21, నవంబర్ 2020, శనివారం

సమస్య - 3551

22-11-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఆకసమునందుఁ దోఁచె శశాంకశతము”

(లేదా…)

“ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”

64 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ఆకలి కాగలేకయిక హ్లాదము నొందుచు నర్ధరాత్రినిన్
    పీకుచు కోడి మాంసమును బీరును గ్రోలిన మైకమందునన్
    కూకటపల్లి వీధినిక గుట్టుగ వీరుడు పైకిచూడగా
    నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై....

    రిప్లయితొలగించండి
  2. ధర్మపరుడైనరాముఁడుధరణియందు
    రాజ్యమేలంగప్రజలునురాగమంద
    సూర్యవంశంబుశోభిల్లెసూనుఁజూచి
    ఆకసమునందుఁదోచెశశాంకశతము

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మహిమ గలిగిన కార్తీక మాస మందు
    దీప్తి చెందెడి యాకాశ దివ్వె లన్ని
    అనగిపెనగి మనలకెల్ల నబ్బురముగ
    ఆకసమునందు దోచె శశాంక శతము.

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వాకిటి బైటకున్ జనుచు ప్రక్కను గేహపు సుందరాంగినిన్
    తేకువ మీర మెచ్చగను తీయుచు భామయె రోలులోననున్
    రోకలి బుఱ్ఱమీదనిడ రోమియొ తూలుచు పైకిచూడగా
    నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై....

    రిప్లయితొలగించండి
  5. తాకనెమానవుండుతనదాపునచంద్రునివన్నెచిన్నెలన్
    రాకెటుపంపగానచటరాకకుపోకకుదారిచూచెగా
    ప్రాకగమేధతోడుతనుప్రాభవమందెనుచల్లగానటన్
    ఆకసమందుఁదోచెనుశశాంకశతమ్మదినేత్రపర్వమై

    రిప్లయితొలగించండి

  6. మైలవరపు వారి పూరణ

    వేకువ జామునందు నృపవీథినినేగగ, విద్యుదుజ్జ్వలత్
    ప్రాకట దీపికాచయము రంజిలుచుండెను స్తంభపంక్తిపై,
    శ్రీకరమౌ శశాంకతతి చీకటి చీల్చుచునున్నరీతి., నా
    యాకసమందు దోచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  7. జాల్రా :)



    సఖి! కవీశ్వరులకిదేను సమయమాయె!
    రాత్రి తొమ్మిది! బ్లాగ్విహారమ్ము లలర
    యాకసమునందుఁ దోఁచె శశాంకశతము
    శంకరాభరణ మనెడు సైరిభమున


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ప్రియసఖుడు జన్మ దినమంచు పిలిచె నంచు
    సంబరముతోడ నటకేగి సరదు మించి
    సుప్రతిభ గ్రోలి తూలుచున్ జూచినంత
    నాకసమునందుఁ దోఁచె శశాంకశతము

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వీకను శంకరున్ గొలిచి పెంపుగ కార్తిక మాసమందునన్
    జోకగ దేవళమ్మునను సొంపుగ దీపములుంచి నంతటన్
    పైకని నిల్పుచున్ ద్యుతిని ప్రాకగజేయ నపూర్వమౌనటుల్
    నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై.

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    ఆకసమందు దోచెను శ
    శాంకశతమ్మది నేత్రపర్వమై

    ( " ఆజాద్ హింద్ ఫౌజు " నిర్మించిన సుభాసుచంద్రుడు భారతీయులకు దాస్యాంధకారాన్ని బాపే నూర్గురు చంద్రులుగా కనిపించాడు )
    ఉత్పలమాల
    ------------

    చేకొని మాతృదేశమున
    చేరిన యాంగ్లుల పారద్రోలగా
    వాకొనలేని పౌరుషపు
    భారతసైన్యము " హిందుఫౌజు " నే
    యేకత చంద్రబోసు " జయ
    హిం " దని స్థాపన జేసి నిల్వగా
    నాకసమందు దోచెను శ
    శాంకశతమ్మది నేత్రపర్వమై .

    రిప్లయితొలగించండి
  11. వీకను గాధిరాజసుతు వెంట జరించుచు కానయందునన్
    తాకగ రామపాదమది ధన్యతనొందెను రాయినాతియై
    నాకము నుండుదేవతలు నాట్యము సల్పగ హర్షమొందుచున్
    ఆకసమందు దోచెను శశాంకశతమ్మ ది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేకువ ప్రేయసిన్ గలువ దీపములారిన వేళచాటుగా
      చేకొని నిచ్చెనొక్కటి విశేష ప్రయత్నము
      జేయనెంచగా
      దూకుచు జాగిలమ్మొకటి దొర్కగబట్టగ
      పిక్క , భీతిచే
      నాకసమందు దోచెను శశాంశతమ్మది
      నేత్రపర్వమై

      తొలగించండి
    2. శ్రీకర రామనామమది చేరగ నింపుగ
      కర్ణమందునన్
      వేకువ ఝామువేళ బహువింతగ
      చెట్టుకొమ్మలన్
      ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచి
      త్తాకసమునందు దోచె శశాంక శతమ్మది నేత్రపర్వమై

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణ రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏

      తొలగించండి
    5. సవరించిన పూరణ

      శ్రీకర రామనామమది చేరగ నింపుగ
      కర్ణమందునన్
      వేకువ ఝామువేళ బహువింతగ శింశుప వృక్షశాఖలన్
      ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచి
      త్తాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై

      తొలగించండి
  12. అందరికీ నమస్సులు🙏

    దూకుడు చూపుచున్ మనసు దోచు టపాసులు కాల్చ దండిగన్
    చీకటి చీల్చు దీధితులు శీఘ్రము మారెను వెన్నముద్దలై
    వేకువ యోర్వలేనటుల వేడుక లంబరమంట నివ్విదిన్
    *“ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  13. పండు వెన్నెల విరబూయ వారకాంత
    ప్రియుడి కోసమై వేచెను రేయిబవలు
    తెరిపి లేకుండ వెదికెను తీక్షణముగ
    ఆకసమునందుఁ దోఁచె శశాంకశతము!!

    రిప్లయితొలగించండి
  14. అందరికీ నమస్సులు🙏

    *నా సరదా పూరణ యత్నం*
    (కేవలం ఊహించి మాత్రమే)😊

    *ఉ*

    చీకటి బోక ముందు పతి చేరెద నింటికి యంటు చెప్పగన్
    సోకులు జేసుకొన్న సతి చూపులు గుమ్మము ముందుబెట్టియున్
    రాకనె చెప్పు కాలమున రంకెలు వేయుచు భార్య కొట్టగా
    *“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "... నింటి కటంచు జెప్పగన్..." అనండి.

      తొలగించండి
  15. కె.వి.యస్. లక్ష్మి:

    మహిమ గలిగిన కార్తీక మాసమందు
    మహిని ఘనముగ శంభుని మందిరముల
    వెలుగు ఆకాశ దివ్వెల జిలుగులవియె
    ఆకసమునందు దోచె శశాంక శతము.

    రిప్లయితొలగించండి
  16. ప్రాకట మైన పర్వమని బాలురు వృద్ధులు కోడెకారులున్
    చీకటి వేళజేరిరట చేతులనూపుచు నృత్యమాడుచున్
    కౌకుబమంతగూడి యట గాల్చ మతాబులు భ్రాంతి కల్గెనే
    ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    చీకటి మిగిల్చి సీత కశోక వనిని
    గోడు వెట్టిన రక్కసి కూలె ననఁగ
    సీత మదివీణ మీటగ శ్రీరఘ పతి
    యాకసమునందుఁ దోచె శశాంక శతము

    ఉత్పలమాల
    కైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్
    జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నా
    కైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్న సీతకై
    యాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
  18. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    ఆకసమునందు దోచె శశాంక శతము
    (లేదా)
    ఆకసమునందుదోచెను శశాంక శతమ్మది నేత్ర పర్వమై

    నా పూరణ

    1) ఆ.వె.
    గంగ హారతి గనులార గాంచునపుడు
    దీప కళికా వినిర్గత దీప్తులమర
    పుణ్య కార్తీక పౌర్ణమి పులకరించె
    ఆకసమునందు దోచె శశాంక శతము

    2) ఉత్పలమాల
    నాకము మించిపోవు భవనమ్ముల కాంతులు మిన్నునంటగన్

    వాకిటఁ విద్యుతుల్ మెఱయు వర్తుల దీప్తులు శోభఁగూర్చగాఁ

    బ్రాకట వైభవమ్ముగను రాముకు సీతకుఁ బెండ్లియౌ తరిన్

    ఆకసమందుఁ దోచెను శశాంక శతమ్మది నేత్ర పర్వమై

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'రామునకు' అనడం సాధువు.

      తొలగించండి
  19. దివ్వెలు వెలిగించెడి పర్వదినపు రేయి
    బాలురందరొ కేతూరి పయికివిసర
    జువ్వలు నెగసి విరియుట జూచి నంత
    నాకసమునందుఁ దోఁచె శశాంకశతము

    రిప్లయితొలగించండి
  20. పెళ్ళి సాక్షిగా గూడిరి ప్రేమజంట
    మల్లెపందిరిమాటున మంచమేసి
    మగువ కురులను పూలను మగడుజూడ
    ఆకసమునందుఁదోచెశశాంకశతము

    రిప్లయితొలగించండి
  21. శాస్త్ర వేత్తలు వదలిన శాట లైటు
    వెలుగులను జమ్ముచూ చేరి వింత గాగ
    నాకస ము నందు దోచె శశాంక శతము
    లనుచు జనతతి వీక్షించె హర్ష మొదవ

    రిప్లయితొలగించండి
  22. ఇన్నినాళ్ళకునుదయించెనింటియందు
    నందనుడుభువివిరిసెనానందహేల
    దేవతలదీవెనలఫలంబీ వరమ్ము
    ఆకసమునందుఁ దోఁచె శశాంకశతము

    రిప్లయితొలగించండి
  23. కొద్దిపాటి సవరణలతో...

    తేటగీతి
    చీకటి మిగిల్చి సీత కశోకవనిని
    గోడు వెట్టిన రక్కసి కూలె ననఁగ
    హృదయవీణ మీట కుజకు నినకులుండు
    యాకసమునందుఁ దోచె శశాంక శతము

    ఉత్పలమాల
    కైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్
    జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నా
    కైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్నఁ గాంతకై
    యాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
  24. పీకలుద్రెంచువాడునలివేణులవేడుకతార్పుకాడుదా
    పీకలదాకదాగికనిపించినమేకనుగావుపట్టెడా
    జీకటిశక్తిపోషకుడుసేనకుజిక్కగదండపెట్టుచో
    *“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*

    రిప్లయితొలగించండి
  25. సంజ సమయము లందున చక్కగాను
    హారతు లొసగ తులసికి నతివ లెల్ల
    కాంతులీనుచు నత్తరి ఘనముగా ను
    నాకసము నందు తోచె శశాంక శతము

    రిప్లయితొలగించండి
  26. ఉ:

    ఏకము జేసిరల్లరిగ యింటిని పిల్లలు గోల సేయుచున్
    పోకడ నెంచి వారలను పూనుచు జేగొన వేధశాలకున్
    చేకురువొందె చూడనటు చేరువ చుక్కలు, కాంతి పంజము
    న్నాకస మందు దోచెను శశాంక, శతమ్మది నేత్ర పర్వమై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. పీకలవరకు ద్రాగినవెంకికపుడు
    నాకసమునందుదోచెశశాంకశతము
    మత్తుగలుగుట నట్లుగామభ్యపెట్టు
    చంద్రుడొక్కడేగదయుండు చదలునందు

    రిప్లయితొలగించండి
  28. గాన వేదిక కాఁగ నాకాశ మచటఁ
    దారలు చెలంగ నింపగు తారల వలె
    వదనములు వెల్గఁ దోయజ వైరి భంగి
    నాకసము నందుఁ దోఁచె శశాంక శతము


    దూఁకఁగ మత్స్యకోటు లవి తోఁచఁగఁ దారల పంక్తి భంగినిన్
    వీకఁ జెలంగ నంత వినువీధిని నుర్ములు వాన కుర్య నా
    రాకకు నీటిబొట్టుల పరంపర వెల్గఁగ సందరమ్ము నా
    నాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
  29. అంతరిక్షానికేలనో నాయుధమ్ము
    తగని నాయకుడొచ్చిన దప్పుదెలియు
    పెద్ద ముప్పొచ్చు యుద్ధాన పెఠిలుమనుచు
    నాకసమునందుఁదోచు శశాంకశతము

    రిప్లయితొలగించండి
  30. దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలో
    నాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమై
    నాకపుచంద్రుడయ్యెడను నవ్వులమోముగ గానిపించగా
    జీకటియంతయున్ దొలగిచిక్కెనుదెల్లటికాంతితోడుతన్

    రిప్లయితొలగించండి
  31. చీకులు చింతలన్ మరచి సేయగ పండుగ దెచ్చిరందరున్
    కాకర వత్తులున్ పలురకంబుల వింత టపాసులన్నియున్
    చీకటి రాత్రి వేళ విరజిమ్ముచు కాంతుల వెల్గె నంతలో
    ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
  32. నాకలలేఫలించెమదినాట్యముజేసెమయూరమై నమో
    వాకములర్పణంబిడెద పావనమూర్తికి పార్వతీశుకున్
    శోకముబాపిమానసము శోభిలజేసిన వేళ హేలగా
    నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల:
    ++++++++++==
    భీకరమైన రోగమిది,భీతిలిపోయెను విశ్వమంతయున్!
    రేకలు వీడమేలగను,రేపును మాపును రోగతంత్రముల్
    వేకువలాగవచ్చినది,వేక్సిను వచ్చునటన్న వార్తతో
    నాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై.

    రిప్లయితొలగించండి