2, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3651

 3-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్”
(లేదా...)
“ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”

79 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కుదురుగ నుండజాలకయె కుత్సిత బుద్ధిని వీడియాదటన్
    చదువులు మాని దీదియట చక్కగ నేర్వగ రాజకీయమున్
    పదుగురు పల్కగా నిటుల భాజప కాంగ్రెసు కమ్యునిష్టు తో
    నిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్

    రిప్లయితొలగించండి
  2. సదమల చిత్తము గల్గియు
    పదుగురితో కలసి మెలసి బాగుగ మెలఁగన్
    విదితము నౌ గద నయ్యెడ
    నిది యది కానట్టి దే దొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
  3. విదితముకానిదికవితా
    నందముతెలిసినకవియునునక్కజమోందున్
    పదిలముగాగనుతిరమగు
    ఇదియదికానట్టిదేదోయిడుమోదమ్మున్

    రిప్లయితొలగించండి
  4. ఇదిగో భువి సంతోషము

    అదిగో స్వర్గపు సుఖముల యవ్వన కాంతుల్

    యెది కావలెనరయంగా

    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాంతుల్+ఎది' అన్నపుడు యడాగమం రాదు. "యౌవనరుచులే" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ
      సవరణలు పాటిస్తానండీ

      తొలగించండి
  5. అదవద చెందకు సఖుడా
    చదువులు వ్యర్థంబయె, వెవసాయమ్మది నీ
    యుదరము నింపక పోయిన
    నిదియది కానట్టిదేదొ యిడు మోదమ్మున్ .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అయె' అన్న క్రియారూపం సాధువు కాదు. "చదువులు వ్యర్థంబులె వ్యవసాయమ్మది.." అనండి.

      తొలగించండి
  6. సదమలచిత్తవ్రుత్తినినిస్సంగుడునైతిరమాసనంబునన్
    కదలనిమానసంబుననుకాంచగదివ్యముదీపమన్నిటన్
    కుదురుగశోభనిచ్చునదికూర్చునుశాంతినిసాధనంబునన్
    ఇదియదికానిదేదియోయదేయిడుచుండునుమోదమెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "సదమల చిత్తవృత్తి చ్యుతసంగుడునై స్థిరమాసనంబునన్" అనండి.

      తొలగించండి
  7. సమస్య :
    ఇది యది కాని దేదియొ య
    దే యిడుచుండును మోద మెప్పుడున్

    ( పారిజాతకుసుమాన్ని రుక్మిణీదేవి వేణిలో అలంకరించి సాత్రాజితి మందిరంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుని అంతరంగతరంగాలు )

    మది నిది కొల్లగొట్టినది
    మంజులభాషిణి సత్యభామయే ;
    కదలిక నాట్యమా ? విసుర ?
    కన్నుల బ్రేమయ ? నల్క చిందులా ?
    పెదవుల కంపమా ? విసుగు
    విర్పుల ? ముగ్ధమనోహరాంగిలో
    నిది యది కాని దేదియొ య
    దే యిడుచుండును మోద మెప్పుడున్ .

    రిప్లయితొలగించండి
  8. చదువులు వ్యర్థమయ్యె వెవసాయము నష్టము తెచ్చెనంచు నీ
    వదవద చెందబోకుము సహాయము చేసెడు వాడొకండె నీ
    సదమల చిత్తమందు గిరిజాయతిఁ గొల్చిన చాలు నేస్తమా!
    యిదియది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్ .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  9. కందం
    పొదవుకొన కౌగిటన్ దా
    'వదలు' వదలని ప్రియురాలు వట్టి బిగింపన్
    బెదవుల నద్దిన ముద్దున
    నిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    చంపకమాల
    ఎదురుగ ప్రేయసిన్ గనుచు నింపొనరింపగ నూసులాడుచున్
    జెదరిన పైటతో హొయల బిత్తర చూపుల నుండ గౌగిటన్
    బొదవుకొనంగఁ దా 'వదలు' ముచ్చట గాదన రేగు ముద్దులో
    నిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్

    రిప్లయితొలగించండి
  10. చెదిరెను కన్ను లోకమున చిందిన బంగరు కాంతి కాంచగన్

    అదిరెను మానసమ్ము సుర రాజును చూసిన కళ్ళు కాంతులన్

    ఇది యది కానిదొక్కటల ఈశుని వాసమె మోక్ష మార్గమౌ

    ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    ఇది యనగా శరీరమిది యెప్పుడొ నాశనమందు.,నట్టులే
    యది యన నల్లదే జగము.,నద్దియు శాశ్వతమౌనె., యెంచగా
    నెదొ గలదద్ది బ్రహ్మము., రహించును నిత్యమనంగ., సత్కవీ!
    ఇది యది కాని దేదియొ య
    దే యిడుచుండును మోద మెప్పుడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. అది యిది యని యననేటికి
    మదికి ముదము గలుగ జేయుమదియే చాలున్
    సదమలమగు హృదయముతో
    నిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి

  13. గురువర్యులకు నమస్సులు, నిన్న మీరిచ్చిన సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ఉత్సాహము:
    కూర్చుకుంటి సొమ్ము వేల కొలదిగా చికిత్సనున్
    నేర్చి యుంటి రనుచు నమ్మి నీతి పరులటంచు నే
    దూర్చినాడను తల! దమరి దుష్ట బుద్ధి నెంచగా
    జేర్చును పరలోకము దమ చేతి మాత్ర యయ్యయో!

    రిప్లయితొలగించండి
  14. వదనము జూడ చంద్రముఖి పాణిని బట్టిన ప్రాణనాయకే
    మది మథనంబు జేయుచును మానస వీధిని శాసనంబు తా
    వదలక జేయుచుండ బలు పాటులు తప్పవు రాసకేళిలో
    నిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సదనము ఖేద మోదముల సంకుల సంగమ సారమేగదా
      వదలని రాగ బంధములు వారణ సేయగ లేని మృత్యువున్
      సదమల చిత్తుడై తెలిసి సాగగ మర్త్యుడు ధన్యుడౌ సుధీ
      యిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'నాయకి+ఏ' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  15. చం:

    ఎదురుగ నిల్చినంతయునె యెక్కడ లేని యనన్య గారమున్
    ప్రదరము వోలు చందమున ప్రాకుచు చేరిన పట్టిపట్టి తా
    వదలక దెబ్బలాడినను వాదన జేయుచు వంక బెట్టినన్
    యిది యది కాని దేదియొ యదే యిడు చుండును మోద మెప్పుడున్

    పట్టి పట్టి =మనుమరాలు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నిల్చినంతటనె..." అనండి. 'అనన్య గారము' వైరి సమాసం.

      తొలగించండి
    2. సవరణ లతో..:

      చం:

      ఎదురుగ నిల్చినంతటనె యెల్లలు లేని యనంత గారమున్
      ప్రదరము వోలు చందమున ప్రాకుచు చేరిన పట్టిపట్టి తా
      వదలక దెబ్బలాడినను వాదన జేయుచు వంక బెట్టినన్
      యిది యది కాని దేదియొ యదే యిడు చుండును మోద మెప్పుడున్

      పట్టిపట్టి=మనుమరాలు

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  16. వదలక మది హరి పదముల
    కుదురుగ ధ్యానింప సతము కొదవయె లేకన్
    సదమలమౌ హృత్కమలము
    నిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
  17. పదిచీరలుచూసితినిగ
    సదరుగ, కానబడలేదు, చమకుల తణుకుల్
    మది కోరు క్రొత్త పుంతలు
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
  18. పదవియు విత్తము నొకదెస
    గుదురుగ నిల్చి యలవడిన గూడ నిరతమున్
    మది యేల దృప్తిగనదో !
    యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
  19. ఇది పాత డిజైను గదా,
    యెద దోచెడి శోభలేదు ఇందున, అకటా
    మది కోరు క్రొత్త పుంతలు,
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేదు+ఇందున' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "శోభ గాంచ నిందున నకటా.." అనండి.

      తొలగించండి


  20. నదియా! జిలేబి ! పూర్ణిమ
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
    మదిలో గిలిగింతలతో
    కదలిక తెచ్చును తెలియగ కాముని కృపయే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. చదునుగజేసి హలముతో
    పదునుగ జేయంగపట్టె పదిరోజులకున్
    వదలగ నిదియును నిపుడున్
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
  22. వదలుకొనలేను తల్లిని
    బదులుగమాటాడలేక భార్యతొ నుంటిన్
    కుదురుగ నుండగ, దేవా
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భార్యతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
  23. సదమలవృత్తిమాధవునిసన్నుతిజేసితిడెందమందునన్
    సదనముగట్టితిన్స్మరణసల్పితినిల్పితినాల్కనామమున్
    వ్యథలనుగట్టివైచితిజయంబునుగోరితికర్మపాశమే
    *యిది, యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”*

