6, డిసెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3212 (కోడిని మ్రింగినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్"
(లేదా...)
"కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"

44 కామెంట్‌లు:



  1. వేడిగ నడిరేయినటా
    ఝాడించుచువేయగాను జల్ది పకోడీల్
    మేడము జిలేబి యేను, ప
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    కూడుచు బంధు మిత్రులుగ కూరిమి మీరగ ముంబయందునన్
    తాడన మొంద నెన్నికల తాళగ జాలక తన్నులన్ భళా
    మాడిన మోముతో చెలగి మంచము నెక్కెడి యుద్ధమందునన్
    పోడిమి మీర సైనికులు పూర్తిగ మ్రింగిరి భాజపానహో:👇
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దీది vs దాదా (2011):

    కూడుచు వంగదేశమున క్రూరులు కొందరు చీని భక్తులై
    బోడిగ జేయ రాష్ట్రమును బొంకుల దిబ్బగ వేగిరమ్ముగా
    నాడుచు పాడుచున్ మమత హాయిగ మ్రింగెను కమ్యునిస్టులన్: 👇
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్

    రిప్లయితొలగించండి
  4. సరదాగా రాసిన పూరణము 🙏

    ఆడిన యాటను గెలువగ
    మూడును లెగ్ పీసులనుచు ముచ్చట గొలఁపఁన్
    ఓడిన వారల పోటీ
    కోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్!
    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేడిగ నూనెను వేయగ
      మాడిన వా ముక్కలనుచు మాయలు జేయఁన్
      మాడిన వొదిలి మిగిలిన ప
      కోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్
      🙏🙏

      తొలగించండి
    2. *3:*
      దాడిని చేసిన రేటున
      గూడా నే తినగ తలచి గుట్టుగ నింటన్
      వేడిగ జేసిన యుల్లి ప
      కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్

      కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి

      తొలగించండి
    3. *4:*

      మోడీ జోరుగ వచ్చిరి
      కేడీ పాక్ నొదలఁననుచు కేరింత లతోన్
      వీడను యా దేశమని, బ
      క్కోడిని మ్రింగిన, ది (the) కోడి కోపింప జనుల్!

      *కళ్యాణ్ చక్రవర్తి*

      తొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    __________________________

    మాడినవని మగడొసగిన
    మాడువు పై నుండి విసరె - మంజుల యంతన్
    మాడిన కడుపున వడిగ, ప
    కోడిని మ్రింగినది కోడి - కోపింప జనుల్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. కూడి పురజనం బెల్లరు
    వాడిగ చర్చించ రచ్చబండకు జేరన్
    తోడుగ తెచ్చిన వేడి ప
    కోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    యిట్లన నమ్ముట కష్టమయ్యెడిన్ :
    __________________________

    కోడెను కోడె కుమ్మెనను - కున్నను సత్యము యౌవనంబునన్
    గూడును పక్షి వీడెనను - కొన్నను తప్పదు రెక్క హెచ్చుటన్
    ఏడను లేని వింత గద - యిట్లన నమ్ముట కష్టమయ్యెడిన్
    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁ - గొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-2)
    కంఠపు ఘాతము దొంగ కత్తితోన్ కోడినిఁ గోడి మ్రింగె :
    __________________________

    కోడిని పందెమున్ పనుప - కుక్కుట పాళులు మెట్ట నేల పో
    ట్లాడెడి చోటు జేరి మహ - లావగు కోడిని పందెమొడ్డ యు
    ద్గాఢపు పోరునన్ సమసె - కంఠపు ఘాతము దొంగ కత్తితోన్
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁ - గొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓడిన కోడిని
      గెలిచిన వాడూ, వాడి కోడీ, మిత్రులూ కలసి తినేస్తారు కాల్చుకొని :

      తొలగించండి


  9. బాడబు డొక్కడచ్చట సభాస్థలి లోనవధానమందు జీ
    రాడు విధమ్ము చప్పున వరానన యోచన తోడుగాను కో
    రాడెడు రీతి నీ విధము రావడి చేయు సమస్య నిచ్చెగా
    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ఆడుది కన్నులంబడ మృగాకృతి దాల్చి నరాధముండు వెం...
    టాడి సుఖింపనెంచగఁ., దటాలున వాడి కటారిపోటుతో
    చేడియ చంపె , నచ్చటకు చేరినవాడొకడిట్లు పల్కెడిన్
    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
    (కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్)
    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    చంద్రుని రాకలో చల్లదనము లేదు,
    వెచ్చటి గాలులు విస్త రించ,
    విద్యుత్తు కోతతో విసుగు పెరుగు చుండె,
    చెమటలతో కల్గె చీదరమ్ము.
    దోమలు దాడితో దూరమాయె నిదుర,
    సుప్తి మెల్లగ కల్గు చుండ కీచు

    రాయి చేయుచునుండె రవము, నిదురకు భం
    గము నిడి నటునిటు కదులు చుండి
    న ఎలకోడిని మ్రింగినది కోడి కోపింప,
    జనులెల్ల మదిలోన సంత సఁబు



    బడయుచు కొనియా డెతమ పెంపుడు శిఖండి
    చేతను,ప్రతి దినము తన కూతకు నప
    వాదు వేయు జనులు నేడు మోద మొందె
    గద ననుకొనుచు యింటి పై కప్పు కెగిరె

    రిప్లయితొలగించండి
  12. ఆడుకొనంగ మేము కవు
    లందరమున్ లభియించినాము ; మో
    మోడగ నేమియున్ బలుక
    మో కవిరాజ ! మహాశయా ! యికన్
    వేడగలేము ; వేడుక లి
    వే కద మీకు ! నహా ! యెపుం డెటన్
    గోడిని గోడి మ్రింగె ? గను
    గొన్న జనుల్ వడి గోపగింపగన్ .

    రిప్లయితొలగించండి
  13. ఆడది కనబడి నంతనె
    దాడికి యత్నించు నీచ దానవుని వలె న్
    వీడక వెంట న్ బడి యా
    కోడి మ్రింగి నది కోడి కోప గించ జను ల్

    రిప్లయితొలగించండి
  14. ఏడుచు చున్నదదెందుకు
    కోడలనుచు మామ యడుగ కోమలి చెప్పెన్
    చేడియ చేసిన వేడి ప
    కోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్.

    రిప్లయితొలగించండి
  15. ఆడుచు బాడుచు జనులే
    వేడుకగా వనమునందు విందు గుడుపగా
    వేడిగ జేసిన నేతి ప
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్ !

    రిప్లయితొలగించండి
  16. కోడునుదాటిరి ఓటున
    కోడిని మ్రింగిరని జనము కోడై కూసెన్
    కోడన నేమో తెలియక
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్!!

    రిప్లయితొలగించండి
  17. కందములు:
    లేడిని సింహము జంపెగ
    వేడుక దూకియు రయమున వేదన జెందన్
    బీడుల నేమియు లేక, ప
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్"

    ఆడిరి పుంజుల పందెము
    వేడుక గట్టిరి యడిదము వేగము గెలువన్
    వాడగు గత్తుల గాయము
    కోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్

    వేడుక దిరుగుచు జొన్నల
    వాడుక గింజలు దినగను వాపోవ దనుఁన్
    మేడల నవి గానక, జే
    గోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్

    రిప్లయితొలగించండి
  18. కందం
    వేడిగ నోరూరుంచెడు
    మాడికిఁ గనువిందుఁ జేయ మనసుపడంగన్
    వైడముగ నెంగిలించి ప
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్
    (వైడము = వేగము)

    రిప్లయితొలగించండి
  19. అడవిని దిరిగెడు కక్కర
    కోడిని మ్రింగినదికోడి,కోపింపజనుల్
    మాడునకొట్టెను నొజ్జను
    గీడునుదాజేసెననుచుగేకల తోడన్

    రిప్లయితొలగించండి
  20. ఓడినవీరసైనికులు ఒంటరిగానిటువేగలేక కా
    పాడగజేరెకాంగిరెసుపాలనజేయపవారుకూటమిన్
    వేడిరి ముందుముందునట వేదికనివ్వనిభాజపాపయిన్
    కోడినికోడిమ్రింగెకనుగున్నజనుల్ వడి కోపగించగా
    ————————_______\\
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  21. పాడిన పాటబాడకను, పాలనజేయనయోధ్యగెల్వగా
    తాడిననెక్కినంత తన, తాతలునాపయి ముత్తలందరున్
    కాడినిగట్టినెగ్గినటు ,కర్మముసైనికులొద్దుపొమ్మనన్
    కోడినికోడిమ్రింగెకనుగొన్నజనుల్ ,వడికోపగించగా
    ++++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి

  22. ... శంకరాభరణం... 06/12/2019 ...శుక్రవారం

    సమస్య.
    *** *** **

    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"

    నా పూరణ. ఉ.మా.
    ** *** ***

    వీడరి న్యాయ ధర్మములు వీడరి నీతి నిజాయితీలనే

    వీడిరి సత్యమార్గమును వీడిరి శీలమె లోకవాసులే

    చూడగ వింతలే జరిగె చోద్యము; నందున నొక్కటిద్దియే


    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  23. కోడలుముచ్చటపడ తా
    వేడుకగానత్తజేసెవేడిపకోడీ
    కోడలికన్నులుగప్పిప
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్

    రిప్లయితొలగించండి
  24. మాడగజేసెగాముఖము, మారినపోకడముంబయందునన్
    వీడిరి పాతబంధమును ,విర్రగవీగగ భాజపాపయిన్
    తోడుగనిల్వగా నికను ,తోకలవోలెను సైనికేశ్వరుల్
    కోడినికోడెమ్రింగకను,గొన్నజనుల్ వడికోపగించగా
    *********************************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  25. వీడగ పాతబంధమును, వీరుల సేనలు పాలనమ్ముకై
    తోడుగనిల్వగోరగనె ,తోకలనూపుచువచ్చె కాంగ్రెసే
    వేడుకయాయెగాపవరు,వేదికనెక్కగజేసెనంతలో
    కోడినికోడిమ్రింగెకనుగొన్నజనుల్, వడికోపగించగా——————————————
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  26. పాడెనుగట్టిరేజనులు ,పాపముగానిది దల్చరెవ్వరున్
    వీడగజేసె ప్రాణములు ,వీధికినెక్కినమానవాధముల్
    వేడుకయాయెదేశమున ,వేదికగానవ పోలిసన్నలే
    కోడినికోడిమ్రింగెకనుగొన్నజనుల్ ,వడికోపగించగా
    +****+++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  27. కోడియెరాముకెన్నికలగుర్తు!యతండుపరోపకారియౌ
    కోడినివండిమద్యమిడికోడిరమేషొకవిందొసంగగా
    నోడెనురాము!యాబలపనూరునవోట్లటుదారితప్పగన్
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  28. పాడుచుఁ బాటలు త్రాగుచుఁ
    గూడి తినుచు నుండఁగా సఖులు మోదముగా
    వేడిగ నున్న వడి వడిఁ బ
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్


    వేడుక నుండ నెల్లరును వేగమ దూఱి గృహమ్ము లోనికిం
    బాడిగ ధాన్యరాశి పయిఁ బర్చగ నింపుగఁ దాటి యాకులన్
    మూడుర దాని కింక నిట ముందుగఁ బాదపు గోటిఁ దన్ని యా
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్

    [ఆకు + ఓడి = ఆ కోడి; ఓడి = నీవార ధాన్యము]

    రిప్లయితొలగించండి
  29. వాడిగవేడిగా బ్రజలవాదనలన్నియు విన్నమీదటన్
    గోడినిగోడిమ్రింగె గనుగొన్నజనుల్ వడిగోపగింపగన్
    బాడియగాదునాదెలిసెబల్కుటయిట్లని గోడీయేవెసన్
    గోడీనిమ్రింగుటేలయగు గోరుదుమిమ్ములజింతజేయుడీ

    రిప్లయితొలగించండి
  30. కోడలు యత్తపై యలిగి కొండొకచోతనమేధజూపగా
    దాడినిజేయగానికను ధారపువాహికలన్నిజూపగా
    కోడలుపైనయెంతగను కొత్తగ ప్రేమనుజూపెనత్తయే
    కోడినికోడిమ్రింగెకనుగొన్నజనుల్ వడికోపగించగా
    +++*++****+**++++++++*
    రావెలపురుషోత్తమరావు


    రిప్లయితొలగించండి
  31. చేడియ చేసిన వేడి ప
    కోడిని మ్రింగినది కోడి, కోపింప జనుల్
    తోడనె పరుగులు దీసెను
    దాడిని తప్పించుకొనగ తహతహ తోడన్.

