28, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3146 (చుక్కలు భూమిపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్"
(లేదా...)
"చుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

91 కామెంట్‌లు:


 1. మక్కువ మీర మందలుగ మాలున జేరుచు నుత్సవమ్మునన్
  స్రుక్కక వేచి వేచియట చూడను గోరగ మోదమొందుచున్
  చక్కని భామ లెల్లరును చారెడు మోమున,... చిత్రసీమలన్
  చుక్కలు భూమిపైవెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్


  మాలు = mall
  చుక్కలు = తారలు (సినీ)

  రిప్లయితొలగించండి
 2. మిక్కిలి యందగత్తెఁ గని మేలగు కానుక నిత్తుమంచు వా

  రెక్కువగా ప్రచారము మహీతల మంతట సేసినందునన్

  లెక్కకు మించి జేరిరటఁ లేమలు, వారిని గాంచఁ దోచెనే

  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగా

  రిప్లయితొలగించండి
 3. పెక్కువ సంబరమ్ములిడు పేరగు "నంది" యవార్డు వేడ్కలో

  మిక్కిలి సౌరు వల్వలను మిన్నగు నాభరణాలు దాల్చియున్

  జక్కటి వేదికన్ మిగుల చక్కని తారలలంకరించగన్

  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్


  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  ఎక్కడ నేర్చినారొ మన యింతులు దీర్చిరి సంకురాత్రికిన్
  చక్కని రంగవల్లులు విశాలగృహావరణమ్ములందు పల్
  చక్కని చుక్కలన్ , పరవశమ్మొనరించుచు చూచువారికిన్
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది ఇప్పటి పూరణ..

   చిక్కని హావభావముల క్షీరధిజాతగ , నద్రిపుత్రిగా,
   మక్కువ భారతీసతిగ , మా ధరణీసుత జానకమ్మగా
   నెక్కడ నేర్చినారొ నటియించుచు మా తెనుగింటి తారలన్
   చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. ఉత్పలమాల
  చక్కని సారసాక్షులకు స్పర్ధను గూర్చుచు విశ్వసుందరిన్
  దృక్కుల లోనె గాక పలురీతుల మానసమెంచి హేరమున్
  చొక్కపు వేదిపై తొడుగఁ జూడఁగ వేడుక నింగి జూరుచున్
  జుక్కలు భూమిపై వెలిగె సూర్యుఁడు చంద్రుఁడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...జూరుచున్'?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో

   ఉత్పలమాల
   చక్కని సారసాక్షులకు స్పర్ధను గూర్చుచు విశ్వసుందరిన్
   దృక్కుల లోనె గాక పలురీతుల మానసమెంచి హేరమున్
   చొక్కపు వేదిపై తొడుగఁ జూడఁగ వేడుక నింగి జారుచున్
   జుక్కలు భూమిపై వెలిగె సూర్యుఁడు చంద్రుఁడు చోద్యమందగన్

   తొలగించండి
 6. చక్కని నవరాత్రులలో
  మిక్కిలి మేకప్పు తోటి మెరుపుల వోలెన్
  చక్కగ గులుకుచు వచ్చెడు
  చుక్కలు భువి పైన వెల్గె జోద్యంబయ్యెన్.

  రిప్లయితొలగించండి
 7. చక్కనిరంగవల్లులను ,చక్కగ చుక్కల ,తోడ దిద్దగా !
  నిక్కము శోభగూర్చెనవి ,నీరసమందగజేసి భార్యలన్!
  పక్కనజేరియోర్పుగను,పాటుగ భర్తలు సేవజేయగన్
  చుక్కలు భూమిపై వెలిగె,సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 8. లెక్కకు మించి తప్పులను,లేకిగ జేసిరి పాక్కుపాలకుల్!
  నిక్కము వారితప్పులను,నేర్పుగ జూపిరి మోది,షాలిలన్
  చక్కిలిగింతలాయెనిక,చప్పగ వారల వాదనల్ వినన్
  చుక్కలు భూమిపై వెలిగె,సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 9. కందం
  అక్కడ బ్రహ్మోత్సవమన
  నక్కజముగ సూర్యచంద్రు లాహరి సేవన్
  మక్కువ నుండ తిరుమలన్
  జుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి

 10. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అక్కజ రీతినిన్ మిగుల హాయిని గూర్చెడు వంగభూమినిన్
  మిక్కిలి మోదమొందుచును మేదినిపూరు తటాకమందునన్
  చక్కగ వానలే కురియ సారస పర్ణము పైన నీటివౌ
  చుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్

  మేదినిపూరు = Midnapore

  రిప్లయితొలగించండి
 11. నిక్కముగ జేరి కాలిడె

  చక్కని చంద్రుని శిరమున జనముల్ మెచ్చన్

  దిక్కులు తెలియక చూడగ

  చుక్కలు భువిపైన వెల్గె జోద్యంబయ్యెన్

  అపోలో లో అమెరికా వారు వెళ్లి చంద్రుని పై కాలు పెట్టి దిగి చూడగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తదితరులకు మన భూమి చందమామ లాగా దాని చుట్టు చుక్కలు కనబడినవట

  రిప్లయితొలగించండి


 12. ప్రక్కన నిలబడి హ్యూస్టను
  మక్కువ మీరగ నొకరిని మరియొకరహహో
  మిక్కుటముగ మెచ్చుకొనిరి
  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. ఆకాశవాణికి పంపినది :)


  ఇక్కడ హౌడి మోడియని యిమ్మున చేరగ ట్రంపు తోడుతన్
  ప్రక్కన సంప్రముగ్ధులుగ భారత సంతతి వారలెల్లరున్
  మిక్కిలి తళ్కులీను మిరుమిట్లను గొల్పు చమక్కుతోడుగా
  చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. కం॥
  మక్కువతో బ్రతుకమ్మల

  ప్రక్క చెరువులోని రాత్రి వనితలు గలపన్

  మిక్కిలి చెరువున జూచిరి

  "చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్".

  రిప్లయితొలగించండి
 15. ఇది ఇప్పటి పూరణ :

  ఉత్పలమాల
  అక్కడ బ్రహ్మదేవుడొగి యంబుజనాభుని సేవ నుండగన్
  దిక్కుల నెల్ల కాంతిమయ దీపములో యన నింగి జారుచున్
  జుక్కలు భూమిపై వెలిగె! సూర్యుఁడు చంద్రుఁడు చోద్యమందగన్
  మక్కువ మీర తిర్మలకు మాధవ వాహన శ్రేణిఁ జేరెడిన్

  రిప్లయితొలగించండి
 16. ( దసరా ఉత్సవాలలో మైమరపించే కాంతులతో దర్శన మిస్తున్న మైసూరు మహారాజమందిర దీపాలంకరణ )

  మిక్కుటమైన వేడుకల
  మేలిమి మైసురు రాజమందిరం
  బక్కజమైన దీపముల
  నందము చింద నలంకరింపగా
  నెక్కడ గాంచినన్ ముదము
  నిచ్చెడి తళ్కుల బెళ్కులీనుచున్
  చుక్కలు భూమిపై వెలిగె ;
  సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్ .

  రిప్లయితొలగించండి
 17. ఎక్కడ గానమిట్టివిప రీతపు బుద్ధిని పెద్దలందరున్
  చక్కని పంటభూములను జప్తుల జేయగ నెంచుచీ గతిన్
  చుక్కల నింపి మెండుగను జుర్రుకు జూచెడి రీతులన్ గనన్
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్
  (AP లో చుక్కలభూముల వివాదం)

  చక్కని వేణు నాదమది జక్కిలిగింతలు బెట్ట గోపికల్
  పెక్కురు గూడుచున్ వెదక ప్రేమలు మీరగ నచ్చటచ్చటన్
  చక్కగ నారి,నారికిని సంతస మేర్చుచు కృష్ణుడుండగన్
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మొదటి పాదంలో యతి విషయంలో సందేహం!

