కవిమిత్రులకు మనవి... ఈరోజు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం బయలుదేరుతున్నాను. రేపు ఉదయం ఆముదాలవలస ద్వారా శ్రీకాకుళం చేరుకుంటాను. అక్కడ రేపటి నుండి శ్రీ ఆముదాల మురళి గారి శతావధానం ఉంది. ఆముదాలవలసలో కాని, శ్రీకాకుళంలో కాని మన సమూహ మిత్రులెవరైనా ఉన్నారా? శ్రీకాకుళంలో రేపు ఒక్కరోజే ఉండి అదేరోజు రాత్రి మళ్ళి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‍లో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం...
సందర్భము: పౌరుషం లేదా పురుషకారం ఉద్యోగానికి అంటే ప్రయత్నానికి కారణం. ప్రయత్నం కర్మకు కారణం. కర్మ నిష్కామంగా జరిగితేనే కర్మయోగంగా పరిణమించి నరుడు తరిస్తాడు. లేకపోతే కర్మబంధంతో జననమరణ చక్రంలో పడి గిరగిరా తిరుగుతూనే వుంటాడు. కర్మయోగంతో జీవితానుభవం కలుగుతుంది. అది సమస్యలతో సతమత మౌతున్న తోటివారికి పనికి వస్తుంది. ఏ పనీ చేయని వాని కే యనుభవమూ రాదు కదా! పౌరుషం అవలంబించకుండా దైవబలం చేకూరా లని చూడరాదు. దైవంమీద భారం వేయకుండా కేవల పౌరుషాన్నీ అవలంబించరాదు.. అలా వున్నప్పుడు మాత్రమే పౌరుషం సార్థక మవుతుంది. *నిత్యం స్వపౌరుషా దేవ* *లోక ద్వయ హితం భవేత్..* (నిజ పౌరుష బలంతోనే ఇహపరలోకాలు రెంటనూ మంచిని పొందవచ్చు.) అని యోగ వాసిష్ఠం లో వసిష్ఠుడు చెబుతాడు. అంతే గాక *మూఢైః ప్రకల్పితం దైవం* *మన్యంతే యే క్షయంగతాః* ( మూఢులచే కల్పించబడిన దైవాన్ని (అదృష్టాన్ని) ఆశ్రయించిన వారు నశింతురు.) అంటాడు. కాబట్టి దైవమే అన్నీ చూసుకుటుం దని పురుషకారం అక్కర్లే దని ఊరికే దైవాన్ని కొలుచుకుంటూ కూర్చుంటే ఏ కర్మా జరుగదు.. సోమరితనం వచ్చేస్తుంది. మెదడు ఖాళీగా వుండటంవల్ల పనికి మాలిన ఆలోచనలకు ఆలవాల మౌతుంది. (Empty mind is devils work shop అని సామెత.) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఉత్తమ పౌరుషం బుద్యోగమునకు, నా యుద్యోగ మది కర్మ యోగమునకుఁ గర్మయోగం బెంచగా జీవితానుభ వమునకు నగు కారణములు మరియుఁ జింతించు నరులకు నెంతే నుపకరించు జీవితానుభవంబు గావున ధరఁ దత పౌరుషము సార్థకత జెందుటకు గాని దైవంబు.. నది లేక దైవబలము కలుగునే! సోమరితనమె కలుగు, నతని మనము దయ్యాల కొంపగా మారుఁ.. గాన పురుషకారంబుఁ బూర్తిగాఁ బోనడంచి, దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 12.9.19 -----------------------------------------------------------
శరణు జొచ్చిన వారిని కరుణ తోడ
రిప్లయితొలగించండినాద రింపక వారిని బాధ పెడుచు
దల్లి దండ్రుల విడనాడి ధరణి యందు
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పెడుచు' అన్న ప్రయోగం సాధువు కాదు.
