31, మార్చి 2021, బుధవారం

సమస్య - 3679

1-4-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ యనిన బూతురా యనకుము”
(లేదా...)
“బూతగు రామచంద్ర యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్”

58 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      (క్రొత్తగా రాజకీయముల లోనికి వచ్చెడి రామచంద్రుఁడను వానితో విశేషరాజకీయానుభవముగల యొక వృద్ధ నేత పలుకుచున్న వచనములు)

      నేత విశిష్ట భావ సువినీత సుభాషణ లెన్నొ చేసినన్,
      బాతకులౌటచేతఁ బ్రతిపక్షపు నేతల కట్టి భాషణల్

      బూతగు రామచంద్ర! యనఁబోకు! సుహృజ్జనులున్నతావులన్
      నేతయె యట్టి భాషితమునే పలుకందగు సాధులౌటచే!

      తొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    తాతల నాటి గొప్పలను త్రవ్వుచు బైటకు లాగి పల్కుచున్
    మూతులు నాకి నాయకుల మూర్ఖుడ! రూకలు మెండు జేర్చుచున్
    నీతులు జెప్పి త్రాగుచును నివ్వెర పోవక హైద్రబాదునన్
    బూతగు "రామచంద్ర!" యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చదువు సంధ్య లవియ చక్కగా నేర్వని
    ద్రాబలు తిరుగాడు తావు లందు
    మంచి మాట లెల్ల వంచింపబడు వేళ
    రామ యనిన బూతురా! యనకుము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (పాండవుల పట్ల కౌరవుల ప్రవర్తన నెంచిన నాటి వ్యక్తి వ్యక్తీకరణ:)

      రీతుల నెన్నియో నుదహరించి నటుల్ సరిధర్మ మెంచుచున్
      బాతిగ రాజ్యభాగమును పాండు తనూజులకీయ మన్నదౌ
      ఖ్యాతిని బెంచు వాక్యమది కౌరవ కొల్వున నెప్పుడెనియున్
      బూతగు "రామచంద్ర!" యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. రాజకీయమయ్యెరామన్నగుడియును
    దానిమాటనెవరుతలపరాదు
    నీతిమంతులెవరునేరమ్ముఁజేయరు
    రామయనినబూతురాయనకుము

    రిప్లయితొలగించండి
  5. సకల దోషములు తొలగు సకల గుణాభి

    రామ యనిన:; బూతురా యనకుము”

    మంచికాలవాలమనుచును రాముని

    వైరిని కలనయిన వెరపునయిన

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  6. తండ్రి మాట నిలిపి ధర్మమ్ము పాటించి
    పూజ నీయు డయ్యె పుణ్య శాలి
    యట్టి వాని మరచి యన రాద దెవ్వరు
    రామ యనిన బూతు రా యనకుము !

    రిప్లయితొలగించండి
  7. అందరికీ నమస్సులు🙏

    రోతగు బుద్దులన్ గడన రూకలు మొత్తము ఖర్చు చేయుచున్
    నీతులు చెప్ప బూననిక నిగ్రహ మోపక కయ్యమాడగన్
    భూతల మందునన్ సదరు బోధలు మెచ్చెక తప్పులెంచగన్
    *“బూతగు రామచంద్ర యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్”*

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  8. పాతగమాటలాడుచునుపావనురామునితల్చబోకురా
    నేతలమాటగుట్టునికనేరుపుమీరగనాకళింపుమా
    చేతమురాముపెండ్లియనిచేరకుభద్రగిరీశుసన్నిధిన్
    బూతగురాచంద్రయనబోకుసుహ్రుజ్జనులున్నతావులన్

    రిప్లయితొలగించండి
  9. నేమము విడి యిటుల నీతిమాలిన మాట
    లనకు మతివతోడ నట్టి మాట
    విజ్ఞత విడి నీవు పెద్దల సభలో
    రామ, యనిన బూతురా! యనకుము.

    నీతిని వీడినట్టి పలు నెత్తురు బొత్తుల సాహచర్యమున్
    భీతిని వీడి నీవిటుల భీరువు జాతిని కించపర్చుచున్
    చేతులనూపి రాతిరికి చెంతకు రమ్మని పిల్చుటన్నదే
    బూతగు రామచంద్ర, యనబోకు సుహృజ్జనులున్న తావులన్.

    రిప్లయితొలగించండి
  10. కంకుభట్టుతో విరటుడు

    ఆతత కౌరవాన్వయము నంతయు నుత్తరుడే
    జయింపగా
    నాతులకీయెడన్ సరసనాట్యము నేర్పు బృహన్నలన్ దగన్
    త్రాతవు నీవెయేయనుచు దక్షుడవంచును నింగికెత్తగా
    బూతగు "రామచంద్ర!" యనబోకు సుహృజ్జను లున్నచోటులన్

    రిప్లయితొలగించండి
  11. ఆటవెలది
    రాముడన్న పేర రసిక శిఖామణి
    యందగత్తెలన్న బొందు గోర
    వ్యంగమునకునైన నవ్వాని పిలువ సు
    త్రామ యనిన బూతురా యనకుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఉత్పలమాల
      కూతలు పెక్కు గూయ ప్రజ గొప్పగ నమ్మియు మద్దతీయఁగన్
      నేతగ గెల్చియున్ విడువనేరడు నిత్యము వారకాంతలన్
      చేతలు మృగ్యమౌనతని చేష్టలెరుంగగఁ బోల్చఁ ధర్మమే?
      బూతగు! రామచంద్ర యనఁ బోకు సుహృజ్జనులున్న తావులన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ఉ:

    తీతువు పిట్ట మాదిరిని తేరగ బల్కెడి వాని దూరమౌ
    రీతిని బెట్ట నెల్లరును లేకిడి మాటలు మానుమంచనన్
    లోతుగ నెంచి నేర్పిరట లోకపు సూక్తిని యొంటబట్టగన్
    బూతగు రామచంద్ర యనబోకు సృహృజ్జనులున్న తావునన్

    *ర ఱ ల ళ లకు గల పరస్పర యతి మైత్రి ననుసరించి యతి గూర్చినాను.*

    తీతువు పిట్ట =అపశకున పక్షి
    లేకిడి=తక్కువతనము


    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సూక్తిని+ఒంట' అన్నపుడు యడాగమం రాదు. "సూక్తిని/సూక్తుల నొంటబట్టగన్" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు; సూచన ననుసరించి సవరిస్తాను

      తొలగించండి
  13. గొడ్డలిని‌చేత బట్టుచు కోసె వేల

    క్షత్రియుల గొంతుల నతడు క్షమయె లేక

    రాజ్య ప్రజలు నేడు పరశు రామ‌యనిన

    బూతురా యనకుమనుచు భూమి జాని

    పలికె తనదు సుతునితోడ భయము కలిగి



    చిన్న రాజు ఒకడు తన కుమారుడు పరశు రాముని గూర్చి మాట్లాడు తుంటే పరశు రాముడు కొన్ని వేల‌మంది క్షత్రియ వధ తన గొడ్డలి తో చేశాడు అందువల్ల మిగిలన క్షత్రియులకు అతను‌ అంటే కోపము అసహ్యం మరియు అది బూతు పదము అని చెప్పు సందర్భము

    రిప్లయితొలగించండి
  14. నాటి కాల మందు నలుగురి యెదుటన
    రామ యనిన యెడల రక్తి కలుగు
    నేటి కాల మందు నేతల యెదుటన
    రామ యనిన బూతురా యనకుము

    రిప్లయితొలగించండి
  15. మందు మాన్ప వాని మంచి కోరితి నేను
    చెప్ప మందు లోని చెడుపు నంత
    తిట్ల దండకంబు తెరిచె వాడు ఇటుల
    రామ యనిన బూతు రా యనకుము.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాడు+ఇటుల' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. "వా డీరీతి" అనండి.

      తొలగించండి
  16. బూతగు రామచంద్ర యన
    బోకు సుహృజ్జనులున్న తావులన్

    ( విశ్వామిత్రమహర్షి శ్రీరామచంద్రునితో )

    ఉత్పలమాల
    .....................

    నీ తలిదండ్రు లిర్వురకు
    నిత్యపు గీరితి దెచ్చిపెట్టుమా !
    కాతరమందకన్ బలుక
    కమ్మని తావుల పచ్చకప్రపుం
    బూతగు రామచంద్ర ! యన
    బోకు సుహృజ్జనులున్న తావులన్
    జేతము భిన్నభిన్నమయి
    చింతల ముంచెడి పల్కులెన్నడున్ .
    ( కాతరము - భయము ; పూత - అలదుట )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      "కాతరమందకే" అనండి. 'అందక' కళ కదా!

      తొలగించండి
  17. స్నేహితుడు రామచంద్రుణ్ణి ఉద్దేశించి

    భూతల పుణ్యవంతులును భూరి వదాన్యులు మీరలేయనన్
    రోతగు నేతలందరిని మ్రోలను భేషని వంతపాడుటల్
    నీతిని వీడి సాగుటయు నేడిదె యందరి మంత్రమౌ యిదే
    బూతగు ! రామచంద్ర ! యనబోకు సుహృజ్జనులున్న తావులన్

    బూతగు = బట్రాజు పని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేత కలంబుబూని శశిశేఖరు విష్ణుని వాణినాథునిన్
      భాతిని గూర్ప వేడి యతి బద్ధము సేసి కవిత్వమల్ల మ
      జ్బూతగు రామచంద్ర ! యనబోకు సుహృజ్జనులున్న తావులన్
      రీతుల మార్తునన్చు పరీక్షకు నైనను, కందిశంకరుల్
      నేతగ నిల్చిరిచ్చటను నీ తరమా మరి వారిగెల్వగన్ !