    రిప్లయితొలగించండి
  32. పాడియెగాదుగాదుగద పాండవుపైనటయుద్ధదుందుభుల్
    చూడగభారతమ్మునను చుక్కలజూసెను ధర్మదేవతే
    నేడికభారతమ్మునను నేరములన్నియు వాటిరూపమే
    కోడినికోడిమ్రింగెకనుంగొనజనుల్ వడికోపగించగా
    ***************+**+*++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  33. ఉ:

    తాడిని తన్ను వాడి తల తన్నెడు వాడొకడుండు రీతినిన్
    గోడును గాన కుండ తమ కోరిక మేరకు కామ వాంఛలన్
    పీడన జేసి దీర్చుకొన, పిట్టల మాదిరి కాల్చి చంపగా
    కోడిని కోడి మ్రింగె, గనుగొన్న జనుల్ వడి గోపగింపగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. వేడిన నాతియే దొరక వేడుక మర్చిరి దమ్ములంచుఁనే
    ఆడిన కీచకుల్ మదన దాహము దీరగ చప్పరించగన్
    వాడిరి ఖాకియే తమకు వాలుగ దొర్కిన కాల్పులే సరన్
    కోడిని కోడిమింగె కనుగొన్న జనుల్ వడి కోపగించగా

    రిప్లయితొలగించండి
  35. కందం
    క్రీడలని వినోదించగ
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్
    కోడిని పందెముపేరిట
    నాడించగ హింసచేయు నాటలు తగదే


    రిప్లయితొలగించండి
  36. కోడిపలావు దోసెలు పకోడియు దెచ్చిరి యమ్మకానికై
    వేడిగ కోడివామనను పేదకు నాకలి వేసెనంచు నా
    మేడకు పోయి చాటుగను మిక్కిలి నేర్పుగ దొంగిలించి యా
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్.

    రిప్లయితొలగించండి
  37. ఆడది దల్చుకొన్ననిక, ఆటలు సాగవు పూరుషాళికిన్

    పాడుగనేలమారెగద,పాపపుకృత్యములెన్నొజేయగా!

    ఆడులు సిం హమై, చెలగ,అక్కరకెవ్వరు తోడురారులే

    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్"

    రిప్లయితొలగించండి
  38. చూడుము వింతగు సంగతి
    నేడొక వేడుకను జరిగె నిజముగ నిటులన్
    దాడికి దెగబడి వేడి ప
    కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుగొన్న జనుల్
    వడిఁ గోపగింపగన్"

    సందర్భము:
    వాలీ రఘూత్తమ శరాభిహతో విమృష్టో
    రామేణ శీతల కరేణ సుఖాకరేణ
    సద్యో విముచ్య కపిదేహ మనన్య లభ్యం
    ప్రాప్తం పదం పరమహంస గణై ర్దురాపమ్
    (అధ్యాత్మ రామాయణం)
    రాముని బాణంచే కొట్టబడి సర్వ సుఖ ప్రదమైన రాముని చల్లని స్పర్శచేత కపి దేహాన్ని వెంటనే వదలి అనన్య లభ్యమైన పరమ యోగిగణాలకు కూడా చేరరానిదైన దివ్యపదాన్ని వాలి పొందగలిగినాడు.
    "కిరీటి (కిష్కింధకు రాజు) యైన వాలిని యుద్ధంలో మింగి (జయించి, చంపి) తానే కిరీటి (వానర రాజ్యాధిపతి) యైనాడు సూర్య సూతి (సుగ్రీవుడు) సుజనద్వయం (మంచివాళ్ళ జంట) వాలిని కోపగించగా సుమా!" అని ఒకడు రామాయణంలోని వాలివధ ఘట్టాన్ని వివరించబోతుంటే..
    అందులోని గొప్పతనాన్ని పట్టించుకోని వాడు.. ఎప్పుడూ హాస్యోక్తులే పలికే వాడు యింకొకడు "కిరీటి" అంటే "కోడి" అని "సుజన" అంటే "జన" అని అర్థం చేసుకొని ఇది మామూలు విషయమే యన్న ధోరణిలో ఇలా అన్నాడు..
    "కోడిని కోడి మింగింది చూసిన జనాలు కోపగిస్తే.."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "నాడు కిరీటి వాలిని ర
    ణమ్మున మ్రింగి కిరీటి తానెయై
    నాడట సూర్య సూతి సుజ
    న ద్వయమౌ రఘురామ లక్ష్మణుల్
    జూడగ వాలిఁ గోపమున
    సు" మ్మనె నొక్కడు.. నొక్క డి ట్లనెన్...
    "కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁ
    గొన్న జనుల్ వడిఁ గోపగింపగన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    6.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి