28, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3676

29-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్”
(లేదా...)
“శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్”

33 కామెంట్‌లు:



  1. పనిలేక కైపదమ్ముల
    పనిగట్టుకు నిచ్చుచుంటివయ్య కవీశా?
    విను మా ఆక్షేపణ! యే
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్?



    జిలేబి పరార్ :(


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఘనమౌ నాత్రిపురంబు రూపడచు సత్కార్యంబునన్ శూరుడై
    తన చాపంబు పరిగ్రహించి తగునుద్యత్క్రోధ భావాత్ముడై
    వెనువెంటన్ రిపుసైన్య సమ్హతిని నిర్వీర్యంబుగా జేయు నీ
    శు నకంబుం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్


    ఈశు నకంబు = ఈశ్వరుని బాణములు

    రిప్లయితొలగించండి

  3. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కనులన్ మూయుచు నవ్వుచున్ ఘనముగా కంగారు వోటర్లవిన్
    తినుచున్ మెండుగ కోటికోటి ధనముల్ తీండ్రించుచున్ మేలుగా
    కనకంబందున నొప్పు గద్దె గనుచున్ గర్వంబుగా నెక్కెడున్
    శునకమ్మున్ గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

    రిప్లయితొలగించండి
  4. కనగాకాలుఁడుభైరవు
    డనయంబునునిజముదెలియుడరయుడుదానన్
    వెనువెంటనడచునదియును
    శునకమ్మునుభక్తిగోలువశుభములుగలుగున్

    రిప్లయితొలగించండి
  5. వణుకుచు తరిమెను వీధిన్

    శునకమ్మును; భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    యనుచునట మొక్కు భైరవు

    కు , నరుడు బహు వింత జీవి కొండల రాయా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    వినయమ్ము న్ఘన భక్తియుక్తులు వెసన్వెల్గంగ సర్వేశ్వరు
    వ్వనమాలిన్గరుడధ్వజున్హరిని సర్వవ్యాపినిన్విష్ణునిన్
    జినునిన్ శ్రీపతినిం ద్రివిక్రము విధున్ శ్రేష్ఠుం బరేశున్మహే

    శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్!

    రిప్లయితొలగించండి
  7. వినయముతో గొల్వవలయు
    వినాయకుని వాహనమును వేడుక తోడన్
    ఘనుడౌ దత్తాత్రేయుని
    శునకమ్ముల భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    రిప్లయితొలగించండి
  8. మునుకొని యెన్నిక లందున
    ఘన విజయము నొంది యొకడు గద్దెను బొందె న్
    జన తతి మనమున దలఁచెను
    శునకమ్మును భక్తి గొలువ శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  9. జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా"

    తనయుని కన్నను మిన్నగ
    పనితనమును జూపితనకు బాసటయై దా
    ననయము రక్షణ నిచ్చెడు
    శునకమ్మును భక్తిగొలువ శుభములు గల్గున్

    కుక్కలకు ప్రేమతో చక్కని శిక్షణ యిస్తే అవి యెంతో సహకరిస్తాయి, ప్రేమిస్తాయి!

    అనుమానంబది వీడుమా! మనకు ప్రహ్లాదంబునే బంచుచున్
    బనిలో నెంతయు చాకచక్యమును సంపాదించి తోడై
    సదా
    తనయున్ మించెడి నమ్మకమ్మునను భద్రమ్మున్
    బ్రసాదించెడిన్
    శునకమ్ముం గడు భక్తిగొల్చిన లభించుంబో శుభమ్ముల్ గడున్

    రిప్లయితొలగించండి
  10. వినగాఁజేసినధర్మమేతుదకునావిష్కారమైనిల్చెడిన్
    మనకన్మాయమునౌనుగావినుతజన్మంబందునీసంపదల్
    అనయంబాశివుభైరవుంగోలుచుచోనాతండుశోభిల్లుగా
    శునకమ్ముంగడుభక్తిగోల్చినలభించుంబోశుభంబుల్గడున్

    రిప్లయితొలగించండి
  11. త్రినయుండంతట కమలా
    సనుదల ఖండింపనెంచి శఠమున సృష్టిం
    చిన భైరవునిన్ వాహము
    శునకమ్మును గొలువ శుభముల్ గల్గున్.


    కినుకన్ బూనిన యంతకాంతకుడు లోకేశుండు సృష్టించె తా
    జనవంద్యుండగు భైరవున్ నలువశీర్షంబున్ విభాళింపగా
    ననుసూయా! విను శంకరున్ మరియు ప్రత్యంతమ్ము వాహమ్మె యౌ
    శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుబో శుభమ్ముల్ గడున్.

    రిప్లయితొలగించండి
  12. మ:

    ఘనమౌ గద్దియ నెక్కె మూర్ఖుడొకడున్ కంపింప జేయన్ బ్రజన్
    తన వారైనచొ మేలు చట్టములు సత్తానెంచి కల్పించుచున్
    మునకల్ వేయగ జూచు చుండు నకటా మొత్తించు చేబోడులన్
    శునకమ్మున్ గడు భక్తి గొల్చిన లభించుంబో శుభమ్ముల్ గడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  13. అనఘా! మూర్ఖుడ! భక్తి యిద్ది యనుకొన్నావట్ర సన్నాసి? యే
    శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్?
    సినిమాల్ జూడగ బుర్ర పాడు వడెనోయ్ శీఘ్రమ్ముగా మార్పు కో
    రిన మేలౌను విచిత్రమైన నడతల్ రివ్వంచు వీడున్ సుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. అనుశోకమ్మున వ్యాకులంబుననె యా హంసుండు చక్రిన్ రమే
    శు నకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్
    వినుడీ సత్యము సౌఖ్యమున్ సహితమూ వెన్నుండు కన్నయ్యనిన్
    వనమాలీ నిను కొల్చు వారి కసలే బాధల్ దరిన్ జేరునే?

