2, మే 2021, ఆదివారం

సమస్య - 3711

3-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ"
(లేదా...)
"సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా"

(దువ్వూరి రామిరెడ్డి గారి పద్యపాదానికి రూపాంతరం)

60 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    ధర నీ లేమిడి యేల పుట్టెనొ కదా, దైవమ్మ, భాషింపుమా!
    పొరిగా సంపద గల్గువారలకు నీ పూజ్యత్వమేలో గదా!
    సిరులందించి, దరిద్రతం దునిమి, సుశ్రేయమ్ములం గూర్చఁగా,
    సిరియే మోక్షము నంద సాధనమగున్; జింతించి సాధింపుమా!

    రిప్లయితొలగించండి
  2. "మోక్షంనారాయణాధిచ్చేత్"
    తే.గి.
    జగము నందున జీవన సాధనమ్ము
    ముక్తి నిచ్చెడి వానికి ముద్దరాలు
    స్వామి చెంతకు చేరగ సాకునట్టి
    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    సిరి = లక్ష్మీదేవి

    రిప్లయితొలగించండి
  3. దైవ చింతన గల్గియు ధార్మికంపు
    కార్యముల యందు మగ్నమై కాంక్ష తోడ
    నామ జపమును భక్తి యన్ నమ్ర యుతపు
    సిరియె మోక్షోప లబ్ది కి జీవ గఱ్ఱ

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరమపదమున జేర్చెడి పరమశివుని
    భజన జేయుచు నిష్ఠతో పరగునపుడు
    సొబగుగ వికసించెడి నాత్మశుద్ధి యనెడి
    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  5. సిరియే మూలము సర్వ జీవులకు సంక్షేమమ్ము జేకూర్చుగా,
    సిరియే గావలెనన్న గాంచు జగతిన్ శ్రీనాథు రూపమ్ముగన్
    సిరినే హద్దున నుంచువాడగునులే శ్రీమంతుఁ, ధీమంతుడున్
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రీమంతు' తర్వాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  6. వరదుండా హరి యండనుండ మది స్థితప్రఙ్ఞత్వమున్ బొందుచున్
    తిరుగేలేని విధంబునన్ మనమునన్ తీవ్రంబగున్
    శ్రద్ధతో
    కరుణాలోలుడు శ్రీపతిన్ గొలువ నిష్కామంబగున్
    కర్మయన్
    సిరియే మోక్షమునంద సాధనమగున్ జింతించి సాధింపుమా


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదాగా
      కఱకు భాషణముల మది విఱచుచుండు
      మొఱకుతనమున సతతము గఱచుచుండు
      తఱచి తప్పులనెన్నుచు వఱలు చుండు
      పరమ గయ్యాళి యైనట్టి భార్యయనెడు
      సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

      తొలగించండి
    2. మీ మొదటి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
      రెండవ పూరణ మనోరంజకంగా ఉన్నది.
      అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
    4. ఇటీవల జిలేబిగారి పూరణలు కూడ కానరావడం లేదు.వారి ఆరోగ్యం యెలా ఉన్నదో!😒😒

      తొలగించండి
  7. స్టీవుయాపిలునిండుగసిరులుఁగూర్చె
    తరిమెవెనువెంటమ్రుత్యువుధరణియందు
    మేలుగోలుపయ్యెమేధకునెఱుకఁగూడె
    సిరియెమోక్షోపలబ్ధికిజీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి

  8. ధనము లేనినాడిక దైవ దర్శనమ్మె
    దొరుకదయ్యె నర్చన కింత దుడ్డులంచు
    గుంజు చుండెడి యీనాటి గుడుల గనగ
    సిరియె మోక్షోప లబ్దికి జీవగఱ్ఱ.


    సరియే నీనుడులంటి, మందిరములన్ సంపాదనే లక్ష్యమై
    గొరకుల్ గాదుటె నిర్వహించునది సంకోచంబు లేకుండనే
    ధరలన్ పెట్టుచు పూజలం చునదియే ధర్మంబనన్ గాంచినన్
    సిరియే మోక్షము నందసాధనమగున్ జింతించి సాధించుమా.

    రిప్లయితొలగించండి
  9. శ్రీకైవల్యపథంబు జేరుటకునై...

    తేటగీతి
    స్మరణఁ జేయుము లోక రక్షానుకూలు
    భక్త పాలనన్ రాక్షస భంజనునకు
    సృష్టి లీలా వినోది కూర్ఛెడు దయయను
    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    పోతనామాత్యుడు వారు శ్రీనాథుల వారితో అన్నట్లూహించి...

    మత్తేభవిక్రీడితము
    సిరి సీతమ్మకు ముక్తి దాత ప్రభువౌ శ్రీరామ చంద్రుండె తా
    వర శ్రీ భాగవతాంధ్ర కావ్యసుధ నేఁ బంచంగ దీవించె ,వా
    క్సిరి దివ్యామృత ధార వాణి నయనాల్ సిప్పిల్ల నిట్లాడెఁ ద
    ద్సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వాక్సిరి' దుష్టసమాసం. "...బంచంగ వాగ్రూపమౌ సిరి.." అందామా?

      తొలగించండి
    2. 🙏 ధన్యోస్మి గురుదేవా🙏

      సవరించిన పూరణ:

      మత్తేభవిక్రీడితం
      సిరి సీతమ్మకు ముక్తి దాత ప్రభువౌ శ్రీరాము నా దేశమై
      వర శ్రీ భాగవతాంధ్ర కావ్యసుధ నేఁ బంచంగ వాగ్రూపమౌ
      సిరి! దివ్యామృత వాణిఁ గాంచి కల నిష్ఠింపంగఁ గారుణ్యమన్
      సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా!