   తొలగించండి
  2. రీ యతి కుదరదా? పెద్దలు జెప్ప ప్రార్థన🙏

   తొలగించండి
 18. చక్కగ చెప్పిన వెంటనె
  దుక్కడు కూర్చుని చదువగ ధుమధుమ పడకన్
  గ్రక్కున జూచిన తల్లికి
  చుక్కలు భువిపైన వెల్గె చోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 19. చక్కని చిన్ని పిల్లలతి చక్కని బట్టలయందు వేగిరన్

  త్రొక్కిస లాడుతూ వెతలు త్రోలుతు పక్కని చిన్న స్టేజుపై

  నిక్కపు ఫ్యూచరున్ మదిని నింపుతు చెంగున గంతు లేయగా

  *చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'త్రొక్కిస లాడుచున్... త్రోలుచు ప్రక్కన... నింపుచు.." అనండి.

   తొలగించండి
 20. మక్కువ మీరగ బాలిక
  చక్కగ దివ్వెలను పేర్చి సాయిని గొలువన్
  చెక్కిలి జారెడి నీరపు
  జుక్కలు భువిపైన వెల్గె జోద్యం బయ్యెన్

  యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

  రిప్లయితొలగించండి
 21. మక్కువ గొల్పు విధంబున
  చక్కని నాట్యము ను సల్పు చా న ల గనుచున్
  గ్రక్కునఁ న ని యె నొ కండి టు
  చుక్కలు భువి పైన వెల్గె చోద్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 22. అమెరికాలో చూసిన ఘటన

  చిక్కని పాలతొ వేడిగ
  చక్కని కాఫీని యిచ్చి పక్కన నిలిచే
  అక్కడి భర్తల గనగా
  చుక్కలు భువి పైన వెల్గె చోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాలతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'కాఫీని + ఇచ్చి' అన్నపుడు యడాగమం రాదు. 'నిలిచే' అనడం వ్యావహారికం.

   తొలగించండి


 23. తక్కువ చేసి చూడవల దమ్మ జిలేబి విశాల మైన యీ
  చిక్కటి చీకటుల్ వరుస చిత్రము లైవెలుగొందు తారలున్
  మక్కువ మీరు రీతి పరమాత్ముని లీలలు చూడ నిక్కడే
  చుక్కలు, భూమి, పై వెలిఁగె సూర్యుఁడు, చంద్రుఁడుఁ జోద్యమందఁగన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. పెక్కురు నటీమణు లచట

  మొక్కలు నాటంగ దలచి ముదమున జేరన్

  చక్కెర బొమ్మల గాంచగ

  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 25. చక్కగ లేచిన వెంటనె
  పక్కలు సర్దిన మగణ్ని మరిమరి గనుచూ
  దిక్కులు పోయిన భార్యకు
  చుక్కలు భువి పైన వెల్గె చోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 26. దిక్కులు పిక్కటిల్లునటు దివ్య శరమ్ముల వృష్టి సల్పగన్
  చిక్కిడి దానవాధముడు శ్రీహరి ధాటికి గూలె నంతటన్
  మొక్కిరి లోకులందరును మోదముగా నిడి దీప హారతుల్
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్
  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
 27. ఆకాశవాణి లో నేడు ప్రసారమైన నా పూరణం

  రక్కసి మూకలన్బడక రాతిరియున్ పవలున్ కళాత్ములై
  చిక్కులు లేకయే చలనచిత్ర నటీమణు లెందఱెందరో
  చుక్కలు భూమిపై వెలిగె; సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్
  ఫక్కున నవ్వె శంకరుడు ఫాల త్రినేత్రము చల్లనై చనన్.