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిచావుల్ దప్పెను నోడి పోవగనుభల్ జంబమ్ముతో పోరగా
రావే యీశ్వర కావవే ననునటన్ రాగమ్ముతో పాడుచున్
బావుర్మంటును నేడ్చి వైరులకికన్ ప్రాణంబులన్ తీయుమన్
దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చావుల్ దప్పె పరాజయంబును గనన్... బావుర్మంచును' అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిజీవితమునకు లక్ష్యము స్థిరము గాను
దైవమును గొల్వు టొక్కటె! తపమటంచు
కోరికల తోడు జీవించి కొవ్వు బట్టి
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గొల్చు టొక్కటె' అని ఉండాలనుకుంటాను.
కవిమిత్రులకు మనవి... ఈరోజు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం బయలుదేరుతున్నాను. రేపు ఉదయం ఆముదాలవలస ద్వారా శ్రీకాకుళం చేరుకుంటాను. అక్కడ రేపటి నుండి శ్రీ ఆముదాల మురళి గారి శతావధానం ఉంది. ఆముదాలవలసలో కాని, శ్రీకాకుళంలో కాని మన సమూహ మిత్రులెవరైనా ఉన్నారా? శ్రీకాకుళంలో రేపు ఒక్కరోజే ఉండి అదేరోజు రాత్రి మళ్ళి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‍లో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం...
రిప్లయితొలగించండిమైలవరపు వారి స్పందన:
తొలగించండిజయోऽస్తు... విజయోऽస్తు 💐🙏🙏💐💐🙏🙏
సరసమనోహరమ్మయిన శాబ్దిక పుష్టిని గల్గి.., భారతీ
వరపదభావనాగరిమ భావసమృద్ధిని పొంది., సత్కవీ...
శ్వరులు శిరమ్ములూచునటు పద్యములల్లుచు నాముదాల శ్రీ
మురళి శతావధాననవమోహనరాగములన్ ధ్వనించుతన్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅస్తి నాస్తి వాదన లన్ని అడ్డుదగుల
రిప్లయితొలగించండిదైవచింతనజేయుట దైన్యమగున?
అంతరంగమునందున అలుకజూపి
దైవమునుగొల్వరాదంద్రు ధర్మవిదులు.
రావెల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకల సారమునెఱిగిన సజ్జనాళి
రిప్లయితొలగించండివేదవిధులన్నిదెలిసిన వేత్తలవగ
మైల యున్నట్టి రోజుల మైకమందు
దైవమునుగొల్వరాదంద్రు ధర్మవిదులు
రావెల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అవగ' అన్న ప్రయోగం సాధువు కాదు. "వేత్త లగుచు/లైన" అనండి.
ధన్యవాదములు గురువర్యా
తొలగించండిసవరణపాఠము ప్రచురించెద
కృతజ్ఞతలు
తేటగీతి
తొలగించండితల్లి దండ్రులె ప్రత్యక్ష దైవములను
వేదవచనంబు మరచి నిర్వేదమునను
ఆశ్రమాలలొ వదిలెడి యల్పనరులు
దైవమును గొల్వ రాదండ్రు ధర్మవిధులు
ఆకులశివరాజలింగం వనపర్తి
రిప్లయితొలగించండిజీవాధారయతండు! లక్ష్యమతడే చేగూరు మోక్షమ్ము, శ్రీ
కైవల్యంబది కోరికల్ విడువ సాక్షాత్కారమౌ, మాలినీ
దైవమ్మున్ గొలువంగ, రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్,
భావావేశపు చేష్టలున్ తలపులున్ ప్రారబ్ధ కర్మాదులున్ !
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
'జీవాధార మతండు...' అని ఉండాలనుకుంటాను.
తోచిన యన్రుతములు కూర్మితోను చెబుతు
రిప్లయితొలగించండిఇరుగుపొరుగు వారి నెపుడు మరుగు పెడుతు
భక్తి చాల నున్నదనుచు ముక్తి కోరి
దైవమును గొల్వరాదండ్రు ధర్మ విధులు
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనృతములు' టైపాటు. 'చెబుతు, పెడుతు' అనడం సాధువు కాదు.
🙏 ధన్యవాదాలు గురువు గారూ
తొలగించండితోచిన యనృతములు కూర్మితోను చెప్పి
ఇరుగుపొరుగు వారి నెపుడు మరుగు పెట్టి
భక్తి చాల నున్నదనుచు ముక్తి కోరి
దైవమును గొల్వరాదండ్రు ధర్మ విధులు
రిప్లయితొలగించండిస్నాన మాడక ప్రాభాత సమయమందు
శుభ్రవస్త్రాల ధరియించు చొప్పు లేక
భస్మధారణ జేయక భక్తి లేక
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిభక్తకన్నప్ప....
నే వేటాడ లభించె మాంసమిదిగో ! నీకే నివేదింపగా
నా విజ్ఞాపన తప్పుతప్పనిరిదే న్యాయ్యంబొకో ? యివ్విధిన్
దైవమ్మున్ గొలువంగ రాదనిరయో ధర్మజ్ఞులున్ యోగులున్ !
శ్రీవాత్సల్యగుణాకరా ! భవహరా ! శ్రీకాళహస్తీశ్వరా !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిదేవ నామది గంటిని దేహి యనగ
రార దయజూడఁ బిల్చిన రావదేమి ?
ఆణువణువు నిండిన నిన్ను దలచి, వేరు
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు"
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanyavaadaalu...
తొలగించండిమూగజీవుల యందెల్ల ముదిమి లేక
రిప్లయితొలగించండికోర్కె తీర్పు కొరకు చాల కూర్మి జూపి
తగుదు నమ్మ నంచు తిరిగి తన్మయమున
దైవమును గొల్వరాదండ్రు ధర్మ విధులు
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అమ్మనంచు'?
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
రావద్దంచును హైద్రబాదుకనివే రాద్ధాంతమున్ జేయగా
బ్రోవన్ గోరుచు నాంధ్రవాసులనికన్ పోషించితిన్ కృష్ణనున్
దైవంబెవ్వడు నన్నుమించగనిటన్ దండంబులన్ బెట్టుమన్
దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్
వే = వేగముగ
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావంబందున శుద్ధిలేక మదిలో పాపంబులన్ సర్వదా
రిప్లయితొలగించండిగావించంగ దలంచుచుండి త్రిజగత్కల్యాణముం గూర్చు వా
డౌవానిన్ గలడంచు నమ్మని ఖలుం డందంగ సర్వార్థముల్
దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైల వస్త్రముల్ ధరియించు వేళలందు
రిప్లయితొలగించండిగ్రహణ సమయము లందున ఖచ్చితముగ
నాత్మ శుద్ధియె లేకుండ యవనిలోన
దైవమున్ గొల్వరాదంద్రు ధర్మవిదులు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లేకుండ నవనిలోన' అనండి.
సత్య ధర్మాలు విడనాడి స్వార్థ ముగను
తొలగించండిదుష్ట భావన ల్ గల్గియు దురితు డగుచు
బాహ్య నటన తో నమ్మింప భక్తుడ గుచు
దైవము ను గొల్వ రాదంద్రు ధర్మ విదులు
కారణము లేక చీమయు కదలబోదు
రిప్లయితొలగించండిపనులు సమకూరు ధరలోన పట్టుదలతొ
సాధనమునందు, సుంతైన శౌచమనక
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు!
