17, మే 2021, సోమవారం

దత్తపది - 177

18-5-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
“ఘనము - ధనము - మనము - వనము”
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
రామాయణార్థంలో
పద్యం వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. వారినిధి లం'ఘనము' సేసి వాయుసుతుఁడు
    సా'ధనము' రామ నామ సంస్మరణ మగుచుఁ
    దెలిపి తన యాగ'మనము'ను జనకసుతకు
    భ'వనము'లఁ గాల్చె రాక్షసుల్ భయపడంగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గురుభ్యోనమః🙏
      3 వ పాద యతి విషయ సందేహము, తెలుప ప్రార్థన. అన్యధా భావించకండి.

      తొలగించండి
    2. యతి తప్పింది. ధన్యవాదాలు. సవరిస్తాను.

      తొలగించండి
    3. సవరణతో....
      వారినిధి లం'ఘనము' సేసి వాయుసుతుఁడు
      సా'ధనము' రామ నామ సంస్మరణ మగుచుఁ
      నవనిజకు దెల్పి తనయొక్క యాగ'మనము'
      భ'వనము'లఁ గాల్చె రాక్షసుల్ భయపడంగ.

      తొలగించండి
  2. ఆటవెలది
    జలధి లంఘనమున స్వర్ణలంకన్ జేరి
    సాధనమున సీత జాడఁ దెలిసి
    సంయమనము తోడ సర్వమ్మెఱిగి, కాల్చి
    ప్రేతవనముఁ జేసె వాతసుతుడు

    రిప్లయితొలగించండి
  3. దత్తపది :

    ఘనము ధనము మనము వనము పదాలను అన్యార్థంలో
    ప్రయోగిస్తూ రామాయణార్థంలో
    స్వేచ్ఛాఛందస్సులో

    ( వాలివధ అనంతరం సీతాన్వేషణ చేయిస్తానన్న సుగ్రీవుడు తన మాట మరచి భోగాలలో మునిగినాడని లక్ష్మ ణునితో అంటున్న రామచంద్రుడు )

    ఘనములు పెక్కులై ధవళ
    కాంతులు తగ్గెను నింగి ; వత్స ! శో
    ధనమది సీత కోసమయి
    తానిక సేనల నంపడేమి ? కా
    మనమును సేయకన్ గడపు
    మద్యపు మత్తున గ్రీవుడిట్లు జ
    వ్వనముల మత్తకాశినుల
    వాంఛల ప్రొద్దుల బుచ్చుచుండెగా !

    ( ఘనములు = మేఘములు ; శోధనము = వెదకుట ;కామనము = సంకల్పము; జవ్వనముల = ప్రాయముల;గ్రీవుడు = సుగ్రీవుడు )

    రిప్లయితొలగించండి
  4. సంయమనమునరామునిసంస్మరింప
    ఇంధనముగాగమనసుననేర్పుమీరి
    సవనమునదక్కనిశుభముశాంతిగలుగు
    మేఘనమువోలెజీవుడుమేటియగును

    రిప్లయితొలగించండి
  5. కట్టి జఘనమునకు నార బట్ట , రాజ

    బంధనములన్ని వీడుచు , బాట పట్టి

    కామనములనన్నియు వీడి కానలకును

    సీత సేవనమున మురిసి చనె రఘుడు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. సుందరా కాండతీర్చును సులుభముగను
    కామనములు, కవనమున కలదుముక్తి
    హనుమ లంఘనము మనకు హాయిగొల్పు
    నిహపరముల సాధనముగ నిలనమనకు

    లంఘనము
    సాధనము
    కామనము
    కవనము

    రిప్లయితొలగించండి
  7. కవనము నను వాల్మీకియు
    రవనము రామున,దమనము రావణు లోనన్
    జవనము సీతను,జఘనము
    పవనజు లోనన్ బలముగ, ప్రస్ఫుట పరచెన్.