  రిప్లయితొలగించండి
 28. వచ్చే వారం ఆకాశవాణి వారి సమస్య

  మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

  రిప్లయితొలగించండి
 29. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
  "మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో"
  మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించండి
 30. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చక్కటి బ్రహ్మోత్సవములు
  మక్కువతో జూడగోరి మాలిమి తోడన్
  పెక్కగు వేల్పుల తారల
  చుక్కలు భువిపైన వెల్గె చోద్యం బయ్యెన్.

  రిప్లయితొలగించండి
 31. చక్కని బొట్టుల సీసా
  దిక్కులు చూచుచు తెరువగ తిరగబడుటచే
  చిక్కని తళుకుల తిలకపు
  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 32. దినమొక ప్రశ్న నిచ్చునట వేకువ ఝామునె వెబ్బు సైటులో

  తనదొక రీతి తీర్ప కడు దారుల నెందరొ తేర్చు చుండగా

  మనది కుటుంబమంచు మరి శంకరు డెప్పుడు తోడు నుండగా

  మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది. కాని ఇది మన శంకరాభరణాన్ని ప్రస్తావించింది కనుక ఆకాశవాణికి పంపితే స్వీకరిస్తారో లేదో?

   తొలగించండి
 33. అక్కటయేమిచిత్రమదియంబరమందునవెల్గునట్టియా
  చుక్కలుభూమిపైవెలిగె,సూర్యుడు చంద్రుడుచోద్యమందగన్
  జీక్కెనుజంద్రయానమటశీతమయూఖునిపార్శ్వమందున
  న్నక్కట శాస్త్రవేత్తలికయాయతరీతినినేమిజేతురో

  రిప్లయితొలగించండి
 34. కం.
  టక్కరి చేష్టల ముక్తికి
  పక్కాగా యుక్తి పన్ని పట్టిరి భటులున్
  మక్కెలు విరుగగ తన్నిన
  చుక్కలు భువిపైన వెల్గె చోద్యంబయ్యెన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 35. చక్కదనాల వెండితెర చానలు చేరగనొక్క వేదికన్
  పెక్కురు ప్ర్రేక్షకావళుల పెంపగు సందడి పెచ్చరిల్లె న
  ల్దిక్కుల మిన్కుమిన్కుమని దీపపు తోరణ కాంతులీనగా
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 36. చక్కనిచుక్కచిక్కనగు చక్కిలిగింతల సోయగాలతో
  నొక్కతెరంగుజూసి నను నుక్కిరి బిక్కిరి చేసె నక్కటా
  చొక్కపు మేనివంపులకు సొక్కెను నామది యగ్గలమ్ముగా
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 37. చక్కని చుక్కలు పెక్కురు
  నక్కజముగ వేది పైన నటునిటు గ్రాలన్
  చొక్కఁపు తళుకుల బెళుకుల
  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 38. చక్కగఁ గృత్రిమ ఘనములు
  వెక్కసముగఁ జల్లి రయ్య విన్నున నా లో
  నక్కపటపు విధి నీరపుఁ
  జుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్


  ఒక్కెడ నాది శంకరున కొక్కతి యీయదు కాయ నొక్కటిం
  దక్కఁగ నంతటం గనక ధార యనన్ స్తుతి నాలపించఁగా
  నక్కజ మంతఁ దత్క్షణమ యభ్రపు మండలు కెంపు వర్ణపుం
  జుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్

  రిప్లయితొలగించండి
 39. మక్కువతో బాలలచట
  యక్కడ అచ్చెరువుతో అవనిపై చూడగ
  చక్కని ఖగోళ వింతల
  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్

  చిన్న పిల్లలు మక్కువతో planetarium కి వెళ్లనప్పుడు వారికి ఆ చుక్కలు, ఖగోళ రహస్యాలు అన్నే భూమి పైననే కనిపించాయి అని నా భావన

  రిప్లయితొలగించండి
 40. టక్కున జారెన్ నాకస
  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్
  అక్కట! దేవతలెల్లరు
  నక్కడ మానస సరసున స్నానంబాడెన్౹౹