      మజ్ బూత్ = బలము (తెలంగాణ మాండలికంలో)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "మంత్రమౌ నిదే" అనండి.
      రెండవ పూరణలో నాల్గవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  18. సీతను తెచ్చితీవు కడు చేటగు నిక్కమటంచు తమ్ముడే
    నీతిగ రామచంద్రునికి నెయ్యము నర్పణ సేయు మంచు దాఁ
    నీతులు వల్క రావణుడు నేరము నెంచి వచించెనుగ్రుడై
    బూతగు రామచంద్ర యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్

    రిప్లయితొలగించండి
  19. స్వామీ నమస్కారము
    మీ వాట్సప్ గుణము నందు నా ఖాతాను జేర్చుటకు అవకాశమివ్వగలరని నా వేడుకోలు 🙏

    రిప్లయితొలగించండి
  20. మూతికి బట్ట కట్టకను మూరడు దూరము నుండకుండియున్

    వేతన తీర్చడయ్య రఘు వేల్పు కరోనను త్రుంచ లేడనన్

    బూతగు రామచంద్ర :; యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్

    కోతికి తండ్రి దాపులను క్రుంగిన దీపము బాధ్యతేరిదో

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. తండ్రి గౌతముడు శతానందునకు జెప్పె
    మాయనాశ్రయించి మాతశీల
    మపహరించె గాన మరువకు మతని సు
    త్రామ యనిన బూతురా యనకుము

    రిప్లయితొలగించండి
  22. పాతక! నీతిమాలి కడు పాప
    ము లెన్నియొ చేయుచున్ సదా
    భూతలమందు దైవమును
    బూని భజించెడు వాని తీరుగన్
    కోతలు మాటిమాటికిని కోసెడు
    వాడవు రామనామమే
    బూతగు, 'రామచంద్ర' యన బో
    కు సుహృజ్జనులున్న చోటునన్

    రిప్లయితొలగించండి
  23. నేతల దీరు మారెననునిత్యమసత్యములాడుచుందురే
    రోతగ దోచు వారి యవరూప విచేష్టలు వారి సన్నిధిన్
    బూతగు రామచంద్ర యనఁబోకు; సుహృజ్జనులున్న తావులన్
    నీతియె రీతియై చెలఁగు నిక్కపు సంస్మృతి రామ నామమే

    రిప్లయితొలగించండి
  24. మంచిమాట చేదు మాత్రగా నెంచును
    నిజము పలుక నెపుఁడు నిష్ఠురంబె
    కుమతి హితవు వినడు కుత్సితుండతనితో
    రామ యనిన బూతురా యనకుము

    రిప్లయితొలగించండి
  25. పూర్వకాల మందు పురుష వర్యు లకట
    మూరు చుంద్రు సతము మూఢ భక్తి
    వీర శైవు లున్న వీడురా యియ్యది
    రామ యనిన బూతురా యనకుము


    నాతులు చూచు చుండఁగ ననంత యశస్వి చువర్ణ దుగ్దకా
    రాతిశయమ్ము కల్గిన మహాశయ! పండితవంశ సంభవా
    ప్రీతిని శబ్దశాస్త్రమునఁ బెంపును జూపఁగ నిట్లు పల్కినన్
    బూతగు రామచంద్ర! యనఁబోకు సుహృజ్జను లున్న తావులన్


    [“మొదటి పూరణ కూడ బాగున్నది. కాకుంటే పద్య ప్రారంభం లోని పదం అశ్లీలార్థాన్ని సూచిస్తుంది కదా!” యను 2021 మార్చి 5 నాటి గురువు గారి మొట్టికాయ గుర్తునకు రాఁగఁ జేసిన పూరణము.]

    రిప్లయితొలగించండి
  26. జాతికి వన్నె తెచ్చు వనజాక్షుల పొంతన చెడ్డమాట యున్
    జ్ఞాతిని రాజు చేయుచెడు జ్ఞానపు కైకకు ముందునన్ సదా
    పాతక వర్త నంబు మరి పాడియు కాదు కదా సభా స్థలిన్
    బూతగు, రామచంద్రయనబోకు,సుహృజ్జనులున్న తావులన్

    రిప్లయితొలగించండి
  27. పుణ్య మబ్బు నెపుడు పుడమి లో జనులకు
    రామ యనిన బూతురా యనకుము
    పనికిమాలినట్టి పలుకులవి నిజమ
    టంచు నమ్ము మయ్య యనవరతము.

    రిప్లయితొలగించండి
  28. పుణ్య మబ్బు నెపుడు పుడమి లో జనులకు
    రామ యనిన బూతురా యనకుము
    పనికిమాలినట్టి పలుకులవి నిజమ
    టంచు నమ్ము మయ్య యనవరతము.

    రిప్లయితొలగించండి