    పొదలనుమాటువేసితినిబోడులజేరితిమందయానలన్
    మదినిదలంచిగొల్చితిసమాదరణీయుడనైతిభోగముల్
    ముదిమిమరీచికల్హృదయమోదడియారెనునేడుమాధవా
    *యిది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”*

    రిప్లయితొలగించండి
  24. హృదయము పొంగిపోవు కడు నింపగు ప్రేమము సోకి నంతటన్
    సదమల వృత్తి వీనులకు చక్కని గానము సేద తీర్చగా
    కొదవ యొకింత లేక చవి గూర్చుచు నా హరి ధ్యానమొక్కటే
    ఇది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  25. పదపడి జీవనమ్ము క్షణభంగురమై స్థిరసౌఖ్యమేగతిన్?
    సదమలసాధువృత్తిఁ గను స్వర్గఫలమ్ము లవెంతొ యంతయే,
    తదితరశాశ్వతాప్తసుఖదాయకముక్తనివేశ మెయ్యదో!
    ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  26. ఇది యని తెలియని భావన
    మెదిలెను మది ముద్దరాలు మెయిమరపింపన్
    అది మరుశరమో వరమో
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి
  27. చదువులు బాగుగ జదివిన
    బదవులుదానుండునైన బహుళముగాగన్
    నెదనాబొందగ దనివిని
    యిదియది కానట్టీ దేదొ యిడు మోదమున్

    రిప్లయితొలగించండి
  28. కుదురుగ నుండు మెల్లపుడు

    గోరకు మందని కోర్కులేవియున్

    పదెపదె చింత జేసినను వల్సిన

    దేదియు నంద బోదు నీ

    మదినిది గుర్తు పెట్టుకొని మాన

    వ నడ్వుము కల్గు శాంతియున్

    ఇదియది కానిదేదియొ యదే యి

    డు చుండును మోదమెప్పుడున్"

    ~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  29. ఇది యని కాదు కాదు అదియేనని మానసమందు నిత్యమున్
    సదమదమౌచు నాత్మభవు శాశ్వతు మాయ నెరుంగ లేక నా
    కిదె పరమార్థమంచు నిహమీదుచు నీతి చరించు వారికిన్
    ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్

    రిప్లయితొలగించండి
  30. చదువుల తల్లియెప్పుడును సాదయనిండుగనీయవిద్యనున్
    బదవులె నేరుగా గలిగిప్రాఙ్ఞుని జేసిన నైననెంతయున్
    మదిగలవారందఱును మాన్యత తోడను మెల్గుచుండుటన్
    నిదియదికానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వారలందఱును... వెల్గుచుండగా । నిది యది..." అనండి.

      తొలగించండి
  31. అదనున పెండ్లాడమనుచు
    వదలక వెంటాడు జనులు; ఫలిత మదేమన్
    బదులుగ గుదిబండ యనును
    యిది యది కానట్టిదేదొ యిడుమోదమ్మున్

    ముదమున బెండ్లియాడుమని ముద్దుగజెప్పెద
    రెందరెందరో
    ఇదిమన సంప్రదాయమని యిల్లునుగట్టుచు పోరు
    వీనులన్
    బదులుగ నేమిలాభమన బాధ్యత బర్వుల
    మోతలే యనున్
    అదియిది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదియది కాదు కాదనుచు నింద్రియ, ప్రాణసమూహ మంతయున్
      వెదకుచు నిత్యమైన మయి వెల్గెడు నాత్మను ధ్యానమందునన్
      ఇదియని చెప్పలేనిదగు నీశ్వరభూతిని మున్గినంతనే
      అదియిది కానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'ఫలితమదేమన్'?

      తొలగించండి
  32. తుదిఁ గాంచ విత్త గృహముల్
    సదువులు భార్యా తనయులు శకట క్షోణుల్
    పదిలమ్ముగ నీ నేరవె
    యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్


    చదలున నున్న భావము భృశమ్ముగఁ గల్గును దూది మాదిరిం
    బదపడి చేయ నీయదు విపన్నునిఁ జేసి పరంబు నెద్ది యే
    నెద వడి దూఱి యూహ లవి యింతలు నింతలుఁ బెర్గి వింతగా
    నిది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్

    రిప్లయితొలగించండి
  33. హృదయము నందున సతతము
    కదలెడి దైవంబు నేడు కన్నుల యెదుటన్
    సదయుండై యగుపింపగ
    నిది యది కానట్టి దేదొనిడు మోదమ్మున్

    రిప్లయితొలగించండి