశ్వాసమున్ జాటి స
  ర్వజ్ఞుల్ మెచ్చెడిరీతి, దేశసుఖమున్ భంజించు దుర్నీతులం
  దజ్ఞానమ్ము వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఖర్చు' అన్యదేశ్యం.

   తొలగించండి
 8. శ్రీరమణీయదక్షిణకరాగ్రవిలాససుదర్శనాత్తవా
  మోరుకరాబ్జముగ్ధరవమోహనభాసురపాంచజన్యమున్,
  శ్రీరమ భూసతీమణియు, చెన్నసలార నురస్థలిన్, తదా
  కారముఁ జూచి దేవుడని గట్టిగ నమ్మెను చిత్రమెట్టులౌ.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  విజ్ఞానమ్మన *నేను* నేర్చినదె , యీ విశ్వంబునన్ *నాదె* స....
  ర్వజ్ఞత్వమ్మని విర్రవీగకుము., *సర్వజ్ఞుండనన్ రుద్రుడే* !
  యజ్ఞానమ్మన *నేను నాది* యనుమా.! *యజ్ఞానమే జ్ఞానమౌ* !
  అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్" !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 10. ప్రజ్ఞానమ్ బ్రహ్మ యనెడు
  సుజ్ఞానము నందజేయు శ్రుతివాక్యముతో
  విజ్ఞాన మగుట తొలగగ
  యజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్.

  రిప్లయితొలగించండి
 11. రామస్వామి కిడాంబి, హైదరాబాద్ నుంచి.

  అజ్ఞానంబె యమాయకత్వమును సౌఖ్యంబున్ బ్రసాదింపగా/
  ప్రజ్ఞాశాలురు క్రూరభారమతులై రాజిల్లగా చూడమే/
  *అజ్ఞానమ్ము వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్* /
  అజ్ఞానాంధత దూరమైనపుడె సత్యంబైన సంతోషమౌ//

  రిప్లయితొలగించండి
 12. *Ignorance is bliss*

  ఏ జ్ఞానము కొఱకు జనులు
  జిజ్ఞాసువులై చరించి ఛేదించెదరో
  ఆ జ్ఞానముకన్న మిగుల
  "యజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్"

  రిప్లయితొలగించండి
 13. అజ్ఞానుల కథలేవిని
  విజ్ఞానముకై వెతుకులాట వింతయె గాదా?
  అజ్ఞు డెవరు విజ్ఞుడెవరు
  అజ్ఞానము వికస నమును హ్లాదమొసంగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'విజ్ఞానపు వెతుకులాట...' అందామా?

   తొలగించండి
  2. వెతుకుట ఆడించిన ఆటలాగుంది.

   అజ్ఞానుల కథలేవిని
   విజ్ఞానముకై వెతుకుట వింతయె గాదా?
   అజ్ఞు డెవరు విజ్ఞుడెవరు
   అజ్ఞానము వికస నమును హ్లాదమొసంగున్

   అలాగే మీరందినట్లుగా
   అజ్ఞానుల కథలేవిని
   విజ్ఞానపు వెతుకులాట వింతయె గాదా?
   అజ్ఞు డెవరు విజ్ఞుడెవరు
   అజ్ఞానము వికస నమును హ్లాదమొసంగున్

   తొలగించండి
 14. ప్రజ్ఞా హీన త కు గురుతు
  న జ్ఞానం బు :: విక స న ము హ్లాద మొ సంగు న్
  సుజ్ఞా న ము జన త తు లకు
  విజ్ఞత తో కూడి నట్టి విమలపు బుద్దుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గురుతు + అజ్ఞానంబు = గురు తజ్ఞానంబు' అవుతుంది. నుగాగమం రాదు. 'గురుతె యజ్ఞానంబు' అనవచ్చు.

   తొలగించండి


 15. ప్రజ్ఞావంతులు! యిస్రో
  విజ్ఞానులపజయమునకు వెరవకుడీ! మీ
  ప్రాజ్ఞానయానమున సం
  జ్ఞ్యాజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్!


  సంజ్ఞ్యాజ్ఞానము - signal beak సంజ్ఞ్యా అజ్ఞానము


  Be courageous ISRO !

  Cheers
  జిలేబి

  రిప్లయితొలగించండి

 16. ఆకాశవాణికి పంపినది


  "ప్రజ్ఞావంతుడ! భాగ్యశాలిని‌ భళా వాగ్దేవి నావాణి ! నే
  నాజ్ఞాపించిన శిష్యులెల్లరును సన్నాహమ్ముతో బారుగా
  సై!జ్ఞానాంబుధి యంచు చేరుదురు!" ఈ శౌటీర్యముల్, వీడగా
  నజ్ఞానమ్ము, వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. ఆశ్చర్యం... జిలేబి గారు ఇంకా రాణీపేటలోనే ఉన్నారట :)

   తొలగించండి

  3. ఎవరండీ వారు ? :)


   ఆకాశవాణి విశేషములా ?   జిలేబి

   తొలగించండి
  4. హా! అంతేగా! గత శనివారం Opening Bats(woman)...ఈ శనివారం One Down :)

   తొలగించండి

  5. ఓ ఈ వారం చదివారన్న మాట

   నెనరుల్స్!


   జిలేబి

   తొలగించండి
 17. విజ్ఞుల చేరిన తొలగును
  అజ్ఞానము, వికసనమును హ్లాద మొసంగున్
  ప్రాజ్ఞుల సాంగత్యమొదవ
  విజ్ఞానమునబ్బు చుండు విశ్వము నందున్.

  మరొక పూరణ

  ప్రజ్ఞావంతులమంచు గొప్పలనుచెప్పన్ వాసిగాబోదదౌ
  నజ్ఞానమ్ము, వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్
  విజ్ఞానమ్మదియెంత నేర్చి నను తా విద్యామదంబెక్కకన్
  విజ్ఞుండై చరియించుచుండగజనుల్ వేనోళ్ళతో మెత్తురే


  రిప్లయితొలగించండి
 18. అజ్ఞుడ నేనని వగవకు
  అజ్ఞుడ! అసమానభావ నజ్ఞత కాదా!
  ప్రాజ్ఞత కొరకై ప్రాకే
  అజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

  రిప్లయితొలగించండి
 19. వచ్చే వారపు ఆకాశవాణి వారి సమస్య

  పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో

  గురువారంలోగా పూరణల నంపవలసిన చిరునామా padyamairhy@gmail.com

  రిప్లయితొలగించండి

 20. (కాళీమాత కరుణతో కాలుడు కాళిదాసై విరాజిల్లాడు )
  అజ్ఞానావృతమూర్తియై పసులతో
  నత్యంత మాత్మీయుడై
  యాజ్ఞల్ గట్టిగ సల్పుచున్ మెలగినా ;
  డా కాలుడే పిమ్మటన్
  విజ్ఞానుండయి కాళికాకరుణచే
  విశ్వమ్మునన్ రాజిలెన్ ;
  అజ్ఞానమ్ము వికాసదాయక మహో !
  హ్లాదమ్ము బండించెడిన్ .

  రిప్లయితొలగించండి
 21. ప్రజ్ఞాశాలినటంచు డంబమును దర్పంబున్ ప్రదర్శించుటే
  అజ్ఞానమ్ము; వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్
  విజ్ఞానామృత పానమున్ సతత సద్విద్యా ప్రకాశమ్ముతో
  ప్రజ్ఞానాంబుధి చంద్రులై వెలుగుచున్ వర్ధిల్లుటే జ్ఞానమౌ

  రిప్లయితొలగించండి
 22. ప్రజ్ఞాశాలినటంచు డంబమును దర్పంబున్ ప్రదర్శించుటే
  అజ్ఞానమ్ము; వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్
  విజ్ఞానామృత స్వాదనమ్ము ఘన సద్విద్యా ప్రకాశమ్మునన్
  ప్రజ్ఞానాంబర వీధులన్ విమల సద్భావాత్మ సౌందర్యమే

  రిప్లయితొలగించండి
 23. జిఙ్ఞాసువులకు దొలగగ
  నఙ్ఞానము, వికసనమును హ్లాదమొసంగున్
  ప్రఙ్ఞానం బ్రహ్మయనెడు
  సుఙ్ఞానము గలిగినంత శోకము సున్నౌ

  రిప్లయితొలగించండి
 24. అఙ్ఞానాంబుధిలోనమున్గిననరుండాలాపమట్లుండెబో
  యఙ్ఞానంబువికాసదాయకమ,హోహ్లాదంబుపండించెడిన్
  సుఙ్ఞానుల్దమపాండితీగరిమచేసౌగంధిపుష్పంబులే
  ప్రఙ్ఞాపాటవమొప్పుసజ్జనుడుదాభాసిల్లునెచ్చోటనన్

  రిప్లయితొలగించండి
 25. విఙ్ఞులపలుకులుగావివి
  యఙ్ఞానమువికసమునుహ్లాదమొసంగున్
  నఙ్ఞానమొసగుజీకటి
  సుఙ్ఞానమ యిచ్చుమనకుశోభనుహృదికిన్

  రిప్లయితొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  ప్రాజ్ఞుల బోధనల తొలగు
  నజ్ఞానము; వికసనమును హ్లాదమొసంగున్
  విజ్ఞానము నందించుచు
  సుజ్ఞానులు పంచు సూక్తి సుధలు ప్రజలకున్
  .

  రిప్లయితొలగించండి

 27. విజ్ఞానంబునునమ్మకున్నజనులన్వేధించురోగమ్మన న్?
  ప్రజ్ఞాశాలురుపాటవమ్ముదెలిపిభాసించిశోభిల్లితా
  మజ్ఞానమ్మునుబారనీయకతమసామర్థ్యంబుజూపించుచో,
  అజ్ఞానమ్ము,వికాసదాయకమహోహ్లాదమ్ముపండించెడిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్ ,రంగారెడ్డి


  రిప్లయితొలగించండి
 28. విజ్ఞానులు పంపిరి గద
  "ప్రజ్ఞాను"ను చంద్ర లోక భ్రమణము కొరకై
  సుజ్ఞానంబిడున దెడపు
  నజ్ఞానము, వికసనమును హ్లాదమొసంగున్

  రిప్లయితొలగించండి

 29. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
  సమస్యాపూరణ కార్యక్రమంలో...
  07/09/2019 శనివారం ప్రసారం కాబోతున్న సమస్య

  అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్"*


  నా పూరణ.....శార్ధూలము
  *** ****


  విజ్ఞాతంబగు జక్కగా నిటుల నీ విశ్వంబు నందెప్పుడున్

  విజ్ఞానంబును భూరి యున్న బుధుడున్ వేవేల రాజిల్లడే?

  విజ్ఞప్తిన్ గడు జేతు నివ్విధము నావే
  దించ మూర్ఖత్వమే

  " అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్ "

  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి
 30. ప్రధాని ఇస్రోసంచాలకులతో..

  కందం
  ప్రజ్ఞానమ్మున దిగు ను
  ద్విగ్నతలన్ చంద్రయాన విఫలత నా శా
  స్త్రజ్ఞుల పూనికతో విడు
  నజ్ఞానమ్ము, వికసనమును హ్లాద మొసంగున్

  రిప్లయితొలగించండి
 31. అజ్ఞానమ్మున వీడువా డనుచు నాయా భేదభావాల నా
  ప్రజ్ఞాపాటవ మెల్ల చాటుకొని కూపస్థాజిరమ్మైతి నీ
  సుజ్ఞానాస్పదమైన గీత జదువన్ శుష్కించె నాలోని యా
  యజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్.

  రిప్లయితొలగించండి
 32. అజ్ఞానతిమిరముడుపఁగ
  విజ్ఞానపు దీపశిఖను వెలిగించదగున్
  సుజ్ఞానమొదవగదొలఁగు
  నజ్ఞానము, వికసనమును హ్లాదమొసంగున్

  రిప్లయితొలగించండి
 33. అజ్ఞాన ధ్వాంతం బీ
  ప్రాజ్ఞ జనులఁ జేర రాదు భగవన్మాయా
  సుజ్ఞాన మసాధ్యము తద
  నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

  [అ + అజ్ఞానము = అనజ్ఞానము; అజ్ఞానము లేమి యనగా జ్ఞానము]


  “రాగమ్ము పండించెడిన్” పాఠమునకు కూడ వర్తించు నట్లు చేసిన పూరణములు. మొదటిది యాకాశవాణికిఁ బంపగాఁ జదువబడినది.


  ప్రాజ్ఞుల్ మెచ్చు కవిత్వ పాటవము పెన్పారంగ వేదాంగ సూ
  క్తిజ్ఞానమ్ము తదర్థ భావములు సంకీర్తింప సామర్థ్యమౌ
  విజ్ఞానంబు సెలంగ సూరిజన సంవేద్యమ్ము దుష్టార్థ గీ
  రజ్ఞానమ్ము వికాస దాయక మహో రాగమ్ము పండించెడిన్

  [దుష్టార్థ గీః + అజ్ఞానమ్ము = దుష్టార్థ గీ రజ్ఞానమ్ము: చెడు నర్థము నిచ్చు వచనములు తెలియమి]


  ఏ జ్ఞానమ్ము గడించ నేరకయు ద్వేషేర్ష్యాది దౌర్బల్య యు
  క్తాజ్ఞాతస్థిత దుర్జనవ్రజ మనో౽ ర్థా శాని శోద్రిక్త చి
  త్తజ్ఞాతిద్విష దుర్వివేక మొసఁగుం దాపమ్ము గర్వోత్పతి
  త్రజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్

  [గర్వ + ఉత్పతితృ + అజ్ఞానమ్ము = గర్వోత్పతి త్రజ్ఞానమ్ము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ "ప్రాజ్ఞుల్ మెచ్చు..." పద్యము ఈ ఉదయం ఆకాశవాణిలో చదువబడినది

   🙏

   తొలగించండి
  2. అవునండి. ధన్యవాదములు.
   యతి నెవ రెవ రెట్లు సాధించితిరో చూడాలని విన్నాను. అందులో నన్ని పూరణములు (నాది తక్క) యతి భంగముతోనే యున్నవి!

   తొలగించండి
 34. ప్రజ్ఞా! వీనుల విందుగా వినుమ సంబాదమ్ములన్ దెచ్చు గా
  నజ్ఞానమ్ము, వికాసదాయకమహో రాగమ్ముపండించెడిన్
  సుజ్ఞానమ్మె దృశింప జేయు భువిలోచొక్కంపు మార్గమ్ములన్
  ప్రజ్ఞన్ బెంచి విశేష కీర్తినిడు విజ్ఞానమ్ము మవ్వంపుగన్!!!

  రిప్లయితొలగించండి
 35. విజ్ఞానశాస్త్రమందున
  ప్రాజ్ఞుడయినను తిథివార వర్జ్యము లెరుగన్
  విజ్ఞాన రహితునికి గల
  అజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

  రిప్లయితొలగించండి
 36. Ignorance is bliss
  If one is unaware of an unpleasant fact or situation one cannot be troubled by it.

  ప్రాజ్ఞుఁడతండుజ్యోతి
  ష్యజ్ఞాన ధురీణుఁడికను సతమతముపడెన్
  విజ్ఞాతుఁడఖిలముదెలిసి
  నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

  రిప్లయితొలగించండి


 37. విక్రముని సిగ్నలు జిలే
  బీ క్రమముగ వచ్చునా ? సభీ ఉత్సుక్ హై!
  చక్రమ్మిక తిరుగునకొ? ప
  రాక్రమము వెలువడునా విరాజిల్లంగన్ ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిక్కెద నద్దములోపల
   చక్కగ నుండు భువిన నను చఱచుట నేలో
   చుక్కలుగోరాడు పనులఁ
   మక్కువ జూపకు కలియుగ మానవుడ వినో

   తొలగించండి
 38. గురువు గారికి నమస్సులు
  జిజ్ఞాసన్ యివ్వదు గద
  అజ్ఞానము,వికసనమును హ్లాదమోసంగున్
  విజ్ఞాన శోధనల్ ,గుణ
  ప్రజ్ఞావంతులు వెలిగిరి పరిశోధకులై.

  రిప్లయితొలగించండి
 39. అజ్ఞానమ్మదియంధకారసదృశంబందించుగా ఖేదమున్
  విజ్ఞానమ్మను దివ్వెజేగొనుమువెల్గుల్ విరాజిల్లగన్
  సుజ్ఞానమ్మొనగూర్చువిజ్ఞతయు సంశోధించి పోకార్చుతా
  నజ్ఞానమ్ము, వికాసదాయకమహో హ్లాదమ్ముఁ బండించెడిన్

  రిప్లయితొలగించండి
 40. కం.
  ప్రాజ్ఞత నెఱిఁగిన మనుజుడు
  విజ్ఞత మేరకు నడచును విజయము దిశగన్
  ప్రజ్ఞాను నెపుడు కదుపిన
  యజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 41. విజ్ఞులచెంతన వినయము
  యజ్ఞములా భావనమున ననవరతమునన్
  ప్రజ్ఞను జూపక యే విన
  నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్!!

  రిప్లయితొలగించండి
 42. asnreddy

  శా: విజ్ఞానమ్మొసగున్ వసుంధర పయిన్ విద్యార్థికభ్యాసమే
  సుజ్ఞానాంబుధిలో సతమ్ము చనుచున్ శోధించినన్, బాయగా
  నజ్ఞానమ్ము, వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్
  ప్రజ్ఞావంతునికిన్ సరస్వతి దయన్ ప్రాప్తించు సత్కారముల్

  రిప్లయితొలగించండి
 43. విజ్ఞుల చేరంగ తొలగు
  నజ్ఞానము, వికసనమును హ్లాద మొసంగున్
  ప్రాజ్ఞుల సాంగత్యమొదవ
  విజ్ఞానమునబ్బు చుండు విశ్వము నందున్.

  ప్రజ్ఞావంతులమంచు గొప్పలనుచెప్పన్ వాసిగాబోదదౌ
  నజ్ఞానమ్ము, వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్
  విజ్ఞానమ్మదియెంత నేర్చి నను తా విద్యామదంబెక్కకన్
  విజ్ఞుండై చరియించుచుండగజనుల్ వేనోళ్ళతో మెత్తురే

  రిప్లయితొలగించండి