    (నాకు చాలా ఇష్టమైన కబీర్ దోహా ప్రేరణగా...

    దుఖః మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే న కోయ్
    జో సుఖ్ సుమిరన్ కరే వో దుఖః కాహే హోయ్౹౹)

    రిప్లయితొలగించండి
  15. శునకము విశ్వాసమునకు
    ఘనతరమగు మారు పేరు గననీభువిలో
    శునకమె భైరవుఁడుగదా
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    రిప్లయితొలగించండి
  16. కనకపు సింహాసనమున
    “శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్”
    వినయావనతుడుభక్తిని
    యనయమునావారణాశి హరుని స్వరూపిన్

    రిప్లయితొలగించండి
  17. మనల గడచు నమ్మకమున
    ధన మాన కనక వసతుల దరచుగ గాయన్
    మనుజునకు సన్నిహితువగు
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    కడచు = అతిక్రమించు

    రిప్లయితొలగించండి
  18. శునకమ్మీజగమందు బేరువడసెన్ శుద్ధంపు విశ్వాసమై
    శునకమ్మే యజమాని రక్షణకుదా శుష్మంబు నెల్లప్పుడున్
    శునకమ్మేగద కాలభైరవుఁడు నీశుండున్ వరాణాసిలో
    శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

    రిప్లయితొలగించండి
  19. కం//
    శునకమ్మే భైరవుడని
    మునిపుంగవు లెల్లగొలువ ముదముగ తానే !
    పనిగట్టుకుని వెలసెనిట
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్ !!

    రిప్లయితొలగించండి
  20. ధనమును దోచగ దొంగలు
    మననము జేసుకొనుచు నొక మందిరమందున్
    ధ్వనిజేయకనుండుమనుచు
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    రిప్లయితొలగించండి
  21. తనువుల్ వీడిరి తమ్ములందరకటా , తావెంట రాకుండెనే

    తన పత్నీ మణి ద్రౌపదీ లలనయున్, తావెంట వచ్చెన్నహో

    శునకంబుం గడు భక్తిఁ :; గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

    మణి కంఠున్దలి దండ్రి బేధమును నమ్మన్యమ్మనుష్యాళికిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  22. మనదౌ రాష్ట్రము నందున
    ఘనముగ నాశ గలిగించు కథలను జెప్పన్
    విని నమ్నితిమి గద మరిక
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    రిప్లయితొలగించండి
  23. కనగనె ఛీఛీ యనవలె
    శునకమ్మును,భక్తిగొలువ శుభములు గల్గున్
    వినగను సంతస మొందగ
    ననవరతము గీ ర్తనలను నార్తిని బాడన్

    రిప్లయితొలగించండి
  24. కందం
    మును భస్మాసుర ధాటి హ
    రుని గాచి, గజాసురోదరుడయిన విడిపిం
    చి నగజ కొసఁగిన హరి నీ
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    మత్తేభవిక్రీడితము
    మును భస్మాసురు బుగ్గిఁ జేయఁగొన దుర్మోహాంధుడైనన్ మహే
    శుని రక్షించ, గజాసురోదర నివాసుండైన కాపాడియున్
    ధనువై మేరువు సేరగా త్రిపురులన్ దండించు యుద్ధాన నీ
    శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

    రిప్లయితొలగించండి
  25. ఘనుఁడా మహాత్ముఁడు తపో
    ధనుండు విప్ర కులజుండు ధర శునకపుఁ బే
    రున వెలిఁగె శునక సన్ముని
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    [శునకము = శునక వర్ణ సమూహము]


    కని మూఢాత్ముల నెందు వారి కనువౌ కార్యమ్ములం దీర్పఁగా
    ముని వేషమ్మున మోసగించు నరులం బూజింప నీకేలనో
    మన గేహమ్ములఁ గాచు సంతతము సామర్థ్యమ్ముగాఁ గావునన్
    శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

    రిప్లయితొలగించండి
  26. విను కాశీపురిలో వెల
    సెను భైరవమూర్తిగ శశిశేఖరుడే బా
    పును పాపంబుల వెరవక
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    కనకపు సింహాసనమున
    ననువుగ గూర్చుండ బెట్టిరా కంటకునిన్
    అననేటికి తప్పని యిక
    శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

    రిప్లయితొలగించండి
  27. కనగన్ తట్టెను యిట్లు వ్రాయగను నోకామాక్షి యేమంటివే
    శునకమ్మున్ గడుభక్తిగొల్చిన లభించుభో శుభమ్ముల్ గడున్ ?
    వినుమా శంకరు గోల్వగానగును నెవ్వాడెంత భక్తిన్ దగన్
    గనిపించుండతడేయిలన్ గదిక దాగైకొండు మోక్షంబికన్

    రిప్లయితొలగించండి
  28. అనవరతమ్మును మదిలో
    కొనియాడుచుతా మరిమరి కోరుచు వరముల్
    వినయముతోడను పరమే
    శునకమ్మును భక్తిగొలువ శుభములు కలుగున్
    : మరొక పూరణ

    అనయము మోసము చేయుచు
    జనులను హింసించునట్టి సాధువు నిలలో
    కొనియాడుచువెతనొందక
    శునకమ్మును భక్తిగొలువ శుభములు గల్గున్


    రిప్లయితొలగించండి
  29. మనుషులు ఈసున విషమును
    కనులను గ్రక్కెదరు సుమీ కావలసిన వా
    రును మరి వారికి బదులుగ
    శునకమ్మును భక్తి కొలువ శుభములు కల్గున్

    రిప్లయితొలగించండి