  రిప్లయితొలగించండి
 41. చక్కని చీరలన్ దొడిగి సందడి చేయగ చిత్ర నాయికల్
  చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమొందగన్
  చిక్కును సోయగమ్ములని చేరిరి ప్రాయపు వారు సందెలో
  చిక్కులు వచ్చె బంటులకు చేయ ప్రజాళికి సేవనమ్ములన్

  రిప్లయితొలగించండి
 42. చుక్కలె సినిమా తారలు
  మక్కువతోవారువచ్చిమాలును దెఱువన్
  చక్కటి సొగసులు గలయా
  చుక్కలు భువిపైన వెల్గె జోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 43. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  చుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు
  చంద్రుఁడుఁ జోద్యమందఁగన్

  సందర్భము: వినత పుత్రుడైన గరుత్మంతుడు తన తల్లి సవతి తల్లి కద్రువ వద్ద దాస్యం చేస్తుంటే విడిపించేందు కేం చేస్తే సరిపోతుం దని కద్రువ నడిగాడు. దేవలోకంనుంచి అమృతం తెచ్చి యివ్వా లన్నది ఆమె. గరుడుడు స్వర్గం చేరుకొని ఇంద్రుని భటుల నోడించి తన రెక్కల గాలితోనే ఇంద్రుని వజ్రాయుధాన్ని ఎగురగొట్టి అమృత కలశాన్ని తెచ్చి దర్భలమీ దుంచి కద్రువ కప్పజెప్పి స్నానం చేసి శుచిగా సేవించండి అని వెళ్లిపోయాడు. దాస్యంనుంచి వినత విడిపించబడింది.
  ఐతే స్నానానికి వెళ్లిన వాళ్ళు తిరిగిరాక ముందే దేవేంద్రుడు వచ్చి కలశాన్ని ఎత్తుకుపోయాడు. కొన్ని చుక్కలు భూమిపై దర్భలమీదపడి మెరుస్తూవున్నాయి. కద్రువ సంతానమైన నక్కి నక్కి చూస్తున్న పేరాశ గల కొన్ని నాగులు స్నానం గీనం అక్క ర్లే దని గబుక్కున వచ్చి ఆ చుక్కలను నాకబోగా దర్భల పోచలు పదునుగా వుండటం వల్ల నాగుల నాల్కలు రెండుగా చీలినవి. అందుకని సర్పాలను ద్విజిహ్వు లంటారు..
  అమృత బిందువులు సోకడంవల్ల దర్భలు పవిత్రములైనవి. పితృకార్యాల్లోను శుభకార్యాల్లోను వాటి కెంతో ప్రాధాన్య మేర్పడింది.
  పేత్వము= అమృతము
  పవి= వజ్రాయుధము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  రెక్కల గాలి నింద్రు పవి
  లేచిపడన్ ఖగరాజు పేత్వమున్
  జక్కగఁ దెచ్చి యుంపగఁ గు
  శంబుల.. దొంగిలె వజ్రి.. జారి, యా
  చుక్కలు భూమిపై వెలిఁగె,
  సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్
  నక్కిన నాగులున్ వెడలి
  నాకగ దర్భలఁ జీలె నాల్కలున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  28.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 44. చక్కగ నొక్క వేడుకను సందడి జేయగ నద్భుతమ్ముగన్
  చెక్కిన బొమ్మలౌ చలన చిత్రము లందున నాయకీ మణుల్
  పెక్కురు రాగ జూచుచును పేర్మిని దల్చిరి పౌరులిట్టులన్
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు జంద్రుడు చోద్యమందగన్.!!!

