30, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3413

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్"
(లేదా...)
"జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్"

డా. సి.వి. సుబ్బన్న శతవధాని గారి పూరణ...
మృత్స్నావర్ధిత పారిజాత సుమనోరేఖన్ జగన్మోహనో
ద్యత్స్నిగ్ధద్యుతి మించు కన్య వలచెన్ దా రాజవర్యున్ దదం
చత్స్నేహాదృతి నిద్రలేమి వగచెన్ జాల్చాలుఁ బొమ్మంచనున్
జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్.

41 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    జ్యోత్స్నల్ వెల్గెడు రాత్రి నా మదినహో జోకొట్టి కవ్వించగా
    జ్యోత్స్నల్ పారెడు బీచినందు జనగా శోకమ్ములన్ తీర్చుటన్
    జ్యోత్స్నల్ నామములన్ చెలంగు చెలులన్ శూరుండనై కోరగా
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Amethi 2009:

    జ్యోత్స్నన్ బోలెడు భాజపా స్మృతినహో శూరుండనై పోరగా
    జ్యోత్స్నల్ వెల్గెడు రాత్రి వోటులనయో జోకర్లు లెక్కించగా
    జ్యోత్స్నల్ కన్నుల దాల్చి వేచగన నే నోడంగయో నాహృదిన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్

    రిప్లయితొలగించండి


  3. కంది వారివ్వాళ సెలవా :)


    జ్యోత్స్నల్ జ్యోత్స్నల్ జ్యోత్స్నల్
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్
    జ్యోత్స్నా దేవియె దివ్వెల
    జ్యోత్స్నల్ కన్బడక దీర్చి జోజో యనగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. జ్యోత్స్నా కాంతుల మించెడు
    జ్యోత్స్నాంబర ధారియౌచు జోడు నరయుడిన్
    జ్యోత్స్నాభిసారిక కహో
    జ్యోత్స్నల్ నలుదిశల బర్వి క్షోభను గూర్చెన్

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  6. జ్యోత్స్నాదేవియె క్రోధమొందె నరులే జువ్వాడ గాంచెన్ వెసన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్
    జ్యోత్స్నల్ చేర్చెను దాని కారణముగా ఝుంపాకముల్ తీరుగా
    జ్యోత్స్నల్ వెల్గుల గాంచి మానవులు సద్యోజాతుడిన్ గొల్చిరే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ఈ త్స్నాప్రాస నొసంగి నన్నిటుల హింసించంగ న్యాయమ్మొకో?
    మత్స్నేహమ్ము మదిం దలంపవొ కడున్ మాత్సర్యముం బూనితో?
    హృత్స్నిగ్ధత్వము నందవో? యిపుడు నే నిట్లందురా... యెవ్విధిన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్?

    రిప్లయితొలగించండి
  8. సత్స్నేహంబులు శాంతి గూర్చు సమయాచారంబులన్ దెల్ప తా
    కృత్స్నంబై నిలచున్ మహౌషధము సంగంబేను సర్వార్థమౌ
    తత్స్నిగ్ధాంచిత బంధముల్ మరువగన్ తాత్సార మబ్బంగ నా
    జ్యోత్స్నల్ నల్దెసలందు బర్వి కడు సంక్షోభమ్ము గల్పించెడున్

    కృత్స్నము = సమస్తము, స్నిగ్ధము = దృఢత్వం, స్వచ్ఛత

    రిప్లయితొలగించండి
  9. గృత్స్నుండై కడు లాలసు
    డుత్స్నానార్చన విధంబు లుట్టుటి వనగా
    కృత్స్నము మండగ కులమున
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్

    గృత్స్న-సాంగవేదాధ్యాయి,
    లాలసుడు+ఉత్+స్నాన,
    కృత్స్నము-కడుపు

    రిప్లయితొలగించండి

  10. మైలవరపు వారి పూరణ

    ఇటీవలనే స్వర్గస్థురాలైన మా అమ్మ శ్రీమతి మైలవరపు లక్ష్మీకాంతం గారి సంస్మరణ 🙏

    కృత్స్నానందము మాసిపోయినది., త్వన్మృత్యుప్రభావంబునన్
    మృత్స్నానంబులు పిండదానముల లక్ష్మీకాంతమా! ఆర్తమౌ
    హృత్స్నిగ్ధత్వమెటుల్ భరింతు? జననీ! యిందుప్రభన్ గాంచ నిన్.,
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  11. జ్యోత్స్నల్ నాలుగు దిశలన్ 
    జ్యోత్స్నలు నింపంగ చూడ చూడ్కుల నింపన్ 
    జ్యోత్స్నాభిసారిక యనియె  
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్  

    రిప్లయితొలగించండి
  12. జ్యోత్స్న ను మను వాడె నొకడు
    జ్యోత్స్న వెడలె తండ్రి వెంట శూన్యపు గదిలో
    జ్యోత్స్న పతికి విరహము నన్
    జ్యోత్స్న ల్ నలు దెసల బర్వి క్షోభ ను గూర్చెన్

    రిప్లయితొలగించండి
  13. జ్యోత్స్నకు బరిణయమాయెను
    జ్యోత్స్నాపతి యరుగవలసె యూరపు పనిపై
    జ్యోత్స్నయు విరహిణి కాగా
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  14. జ్యోత్స్నా యీ శరదిందుబింబము గనన్ శోభాయమానంబునై
    జ్యోత్స్నాభాసితమైన నీ వదనమే ద్యోతంబగున్ నా మదిన్
    జ్యోత్స్నా నీ విరహంబు నోప గలనా జూడంగ నీ యామినిన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్

    రిప్లయితొలగించండి
  15. జ్యోత్స్నలనంగనుగాంతులు
    జ్యోత్స్నల్ నలుదెసలబర్విక్షోభన్ గూర్చెన్
    జ్యోత్స్నలగూరిచియటులుగ
    కృత్స్నుండైమిగులబలుకగృష్ణా!సబబే?

    రిప్లయితొలగించండి
  16. కృత్స్నమ్ము చిత్తము లలర
    మృత్స్నా నేచ్చ జనియింప హృత్కమలములన్
    జ్యౌత్స్నమ్మున జీవాళికి
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్


    కృత్స్నోద్దీపిత చిత్త రాగ జని తాంగీకార భావమ్ము సూ
    హృత్స్నిగ్ధేద్ధ విచార సంచలిత వక్రేక్షా ప్రతీక్షార్త బా
    ర్హత్స్నేహార్ద్ర మనోవిలాస జన పంచాస్త్రార్త జీవాళికిన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్

    రిప్లయితొలగించండి
  17. సత్స్నేహంబొనరించిన
    కృత్స్నంబౌ తాపములను కేండ్రించుసదా
    తత్స్నేహార్ధికి విరహ
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  18. సత్స్నేహంబది దుర్లభమ్మనిగదే జాగర్యమున్ బొందుచున్
    మత్స్నేహంబును కోరుకుంటివట కొమ్మా, యేలరాకుంటివో
    జ్యోత్స్నా! నీవిక రాకపోయితివి, నేశోకమ్ములో మున్గగన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్.

    రిప్లయితొలగించండి
  19. జ్యోత్స్నా ప్రియనై వేచితి
    జ్యోత్స్నా! రాకుంటి వేల? చోద్యం బదియే
    జ్యోత్స్నా మయలోకంబున
    జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  20. జ్యోత్స్నయహ్రుదికాహ్లాదము
    తత్స్నేహంబేజగతికిదారింజూపున్
    జ్యోత్స్నినిమనసునవిడువగ
    జ్యోత్స్నల్నలుదెసలఁబర్విక్షోభఁగూర్చెన్

    రిప్లయితొలగించండి
  21. జ్యోత్స్నల్ నల్దెసలందుబర్వికడుసంక్షోభంబుగల్పించెడున్
    జ్యోత్ర్నా!యేమనియంటివిప్పుడయహోక్షోభంబుగల్పించెనే?
    జ్యోత్స్నల్ గల్గినకాంతులొయ్యనదగన్ జోతించుభూభాగమున్
    జ్యోత్స్నల్ హాయినిగూర్చియెల్లరునుదాసౌఖ్యంబుతోనుందురే

    రిప్లయితొలగించండి
  22. సీతా వియోగంతో శ్రీరామచంద్రుని ఆవేదన....

    కందం
    హృత్సిగ్ధత్వమ్మమరగఁ
    దత్స్నేహాంచిత మధురిమఁ దనరఁగ సీతా!
    కృత్స్నానందము విడె, వని
    జ్యోత్స్నల్ నల్దెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్


    శార్దూలవిక్రీడితము
    హృత్సిగ్ధత్వముఁ బెంపునొంద వనిలో నింపార దాంపత్యమున్
    త్స్నేహాంచిత భావవీచికల సీతా! పారవశ్యమ్ములన్
    కృత్స్నానందము వీడె నీ విరహమన్ క్లేశమ్మునన్ రాత్రులన్
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్!

    రిప్లయితొలగించండి
  23. జ్యోత్స్నను బెండ్లా డంగా
    తత్స్నిగ్ధ యు జ్యేష్ఠమందె దవ్వుల వెడలన్
    జ్యోత్స్నను స్మరించు మగనిని
    జ్యోత్స్నల్ నలుదిశల బర్వి క్షోభను గూర్చెన్

    రిప్లయితొలగించండి
  24. కం:

    జ్యోత్స్నామయ తీరమునన్
    చిత్స్నేహము పెంపుసేయ చిత్తము లలరన్
    సత్స్నేహము దుర్లభమన
    జ్యోత్స్నల్ నలు దెసల బర్వి క్షోభను గూర్చెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. శా: మత్స్నేహంబునుకోరి చేయినిడగా మన్నించి నాప్రేమమున్
    తత్స్నిగ్ధన్ కని మానసమ్మువిజయోత్సాహమ్ముతోపొంగె చూ
    సత్స్నేహమ్మిది కాదటంచుతొలగన్ సంతాపమే క్రమ్మగా
    జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్

    రిప్లయితొలగించండి