1, ఏప్రిల్ 2021, గురువారం

సమస్య - 3680

2-4-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్”
(లేదా...)
“వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులై”
(ఇంతకు ముందే శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారి 'వెధవ శతకం' ఆవిష్కరణ జరిగింది)

70 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  అధములు నొవ్వకుండగను హాయిని గూర్చుచు వ్రాయగన్ కవీ
  విధవలు చేరి పందిరిని బింకము వీడుచు నవ్వుచున్ భళా
  "వెధవల కావ్యమున్" చదివి వేడుక నొందగ వింతవింతగన్
  వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులై

  రిప్లయితొలగించండి
 2. సుధ లొలికెడు పలుకులును
  విధులను మరచుచు సతతము వింతగ మెలిగే
  యధముల వర్ణన రచన న్
  వెధవలు సెలరేగి రంట వేల కొలదిగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. "సుధల నొలికెడు పలుకులును" ఆనండి. 'మెలిగే' అనడం వ్యావహారికం.

   తొలగించండి
  2. సవరించిన పద్యం ---
   -----------------=
   సుధల నొలికెడు పలుకులును
   విధులను మరచుచు సతతము పేట్రేగెడి నా
   యధముల వర్ణన రచనన్
   వెధవలు సెలరేగి రంట వేల కొలదిgan

   తొలగించండి
 3. రుధిరము నేలన వాలిన

  వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్

  కదనమున నాల్క చాపెను

  రుధిరము పట్టెనట కాళి రోసెనసురులున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి

 4. వ్యధలను ద్రుంచలేరు మది
  వైనము నందుచు రాగబంధమౌ
  సుధను గ్రహించలేరు, తమ
  చోద్యపు వింతల నాటలాడుచున్
  విధియని నింద జేయుదురె!
  వేదికలందు వచించి, చిత్రమౌ
  వెధవలు పెచ్చురేగిరఁట!
  వేలకొలంది శకారరూపులై!

  వెధవ=నిష్ప్రయోజకుడు

  రిప్లయితొలగించండి
 5. పధమునభరతునిభూమిగ
  విధమునవేదముతెలియుచువిలసిల్లంగా
  అధమముబుద్ధినితాకుచు
  వెధవలుసెలరేగిరంటవేలకోలదిగన్

  రిప్లయితొలగించండి
 6. సమస్య :
  వెధవలు పెచ్చురేగిరట
  వేలకొలంది శకారరూపులై

  ( వితంతువులకు పునర్వివాహాలు చేసి
  వారి బ్రతుకులలో వెలుగులు నింపిన సంఘసంస్కర్త వీరేశలింగం గారిని ఈసడిస్తూ నోరుపారేసుకొనే " శకారుల"కేమి
  శిక్ష విధించాలి ?)

  విధవలకున్ వివాహముల
  వేడుక మీరగ సల్పు " వీరునిన్ "
  మిథునములందు రేబవలు
  మేలిమి నింపెడి మార్గదర్శకున్
  గదనముకైన సిద్ధపడు
  కారుణికోత్తము నీసడించుచున్
  వెధవలు పెచ్చురేగిరట !
  వేలకొలంది శకారరూపులై .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ద - ధ లకు , ధ - థ లకు యతి చెల్లుతుంది. కానీ ద - ధ - థ లలకు యతి చెల్లదనుకుంటాను.

   తొలగించండి
 7. బుధజనులను కాదనుచును
  మధువును పంచిన ఖలునకు మద్దతుతో నా
  యధికారుల భృత్యులనెడు
  వెధవలు సెలరేగిరంట వేల కొలదిగన్.


  బుధజనులంచు చెప్పినను మూఢజనాళికి నచ్చదయ్యెనే
  మధువు ధనమ్ము పంచు కడు మందులె నేతలటంచు నమ్మిరే
  యధికులు, వారియోటు గొని యందల మెక్కిన నేత భృత్యులౌ
  వెధవలు పెచ్చురేగిరట వేలకొలంది శకారరూపులై.

  రిప్లయితొలగించండి
 8. కదిలెను కరోన సైన్యము
  వదిలించెను విస్తృత ముగ,వదిలిరి భయమున్
  పదుగురు కలియగ వీధుల
  వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్!!