  రిప్లయితొలగించండి
 45. తిక్కగజేయు పాలనకు, తీర్పునుజెప్పెడురీతి నిద్ధరన్
  లెక్కగ పంచభూతములు,లేశమునైనను లెక్కబెట్టకన్
  మిక్కిలి బాధపెట్టినవి,మించుగ వానల ముంచి రాష్ట్రమున్
  చక్కగ పాలనమ్మునిక, చారుతరమ్ముగజేయమంచు నా
  చుక్కలు భూమిపై వెలిగె,సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 46. చక్కని చుక్కలై వెలుగు, చానలు నీభువి తారహారముల్!
  మిక్కిలి ప్రాభవమ్ముగొని, మీటిరి గుండెల వీణలన్నిటిన్
  చక్కగ పాత్రలన్నిటిని, జాణతనమ్మునునింపిజేయగా
  చుక్కలు భూమిపై వెలిగె,సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 47. . *శ్రీ గురుభ్యో నమః*
  శంకరాభరణం-సమస్యాపూరణం
  సమస్య ::
  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్య మందగన్.
  సందర్భము ::
  “దేహత్యాగం చేసిన మన సోదరి సతీదేవియే పార్వతిగా జన్మించి ఇప్పుడు పరమేశ్వరుని పెండ్లియాడేందుకు సిద్ధంగా ఉంది.
  ఆ పెండ్లి సంబరాలను చూచేందుకు మన మందఱం పోదాము” అని కలసి మాట్లాడుకొనిన అశ్విని భరణి కృత్తిక మొదలైన దక్షపుత్రికలు వెంటనే హిమవంతుని నగరానికి చేరుకొన్నారు. దివినుండి భువికి అవతరించి భూమిపై వెలిగిపోతున్న ఆ నక్షత్రాలను (చుక్కలను) సూర్యుడు చంద్రుడు వింతగా చూడసాగినారు అని చెప్పే సందర్భం.
  పూరణ ::
  నిక్కము సోదరీమణి జనించెను పార్వతిగా, మహేశ్వరున్
  చక్కగఁ బెండ్లియాడు నట సంబరమున్ గన పోద మంచు పెం
  పెక్కిన ప్రేమ తార లదె వేగ హిమాలయ సీమ జేరగా
  చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్.
  కోట రాజశేఖర్ నెల్లూరు 28.9.2019

  రిప్లయితొలగించండి
 48. బక్కటి రైతు సాగుబడి భారము గా తలపోయ పైసకై
  దిక్కయె "రైతుబంధు" చెయి ద్రిప్పగ కొంతలొ కొంత బాసటై
  చక్కగ" మేడిగట్టు"జల జాలులు నేలను బార యెండలో
  చుక్కలు భూమి పై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

  రిప్లయితొలగించండి
 49. కం.
  చక్కని భామలు బెట్టగ l
  చిక్కిన బియ్యపు వడియము జిలుగుల చీరన్ l
  మక్కువగా గనినప్పుడు l
  చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్ ll

  రిప్లయితొలగించండి
 50. మొదటిsaరి ప్రయత్నం ..
  మా గురువుల సహకారంతో


  ఇక్కడె నున్నది షాపని
  చక్కగ కొనుటకు వెళితిని *సతికై వలువల్*
  నక్కడ ధరలను జూడగ
  చుక్కలు భువిపైన వెల్గె జోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 51. చక్కని యుడుపులు దాల్చుచు
  నక్కర తో బాలికలట నాడుచు నుండన్
  మక్కువతో పల్కిరి ప్రజ
  చుక్కలు భువి పైన వెల్గె చోద్యంబయ్యెన్.

  అక్కడ తోడను మగువలు
  చక్కగ పండుగల యందు సంతోషముతో
  మక్కువ తో ముగ్గులిడగ
  చుక్కలు భువిపైన వెల్గె చోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 52. దక్కగ బువ్వ యెల్లరకు, దండిగ చెర్వుల ద్రవ్వినంతటన్

  చుక్కల దారిలోన జను చుండెడి వారలు గాంచ నీరమున్

  జక్కని కాంతి పుంజముల చందము మైమరిపించెనే భళా

  చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!

  రిప్లయితొలగించండి