లోక కల్యాణమును గోరి ప్రాకటముగ
రిప్లయితొలగించండిప్రార్థన సలుప వలయును భక్తి తోడ
పరుల నాశనమును గోరి భక్త జనులు
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
మతము పేరిట జనులను మాయ జేసి
రిప్లయితొలగించండితమదు దైవము గొప్పయె దప్ప నితర
దైవమునుఁ గొల్వరాదంద్రు; ధర్మవిదులు
దైవ మొకడంద్రు వేరగు దారులైన
తల్లిదండ్రుల విడనాడుతనయు లికను
రిప్లయితొలగించండిదైవమును గొల్వరాదండ్రు ధర్మవిదులు
వారి పిదపనే దైవము బరగు గాన
తల్లిదండ్రుల పూజయే దైవపూజ
ఇహము కోరుచు మానవులహరహమ్ము
రిప్లయితొలగించండిపరము తలుపక మనినచో ఫలితమేమి
ఐహికమ్మగు సుఖములకాశచెంది
దైవమునుఁగొల్వరాదంద్రు ధర్మవిదులు
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిలావొక్కింతయు లేదు లేదనిననే రక్షించె వేదండమున్
నీవే దిక్కని యాజ్ఞసేని పిలువన్నెక్కొల్పెఁ దా చీరలన్
భావంబందు శరణ్యమాతడను విశ్వాసమ్ము లేకుండగన్
దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్
దైవమ్మున్గొలువంగ రాదనిరయో ధర్మఙ్ఞులున్యోగులున్
రిప్లయితొలగించండిదైవమ్మేగద రక్షజేయునుమహిన్ ధర్మంబె యట్లంటిరే
దైవమ్మున్ గొలువంగ వచ్చునుసదా ధ్యానంబుపూజాదులన్
గావన్ బృధ్విని జంతుజాలమునీలన్ గారుణ్యమొప్పారగన్
శక్తి కొలదికొలచినను చాలు భక్తి
రిప్లయితొలగించండికల్గిచేయు పూజలెమిన్న గాన హంగు
నార్భటుల యాత్మ శుద్ధిలేనట్టివారు
దైవమునుకొల్వరాదంద్రు ధర్మవిదులు
4వపాదము చివర
రిప్లయితొలగించండిజంతుజాలమునిలన్
గా చదువప్రార్ధన
శక్తి కొలదికొలచినను చాలు భక్తి
రిప్లయితొలగించండికల్గిచేయు పూజలెమిన్న గాన హంగు
నార్భటుల యాత్మ శుద్ధిలేనట్టివారు
దైవమునుకొల్వరాదంద్రు ధర్మవిదులు
శక్తి కొలదికొలచినను చాలు భక్తి
రిప్లయితొలగించండికల్గిచేయు పూజలెమిన్న గాన హంగు
నార్భటుల యాత్మ శుద్ధిలేనట్టివారు
దైవమునుకొల్వరాదంద్రు ధర్మవిదులు
విశ్వ కళ్యాణ మూహించి విశ్వ జనులు
రిప్లయితొలగించండిదయ్యమును గూడ పూజింపఁ దగును గాని
లోక నాశనార్థమ్ముగ లోకు లెట్టి
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
దైవాకారపు విగ్రహమ్ములకు నిత్యప్రోక్త సత్పూజకై
ప్రావీణ్యమ్ముగఁ బంచలోహములనే వాడంగ నొప్పున్ భువిం
గైవల్యమ్మును బొందఁ గోరినను ధిక్కాలాయస స్కంధమౌ
దైవమ్మున్ గొలువంగ రాదని రయోధర్మజ్ఞులున్ యోగులున్
[అయోధర్మజ్ఞులు = ఇనుము గుణములు తెలిసినవారు]
అంటు సమయములందు నే యాలయమున
రిప్లయితొలగించండిదైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
మనసున కొలుచు కొనుటకేమాత్రపడ్డు
లేదనుచు తెలుపుదురు వరేణ్యులెపుడు
తేటగీతి
రిప్లయితొలగించండిదేవుఁడొక్కడే యనుమాట ధిక్కరించి
లౌకికమ్ముల దేవుని రంగరించి
మతము మార్చంగఁ జూచు నమానుషమున
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
నీవా స్వార్థము వీడకుండ సతమున్ నేరాలనే చేయుచున్
రిప్లయితొలగించండినీవేదిక్కని నమ్మి నట్టి జనులన్ నిర్భాగ్యులన్ ద్రొక్కుచున్
నీవే పాపము దీర్చువాడవనుచున్ నిత్యమ్ము పేరాశతో
దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
సందర్భము: పౌరుషం లేదా పురుషకారం ఉద్యోగానికి అంటే ప్రయత్నానికి కారణం. ప్రయత్నం కర్మకు కారణం. కర్మ నిష్కామంగా జరిగితేనే కర్మయోగంగా పరిణమించి నరుడు తరిస్తాడు. లేకపోతే కర్మబంధంతో జననమరణ చక్రంలో పడి గిరగిరా తిరుగుతూనే వుంటాడు.
కర్మయోగంతో జీవితానుభవం కలుగుతుంది. అది సమస్యలతో సతమత మౌతున్న తోటివారికి పనికి వస్తుంది. ఏ పనీ చేయని వాని కే యనుభవమూ రాదు కదా!
పౌరుషం అవలంబించకుండా దైవబలం చేకూరా లని చూడరాదు. దైవంమీద భారం వేయకుండా కేవల పౌరుషాన్నీ అవలంబించరాదు.. అలా వున్నప్పుడు మాత్రమే పౌరుషం సార్థక మవుతుంది.
*నిత్యం స్వపౌరుషా దేవ*
*లోక ద్వయ హితం భవేత్..*
(నిజ పౌరుష బలంతోనే ఇహపరలోకాలు రెంటనూ మంచిని పొందవచ్చు.) అని యోగ వాసిష్ఠం లో వసిష్ఠుడు చెబుతాడు. అంతే గాక
*మూఢైః ప్రకల్పితం దైవం*
*మన్యంతే యే క్షయంగతాః*
( మూఢులచే కల్పించబడిన దైవాన్ని (అదృష్టాన్ని) ఆశ్రయించిన వారు నశింతురు.) అంటాడు.
కాబట్టి దైవమే అన్నీ చూసుకుటుం దని పురుషకారం అక్కర్లే దని ఊరికే దైవాన్ని కొలుచుకుంటూ కూర్చుంటే ఏ కర్మా జరుగదు.. సోమరితనం వచ్చేస్తుంది. మెదడు ఖాళీగా వుండటంవల్ల పనికి మాలిన ఆలోచనలకు ఆలవాల మౌతుంది. (Empty mind is devils work shop అని సామెత.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఉత్తమ పౌరుషం బుద్యోగమునకు, నా
యుద్యోగ మది కర్మ యోగమునకుఁ
గర్మయోగం బెంచగా జీవితానుభ
వమునకు నగు కారణములు మరియుఁ
జింతించు నరులకు నెంతే నుపకరించు
జీవితానుభవంబు గావున ధరఁ
దత పౌరుషము సార్థకత జెందుటకు గాని
దైవంబు.. నది లేక దైవబలము
కలుగునే! సోమరితనమె కలుగు, నతని
మనము దయ్యాల కొంపగా మారుఁ.. గాన
పురుషకారంబుఁ బూర్తిగాఁ బోనడంచి,
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
12.9.19
-----------------------------------------------------------
నేల విడుచుచు సామునునెపుడుజేయు
రిప్లయితొలగించండివారిపట్లను మెలకువ వలయుసుమ్ము
నింగి నెక్కగజేయగ నెనరుజూపి
దైవమునుగొల్వరాదంద్రు ధర్మవిదులు
కోరినట్టి కోర్కెలు నెరవేరకున్న
రిప్లయితొలగించండితిట్టు కొనుచనవరతము దేశమందు
సంచరించుచు నున్నట్టి జనము లన్య
దైవమును గొల్వ రాదంద్రు ధర్మ విధులు
అక్రమార్జనమును చేసి యవనియందు
తప్పులను కప్పిపుచ్చంగ దైవమునకు
కానుకలొసంగుచు సతము ఘనముగాను
దైవమునుగొల్వ రాదంద్రు ధర్మ విధులు
భక్తితో పూజ చేయంగ వలెను సతము
దైవమును, గొల్వరాదండ్రు ధర్మవిదులు
వామ మార్గము పూనుచు బలినొసంగు
మనెడు కుత్సిత యోగుల ననవరతము
sardulamu:
రిప్లయితొలగించండికైవల్యంబును గోరఁగా బుధులునే కైంకర్య ధర్మంబులన్
శైవంబున్ మరియా హరీ నలువ శ్రీ, శైలేయి,బ్రాహ్మీ నిలన్
జీవంబే యొసగే త్రిమూర్తులును నీజీవాత్మ లైయుండఁగన్
దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి