1, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3296 (ముది పుణ్యపు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్"
(లేదా...)
"ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్"
(కడిమిళ్ళ వారి పాలకొల్లు అష్టావధాన సమస్య)

50 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కుదురుగ కాటువేయగను కూరిమి మీరగ జామకాయలన్
    కదులుచు నొప్పి పెట్టుచును కన్నుల నీరము తెచ్చు దంతముల్
    ముదమున రాలి పోవగను ముప్పది రెండును హాయిహాయిగా
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో పాపం! పచ్చి జామకాయ ఎవరు కొరకమన్నారు? దంతచ్యుతి హాయినిచ్చిందా? ఆహా!
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కుదురుగ కంది శంకరుని కూటమి నందున వార్ధకమ్మునన్
    ముదమున జేరి పూరణలు ముప్పది వందల పైన జేయుచున్
    చదువులు సంధ్యలన్ విడిచి చక్కగ కూర్చగ బ్లాగునందునన్
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. సదమలవృత్తిలోనొదిగి, సాధ్యముజేయుచు శాంతిసౌఖ్యముల్
      మదికదలాడగాదగును,మంచిగజీవిక సాగిపోవగన్
      కొదవదియేమియుండునిక ,కోరికలన్నియు శూన్యమైన చో
      ముది యొక పుణ్యమూలముగ, మోదమొసంగును మాటిమాటికిన్.

      తొలగించండి
  4. ( ప్రజలకు నీరిచ్చిన మన ఇంజనీరులలో
    డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు శతవసంతవైభవవిరాజితుడు )
    ముదముగ కన్నడంపు భువి
    మోక్షపుగుండపు విశ్వరయ్యయే
    ఘనుడని ఖ్యాతిగాంచెగద !
    కస్తురిభాషపు గణ్యమూర్తియై ;
    పదనుగ నూరువర్షముల
    పండుగ గైకొనె హర్షితాత్ముడై ;
    ముది యొక పుణ్యమూలముగ
    మోద మొసంగును మాటిమాటికిన్ .
    ( కస్తురిభాష - కన్నడభాషకు కన్నడ
    కస్తురి అని ప్రశస్తి )

    రిప్లయితొలగించండి
  5. పదిలము తిరిగిన యాత్రలు
    కుదురుగ నొకతావు నుండి కొసరిన పున్నెం
    బదులుగ నిచ్చును దైవము
    ముది పుణ్యము మూలమగుచు మోద మొసంగున్

    రిప్లయితొలగించండి
  6. .... శంకరాభరణం....
    01/03/2020...ఆదివారం

    సమస్య.
    *******

    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్"

    నా పూరణ. చం.మా.
    ** *** *****

    కుదురుగ యుండకే మనుసు కోర్కెలు రేగుచు మిక్కుటమ్ముగన్

    కుదరదు మోక్షమొందగను గొల్చుచు దైవము యౌవనమ్మునన్

    ముదిమి నశించి గోర్కెలును బూజలు నీశుకు జేయ వీలగున్

    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్"


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  7. ముదమును మూటగట్టుచును,ముందుతరాలకు మార్గదర్శిగా
    పదునుగభక్తిభావముల,పావన ధాత్రినబెంచమేలగున్
    కుదురుగపాలనమ్మునిక,కుళ్ళు కుతంత్రము లేని చోటులన్
    ముది యొక పుణ్యమూలముగ, మోదమొసంగును మాటిమాటికిన్.

    రిప్లయితొలగించండి
  8. ముదముగ కందిశంకరులు, ముద్దలుగానిడ వారిబ్లాగులో
    కుదురుగజేరినారుగద, కూటమిగట్టుచు సాహితీప్రభల్
    నిధనముజేసినారుగద,నిద్రనుమానుచు పూరణమ్ములన్
    ముది యొక పుణ్యమూలముగ, మోదమొసంగును మాటిమాటికిన్.

    రిప్లయితొలగించండి
  9. మదిరాక్షు లందరును ' కౌ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్ '
    మదినటుల తలచి తరలిరి
    నదియొడ్డుకు దీపికను వెలిగించి నదిలో విడువన్

    కౌముది = కార్తీకపూర్ణిమ (ఆం . భా)

    రిప్లయితొలగించండి
  10. కుదురుగతల్లిదండ్రులను,కూర్చొనబెట్టెడు వారలున్నచో
    పదునుగయుందురే ,మనసు పండగజేయుచురోజురోజుకున్
    నిదురనుమానకుండతమ,నిద్దురహాయిగపోవువారికిన్
    ముదియొకపుణ్యమూలముగమోదమొసంగునుమాటిమాటికిన్
    ++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు


    రిప్లయితొలగించండి


  11. పదిలము చేసెను బ్రహ్మయె
    ప్రదానముగ నొకరికి యొకరనుచు సదా బ
    ల్లిదునికి వైదికమై కౌ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్



    జిలేబి

    రిప్లయితొలగించండి


  12. పదిలము చేసుకొమ్మ యిదె భాగ్యపు వేళ ప్రదానమయ్యె నా
    నది జిత సాగు జీవితము నమ్మిక నాపరమాత్మ పై సదా
    కుదురుగ నుంచి నావను చకోరక రాత్రుల త్రోలగాసఖీ
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. *కుదురుగ నుంచి నావను నిగూఢపు రాత్రుల త్రోలగా సఖీ

      తొలగించండి
  13. చదువులతోడ బాగుగనె సాగెను చిన్నతనంబు పొందికన్
    పదవుల పొంది విత్తమును వాసిగ జేర్చగ యౌవనంబునన్
    ముదితనమందు యుక్తముగ పుట్టెను భక్తి యకాయునందునన్
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్"

    రిప్లయితొలగించండి
  14. గుదిబండగ మారిన పలు
    వదలని బాధ్యతలు తీరు వార్థక మందున్
    తదుపరి జీవిత మదియే
    ముది, పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్.

    రిప్లయితొలగించండి
  15. చెదరని చిత్తము తోడుత
    పదిలము గా శివుని మదిని భజియించుచు తా
    నెదలో భక్తిని గలిగిన
    ముది పుణ్యపు మూలమగుచు మోద మొసంగు న్

    రిప్లయితొలగించండి
  16. వదలగ భ్రాంతి లౌకికనిబద్ధకుటుంబనిగూఢబంధముల్
    చెదరిన నమ్మకమ్ములని చెన్నెసలారు నశాశ్వతమ్ములే
    గద యని సర్వజీవితతిగమ్యనివాసముఁ జూపు దీపమౌ
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  17. మదిలోగతవిభవములను
    ముదివయసునముదితతలచిముసిముసినగుచున్
    ముదమొందె గతమెయొక కౌ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

    రిప్లయితొలగించండి
  18. సదమలమైన భావముల సంతతివారలు సన్నుతించుచున్
    పదిలములైన మార్గము లపారముగా గ్రహియించుచుండి తా
    మెదలను దేవతాపదవి నింపలరంగను గూర్చి చేరగా
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    మదికిని నింపుఁ గూర్చు సుసమంచిత పద్యము! వ్రాయఁ బూన, నా
    కెదియొ యొకండు దోస మది యెప్పుడు వర్తిలుచుండు! వ్యాకృతం
    బది గ్రహియింప, నందుకొని పండిత శిక్షణమున్, బఠింపఁ గౌ
    ముది, యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్!

    రిప్లయితొలగించండి
  20. చెదరని భక్తి భావమున జేసితి పూజలు రామచంద్ర నీ
    పదములు చూచు భాగ్యమును పండ్లు నివేదన జేయు భోగమున్
    ముదమున గల్గె నేడిదియె ముచ్చట తీరెను పేదరాలికిన్
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  21. వదలగ సంసారభరము
    మదిరోయగ గోర్కెలన్ని మాయయెదొలగన్
    మదనాంతకు నర్చించెడు
    ముది పుణ్యపు మూలమగుచు మోదమునొసగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సదమల మదితో శ్రీపతి
      పదముల సేవింపగోరి పావనగిరిపై
      కదియగ వృద్ధుల వరుసను
      ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

      తొలగించండి
  22. కందం
    మదనుని తాకిడి వీడిన
    నదనున పరమాత్మ పైన నంచిత రీతిన్
    మొదలౌ భక్తియనెడు కౌ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెరుగ్గా ఉండేందుకు కొద్దిపాటి సవరణలతో

      కందం
      మదనుఁడు వీడిన చీకటి
      సదనము పరమాత్మ వెలయు సౌధమ్మగుచున్
      మొదలౌ భక్తియనెడు కౌ
      ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

      తొలగించండి
  23. ముదితకు జీవనంబు కడుమోదముగూర్చగ నెల్లకాలమున్
    ముదిమినిజేరెనిప్పటికి ముచ్చటలన్నియుఁదీర తృప్తితో
    సదమలసాధుజీవనము సాగగఁనామెకు జన్మమందు కౌ
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  24. కదిలెడి కాలమదెన్నడు
    వదలదు దేహ బలమంత వడివడి తగ్గన్
    మదిని భగవాను దలపుము
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్.

    రిప్లయితొలగించండి


  25. హృదిలో మాధవు రూపును
    వదలక నిలుపుచు తలచినవలపుప్పొంగన్
    మదికానందమొసగు కౌ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్..

    : మరొక పూరణ

    ముదము నచేరి నేర్చితి నిపూరణ చేసెడి పద్య విద్యలన్
    సదనము నందు కూర్చొనుచు చక్కగ నెల్లరి పూరణమ్ములన్
    చదువు చు నున్న చాలునిక స్వాంతము‌ నందున శాంతి నిండగా
    ముది యొక పుణ్య మూలముగ మోదమొ సంగును మాటిమాటికిన్"*

    రిప్లయితొలగించండి
  26. కుదిరెను బాధ్యతలు గడచి
    కుదురగు జీవితము దీరె కోరికలిక నా
    మది నాధ్యాత్మికత బెరిగె
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

    రిప్లయితొలగించండి
  27. మఱియొక పూరణము:

    విదిత సుసంసృతీ కలిత వేదనముల్ సని, పాఱె! దైవమున్
    మదిని స్మరింపఁ జిక్కెఁ దఱి! మాన్యుల స్నేహము లందెఁ! బద్యముల్
    గొదువయె లేక వ్రాయు వెలుఁగుల్ గనిపించె! గణించి చూడ నీ
    ముది, యొక పుణ్య మూలముగ మోదమొ సంగును మాటిమాటికిన్!

    రిప్లయితొలగించండి
  28. అదటున గిరాటు వేసితి
    నది కీరేష్ఠమును పెరటినందు భళా నే
    డది నొసగు ఫలములు తినగ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్

    సందర్భము:
    "రాముడు రాజైతే నా ఆరాటమూ తీరుతుంది. బాధ్యతా నెరవేరుతుంది.
    (ముదిమి కమ్ముకొని వస్తున్నది. ఎప్పు డే మౌతుందో తెలియదు.) ముసలితనం పుణ్యానికి మూలమైతేనే సంతోషంగా వుంటుంది. (చింతాక్రాంతమైతే కాదు గదా!)" అన్నాడు దశరథుడు సదాసదులతో ప్రజలతో...
    "ముదిసితి భూభారమునకంటె ఘనతఁ
    బొదలు జరా భారమును దాల్చు కతన
    ....కావున నా రాముఁ గళ్యాణరాము
    దేవతాహితకాము ధీగుణస్తోము
    .....బ్రజలఁ బాలింపంగఁ బట్టంబుఁ గట్టి
    యూరటఁ గోరుచు నున్నాడ మీకు
    నీ రీతి సమ్మతియే!" యంచుఁ బలుక
    ...."మీ రానతిచ్చిన మేలిమి మాట
    వారు వీ రన కెల్ల వారికి హితమె
    హృదయ రంజకము నభీష్టదం బయ్యె
    నదిగాక సకల జనానందకరము"
    అన్నారు సభాసదు లంతా..
    (రంగనాథ రామాయణం అయో.కాం.)
    పదపడి=మరియు, తర్వాత
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *దైవ సంకల్పం*

    ఎది యారాటం బిక నా

    మది? రాజయి రాఘవుండు మహిఁ బాలింపన్..

    బదఁపడి బాధ్యత దీరును..

    ముది పుణ్యపు మూలమగుచు మోద మొసంగున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    1.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. ఇదియదియనుచునుబలుకక
    మదినెప్పుడుదైవభక్తిమయముగజేయన్
    సదమలభావములలవడ
    ముదిపుణ్యపుమూలమగుచుమోదమొసంగున్

    రిప్లయితొలగించండి
  31. సదమలమైనదీ దశయె స్వామిపదమ్ముల చెంతనిల్చి యా
    మదనుని గూల్చవచ్చు పరమాత్మ సుధారస సేవనమ్ముతో
    హృదయము బ్రహ్మతత్వము గ్రహించి రమించును నవ్యమై సదా
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  32. ఇదియదియంచుగాలమునునీడ్చుచుబోవుచునుండకెప్పుడున్
    మదినికరామచంద్రునిలమానసమందుననిల్పుచుండుచో
    సదమలబుద్ధులయ్యవిసుసాధ్యములౌచునుదక్కగానికన్
    ముదియొకపుణ్యమూలముగమోదమొసంగునుమాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  33. కుదురుగ మనస్సు నందిడి
    చెదరని భక్తి నిరతమ్ము సేసిన నా శే
    షుఁ దలంచి పూజ విను పా
    ముది పుణ్యపు మూలమగుచు మోద మొసంగున్


    పదుగురు నొక్కచోటఁ బరిపాటిగఁ జిత్తము నందుఁ దల్చుచున్
    ముదముగఁ జక్రధారి పద పుష్పయుగమ్ము వహించ భక్తితో
    సదమల నిర్జరాకలన సక్త మహోత్సవ రా డకాలకౌ
    ముది యొక పుణ్యమూలముగ మోద మొసంగును మాటిమాటికిన్

    [అకాలకౌముది = ఉత్సవ విశేషము]

    రిప్లయితొలగించండి
  34. చంపకమాల
    సదమల రీతినిన్ గొలచె చక్కని ముప్పది రెండు వేల కై
    పదముల గానమాధురుల భావజు తండ్రిని వేంకటేశ్వరున్
    పదకవితా పితామహుఁడుఁ బంచిన కీర్తన లాది భక్తి కౌ
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  35. కదుములుగట్టెకాయమున,గాత్రముబొంగురుబోవుచుండెలే
    ముదిమికిముందుమాటగను,ముచ్చటదీరెడుకోర్కె డిగ్గెరా
    సదమలభక్తివేడెదను ,సర్వమునీవయి నిల్చిపోవుచో
    ముదియొకపుణ్యమూలముగ ,మోదమొసంగునుమాటిమాటికిన్
    +++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  36. ముదముగ మనుమల తోడను|
    కుదురుగ బ్రతుకుల గడుపుచు కొరతలు లేకన్|

    పదిలము వృధ్ధుల జన్మము
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్"

    రిప్లయితొలగించండి
  37. అదుపున కోర్కిలనుంచుచు
    కుదురుగ బ్రతుకును గడుపగ కూరిమి తోడన్
    కదుకొని వేరాకల కౌ
    ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్!

    వేరాకల =వేయి పున్నముల

    రిప్లయితొలగించండి
  38. సదమల కర్మల తోడుత
    నొదవుగ నా విశ్వనాథు నొనరుగ గొలువన్
    మదిలో ధ్యానించెడి నో
    ముది పుణ్యపు మూల మగుచు మోదమొసంగున్!

    రిప్లయితొలగించండి
  39. హృదయజులే పరాయిలయి హేళన జేసేడు కాలమందునన్
    వదులును కార్యభారములు బాధ్యత లన్నియు తీరునత్తరిన్
    వదలగ దేహదార్ఢ్యమిక వ్యాధులు జేరుచు కాడు బిల్వ నా
    ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్.

    రిప్లయితొలగించండి
  40. కొబ్బరి కాయ ఎందుకు కొడతారు చక్కగా వివరించారు రచయిత దానికి జిలేబీ పైకూ వ్యాఖ్య చూడండి.

    నేను అందుకే చెప్పాను. జిలేబీ కరీనా వైరస్ కంటే ప్రమాదకరం అని.

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "ముది పుణ్యపు మూలమగుచు
    మోదమొసంగున్"

    సందర్భము:
    అథ మే కృషతః క్షేత్రం
    లాంగలా దుత్థితా మయా
    (బా.కాం. 66-13)
    క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా
    భూతలా దుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా 14
    అంత నొకమారు నేను యాగానికి పూర్వాంగంగా పొలం దున్నుతుంటే నాగటి చాలులోంచి ఒక కన్య పుట్టింది. భూమిని శోధిస్తుంటే పొందబడింది కాబట్టి సీత.. అని ప్రసిద్ధురాలయింది. అలా భూమినుంచి పుట్టిన ఆమె నా కూతురుగా పెరిగింది.
    శివధనుస్సును చూపించబోతూ విశ్వామిత్ర రామ లక్ష్మణులకు జనకుడు సీత తనకు లభించిన ఉదంతాన్ని పైవిధంగా వివరించినాడు.
    జనకుడు నాగటి చాలులో సీత లభించగా మురిసిపోయి పుత్రికోత్సాహాన్ని గురించి తా నిలా చెప్పుకున్నాడు.
    "నా కిక తక్కువతనమే కలుగదు. లోకమాత దయతో కూతురు నిచ్చింది. నేడు గదా! నిజంగా జనకు ణ్ణయ్యాను..రాబోయే ముదిమి నాకు సంతోషాన్నే యిస్తుంది."
    ఆ విధంగా సందర్భం పవిత్రమైనది. సత్ఫలం లభించింది.
    (29.2.20 నాటి నా పూరణలూ చూడవచ్చు ఇదే వృత్తాంతంకోసం.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *పుత్రికోత్సాహము*

    కొదవయె యిక నా కొదవదు..

    సదయ సుమా లోకమాత! జనకుడనైతిన్

    గద నేడు! కూతు నొసగెను..

    ముది పుణ్యపు మూలమగుచు
    మోద మొసంగున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    1.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి