18, జనవరి 2021, సోమవారం

సమస్య - 3608

19-1-2021 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాయను నను వీడి పోకురా యను రాయా”

(లేదా…)

“రాయను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్”

72 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



పోయెద ననవలదయ్యా
నా యయ్యరువీవు! సామి! నా గేస్తువిరా!
నీ యాన ! పద్యముల నే
రాయను! నను వీడి పోకు, రాయను రాయా!



జిలేబి

BMahalakshmi చెప్పారు...

వీయగచల్లనిగాలులు
పూయగగంధముమనసుకుభూరిగశోభన్
హాయనుమాటలనేమని
కాయను? ననువీడిపోకురాయనురాయా

యెనిశెట్టి గంగా ప్రసాద్ చెప్పారు...

వేయని వేషము లేదే
మాయలు పన్నుచు గడిపితి మమతలు పంచన్
ప్రాయము మీరగ మనసుకు
రా యను నను వీడి పోకురా యను రాయా!

Haranath Rao Chennamsetty చెప్పారు...

మాయ పడితి కావగ రా

రా, యను నను వీడి పోకు, రాయను రాయా
రాయా భజించెద తెలుపు

మాయా మోహములు దాటు మధురపు త్రోవల్

...భారతీనాథ్ చెన్నంశెట్టి...

Yajnesh చెప్పారు...

దేవకీదేవి ఉవాచ:

ఆ యమ్మకు జూపితివట
నీయాస్యమునందు నాడు నిఖిల జగంబుల్,
"నీ యనురాగము గోరుదు
రా" యను నను వీడి పోకు, రా యను, రాయా!

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

ఓయన లేను రాను మరులూయెల లూగగ లేను బేలరా
యూ యనలేను ఛీయనగ నుల్లము నొప్పదు గుండె రాయయెన్
దాయగ లేను మాయయని దాయక పో కభయంబు నీయ *రా*
*“రా!యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్”*

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చేయను దూషణ పరులను
ఛీ యని యనిపించు కొనను చెడు కవితలతో
పాయక గొల్తును గావుము
రా ' యను నను వీడి పోకురా యను రాయా

ఉదయ భాస్కర్ చెప్పారు...

న్యాయమ్మా నేస్తం నే
చేయదగని పనులనేమి జేసితినయ్యా
పోయెద ననకోయ్ అత్తరు
రాయను నను వీడి పోకు రాయను రాయా

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

నీ యశమును కాపాడుచు
నోయారమునౌ విధమున నుపచారములం
జేయుచు నుండు సఖుని నను
రా! యను, నను వీడిపోకురా యను! రాయా!

విరించి చెప్పారు...

మేయరు వైన నీకతడు మిత్రుడు, నాహృదయమ్మునుండెనా
లాయరు, నన్ను కాదని చిరాకుగ మాటలనాడు చుండెనే
సాయము జేయుమా! యతని సన్నిధి కేగి, యభీష్ట యైన తా
రా యను నన్ను వీడకుమురా యను, రాయ పరాయణోక్తులన్.

విరించి చెప్పారు...

శ్రేయోభిలాషి వనుచును
ప్రోయాలే పలికె, నీదు బోడిక యౌ యా
లాయరు తో చెప్పుడు, తా
రా యను నను వీడి పోకురా యను, రాయా

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

నీ యశమున్ ప్రసిద్ధమగు నీ ప్రతిపత్తిని లోకమంతటన్
సోయగమైన పద్థతిని సూటిగ వ్యాపనమొందజేయుచున్
హాయిగ నిచ్చలున్ కదలు నాప్త సఖుండను నన్ను ప్రేమతో
రా!యను,నన్నువీడకుమురా!యను, రాయ! పరాయణోక్తులన్.

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సమస్య :
రాయను ననువీడి పోకురా యను రాయా

( నిద్రలో కాలు తగిలిందని కోపించి రావటం మానిన శ్రీకృష్ణదేవరాయల వద్దకు చిన్నాదేవి పంపిన చెలికత్తె వచ్చి అంటున్నది . )

కందము
...............

మా యనుగుం జెలి చిన్నయె
యా యపరాధం బొనరిచె ; నయినన్ సతమున్
" గాయము నిదురన్ జేసితి ;
రా ! " యను ; " నను వీడి పోకురా ! " యను; రాయా!

Raja Rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Raja Rao చెప్పారు...

కె.వి.యస్. లక్ష్మి:

మాయా మానుష రూపుడ!
నీ యతులితమౌ నెనరుల నెంచుచు రాధే
తీయగ పాడుచు కృష్ణా!
రా! యను, నను వీడిపోకురా యను! రాయా!

Yajnesh చెప్పారు...

హేయ మదేల యౌను తెగ యింతుల మానధ నంబునీవ కా
త్యాయని పూజ సల్పితిని యాదవ భూషణ నిన్ను చేరగా
మాయలు మానుమయ్య యిక మన్మథ బాధల నేగలేనురా
రా! యను నన్ను వీడకుము రా యను రాయ పరాయణోక్తులన్.

Zilebi చెప్పారు...



టపటప పద్యములను దెప
గుప రాయను! నన్ను వీడకుము! రాయను రా
య పరాయణోక్తులన్, వల
దు పత్ని పైకినుకయు వలదు వలదు వలదోయ్


జిలేబి

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ఏయుగమందైననునే
నీయనువర్తిని మురహర నీరజనాభా
బాయక దరిచేరగరా
రాయను ననువీడిపోకురాయనురాయా

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మాయలు చేయకు కృష్ణా
రేయీ పగలనకవివిధ రీతులయందున్
తోయజనేత్రా పిలిచితి
రాయని ననువీడిపోకురాయనురాయా

కంది శంకరయ్య చెప్పారు...

(నాయికా విరహవేదనను నాయకునితో చెప్పుచున్న చెలికత్తె)...

నీ యతులానురాగ తరుణీమణి ముగ్ధ వియోగమగ్న "యౌ
రా" యను, "గన్నులారఁ గనరా" యను, "లోకులు విన్న నవ్విపో
రా" యను, "జాగు సేయకుమురా" యను, "నీవొకసారి వచ్చి పో
రా" యను, "నన్ను వీడకుమురా" యను రాయ! పరాయణోక్తులన్.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పద్యాలతో మరీ అంతగా బాధపెడుతున్నారా పాపం! బాగుంది మీ పూరణ. అభినందనలు.
నిజానికి 'వ్రాయు' అన్నది సాధురూపం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యాపాదంలో టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నేస్తం" అనడం వ్యావహారికం. "నేస్తమ!" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తెగ నింతుల..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రేయియు.. రీతులతోడన్.." అనండి.

కంజర్ల రామాచార్య. చెప్పారు...


నిన్నటి పూరణ.

పొందునుఁ గోరి వెంటఁ బడఁ బోకిరిమూక
నిజాము సైనికుల్
కొందరు రజ్వి కాశిములు,... కుందుచు నీ తెలగాణశౌర్యసు
స్పందితసుందరీమణులు చయ్యన వారల శీలభంజనా
నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై.

కంజర్ల రామాచార్య.

chandrashekhar yelisetty చెప్పారు...

ప్రేయసి రాసే లేఖ గా నా ప్రయత్నము:

ఉ:
దాయగ లేను నీ విరహ తాపము నోర్వగ లేనటంచు తా
వ్రాయుచు పేమలేఖ మయి భారము మోయగ తల్లడిల్లుచున్
తీయుచు కూనిరాగములు తీరుగ బల్కెను మాటిమాటికిన్
రా యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్

వై. చంద్రశేఖర్

Learning Bhagavatam చెప్పారు...

ప్రేయసి ప్రియముగ ప్రియునితొ
రా యను, నను వీడి పోకు, రా, యను, రాయా,
నేయముగ నిన్ను కోరా
ప్రాయము నీకే యను తను ప్రాధేయముగన్

seethadevi gurram చెప్పారు...

రామ వియోగమున దశరథుని స్థితి

పాయని ప్రేమబంధమున బాధను కుందుచు భూమి పైబడున్
హా!యను, పాతకుండ! మునిహత్యను జేసిన శాపమే
యనున్
ఛీ! యను, కాముకుండనయి చేసితి ద్రోహము నీకు రామ యౌ
రా!యను, నన్నువీడకుమురా! యను రాయ పరాయణోక్తులన్

యెనిశెట్టి గంగా ప్రసాద్ చెప్పారు...

🙏

Learning Bhagavatam చెప్పారు...

కాయమున నిలువు నీవు, హ
రా, యను నను వీడి పోకు, రా యను, రాయా
ఆయువు నీకే, శరణము
నీయు మను, వదలకము నను, నీవను మనసా

Surya చెప్పారు...

ఆ యమ నిన్నే వలచెను
నీ యెడబాటునకు నిక్కి నిష్ఠురమాడెన్
వాయపు మాటల నిక నే
వ్రాయను నను వీడి పోకురా యను రాయా

purushothamarao ravela చెప్పారు...

మూయగలేరు మూతులను,ముందుగనాపగ బూతు మాటలన్
వ్రాయగలేరు కావ్యములు,రాపిడినివ్వని వస్తుసంవిధిన్
సాయముగానురారికను,సర్వము నాపగ రోగవిస్తృతిన్
రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్
+++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

విరహంతో తల్లడిల్లే శకుంతలను జూచి చెలికత్తెలు ఎంతకూ రాని రాజు దుష్యంతుని తలచుకొంటూ ...

కందం
సోయఁగమందిసుతునొసఁగ
నీ యనురాగానురతిని నిద్దురనైనన్
రోయు శకుంతల కావగ
రా! యను నను వీడిపోకురా! యను రాయా!

ఉత్పలమాల
కోయిలకూజితమ్ములె శకుంతల పెండ్లికి మేళతాళముల్
సోయఁగమంది సంతుఁగని సూడఁగ రావని కల్వరింతలన్
నీ యనురాగమున్ గొనఁగ నిద్దురనైనను భామ "కావగా
రా! " యను "నన్ను వీడకుము రా! "యను రాయ! పరాయణోక్తులన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తోయజ నేత్రను గాంచుమ
నీ యెదఁ జోటిమ్ము నాకు నెమ్మిని జాఁ గే
లా యివ్విధమ్ముగా రా
రా యను నను వీడి పోకురా యను రాయా


రాయఁడ నిన్ను గాంచి వర రాజకుమారి మృగేంద్ర మధ్యయే
వే యనురాగ మూని మది వింతగ నొక్క త్రుటిం జెలంగి తా
సోయగ మందు గర్వమున సుందర గాత్ర సమేత యౌవన
ప్రాయను నన్ను వీడకుమురా యను రాయ! పరాయణోక్తులన్

[రాయ = రాయ బిరుదు కలవాఁడా]

sailaja చెప్పారు...

ఓ యదునందన శౌరీ
నీయడుగుల సడియె వినగ నిలచితి నోయీ
మాయల మానసచోరా
రా యను నను వీడిపోకురా యను రాయా!!!

sailaja చెప్పారు...

రేయియె నవ్వె మాధవుడ లేతగ తాకెను పూలతావులే
మాయలు చాలు, గోపికల మధ్యన యుంటివొ మర్చిరాధికన్
గాయము లయ్యె నామదికి గమ్మున తీయగ వేణువూదుచున్
రా, యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్!!!

subbarao చెప్పారు...

మాయలమారివికృష్ణా!
రాయనుననువీడీపోకు,రాయనురాయా!
నీయానతికొఱకైయిట
రాయిగనేనుంటిగదర రహిచెడికనుమా

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

నీ యనురాగ ప్రేమమయ నిర్మల రాగసుధాబ్ధి చంద్రికా
శ్రీ యిసుమంతయైన యెద జేరిన బుద్ధి ప్రభాకరుండు స
న్నాయిని మీటు చిత్తమను నట్టువ నాట్యము సల్పు వచ్చి పో
*“రా!యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్”*

subbarao చెప్పారు...

రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్
నాయపరాధముల్గనక నన్నునుజూడుముదయామయుండవై
నీయడుగుల్ శిరంబునను నిల్పుచుసేవలుసేయువాడనే
పాయకయుండుమాయికను భద్రగీరీశుడ!రామ!నామదిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

రాయనిగాంచగనె వలపు
రాయని సుమశరములఝరి రాయిడివెట్టన్
కాయము గాయము బాపుము
రా! యను నను వీడి పోకురా యను రాయా!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రియునితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
'నిన్ను కోరా' ?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు మనోహరహంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Haranath Rao Chennamsetty చెప్పారు...

కంది శంకరయ్య
చాలా బాగుందండీ.
“రా” ను వదలక పదే పదే మీ నాయకి , చెలికత్తెతో పలికించిన విధానము అద్భుతమండీ

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా🙏