15, జూన్ 2020, సోమవారం

సమస్య - 3399

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రోగము నయమైన మిగుల రోదించెనయో"
(లేదా...)
"రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

81 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    బాగుగ పీల్చుచున్ కడకు బాధల నొందగ దగ్గు వ్యాధితో
    బేగమె పారిపోదునని భీషణ రీతిని రచ్చజేయగా
    వేగమె బీడిలన్ విడిచి, ప్రీతియె లేదని జీవితమ్మునన్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  2. రోగికి యూపిరి యాడక
    వేగమె యాస్పత్రి కేగ వేదన తోడన్
    లాగేయగ ధనమంతయు
    రోగము నయమైన మిగుల రోదించెనయో.

    రిప్లయితొలగించండి
  3. 15.06.2020
    అందరికీ నమస్సులు 🙏

    సమస్యను స్వీకరించిన కంది గురువులకు శతాధిక వందనములు 🙏🙇‍♂️🙏

    *సమస్య: రోగము నయమైన మిగుల రోదించెనయా*

    నా పూరణ యత్నం 😊😀

    *కం*

    రోగము దరిజేరెననుచు
    త్యాగము జేయుట సరియని త్రాగుడు నికపై
    వాగిన మిత్రుల జూచుచు
    *రోగము నయమైన మిగుల రోదించెనయా*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. రోగము కొరోన పోవగ
      వేగమె నాస్పత్రిని ప్రయివేటుది చేరన్
      బాగుగ డబ్బులు వ్యయమై
      రోగము నయమైన మిగుల రోదించెనయో

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    భోగము లన్నియున్ విడిచి బొట్టును పెట్టుచు మోము మీదనున్
    సాగుచు వీధి వీధులను జంబము మీరగ వోట్లు కోరగా....
    వేగమె మోడి గెల్వగను పీకుచు జంద్యము, వీపు గోకెడున్
    రోగము పోయి స్వస్థుఁడయి, రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    గోకుడు = గజ్జి

    రిప్లయితొలగించండి
  6. వేగగ లేక తండ్రి యటు వేదన నొందగ పుత్రరాజమే
    వేగిర చేర్చవైద్యుడటు వెట్టగ కృత్రిమ శ్వాసయందగన్
    బాగుపడంగనే కనుచు బాదిన బిల్లును దానుదల్చుచున్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  7. [15/06, 00:27] V: శ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:15-06-2020. మహోదయులకు శుభోదయ నమస్సులతో ,
    నేటి సమస్యాపూరణాల యత్నం -

    వేగమె బడికిక చనుమన
    సాగదనె బాలుడు తనకిక స్వాస్థత విధిగన్
    చేగూరలేదనుచున్
    రోగము నయమైన మిగుల రోదించెనయో!


    జాగృతమైన పుత్రుని తొ , చక్కగ సర్వము తీర్చి దిద్దగ
    న్నీగృహ శుభ్రతన్ మరియు నేమపు కార్యము లెల్లజే యు మో!
    స్వగృహమే !యనంగ హృది భారము నిండగ బాధగూడ గన్
    రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టు గన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      కందం రెండవ పాదంలో గణభంగం. 'స్వస్థత/స్వాస్థ్యము...చేకూరలేదు' సాధువులు.
      వృత్తంలో 'పుత్రునితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'స్వగృహ' మన్నపుడు 'స్వ' లఘువే. గణభంగం. సవరించండి.

      తొలగించండి
  8. భోగము కాదె వేళకును భోజనమంది కరోన వైద్యమే
    సాగుట క్షేమ సౌఖ్యముల సాధనయే పరమంబుగన్? సదు
    ద్యోగము లేని గొప్ప పనిదొంగకు గుండెల గుండుపడ్డదోచ్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. రోగిష్టి భార్య పేరున

    వేగము గన్జేసె నొకడు బీమా ఘనతన్

    భోగము నుకోరి,శుభముగ

    రోగము నయమైన మిగుల రోదించెనయో


    భార్య చనిపోయిన కోట్లు వచ్చునని తలచి ఒకడు అప్పు చేసి ఇన్సూరెన్స్ పాలసి చేసి భార్య కోలుకొనగా ఏడ్చిన సందర్భము

    రిప్లయితొలగించండి
  11. ఆగని గ్రీష్మ పు తాపము

    సాగని భిక్షాటనమ్ము,సాగెడు నేసీ

    భోగము లిక నుండవనుచు

    రోగము తగ్గెనని మిగుల రోదించెనయో


    బిక్ష గానికి కరోనా వచ్చిన దని ఆస్పత్రిలో చేర్చగా ఏసి రూములో భోగములు‌ అనుభవించుచు డిస్చార్జి అయినపుడు అతని మనోభావము

    రిప్లయితొలగించండి
  12. ఆగిన వంటల డ్యూటీ,

    బాగుగ దొరికిన సెలవులు, భామల సేవల్,

    ఆగును గదా యికననుచు

    రోగము తగ్గెనని మిగుల రోదించెనయో

    రిప్లయితొలగించండి


  13. రాగముల తీసి పాడెను
    రోగము నయమైన, మిగుల రోదించెనయో
    యోగము కలయక బాధలు
    తీగల వలెచుట్టుకొనగ తిండాట్టముతో!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. కందోత్పల


    భగభగ మండుచు బాధ బ
    డగ రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జే
    యఁగసాగె బిట్టు గన్ తా
    ళగలేక నలిపిరినిక కలవరపడి సుమీ!


    అలిపిరి - నీరసము
    జిలేబి

    రిప్లయితొలగించండి

  15. రోగము తో తిరుక్షవరము


    వేగము గాను తగ్గుటకు వేలకు వేలు ధనమ్ము బోవగా
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
    మీగడ యైన జీవితము మిక్కిలి హీనము కాగ లేమితో
    భోగము లెల్ల బోవనరె బువ్వకు బువ్వకు చిక్కుపాట్లతో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. భోగములన్ని మాసినవి బూడిద యయ్యెను విత్త మంతయున్
    రోగము ఘోర మైనదని లోపల నెల్ల దహించి వేసె నం
    ౘాగము చేసె వైద్యు డది యౌనను కొంటిని మోసమంౘు నా
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.

    రిప్లయితొలగించండి
  17. రోగముమూగబాధయనరోగముబోయినబల్కెదూరుడై
    రోగముగంటిజూపుదనరోగముబోవగజూచెహింసలన్
    రోగమువిన్కిడిన్దనినరోగముబోవగదూరతన్వినన్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    కొరుప్రోలు

    రిప్లయితొలగించండి
  18. రోగనివారణశాలకు
    రోగినితరలించినారు రుగ్మతవోవన్
    వేగమె ప్రాణాంతకమగు
    రోగము నయమైన మిగుల రోదించెనయో

    రిప్లయితొలగించండి
  19. బాగుగ సంతోషపడెను
    రోగము నయమైన , మిగుల రోదించె , నయో
    బాగుగ నింటనె యుండుట
    సాగదు , మరి యెటులగోష్టి సలుపుదు ననుచున్

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    రోగము హెచ్చె వీని., కిక రోజులు మాత్రమె యుండు., నాస్తిలో
    భాగము నాకు నాకనుచు బంధువులెల్లరు కీచులాడ., నే
    యోగమొ యాతడే బ్రతికియుండగ నీగతి జూచి ఖిన్నుడై
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  21. నా పూరణ. ఉ.మా.
    *** ***** **** ****

    రోగపు పాలు జేసెను కరోన పిశాచమె భార్యభర్తలన్

    వేగమె తగ్గె భర్త కతివేలపు చక్కని వైద్య మందగాన్

    రోగమె మీఱగన్ గృహిణి క్రుంక భరించక ప్రాణనాథుడే

    రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగసాగె బిట్టుగన్


    -- �� ఆకుల శాంతి భూషణ్ ��
    �� వనపర్తి��

    రిప్లయితొలగించండి
  22. రోగమనుచు పోవంగను
    వేగమె చేయగ పరీక్ష బిల్లుల మోతన్
    నా గతి అప్పులె యనుచును
    రోగము తగ్గంగ మిగుల రోదించె నయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'పోవంగను' అనడం సాధువు కాదు. "రోగమనుచు తానేగగ..." అనండి.

      తొలగించండి
  23. బాగరి నర్సొక్కతె యను
    రాగము తో పలుకరింప రక్తుండగుచున్
    భోగార్థియైన వాడే
    రోగము నయమైన మిగుల రోదించెనయో

    రిప్లయితొలగించండి
  24. రోగి ముదంబున బొంగెను
    రోగము నయమైన : మిగుల రోదించె న యో
    ఈగతి చికిత్స కొఱకై
    తా గడి యించిన ధనమది తరిగిన దనుచు న్

    రిప్లయితొలగించండి
  25. సాగగ సుదీర్ఘ వైద్యము
    రోగికి స్వస్థత లభించి రుగ్మత వీడన్
    ఆగెను గడనని వైద్యుడు
    రోగము నయమైన మిగుల రోదించె నయో!

    రిప్లయితొలగించండి
  26. ఏగెదవెచటికి విను నీ
    వాగుము జెల్లింపుమనగ నరవై లక్షల్
    ఆగని కన్నీట నతడు
    రోగము నయమైన మిగుల రోదించెనయో

    రిప్లయితొలగించండి
  27. రోగముగలయాసోముడు
    రోగమునయమైనమిగులరోదించెనయో
    రోగపుసమయములందున
    భోగములంబొందియికనుభోగములేమిన్

    రిప్లయితొలగించండి
  28. ఉ:

    వేగన మాన్ప, సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్
    భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్
    సాగవు యాటలింక పద సాకులు యేలని గద్దిరింపగన్
    రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్

    వేగన=కలత

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'సాగవు+ఆటలు, సాకులు+ఏల' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురువు గారి సూచనల ననుసరించి మార్పుతో..

      ఉ:

      వేగన మాన్ప,సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్
      భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్
      సాగవు కుంటిసాకు లిక సాగిలు టేలని గద్దిరింపగన్
      రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  29. రోగమునొందినట్టిరవిరోజులవెంబడివైద్యశాలలో
    భోగములొందుచున్ నికనుభోగములుండనిగారణంబునన్
    రోగముపోయిస్వస్ధుడయిరోదనజేయగసాగెబిట్టునన్
    రోగములేకయుండుటకురోదనజేయకసంతసింపుమా

    రిప్లయితొలగించండి
  30. ఆగమ కాలమంతయు తనాయస మంతయు బాపగానిటుల్
    బాగుగ జూచెనీ ప్రకృతి, ప్రాణము నిల్వగ వార్ధకంబునన్
    రాగము చావకింతయును లక్ష్యము వీడుట కొక్కరోజుకే
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  31. నాగరికం బయ్యెను వే
    వేగఁ జనఁగ వైద్యు కడకు వెఱ్ఱిగ భీతిన్
    వేగఁ దిరిగి కనిపించఁగ
    రోగము నయ మైన మిగుల రోదించెనయో

    [నయ మైన(న్)]


    బాగుగ చిత్త ముంచి మఱి వైద్యము సేయఁగఁ గీర్తి హస్తుఁడే
    క్రాఁగఁగఁ జేసి సంతతము కంటకమై రుజ కొన్ని నాళ్లహో
    దాగి శరీరమం దిపుడు తగ్గిన హర్షము పొంగ నత్తరిన్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగ సాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  32. రోగముసోకి కరోనా
    వేగమెచని వైద్యశాల బెడ్డునజేరన్
    జాగున దొంగలుదోచగ
    రోగము నయమైన మిగుల రోదించెనయో!

    బాగుగ వైద్యమందగ సుభాగ్యుడు సోముడు జేరెనింటికిన్
    రోగముపోయి స్వస్థుడయి,రోదన సేయగసాగె బిట్టుగన్
    బీగములేని యిల్లుగని ,పెక్కగుసొమ్ములు దోచుకోబడన్
    సాగగ నెట్టులో బ్రతుకు చచ్చిన బాగుగనుండె నంచునున్

    రిప్లయితొలగించండి
  33. భోగపు వాడలన్ దిరుగు పోకిరి వానికి యంటుకున్నదో
    రోగము, గేస్తురాలు ఝష లోచన భీతిలి వైద్యశాలలో
    లోగిలినమ్మి చేర్చెనట రూపసి, వాసము పోయెనంచు నా
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  34. ఉత్పలమాల
    ఆగును నీదు గుండియ నియంత్రణ జేసెద మంచు వైద్యులున్
    జాగు వినాశ కారకము శస్త్ర చికిత్సకు రమ్మటంచు నా
    రోగికి వైద్యమున్ సలిపి రొక్కము గుంజగ లక్షలాదులున్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి

  35. కందం
    ఆగును గుండియ యంచును
    సాగించుచు వేగిరముగ శస్త్ర చికిత్సన్
    తూగననిన గుంజ ధనము
    రోగము నయమైన మిగుల రోదించెనయో!

    రిప్లయితొలగించండి
  36. ఆగముచేసెనే జగతి నందరి జీవితముల్ కరోన యు
    ద్వేగమునొందగా నొకడు వేగ సువైద్యము పొందనెంచుచున్
    సాగెను వైద్యశాల, కట సంపద వారలు కొల్లగొట్ట నా
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  37. రోగముపెచ్చరిల్లనొక రోగి జనెన్ జనవైద్యశాలకున్
    రోగచికిత్సజేసితనరుగ్మతమాన్పగ వైద్యుడంతటన్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
    సాగిలి మ్రొక్కి వైద్యునకు సాంత్వనజేకుర మానసంబునన్

    రిప్లయితొలగించండి
  38. బాగుగ దేహపుష్టిగొని భార్య కుటుంబముఁ వీడి దుర్మతిన్
    భోగపు బాటనెంచి యది భూషణ మేనని నెంచి జూడగా
    సాగదు జీవితంబనుచు సత్వరమే తన తప్పు నొప్పగన్
    రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.

    రిప్లయితొలగించండి
  39. వేగమున వెడలె నల్లుడు
    రోగము నాస్పత్రి జేర్చిరో దన మామన్
    చేగొనుదు నాస్తి యాశన,
    రోగము నయమైన మిగుల రోదించెనయో!

    రిప్లయితొలగించండి
  40. సాగే ప్రేమే పెళ్లికి
    వేగముసాగంగ పిదప వేడుకదరుగన్!
    మూగిన ననుమానంబున
    రోగమునయమైనమిగులరోదించెనయో!

    రిప్లయితొలగించండి
  41. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాగెను ముదమున నింటికి
    రోగము తగ్గెనని; మిగుల రోదించెనయో
    రోగము నణచిన వైద్యుడు
    బాగుగ ధనమును కొసరిన వైనము ననుచున్.

    రిప్లయితొలగించండి
  42. త్రాగుచు నుండగ సతతము
    రోగమొకటి వచ్చిచేర రొప్పుచు మందున్
    త్యాగము చేయుమనంగను
    రోగము నయమైనపిదప రోదించెనయా

    రిప్లయితొలగించండి