17, నవంబర్ 2020, మంగళవారం

సమస్య - 3547

18-11-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్” 

(లేదా…)

 

“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”

53 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. "శ్రీ రాముని దయ చేతను..."

      సరదా పూరణ:

      కవిమిత్రులు శ్రీ గుండా సుబ్బసహదేవుడు గారలకు ధన్యవాదములతో:

      నెపములు చూపకే కడకు నిక్కుచు నీల్గుచు ముందురోజునన్
      చపలపు కోర్టు కూడదని చక్కగ చెప్ప టపాసకాయలన్
      కపటపు షాపువారలిట గట్టిగ నేడ్వగ హైద్రబాదునన్
      టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్...

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      అపురూపపు దీపావళి
      టపాసులను గాల్చ నీక టప్పున వెడలన్
      గుపితుండై మనుడనియెన్
      టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!

      తొలగించండి
    2. చంపకమాల
      ఎపుడెపుడాయనన్ గనులకింపగు పండుగ వచ్చిపోయెనే!
      విపణి టపాసులమ్ముకొను వృత్తుల వారికి నోరుగొట్ట నే
      తపనలు దీరలేదనుచుఁ దల్లడపాటున మన్మడిట్లనెన్
      "టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్!"

      తొలగించండి
  3. ఉపయెన్నికందు తామె గె
    లుపొందెదమనుచు టపాసులు మొదటనే కా
    ల్చపనిగొని యోడెఁ దుదకును
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!

    రిప్లయితొలగించండి
  4. టపటపఓటులుప్రేలగ
    కపటపుమాటలగెలుపునుగనెనుగబైడెన్
    విపరీతముగనుట్రంపనె
    టపటపధన్ధన్చిటపటఢంఢండడతుస్

    రిప్లయితొలగించండి
  5. ఎపుడునపాయమునెంచుచు
    నెపమును తలపక నొడుపుగ నేర్పరిలాగన్
    తపమగు రీతిగ కాల్చిన
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🏻సవరించి

      ఎపుడునపాయమునెంచుచు
      నెపములు తలపక నొడుపుగ నేర్పరిలాగా
      టపకాయల పేల్చనిలా
      టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

      తొలగించండి
  6. విపరీతంబుగబాలలు
    టపకాయలుదెచ్చికాల్చఢాంఢామనకన్
    నపుడీరీతిగపేలెను
    “టపటపధన్ ధన్ చిటపట ఢంఢంఢడతుస్”

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విపణిని కొని తెచ్చినవౌ
    టపాసులన్నియునిట వికటము నొందినవై
    విపులముగా పేలక ననియె
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
  8. పాపకు రెండేళ్ళయినను
    విపులము గామాటలొచ్చె వివరింపంగా
    దీపావళి యెట్లనగా
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ తుస్

    రిప్లయితొలగించండి
  9. విపణికి పోయి తెచ్చితిని పెక్కుటపాసులన్ సుతుండు కో
    రి పెలుచగా నికన్ బటికిరింతకు తాళగ లేక వేలుపో
    సి, పరవశించె వాడు గని స్నిగ్దుల తోనవి కాల్చ మ్రోగెనే
    టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్

    రిప్లయితొలగించండి
  10. అపకారము రోగులకను
    నెపమున నుపసంహరించ నేడు
    టపాసుల్
    నిపుణత ధ్వన్యనుకరణను
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ తుస్

    నిపుణత గట్టిజూపెదను నేతలు మెచ్చగ దేశదేశముల్
    విపులపు రాజధానినిట పెన్నిధి గాగను రాష్ట్రవృద్ధికై
    చపలత క్రొత్తమంత్రులయొ చేయగ మార్పులు కూలెనాశలే
    టపటప ధన్ధనాధన ఢఢంఢఢ తుస్సు బుస్సుతుస్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కపటముజేయు శ్రేష్ఠులను గాంచక దివ్వెల పండుగందునన్
    విపణిని నుండి తేబడిన పెద్దవినైన టపాసు బాంబులున్
    నిపుణతలేమి వల్లను కనీసపు గర్జన చూపకిట్లనెన్
    టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్

    రిప్లయితొలగించండి


  12. కెపకెప వేజకు అత్రా
    యిపకు తమార్! వ్యాండొకోని యీ నీలోగచ్
    చపకుచపక్ భూరోభట్
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా...
      ఈ పద్యాలు ఏ భాషలో రాసారు, వాటి భావం కూడా చెప్పగలరు..
      అన్యధా శరణం నాస్తి...