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వెధవయె రాజ్యము నేలుచు
  నధికాధికముగ మకురుల నడరగ జేయన్
  నధమపు పాలన వెలయుచు
  వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెధవయె రాజ్యమేలుచు ప్రవీణత జూపగలేక తోడుగా
   నధమమునౌ క్రియల్ నడపి నాగడ మెంచెడి మూర్ఖులందరిన్
   నధికులజేసి దేశమున నల్దిశలన్ వెలిగింప జేయగా
   వెధవలు పెచ్చురేగిరట వేలకొలంది శకారరూపులై.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. అధవపు చదువుల తోడుత
  విధివంచిత యువత నేడు వికృతంబుగ స్త్రీ (గో
  వధలకు మరిగిరి నిధికై)
  వధ కరిగిరి కామకులై
  వెధవలు సెలరేగి రంట వేల కొలది గన్

  రిప్లయితొలగించండి
 11. కధలివిగావుసత్యములుకశ్యపుఖండమునల్లలాడెనే
  విధమునులేనిజాతులవివెఱ్ఱిగదాడులఁజేసిరేగదా
  పదునుగకత్తిదూసిరటభగ్నముఁజేయగదేశసంపదన్
  వెధవలుపెచ్చురేగిరటవేలకోలందిశకారరూపులై

  రిప్లయితొలగించండి
 12. అధముడు పాలన జేయగ
  విధిలే క జనులు విరివిగ వేదన బడగన్
  బుధులు సరిజేయ బోవగ
  వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్

  రిప్లయితొలగించండి
 13. చదువులు సంధ్యలన్ విడచి జంబముమీరగ
  కార్యకర్తలై
  అదురును భీతినిన్ గనక నల్లరిబెట్టుచు నెల్లవారినిన్
  పదవుల నడ్డుపెట్టుకొని వంచనజేయుచు సొమ్ముదండెడిన్
  వెధవలు పెచ్చురేగిరట వేలకొలంది శకారరూపులై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెధవలచే నెన్నబడుచు
   వెధవల కోసమె నడచెడు వెధవల దైనన్
   అధమపు రాజ్యంబున సరి
   వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
 14. మధువును మగువల మరగిన
  అధముల కందలము నిడగ నభివృద్ధెటులౌ
  విధినేమందుము నేడిక
  వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్

  రిప్లయితొలగించండి
 15. బుధులగు పెద్దలన్ విడచి బుద్ధి విహీనుని రాజు సేయగా
  నధముల కగ్ర పూజ్యతయు నందలముల్ లభియింపకేలనో
  మధువిక పార నేరులుగ మానినులన్ చెరబట్టు కూళలౌ
  వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులై

  రిప్లయితొలగించండి
 16. అధములు రాజులైరి మరి యాతని బంటులు మీదు మిక్కిలిన్
  నిధిపతులైరి వారలిల నీతిని మాలి ప్రభుత్వ విత్తమున్
  నిధనము జేయ బూనిరిట నేనిక జెప్పగలేను దేవుడా !
  వెధవలు పెచ్చురేగిరట వేలకొలంది శకారరూపులై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్వామీ నమస్కారము
   మీ వాట్సప్ గణపతులకు సహా నమస్సులు ఆర్యా! వాట్సప్ సమూహము నందు నా ఖాతాను జేర్చుటకు అవకాశమివ్వగలరని నా వేడుకోలు 🙏 98855 90520

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   మిమ్మల్ని శంకరాభరణం వాట్సప్ సమూహంలో చేర్చానండీ!

   తొలగించండి
 17. వెధవల జేయు చిత్రముల వెఱ్ఱిగజాలము జేర్చ కొందరున్
  సుధలన వేఱు కావనుచు జుఱ్ఱుచు వానిని బుద్ధి హీనులై
  వధువుల మానభంగములు పర్వము లన్నటు చేయ సాగిరే!
  వెధవలు పెచ్చు రేగిరట వేలకొలంది శకార రూపులై

  రిప్లయితొలగించండి
 18. సుధలను చిందు అందమగు సోయగమొప్పెడు పెళ్లి కూతురిన్
  విధులను సేయగా వదలి వెళ్లిన భారత సైనికుల్ యధా
  విధి సరిహద్దు వద్ద బహు విద్విషులన్ హతమార్చినన్ హరీ!
  వెధవలు పెచ్చురేగిరట వేల కొలంది శకార రూపులై

  రిప్లయితొలగించండి
 19. మధురముమదవతియధరము
  మధురముపసివాడిపలుకుమధుపమునాదం
  బెదతేనెతుట్టెగదపగ
  వెధవలుసెలరేగిరంటవేలకొలఁదిగన్

  రిప్లయితొలగించండి
 20. వెధవలు యీజగమందున
  నధములుపంకమునపొరలునారువువోలెన్
  పదిమందికినొకడుండును
  వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్
  (ఆరువు=శూకరము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెధవలు+ఈ' అన్నపుడు యడాగమం రాదు. "వెధవలె యీ.." అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరించుకుంటాను.

   తొలగించండి
 21. బుధులై యనంత కృష్ణులు
  'వెధవ శతకము' ను రచింప వేగిరపడగా
  నధములుగ వారిఁ తలపున
  వెధవలు సెలరేగిరంట వేలకొలఁది గన్!

