25, మార్చి 2020, బుధవారం

సమస్య - 3319 (సకల జనాళి భీతిలఁగ...)

కవిమిత్రులారా,
ఉగాది శుభాకాంక్షలు 2020 కోసం చిత్ర ఫలితం

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"
(లేదా...)
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ"

76 కామెంట్‌లు:

Akula shanthi bhushan చెప్పారు...

వికలమె చెందితిమి గద
వికారిని విరివిగ నీయ వెతల కరోనా!
యిక తేరుకొనక ముందే...
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"

seethadevi gurram చెప్పారు...

కవి మిత్రులందరికీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

వికలమవగ మానసములు
తికమక బెట్టెడి కరోన తీరునుజూడన్
ఒకరికొకరు దూరమవగ
సకలజన భయంకరముగ శార్వరివచ్చెన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


నడిరేయి సరదా పూరణ:

శుకములు మూగగా తనరి చూడగ ముచ్చటమీర జామలన్
పికములు కూయుచుండగను ప్రీతిని మామిడి తోటలందునన్
తికమక లేక వేపలది తియ్యని పచ్చడి నింట గ్రోలుచున్
వికలపు మానసమ్ము విడి వేడుక జేయుడు!;...వెంగళప్పలౌ
సకలజనాళి భీతిలఁగ;...శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. "వికలమ్మె చెందితిమి గద" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణపై వాట్సప్ సమీక్షను గమనించండి.

కంది శంకరయ్య చెప్పారు...

ఇప్పటి దుర్భర పరిస్థితిలో అందరికీ ధైర్యం చెప్తూ చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. (ఇది ఎంతమాత్రం సరదా పూరణ కాదు!). అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

స్వర్గారోహణ పర్వము (Police Warning):

పకపక నవ్వి వీధులను పండుగ జేయుచు నాట్యమాడుచున్
సుకముల వీడకుండగను శుంఠల ముద్దిడి కాగలించగా
నకనక లాడకుండగను నందము నొందుచు జైలునందునన్
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

కంది గురువులకు, కవివర్యులందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు నమస్సులు 🙏🙏🙏

నా పూరణ 🙏

*కం||*

అకటా! వికారి గడిచెను
సకలము సంతోషమనగ శాపము బెట్టెన్
యొకపరి తరచిట జూచిన
*"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"*!!

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏

Akula shanthi bhushan చెప్పారు...


నా పూరణ :: చంపకమాల
**** ***** ***** ***** ***** ***
వికలము జెందె మానసము వేగన గోవిడు భూత మేగుచున్

తికమక జేసి భూరి గడతేర్చ ప్రజాళి వికారి నందునన్

ఇక యరుదెంచు వత్సరమె ఎంతటి ఘోరము జేయునో యనిన్

సకలజనాళి భీతిలగ...శార్వరి వచ్చెను స్వాగతింపుడీ!

🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మరో పూరణ 🌹🌹🙏

*కం||*

కకలా వికలము జేయగ
పకపక నవ్వుచు వికారి పరుగులు దీసెన్
సకలము శాంతమె తదుపరి
*"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(చల్లని శార్వరి - కరకు కరోన)
వికలము నందె చిత్తములు
వేకి కరోనయె విస్తరిల్లగా;
నికరములైన సంపదలు
నిండుకొనెన్ బ్రతిదేశమందున;
న్నిక మనజీవితమ్మెటుల
నింపుగ సాగెడునన్ దలంపుతో
సకలజనాళి భీతిలగ;
శార్వరి వచ్చెను స్వాగతింపుడీ!
(వేకి -వ్యాధి;నిండుకొను -శూన్యమగు)

Zilebi చెప్పారు...



శార్వరి‌ ఆగమనంతో ప్రపంచాన్ని వికారంగా మారుస్తున్న కరోన వీడుతుందని ఆశిస్తో
శుభాకాంక్షలతో


వికటాట్టహాసముల సూ
క్ష్మకృమియె నెదిరింప గా సుమా మనుజులనే
నకటా! ఏమని చెప్పుదు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

***


సకల జనుల పోరామియు
నిక పోవుటకు పరమాత్మ నిమ్మళమును జే
ర్చ కరుణ జూపవలయు ఆ
నక "కోయీ రోడ్డు పైన నా నికలే" జీ!


జిలేబి

vsnmhari చెప్పారు...

చకచకబ్రాకి లోకమున సర్వవిధంబుల మానసంబులన్
వికలము జేసె దుర్మతిని విజ్ఞతలేని "కరోన"దానిచే
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను, స్వాగతింపుఁడీ
యకలుష భావదీప్తి నిట నందును స్వాస్థ్యము సౌఖ్యసంపదల్.

యజ్ఞమూర్తి ద్వారకా నాథ్ చెప్పారు...

శ్రీకరమగునని దలచగ
వికటంబుగ నడుగుబెట్టె భీకర వైరస్
అకటా! విధి నేమందును
సకలజన భయంకరముగ శార్వరి వచ్చెన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

శుభాకాంక్షలు 💐🙏

నకనకలాడు రక్కసియనంగ కరోనయె తాండవింప., న...
ప్రకటితబంధనమ్ముల కరమ్ముల కాళ్లకు కట్లు కట్టి మీ...
రిక పరుగెత్తుడీ యనగనెట్టులొ పొందుట వేపపువ్విలన్
సకలజనాళి భీతిలగ శార్వరి వచ్చెను స్వాగతింపుడీ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Sitharamayya Solasa చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
"కౌగిలించగా" టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'...బెట్టెన్ + ఒకపరి' అన్నపుడు యడాగమం రాదు. "శాపము నిడె నే । నొకపరి..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వేగను/వేగమె కోవిడు... తికమక సేసి మించి... వికారి యందు తా నిక నరుదెంచు... జేయునంచు నీ సకల..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'... అందునన్+ఇక' ఇక్కడ ద్విత్వ నకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు వర్జించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"మనుజులనే యకటా..." అనండి.
'జేర్చ(న్)' ద్రుతాంతం కనుక "జేర్చ గరుణ..." అవుతుంది.

కంది శంకరయ్య చెప్పారు...

విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

Akula shanthi bhushan చెప్పారు...

ధన్యవాదాలు గురువు గారూ...

Sreedhara Rao Machavolu చెప్పారు...

అకట! వికారి గడచె గద

సకలజన భయంకరముగ! శార్వరి వచ్చెన్

మకిలము తొలగించి ప్రజకు

సుకమును సౌఖ్యమ్ము లిడుచు సోయగ మొప్పన్!



గురువర్యులకు, పెద్దలకు, శంకరాభరణంబ్లాగ్ సభ్యులందరికి శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.🌹🌹🌹

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చకితుల జేయుచు జనులను
వికటంబుగ నవ్వు చుండె వింత కరోనా
ప్రకటం బ య్యెను గదరా
సకల జన భయంకరముగ శార్వరి వ చ్చె న్

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మరో పూరణ 🌹🌹🌹

*కం||*

సకలము శాంతమ్మికపై
సకలము సంతోషముండు శార్వరి తోడౌ
నికయిది మొదలే గనుకను
*"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"*

🙏🙏

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ శార్వరీ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

చంపకమాల (పంచపాది)
పెకలు కరోనచే పికము వేదనఁ బాడెడు మృత్యుగీతితో
సకలము మూసివేసికొని సాంతము వ్యక్తులు దూరముండుటన్
వికలముఁ జెందె మానసము వీధుల పండుగ శోభవీడగన్
నికరము షడ్రుచుల్ గలియ నేరక దూర ముగాది యుంచుటన్
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

చకచక నంటుకున్నదిలఁ శక్యము గాదె కరోన నాపుటే?
వికలములైన దేహములు, వేదన పీడిత మర్త్యులన్ కనెన్
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ
సకలము దుఃఖముల్ మరచి షడ్రుచులూరిన పచ్చడిన్ గొనిన్౹౹

గురువుగారికీ, శంకరాభరణం బ్లాగు ఉపయోక్తలందరికీ శార్వరి ఉగాది శుభాకాంక్షలు!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పెకలిన కరోన ధాటికి
నొకరి కొకరు దూరమైన నుద్విగ్నతలన్
చకిత యుగాదినొ సంగుచు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు శ్రీ శార్వరి యుగాది పర్వదిన శుభాకాంక్షలు!

ప్రకటభయంకరోచ్ఛిఖలఁ బైఁ కెగఁద్రోయుచుఁ గాల్చివేయుచున్
వికట కరోన వైరసులఁ బెంచి వికారియె రోగియై చనెన్

సకలజనాళి భీతిలఁగ! శార్వరి వచ్చెను స్వాగతింపుఁ డీ
వికట కరోనఁ ద్రుంచియు, భవిష్య మరోగతఁ బ్రోవ, మ్రొక్కుచున్!

Surya చెప్పారు...

వికటపు పరిహాసంబిది
ప్రకటంబై ప్రకృతి నాశ పరిహారముగా
వికలము జేయుచు మనసులు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

పంచరత్నం వెంకట నారాయణ రావు చెప్పారు...

గురువు గారికి నమస్సులు.
తికమక జేయుచు మహమ్మా
రికరో నావై రస్సే హరిని వణికింపన్
అకటా యేమని చెపుదును
సకల జనభ యంకరముగ శార్వరి వచ్చెన్.

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

సుక, సంకటముల నెల్లరు
వికలము జెందక ధృతిమతి వేల్పుల వేడన్
మకిలము బాపుగ మురహరి
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

విరించి చెప్పారు...

అకటా కరోన యను లా
లికమ్మునెక్కి జముడు విహరించుచు
కాకా
వికలము జేసెడి వేళను
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మనోహరమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, రెండవ పాదాలలో గణభంగం. "...జేసి మహమ్మా... వైరసే" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సుకముల నిడుముల నెల్లరు..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విహరించుచును కకా వికలము..." అనండి.

Sitharamayya Solasa చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు

కం॥
వికటపు కరోన క్రిములను
వికృతమయిన నడత తోడ వెంబడి తేవన్
ఒకసారిగ జగమందలి
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

A.Satyanarayana Reddy చెప్పారు...

ప్రకృతి వికటింప మనసులు
వికలము నొందెను, జనాళి వేదనఁ గనుచున్
వికవికలాడె కరోనా
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

chandrashekhar yelisetty చెప్పారు...

చం:

వికరము ముంచు కొచ్చె కడు భీకర వేదన విశ్వమంతటన్
కకవిక లాడ నెల్లెడల కారణ మైన కరోన వైరసు
న్నిక నిటు భారతమ్మునను నెంచక నుండె నుగాది పండుగన్
సకల జనాళి భీతిలగ శార్వరి వచ్చెను స్వాగతింపుడీ

వై. చంద్రశేఖర్

A.Satyanarayana Reddy చెప్పారు...

వికలము నొంద మానవులు, వేడుకఁ గాంచి కరోన తృప్తితో
వికవికలాడె, వైద్యులను వేడుచు నుండ్రి ప్రజాళి భీతితో
చకచక సాగుచున్ ప్రభుత సాయము చేయుచు నుండ, కొంపలో
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ

విరించి చెప్పారు...

ప్రకటిత మై కరోనయె ప్రపంచము నందున రోజురోజుకున్
జకచక విస్తరించుచు విచారము పెంచగఁ బ్రాణ భీతితో
నకమున లోకమే మునుగు నత్తరి వృద్ధ వికారి వెళ్ళగా
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ.

subbarao చెప్పారు...

వికలముజేయుచుడెందము
పకపకమనునవ్వుతోడపాడుకరోనా
వికటాట్టహాసనడుమున
సకలజనభయంకరముగశార్వరివచ్చెన్

subbarao చెప్పారు...

ఉగాదిశుభాకాంక్షలు
సోదరసోదరీమణులకు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


వికలము కాఁగ నుపాయము
లకటా దీపమ్ము లన్ని యార నొక ద్రుటిన్
వికృతంపురూప మడరన్
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

[శార్వరి = రాత్రి]


ప్రకటిత శుద్ధ వత్సరము బాంధవ మిత్రజ నోఘ చిత్త మో
ద కర మనోర థాది వర దాయక సౌఖ్య విహార మగ్నతన్
సకల బుధవ్రజాలి మనసార నుతించ వినా సుధీ మన
స్సకల జనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ

subbarao చెప్పారు...

వికలముతోడమానసమువీగకరోనయెవచ్చెచూడరో
సకలజనాళిభీతిలిగ,శార్వరివచ్చెనుస్వాగతింపుడీ
నవనవలాడుచుండుచునున్యాయముజేయగభూజనాళికిన్
సకలజనంబులియ్యెడనుశార్వరిరాకకుమోదమొందుడీ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వికలమొనర్చుచువెడలెను
సకలముజగమునవికారిసంవత్సరమే
చకచక కరోనచేగొని
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తేవన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నకమున'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వికటంపు నగవుల నడుమ/వికట్టాటహాస మొనరుచు" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను
స్వాగతింపుఁడీ"

సందర్భము: దేహాత్మ భ్రాంతితో (దేహమే శాశ్వత మనే భ్రాంతితో) దాన్నే ప్రేమిస్తూ ఇంతకుమించి మరేమీ లే దనే మాయలో పడిపోయి భోగలాలసు డౌతాడు జీవుడు. ఇది మొదటి దశ.
తద్వారా నిర్మలమైన శాశ్వతమైన దివ్యతత్వంలో తన మనస్సును స్థిరంగా నిలుపలేకపోతాడు. ఇది రెండవ దశ.
ఇక అప్పటినుంచి మృత్యు వెప్పుడు కబళిస్తుందో అనే సంశయంతో ప్రతినిత్యం తెగ భయపడి పోతుంటాడు. అదే అతని నిత్య భావన. ఇది మూడవ దశ.
ఇలా భావన చేస్తూ చేస్తూ మరణ స్మరణమే కాని మాధవ స్మరణం లేనందువల్ల.. మృత్యు స్మరణమే గాని మృత్యుంజయ స్మరణం లేనందువల్ల అతడు అనుకోకుండానే దైవానికి దూరమైపోతాడు. (రామ భక్తుడు కాకుండా పోతాడు.) ఇది నాల్గవ దశ.
అట్లాంటి జనాళికి అంటే రామ భక్తులు కాని వాళ్ళకు భయం కలిగించేటట్టుగా శార్వరి వచ్చేసింది. అంటే రామ భక్తులైన వాళ్ళకు భయం తొలగించేటట్టుగా వచ్చేసిం దని అర్థం.
అట్టి శార్వరికి స్వాగతం పలుకండి!!
~~~~~~~~~~~~~~~~~~~~~~

*దశల వారీగా..*

అకలుష దివ్య తత్వమున
నాత్మను నిల్పక దేహమందు ప్రే
మికు లయి.. భోగ లాలసత
మృత్యు సమాగమ రూప సంశయ
ప్రకటిత నిత్య భావు లయి,
రాముని భక్తులు కాని వారలౌ
సకల జనాళి భీతిలఁగ
శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.03.20
-----------------------------------------------------------

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

seethadevi gurram చెప్పారు...

పకపకలే కరవాయెను
మకరాంకుని జాడగనము మరణభయమ్మే
ప్రకటితమై పీడింపగ
సకలజన భయంకరముగ శార్వరివచ్చెన్

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను
స్వాగతింపుఁడీ"

సందర్భము:
రావణ వధకు ముందు రాత్రి.
విచారంలో మునిగిపోయిన రావణుని మదిలో తాను విభీషణుని తిరస్కరించడం, అతడు తా నెన్నడూ ఊహించని విధంగా రాముని వైపు వెళ్ళిపోవడం గురుతుకు వచ్చి బాగా కలవరపడిపోయాడు. అతని స్మృతి పథంలో విభీషణుడు తన యెదుట నిలిచి ఇలా అంటున్నట్టు స్ఫురించసాగింది.
"జిహ్వ గుహ్యములు రెండే సుఖ మిస్తా యనుకుంటారు మూర్ఖులు. ఇవే బలవత్తరమైన యింద్రియాలు.
(మొదటి దానికి లొంగిపోయినవాడు కనిపించిందల్లా కడుపులోకి తోసేస్తూ వుంటాడు. రెండవదానికి దాసోఽహ మన్నవాడు కంటికి నదురురుగా కనిపించే ప్రతి యువతీ కావాలంటాడు.)
ఒకటి విజృంభిస్తే మరొకటి విజృంభిస్తుంది.. ఒకటి అణిగితే మరొకటి అణగుతుంది.
(చైనాలో రుచుల యావ పెచ్చుపెరిగి పోవడం, జనాభా చెట్టెక్కి కూర్చోవడం ఈ రెండింద్రియాల విజృంభణయే!)
(కుంభకర్ణుడు జిహ్వకు, రావణుడు గుహ్యానికీ సంకేతాలు.)
కుంభకర్ణుడు ఉట్టి పుణ్యానికే నేలకూలాడు. తర్వాతి వంతు నీదే!
ఈ (లంకలోని) సకల జనాలు భీతిల్లే శార్వరి (రాత్రి) ఇదే! ఇదే నీకు చివరి రాత్రి. తెల్లవారితే నీ జీవితానికి భద్రత లేదు. (రాముని చేతిలో మృత్యువే!)"
("శార్వరి" అంటే "రాత్రి" అనే అర్థంలో ప్రయుక్తము.)
మన ఇంద్రియాలలో కండ్లకు చూడడ మనే పని, చెవులకు వినడ మనే పని ఒక్కొక్కటే అప్పజెప్పబడినవి. అలాగే తక్కిన వాటికీ.. కాని జిహ్వకు రుచి చూడడం, మాట్లాడడం అనే రెండు పనులూ, గుహ్యానికి మూత్ర విసర్జనం, మైథునం అనే రెండు పనులూ అప్పజెప్పబడినవి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~

*జంట కవులు*

"సుక మిడు జిహ్వ గుహ్యములె
సు" మ్మనుకొందురు మూర్ఖు..లిందులో
నొకటి శమింప వేరొకటి
యున్ శమియింపదె! కుంభకర్ణు డూ
రక కనుమూసెనే! పిదప
రాగల దా దురవస్థ నీకె!.. ఈ
సకల జనాళి భీతిలఁగ
శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.03.20
-----------------------------------------------------------

Eswarappa.k చెప్పారు...

"ప్రకటన లందుకరోనా
సకలజనభయంకరముగ"!" శార్వరివచ్చెన్
నికరములేని వికారి బ
హు కళంకములందువెళ్ల!" హుందాతనమున్!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

BULUSU V S MURTY చెప్పారు...

వికల మనస్కులయి జనులు
కకావికలయి గృహమందె కరొన భయంతో
ఒకరొకరై బ్రతుకు గడప
సకలజన భయంకరముగ శార్వరి వచ్చెన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!