    రిప్లయితొలగించండి

  8. భువనమున నీదు శక్తి యపూర్వ మంచు
    జాంబవంతుడు చెప్పగా సాధనమున
    సంద్ర లంఘనమును జేసి సాధ్వి వెదకు
    కామనమున మారుతి లంకఁ గాలు మోపె

    రిప్లయితొలగించండి
  9. పంచ పాది


    జలది లం(ఘనము)ను చేసె సరస గతిని,

    శో(ధనము) చేసి కాంచె భూ సుతను, పుణ్య

    జనుల పీచ మణచి యస్త (మనము) చేసె,

    భ(వనము)లను తగుల బెట్టి పవన సుతుడు

    సంత సమ్ముగ రాముని చెంత జేరె

    రిప్లయితొలగించండి
  10. ఘనముఖరస్వరప్రభవకమ్రగళాన్వితశత్రువార్ధ్యబిం
    ధనము బలీంద్రవామనముదాగతపూతచరిత్రదివ్యజీ
    వనము వెలుంగు వాడు రఘువంశసుధాంబుధిశీతరశ్మి నె
    మ్మనమున రూపు దాల్చ బహుమానపురస్కరమొప్ప కొల్చెదన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  11. సీతాదేవి హనుమతో

    పావనము తవాగమనము పవనపుత్ర
    జలధి లంఘనమును జేయ శక్తియుతుడ
    నాదు బంధనమును ద్రెంచి నన్నుగావ
    నాథునికి దెల్పు వేగమే నాదుజాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అహల్య రామునితో

      పావనము నీదుపాదము పరమపురుష
      భవజలధి లంఘనమునకు నావయౌను
      శమనమును గలిగించెడి చక్కనైన
      సాధనము, సద్గతులొసంగు సారసాక్ష!

      తొలగించండి
  12. వార్ధి లంఘనమున జేరి వాయు సుతుడు
    భువనములు గాంచి కనుగొనె పూత చరిత
    సంయము నను లంకలో సమయ మెరిగి
    దర్పమున నిధన ము జేసె దనుజ తతిని

    రిప్లయితొలగించండి
  13. పెనుపు మహాబ్ధి లంఘనము భీకర రూపున జేసి దేహ వ
    ర్ధనము నొనర్చి మారుతి విరాజిత దీప్త సుశోభితాంగి కా
    మనముల దీర్ప రక్కసుల మక్కువ మీఱగ మట్టుబెట్టి సాం
    త్వనమును గూర్చె సాధ్వికి నివాసము లన్నియు గాల్చి మగ్నుడై

    రిప్లయితొలగించండి
  14. పుర జనావళి శ్లాఘనముల నొసగగ
    భవనము విడిచి దారయు భ్రాతతోడ
    వనములకు గమనము జేయ భరతు డేగి
    దాశరధి వోలె నేలు సాధనము నడిగె

    రిప్లయితొలగించండి
  15. శూర్పణఖ రాముని మోహించి పెండ్లాడుమనుట...

    ఘన జఘనము నా సొమ్ము రా స్తనధన మను
    సోయగమె యింధన మగుఁ రా సొగసుకాడ
    యౌవనమును కాదనకు రాఘవ! దమనము
    చేయగలనె తాపమడచ? కయికొనుమయ౹౹

    రిప్లయితొలగించండి
  16. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    దత్తపది : “ఘనము - ధనము - మనము - వనము”
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో రామాయణార్థంలో పద్యం

    సీత భూదేవిలో కలిసి పోవడాన్ని వర్ణించాను .
    సర్వ లఘు కందము లో పూరించ ప్రయత్నించాను

    కం :
    వసుజ యవఘనము గలువగ
    వసుధన; ముదితల గమనము వగచుచు గనియున్ |
    వసుపతి భువనము కుదుపుచు
    వసుమతిని కొసరి యడిగెను వరముగ సతియున్ | |

    వసుజ = భూమి పుత్రి/ సీత ; అవఘనము = శరీరము ; వసుపతి = రాజు/ రాముడు వసుమతి = భూమి

    - రాంబాబు కైప
    17-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  17. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    దత్తపది : “ఘనము - ధనము - మనము - వనము”
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో రామాయణార్థంలో పద్యం

    శూర్ఫణఖ రాముని కోరగా, తాను వివాహ బంధనములో ఉన్నాడని , యవ్వనుడైన లక్ష్మణుని చూపాడు అని.

    ఘన జ*ఘనము* నూపుచు వశ,
    మనమున కా*మనము* తెలిపి మరిమరి కోరన్ |
    తన బం*ధనము* తెలిపి, య
    *వ్వనము*ను గూడిన యనుజుని వనితకు జూపెన్ ||

    వశ= ఆడది /స్త్రీ / లోకువైనది


    - రాంబాబు కైప
    17-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  18. లంఘనముజేసి వారిధి లంకజేరి
    హనుమ మదిలోన రామ ప్రార్ధనము చేసి
    గమనమునుసల్పి సీతను గాంచె తుదకు
    పావనము రామచరితము భవహరమ్ము

    రిప్లయితొలగించండి
  19. ఘనము - ధనము - మనము - వనము
    లంకజేరెనుమారుతిలంఘనమున
    సాధనమునసాటియెలేనిసాక్షితాను
    అమ్మసీతమ్మమనమునహనుమతాను
    పావనముజేసెనగ్నినిపవనసుతుడు

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  20. జలధి లం(ఘనము)న సీత జాడ దెలియ
    సేతు బం(ధనము)న లంక జేర్చె సేన
    రామునాగ(మనము) విని రావణుండు
    రణమునభిభ(వనము)నొంది రాలె తుదకు

    (అభిభవనము = ఓటమి అనే భావములో)

    రిప్లయితొలగించండి
  21. కె.వి.యస్. లక్ష్మి:

    (ఘనము)నగు రామ బాణపు ఘాతములకు
    రణమున ని(ధనము)ను జెందె రావణుడను
    మాట నెఱుగుచు (వనము)న మైథిలపుడు
    (మనము)న ముదము నొందెను మగని క్రియకు.

    రిప్లయితొలగించండి
  22. మునుల రక్షణార్థము దండ కారణ్యములో మునులను బాధించు చున్న రాక్షసులను జంపెద నని రాముఁడు మునుల కభయ మీయ సీత సంశయించి కారణములను జెప్పి రాముని దండకా వన మేఁగుటను దిరిగి యాలోచింప మనఁగ రాముఁడు భార్యతో పలుకు సందర్భము:


    మన ముక్త సంగ సన్ముని
    వన ముద్హర్తృ నిధనము భువన రక్షణ మా
    యనఘ నముచిసూదన నిజ
    మనోర థానుగుణ మౌను మైథిలి వింటే

    [సన్ముని వనము = సన్ముని సమూహము]

    రిప్లయితొలగించండి
  23. యుద్ధమునకు వస్తున్న కుంభకర్ణుని గురించి విభీషణుడు సుగ్రీవునికి (తన అన్న గురించి) చెబుతున్న సందర్భం....

    విఘనము వీనికి నిష్టము
    ఆఘములు చేయుట దమనము నయ్యెను నిద్రన్
    సు ఘటము లుసాధనములు వి
    న ఘన ర వనముగ లరావ ణ సముడు, బలుడే!

    రిప్లయితొలగించండి
  24. సంద్ర లంఘనము నొనర సల్పి హనుమ
    లంక జేరగ నతనిని రక్కసు లట
    నిప్పు వెట్టగ దోకకు భవనములను
    సంయ మనమును గోల్పోయి సరగు గాల్చి
    మాన ధనమున నున్నట్టి మైధిలి గనె

    రిప్లయితొలగించండి
  25. జలధిలంఘనమునుచేసి జవము గాను
    శోధనమునుచేసినరసె సూక్తగతిని
    తనదుభావనము దెలిపి త్వరితముగను
    సంయమనమునసాధించెసకలమచట.
    మరొక పూరణ

    జలధి లంఘనమును జవముగా చేయుచు
    తనదుయాగమనము ధరణి జాత
    కెరుకపరచి కాల్చె నిమ్ముగభవనముల్
    సేతుబంధనమును చేసె విభుడు

    రిప్లయితొలగించండి
  26. అబ్ధినుల్లం *ఘనము* జేసి యనిల సుతుడు
    చెట్టు క్రింద జీ *వనము* ను చేయు కుజను
    శో *ధనము* చేసి లంకలో చూచి, కనలి
    యభిగ *మనము* చేసి యడచె నసుర తతుల

    రిప్లయితొలగించండి
  27. శ్రీ రఘురామ! పావనము జేసితివయ్య మదీయ నావనున్
    చేరిన హాయి లంఘనము జేసెను హద్దుల నా మనమ్మునన్!
    కూరె యొకింత యింధనము కోరి భజింపగ నీదు నామమున్!
    దారి జరించు కామన ముదమ్ము నిడెన్ బదముల్ స్పృశింపగా!

    రిప్లయితొలగించండి
  28. కె.వి.యస్. లక్ష్మి:

    వనధి లం(ఘనము) నొనర్చి వాయు సుతుడు
    సా(ధనము)తోడ లంకలో జానకి గని
    పా(వనము)నైన భక్తిని ప్రణిధి గూర్చి
    తనదు నాగ(మనము)నెంచి వినతి జేసె.

    రిప్లయితొలగించండి