      తొలగించండి


  13. కంద చంపకము


    మెటమార్ఫ్! కత్తా కన్నా
    నట! టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చి
    ట్పట బుస్సు తుస్సు తుస్ కూణ్
    గుట!కాయి కసంచ ఛేళి గుటు కాళోకట్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. కపట కరోనకు భయపడి
    టపాసులను కాల్చమనిరి డంబము జూపన్
    నెపముగ గాల్చగ వినబడె
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
  15. కపటపు హామీల నొసగి
    విపరీతము గా పొగడియు విజయము పిదపన్
    కృప వీడగ తన మాటలు
    టప టప ధన్ ధన్ చిట పట ఢం ఢం ఢ డ తుస్

    రిప్లయితొలగించండి
  16. టపటప,ధన్ ధన్ చిటపట,ఢం
    ఢండడ,
    తుస్, సుయ్యి, బుస్ పి పీపి


    శబ్దముల్ వినిదివ్య చక్షువు తనతల్లి
    నడుగగ తెలిపెత‌నయునకు వివ

    రములను,టపటప రవములు సీమట
    పాసులు ధన్ ధన్ బాంబులౌట్లు

    చిటపట మనుచుండు చేతిలో
    కాకర
    పువ్వొత్తులు వెలుగ,పుడమి పైన


    జడలు ఢం,ఢండ డడ మని విడువక పది

    నిముషముల్ ప్రేలు తుస్ బుస్ మని యను కొన్ని

    కాలకన్, సుయ్యిమను జువ్వ కాలి,యనుచు

    గుడ్డి బిడ్డకు తెలిపెను కోర నతడు

    రిప్లయితొలగించండి
  17. సమస్య :
    టపటప ధన్ ధనాధన ఢ
    ఢం ఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్

    ( గంగావతరణం )

    సఫలభగీరథప్రభుడు
    సార్థకయత్నుడు భక్తి బిల్వగా
    జపలత నీశ్వరున్ మరచి
    చయ్యన దూకుచు దాండవింపగా
    నపరిమితాంధ గంగ ; కిక
    నంతయు గర్వము నంతరించెనే !
    టపటప ధన్ ధనాధన ఢ
    ఢం ఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్ .

    రిప్లయితొలగించండి
  18. విపరీతముగా కొని యట
    టపాసులను కాల్చిరంట టక్కరి చొరలె
    ల్ల, పరిసరములట మ్రొగెను
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
  19. తపముయు జేయు మునులణచు
    కపటముతో కృష్ణుడు నరకాసురునిన్ జం
    పె,పుడమినపేలె బాణము
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
  20. కపటపు వాగ్దాన ఘనులు
    ఉపెన్నికలలందు నోడి యుస్సురుమనిరే
    విపరీతము చెల్లదెపుడు
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!

    రిప్లయితొలగించండి
  21. ఈనాటి శంకరాభరణం సమస్య

    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ తుస్

    నాపూరణ
    (సవరించి)

    విపులకు రెండేళ్ళయినను
    విపులము గామాటలొచ్చె వివరింపంగా
    యెటులీ దీపావళి యన ,
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ తుస్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  22. నిపుణులబెట్టియోటులనునించిపటాకులకాటపట్టనన్
    దపమనరేబవళ్ళువిశదంబుగనేతలుడబ్బుపంచియున్
    సఫలతబొందకేయెదవిషాదమునొందసమీక్షయందునన్
    *“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”*

    రిప్లయితొలగించండి
  23. కం.
    జపముల్ జేసెడి మునులన్
    జపలత్వము తోడ హనుమ సంకటపరిచెన్
    కపివరుని రభస జూడగ
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
  24. కపులన్నియు జేరి యచట
    విపరీతపు రభస జేసి వెర్రిగ గెంతన్
    అపుడే పేలెఁ టపాసులు
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఠపటప సీమటపాసులు
      కపి చేష్టల బాలలంత కలియన్, వా రా
      తపముల బాంబుల గాల్చగ
      టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢడ తుస్.


      తొలగించండి
  25. రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు🙏
      18.11.2020

      నా పూరణ యత్నం..

      *కం||*

      కపటము నెరుగని పతియొక
      జపమొనరించెను గెలువగ జాయను నింటన్
      తపనగ సతితో తలపడ
      *“టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్”*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
      🙏😀

      తొలగించండి
  26. అందరికీ నమస్కారం🙏

    జపమును జేసి తా జనుల జాగృత బర్చెను నేర్పు జూపగన్
    తపమును పట్టె స్మార్టుసిటి తానిక చేసెదనంచు డాబుగన్
    నెపముల జూపి ముంచిరిగ నేతలు మారగ రాజధాని యే
    *“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”*

    వాణిశ్రీ నైనాల, విజయవాడ

    రిప్లయితొలగించండి
  27. కపటపువాక్పటుత్వమటకంటకప్రాయముసంకటంబులన్
    జపలతచెట్టుపుట్టలకుచయ్యనమ్రొక్కిడినంగనాచియై
    నిపుణతరంగరించిబలునిందలమోపియుమొట్టెయిట్టనెన్
    *“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”*

    రిప్లయితొలగించండి
  28. టపటపశబ్దముగలుగుచు
    విపరీతపుసద్దుతోడభీతినిగలుగన్
    చపలతగాల్చగవినబడె
    టపటపధన్ ధన్ చిటపటఢంఢంఢడతుస్

    రిప్లయితొలగించండి
  29. కపటపుమాయమాటలనుకాముకచేష్టలకాంతదాసులై
    చపలపుబుద్దితోడుతనుచేనునుమేసెడికంచెవోలెతా
    రెపరెపలాడుచున్దిరుగుఱేఁడులదర్పమణంచుడీవిధిన్
    టపటపధన్ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతుస్

    రిప్లయితొలగించండి
  30. తపతప యాడించఁగఁ గం
    చు పాత్రలో గులక ఱాళ్ల చొప్పయ్యెను నీ
    దు పలుకులు వికారము లివి
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్


    రెపరెప లాడ నిండ్ల పయి రివ్వున టెక్కెము లల్ల నల్లనం
    దపతప ఱెక్క లూపుచుఁ బతంగము లుబ్బునఁ దిర్గఁ జెల్గఁగన్
    "మపద నిసా" స్వరమ్ము లవి మత్తుగఁ గాల్చఁగఁ జిచ్చుబుడ్డులం
    డపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్

    [(సరిగ) మపదనిసా]

    రిప్లయితొలగించండి
  31. చం:

    కపటపు రాజకీయమున కాలును దువ్విన చీను సైన్యమున్
    నిపతన మొందునట్లు రణ నీతిని నెర్పగ ,దేశ దేశముల్
    శపనము సేయ, భారతమె సత్తువ జూపగ మళ్ళి రిట్లుగన్
    టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బస్సు తుస్సు తుస్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. కుపితమనస్కుడెప్పుడునుగోపముతోడనబళ్ళుకొర్కగా
    టపటపధన్ ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతున్
    టపటపయంచుబేలెడుపటాసునువోలెనురావమొందుచున్
    నెపుడునుమంచికాదుగదయీవిధమైనదురావమీయగా

    రిప్లయితొలగించండి
  33. కపటమెరుంగని మాన్యుడు
    నెపమెన్నడుతానెవరినినిందలువేయం
    డపుడపుడునొందుకోపము
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

    రిప్లయితొలగించండి
  34. చపలత్వమ్మున బల్కగ
    ఎపుడైననిషేధమేల యీ పండుగకున్
    టపటపటపాసుకాల్చగ
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!!

    రిప్లయితొలగించండి
  35. కం. కపటము నెఱుగని గురువుల
    నెపమెంచుతువిద్యనేర్వ నెనరుంచకచెం
    ప,పగులగొట్టెను,తనయున్
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్.

    రిప్లయితొలగించండి
  36. ఢపఢపడప్పుమోతలుగ ఢామ్మని ప్రేలెడి బాంబు శబ్దముల్
    చపచపచప్పటంచుకడుచక్కగ వెల్గెడు చిచ్చు బుడ్లతో
    నెపుడునుదివ్యదీపములనేకమునేడవి మృగ్యమవ్వగా
    టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్

    రిప్లయితొలగించండి