29, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3147 (ఏడ్పే యిష్టమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్"
(లేదా...)
"ఏడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

69 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  అమిత్ షా ఉవాచ:

  కడ్పుల్ కాలగ రాజకీయమునయో కష్టమ్ములే వచ్చెనే
  వడ్పప్పుల్ తిను కాల మాదటను భల్ పార్పోవగా నిచ్చటన్
  గాడ్పుల్ మారగ రాహులయ్య నికనీ కాంగ్రేసు పార్టీకహో!
  ఏడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాంగ్రెస్ పార్టీకి ఏడ్పును మాత్రమే మిగిల్చారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   వడపప్పు -> వడ్పప్పు; పారిపోవు -> పార్పోవు... ప్రయోగాలు సాధువులు కావనుకుంటాను.

   తొలగించండి
  2. 🙏

   ఏమ్చేయను సార్! కష్టమ్ములే వచ్చెనే!

   తొలగించండి

 2. ఏడ్పన తెలియని అయ్యరు
  ఏడ్పుల పెడబొబ్బల సతినే తాళుటకై
  యేడ్పును హత్తుకొనిరి! నా
  కేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్


  జిలేబి

  కంది వారు సెలవా ఇవ్వాళ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఎక్కడికీ వెళ్ళేది లేదు.. కాని ఒంట్లో కొద్దిగా నలతగా ఉంది. (అన్నట్టు ఈ సమస్యను వారం క్రితమే షెడ్యూల్ చేసాను)

   తొలగించండి
 3. ఏడ్పది శిశువుకు బలమట
  కడ్పున గలశిశువు పుట్టి కల్పము పైతా
  నేడ్పందుకొనిన చాలును
  ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణం.. సమస్యాపూరణం

  ఏడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్ !

  *ఇద్దరిదీ* 😀😂

  ఊడ్పన్ జాలను పంతమూన కనునీరొల్కన్ , ముఖంబందునా
  మాడ్పున్ జూడగలేను దక్కనిదె ., మా మన్మండు , నెట్లైన దా
  నేడ్పున్ నేర్పున కళ్లజోడు గొను నన్నేమార్చి , యేమందు?నా
  యేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్ !

  ( ఏమందున్ *ఆ యేడ్పే* )
  ( ఏమందు? *నా యేడ్పే*)

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 5. గాడ్పుల్ తేలగ బీల్చి బీల్చి యెద పోగాలమ్ము సూచింప నా
  కేడ్పే దిక్కని నొవ్వజేయుచు కనుల్ కీలాల వర్ణంబుగా
  యీడ్పుల్లాడగ వేగ వేగముగ నా యిష్టమ్ములే తీర నా
  కేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్!

  పెన్మిటి కరుగు నేడ్వంగ నేడ్వంగ నే :)

  జిలేబి

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  జడ్పుంజెందితి కోర్టులన్నిటను నే ఝాడించి వాదింపగన్
  కుడ్పన్ జాలను కోటి రూప్యములిటన్ కూర్పించి సాధించుచున్
  కడ్పే కాలె తిహారు జైలున విధీ! కళ్ళందు నీరొల్క నా
  కేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్

  రిప్లయితొలగించండి
 7. కుంతీదేవి మనోరథము
  ఏడ్పది దించును భారము
  యేడ్పే చిత్తమునశుద్ధి నేర్పడజేయున్
  యేడ్వగ దేవుడు బల్కును
  యేడ్పే యిష్టమ్ము నాకదే మోదమ్మిడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ పాదమున
   తోడ్పడు దేవుడు యేడ్చిన యని చదువ ప్రార్ధనౌక

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...భార। మ్మేడ్పే... దేవుం డేడ్చిన । నేడ్పే...' అనండి.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా!సవరించెదను!

   ఏడ్పది దించును భార
   మ్మేడ్పే చిత్తమునశుద్ధి నేర్పడజేయున్
   తోడ్పడు దేవుండేడ్చిన
   నేడ్పే యిష్టమ్ము నాకదే మోదమిడున్

   తొలగించండి
 8. ఏడ్పన నెవ్వరి కిష్టము?
  దర్పము లేక పరిపరి వ్యధల తీర్చెడి కం
  దర్పుణి చరణముల కొఱకు
  ఏడ్పే ఇష్టమ్ము నాకదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 9. గాడ్పున నన్నియు బోగా
  తోడ్పడు వారే కరువగు దుస్థితి లోనన్
  ఏడ్పే గద మిగిలెను విను
  మేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 10. ఏడ్పన నెవ్వరి కిష్టము?
  దర్పమొదలి బాల్య మిత్రులందరి తోడన్
  నేర్పుగ గతమును నెమరెడి
  ఏడ్పే ఇష్టమ్ము నాకదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 11. ఏడ్పన నెవ్వరి కిష్టము?
  ఓర్పును బెంచుచు మరిమరి లోపల నాలో
  కార్పణ్యము ద్రుంచెడి నీ
  యేడ్పే ఇష్టమ్ము నాకదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 12. ఏడ్చుచు వచ్చెడి శిశువులు
  ఏడ్పించెదరుగద బాల్య మిడువరకెపుడున్
  ఏడ్పింతురు తుది దశలో
  ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్!!

  రిప్లయితొలగించండి
 13. గాడ్పుద్ధతితోగోకలు
  గార్పణ్యముబుట్టచెలియకాగ్రహమయ్యెన్
  దోడ్పోవనూతిదోయగ
  "ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్"

  రిప్లయితొలగించండి
 14. ఏడ్పును గూడను నొకకళ
  యేడ్పేయిష్టమ్ము నాకదేమోదమిడున్
  నేడ్పును వినినటకుంజని
  యేడ్పునకున్దీటునటుల నేయుదుజిందుల్

  రిప్లయితొలగించండి
 15. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  *"ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్"*

  సందర్భము: మనకు కలిగే సుఖాల అనుభవాలు (కుడుపులు) తాత్కాలికమైనవే! శీతల పవనా లని భావిస్తాం కాని చివరి కవి వడగాడుపులే! ఎందుకంటే అవి దేవుని పూర్తిగా మరపించి శాశ్వతమైన దుఃఖంలో పడిపోయేటట్టు చేస్తాయి..
  కష్టాలు మాత్రం భగవంతుని స్మరించేటట్టు చేస్తాయి. భగవంతునికి నమస్కరించేలా అతణ్ణి శరణు వేడేలా చేస్తూ భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తాయి. క్రమంగా శాశ్వతమైన సౌఖ్యాన్ని చేకూరుస్తాయి.
  అందుకని కష్టాన్నే ఇష్టపడాలి. అదే నిజమైన మోదము నిస్తుంది.. అని భాగవతంలో కుంతీదేవి మొదలైన వారి ప్రార్థనలవల్ల అర్థమౌతుంది.

  కుడుపు లేదా కుడ్పు= అనుభవం
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కుడ్పులు సౌఖ్యములవి వడ
  గాడ్పులు.. ప్రభుని మరపించుఁ గద! తనకై కై
  మోడ్పులకున్ గారణ మగు
  నేడ్పే యిష్టమ్ము.. నా కదే మోద మిడున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  29.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 16. కడ్పున బుట్టిన సంతతి
  యేడ్పులవి యెపుడును ముడ్పు లెంతనియే, కై
  మోడ్పుల విష్ణుని వేడెద
  ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేడెద నేడ్పే...' అనండి.

   తొలగించండి
  2. 🙏
   కడ్పున బుట్టిన సంతతి
   యేడ్పులవి యెపుడును ముడ్పు లెంతనియే, కై
   మోడ్పుల విష్ణుని వేడెద
   నేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

   తొలగించండి
 17. వేర్పడు దూరము గని యో
  దార్పు వలదు వలదనుచును ధారగ వరదల్
  కార్పగ విరహము జూపే
  యేడ్పే ఇష్టమ్ము నాకదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 18. తోడ్పడమని ధీవుని కై
  మోడ్పున గోర, వరమీయ మోదము గూర్చన్
  కూడ్పుడగ చంటి పిల్లడి
  యేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తోడ్పడుమని దేవుని..' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 19. షార్పగు సూది తగిలి యో
  దార్పుకు లొంగక మరిమరి తాతా యనుచున్
  ఆర్పుతు చేరిన మనుమని
  యేడ్పే ఇష్టమ్ము నాకదే మోద మిడున్

  ఆర్పుతు .. అరుస్తూ

  రిప్లయితొలగించండి
 20. ఊడ్పించెద వలువల నని
  యీడ్పించెను నాడు చెనటి యెట్టుల మరతున్
  దోడ్పడకుము సంధి కతని
  యేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్
  (రాయబారానికి వెళ్ళే ముందు ద్రౌపది కృష్ణునితో)

  రిప్లయితొలగించండి
 21. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

  *"ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్*

  నేటి తరం పిల్లల్ని ( *అన్నీ తరాలు అంతే అనుకోండి* )
  దృష్టిలో ఉంచుకుని సరదాగా రాసినది ..

  బయట తినడం కోసం ఏడ్చి సాధించాలని అనుకొనే మనస్తత్వం మీద ��������

  *కడ్పున నాకలి పుట్టగ*
  *చప్పున తినుటకు నిచ్చును చప్పిడి వంటల్*
  *నప్పుడు విందుల కొరకున్*
  *"ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. ఏడ్పున్నేడ్చెడువారుచెప్పుదురహోయీమాటలన్దాగా
   నేడ్పేయిష్టమటంచుజెప్పెదనదేయెంతేనిమోదంబిడున్
   నేడ్పుల్గూడనునొక్కవిద్యయెసుమాయీలోకమందున్గనన్
   నేడ్పుల్నేడ్చుచసాజమేకద యిలన్నింతుల్ గృహంబందునన్

   తొలగించండి
 22. గాడ్పే వేసవి ని వలయు
  ఏడ్పే మరణ సమయ ము న నెక్కువ యగు న్
  ఏడ్పే శిశువు ల కంద muw
  ఏ డ్పే యి ష్ట మ్ము నా క దే మోద మిడు న్

  రిప్లయితొలగించండి
 23. ఉడ్పగ క్షుద్బాధలు క
  న్మోడ్పెఱుఁ గక యుండ నిరతమున్ నిట్టూర్పుల్
  కడ్పది నిండని చో నీ
  యేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్


  తూడ్పన్ మేలగు దుష్ట చింతనలు నిన్దూఱంగఁ జేయంగఁ గే
  ల్మోడ్పుల్ వారికి మేలు సుమ్ము మఱి యారోగ్యంబు నీ కింతగాఁ
  దోడ్పా టుండఁ జెలంగఁ జిత్తమున సంతోషంబు క్షీణంబు కా
  నేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్

  రిప్లయితొలగించండి
 24. గురువు గారికి నమస్సులు.
  పూడ్పం గలేని వేదన
  కడ్పున గలదను విరోధి గడబిడ సేయన్
  తోడ్పాటు యివ్వగా తా
  ఏడ్పే యిష్టము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 25. ఏడ్పుతొ వచ్చెడి శిశువులు
  ఏడ్పించెదరుగద బాల్య మిడువరకెపుడున్
  ఏడ్పింతురు తుది దశలో
  ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్!!

  --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  ****సవరణతో...

  రిప్లయితొలగించండి
 26. గాడ్పులు వానలు వరదలు
  ఏడ్పించగసకలజనులనెన్నోరీతుల్
  యేడ్పులె పరిపాటయ్యెను
  ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 27. తోడ్పాటున్బలరామదేవుడొసగన్
  దొంగాటలన్దృళ్ళి కై
  మోడ్పుల్గాంచక గోపికావసనముల్ మోసంబునన్దాచి,తా
  నేడ్పున్నమ్మకమొప్పునట్లు నటియిం
  చెన్ కృష్ణుడున్ తల్లితోన్
  యేడ్పేయిష్టమటంచు జెప్పెదనదే
  యెంతేని మోదంబిడున్.

  రిప్లయితొలగించండి


 28. (ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు )
  తోడ్పాటై చరియించుచుండును గదా
  దుర్వారశౌర్యుండునై
  చేడ్పాటుం గలిగింప పాండవుల కా
  శ్రేష్ఠుండు రాధేయుడే !
  మాడ్పంజేయుదునయ్య ! నమ్ము మిక నా
  మాటల్ ; సదా వారిదౌ
  యేడ్పే యిష్ట మటంచు జెప్పెద ; నదే
  యెంతేని మోదంబిడున్ .

  రిప్లయితొలగించండి

 29. గాడ్పుల వలె పెను బాధలు,
  తోడ్పడగను హితుల లేమి తొలచగ మదినే
  గాడ్పంపగ వెస వచ్చెడి
  యేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి
 30. దశరథ మహారాజు వశిష్టుల వారితో...

  శార్దూలవిక్రీడితము

  తుడ్పన్ భార్యల కంటి నీరు, సతులున్ తోషమ్మునన్నుండ కై
  మోడ్పుల్ జేతు వశిష్ట మౌనులకు మాముందున్న పుత్రేష్టినిన్
  దోడ్పాటంద నయోధ్యనన్ జరుపుమా! దోగాడు పుత్రాళిదౌ
  యేడ్పే యిష్టమటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్

  రిప్లయితొలగించండి
 31. ఏడ్పున కలుగును బలమని
  యేడ్పే దివ్యౌషధ మని నెరుగుచు నిలలో
  నేడ్పున తొలగును వెతలని
  యేడ్పే యిష్టమ్మునాకదే మోదమిడున్
  [
  తోడ్పడు వారలు లేకను
  గాడ్పును విడుచుచు సతతము గడపగ బ్రతుకున్
  తోడ్పడు నిదియే సఖుడై
  యేడ్పే యిష్టమ్ము నాకదే మోదమిడున్
  [

  రిప్లయితొలగించండి
 32. తోడ్పాటు లేక వెచ్చని
  గాడ్పులు సంసారమందు కన్పడు చుండన్
  కడ్పున కన్న శిశువు దౌ
  యేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి


 33. ఏడ్పుల నే బుట్టితి నా
  కేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్
  ఏడ్పుల నన్నంపించిరి
  ఏడ్పేరుల దాటి బోవ నేడొ తెలియదే !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. గాడ్పులదిరిగెడు శిశువుల
  ఏడ్పేగద మాతృమూర్తి కెక్కుడుబాధౌ
  ఊడ్పుల ముంచును కనులన
  ఏడ్పే ఇష్టమ్మునాకదే మోదమిడున్

  రిప్లయితొలగించండి
 35. ఏడ్పున బుట్టిన శిశువే
  గాడ్పులలో తిరిగితిరిగి గాసిలబడగా
  ఊడ్పుల నూదెడు తల్లుల
  ఏడ్పే ఇష్టమ్మునాకదే మోదమిడున్

  రిప్లయితొలగించండి
 36. గాడ్పుల్ వీచుచు వానలే కురిసె పోగాలమ్మె తా జేరెనో
  యేడ్పే దిక్కయె క్షేత్రకృత్తుకని సౌహిత్యమ్ముతో నేతలే
  తోడ్పాటందగ జేయ వచ్చిరని సంతోషమ్ము తో యంటినే
  యేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్

  రిప్లయితొలగించండి
 37. జన సేమము కొరకు పాటు పడే పాలకుని మానసం...

  కందం
  జడ్పున ప్రతిపక్షాలకుఁ
  గడ్పుల్ జన సేమముఁగని కాలున్! గష్టా
  లూడ్పెడు పాలన, వారల
  కేడ్పే, యిష్టమ్ము నా కదే మోద మిడున్

  రిప్లయితొలగించండి