  చంపకమాల
  మదిగొని గణ్పతుల్ పనికిమాలిన పద్యముఁ గూర్చ వేడుకన్
  బుధులు ననంతకృష్ణులకు స్ఫూర్తినిడెన్ శతకమ్ము వ్రాయఁగా
  నధముల నెంచ పొత్తమున నర్రులు సాచుచు మానసమ్మునన్
  వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులై!

  రిప్లయితొలగించండి
 22. కె.వి.యస్. లక్ష్మి:

  విధులను లెక్కయె జేయక
  నిధులను నిలుపుకొనుటదియె నీమంబగునౌ
  నధముల రాజ్యము నందున
  వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ గురుభ్యోనమః

  ప్రధముడ నేనని పొగులుచు
  నిధులకు గాలము విసరెను, నిర్లక్ష్యముతో
  విధులను గాలికి వదలెను
  వెధవలు సెలరేగిరంట వేలకొలఁదిగన్

  రిప్లయితొలగించండి
 24. వదలకతప్పుడునడకల
  నధములస్నేహంబుజేసినన్యులమనముల్
  వ్యధలనునిరతముగూర్చెడి
  వెధవలుసెలరేగిరంటవేలకొలదిగన్

  *యస్ హన్మంతు*

  రిప్లయితొలగించండి
 25. బుధజనులెల్ల గూడి పలు బోధలు సేసిన నైన మూఢులై
  రుధిరపు క్రీడకై మిగుల డుండుకులైన సుయోధనాదులే
  బధిర మదాంధులై జనగ భారత యుద్ధమునందు వెన్కనే
  వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులై

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. చం:

   సుధలను జిమ్ము లాడుచును చూపుల చిక్కని దుష్ట చేష్టలన్
   రుధిరము పీల్చు చుందురట రూపము నల్లిని వోలు చందమై
   వ్యధలను కూర్చగా మొదలు వంచనయే పరమావధంచు నా
   వెధవలు పెచ్చు రేగిరట వేల కొలంది శకార రూపులై

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 27. మిధిలాపురమున గొందఱు
  వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్
  బధికుల వెంటనుబడుచు వి
  విధములుగ బాధపెట్టు వెధవలు వారే

  రిప్లయితొలగించండి
 28. వ్యధ లిడ బూతులు మాటల
  నధికముగాఁ బల్లె లందు నక్కట చెలఁగున్
  విధవలు రూపొంద నయిరి
  ‘వెధవలు’ సెలరేఁగి రంట వేలకొలఁదిగన్


  అధరము లందు నుండ నగు నాంధ్రపు గ్రంథము లందు మృగ్యముల్
  సుధలను జిందు, గ్రామ్యములు చొప్పడ కుండినఁ, గావ్యముల్ ధరన్
  విధవలు మారి యైరి మఱి వింతగఁ బల్కఁగ నల్గి నోళ్లలో
  ‘వెధవలు’, పెచ్చురేఁగి రఁట వేలకొలంది శకార రూపులై

  రిప్లయితొలగించండి
 29. కథనములల్లి దుర్మతులు కల్లలు కొల్లలుగా ప్రచారముల్
  వ్యధలనుగొల్పురీతిగను వ్యాపన జేతురు వాంఙ్మయంబులన్
  కథలని కల్లలంచు వెటకారపు హాహలముల్ సృజించు నా
  వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులై

  రిప్లయితొలగించండి
 30. మిధిలపువాసులందఱును మీరుచు,హద్దులు దాటినట్టియా
  వెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులై
  వెధవనుబేర వ్రాసిరట పేర్మిని జూడగ నూఱుపద్యముల్
  వెధవలయందు వారికిల బ్రేమనుజెప్పగశక్యమే హరా!

  రిప్లయితొలగించండి
 31. మిత్రులకు నమస్సులు!

  మధుకర మానసుండ్రునయి, మానధనమ్ముఁ గ్రయింప నెంచియుం,
  బృథివినిఁ ద్రిమ్మరంగఁ జని, వేమఱు శోధనఁ దోయజాక్షులన్
  విధిగను జెట్టపట్టఁగను వేచియునుండి, కవుంగిలింపఁగా,

  వెధవలు పెచ్చురేఁగిరఁట వేలకొలంది; శకారరూపులై!

  రిప్లయితొలగించండి
 32. మఱొక పూరణము:

  విధవకుఁ బుంస్త్వరూపులయి, వేమఱు మింఠులతోడఁ గూడియున్,
  ముదితల మానప్రాణముల మోదముతో గ్రసియింపఁ బూనియున్,
  మధువుఁ బ్రియమ్ముగాఁ గొనియు, మైధున క్రీడలఁ దేలియాడఁగా,

  వెధవలు పెచ్చురేఁగిరఁట వేలకొలంది శకారరూపులై!

  రిప్లయితొలగించండి