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సరియౌ భక్తిని గూడు డెందమున ప్రజ్ఞానమ్ముతో సాగుచున్
    పరమున్ గూర్చెడి దైవమున్ ఘనముగా ప్రార్థించు కాలమ్మునన్
    దరి జేరంగగ నుండు నాత్మబల తత్త్వార్థమ్మె ప్రేరించునౌ
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా!

    రిప్లయితొలగించండి
  11. హరి పదములే మదికిసదా హాయినిడును
    భక్తు లెపుడును గోరెడి భాగ్యమునిల
    రాజిల వలెను హృదిలోన రాముడెపుడు
    రాఘవుని దరికిని జేర్చు రామనామ
    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రామనామ సిరి' దుష్టసమాసం. "రాము డనెడి సిరి" అనండి.

      తొలగించండి
  12. మ:

    స్థిరమై సాంతము చేయగన్నగవు లాశింపంగ ప్రావీణ్యతన్
    నిరతంబైనెర వేరనివ్విధిని తా నేకంబవన్నెల్లెడల్
    వరమై యెప్పగ నిత్యమై తనరుచున్ భావింప ప్రారబ్దమౌ
    సిరియే మోక్షము నంద సాధన మగున్ జింతించి సాధింపుమా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. సమస్య :
    సిరియే మోక్షము నంద సాధనమగున్
    జింతించి సాధింపుమా

    ( హరిభక్తి సర్వారిష్టనాశకం - మోక్షసంధాయకం )

    మత్తేభవిక్రీడితము
    ............................

    హరియే యందర గాచుచుండు దయతో
    నాలించి దైత్యేభకే
    సరియై ; దుష్టుల దుర్మదాంధుల పురా
    చారిత్రవిధ్వంసియై ;
    దరియై శిష్టుల నెల్ల నాదుకొనులే ;
    తద్దేవుపై భక్తియన్
    సిరియే మోక్షము నంద సాధనమగున్
    జింతించి సాధింపుమా !!

    రిప్లయితొలగించండి
  14. తన విధిగ బూర్తిగావించ దలచినట్టి
    గమకముల దలకిందులుగ సలుపగల
    యధిపురుషుడొకడు వెలసెననెడి జ్ఞాన
    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  15. సిరినిం సంపదలన్ని వీడి హరిసంసేవస్థిరాసక్తితో
    పరిపూర్ణంబగు నమ్మకంబు విభుఁపై భక్తిన్ మదిన్నింపుచున్
    కరముల్ మోడ్చి సదా మనంబునను దాఁ గాలించుచుండన్ తపో
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సిరినిన్' అనండి అక్కడ బిందువు రాదు. రెండు చోట్ల అరసున్నలు అవసరం లేదు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      సిరినిన్ సంపదలన్ని వీడి హరిసంసేవస్థిరాసక్తితో
      పరిపూర్ణంబగు నమ్మకంబు విభుపై భక్తిన్ మదిన్నింపుచున్
      కరముల్ మోడ్చి సదా మనంబునను దా గాలించుచుండన్ తపో
      సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా

      తొలగించండి
  16. మోక్షసాధన మార్గము మునివరులకు
    తపము సల్పుటయే పరాత్పరునిగూర్చి
    సజ్జనాళికి నెక్కొను సత్యమనెడు
    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురుభ్యోనమః

    అయ్య వరముననాయాస మందుకొనెద
    మమ్మ కరుణయె తోడుగ నమరినప్డు
    నవ్విధంబుల జూడగ హరి సరసన
    సిరియె మోక్షోప లబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  18. సిరియున్ సంపద లెల్లరావెపుడు రాశీభూతమై తోడుగన్
    వరమై నిత్యము నీవొనర్చు పలు సద్వ్యాపారముల్ తోడగున్
    పరమాత్మున్ మదినిల్పి యార్తులకు సేవల్ సల్ప ప్రాప్తించు నా
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా

    రిప్లయితొలగించండి
  19. సిరు లార్జించిన రాజభోగములతోఁ జెల్వారు సౌఖ్యమ్ము లా
    సిరినిం గోరియె వడ్డికాసులుగొనెన్ శేషాద్రివాసుండు నీ
    సిరులే యామ్యపథమ్ములై పొనర, సంసేవాప్తి దానార్థమౌ
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  20. భార్య చెప్పిన మాట తప్పక వినవలె

    నరుడు కాని నందుని కొమరుండుగాని

    చేదుకోమని చెప్పును సిరుల తల్లి

    సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. వరవైవాహికజీవనంబునిదివ్యాపారంబుమోక్షార్థమై
    స్వరసంధానమునాలుబిడ్డలనసంసారంబుగాంక్షంబునై
    నరలోకంబునధర్మసంపదలునానార్థంబున్యాయంబునౌ
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా

    కొరుప్రోలురాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  22. విరులేలా తమ కోమలత్వమున దీ
    పించు న్నవోన్మేషమున్
    తరులేలా తమ శాఖలం బరచి ప్ర
    స్తారించునే నీడలన్
    ధర నీ మానవ సేవజేయగను శ్ర
    ద్ధాసక్తతన్ జ్ఞానమన్
    సిరియే మోక్షము నంద సాధనమగున్! జింతించి సాధింపుమా!



    మరొక పూరణము:

    అరయ న్మోక్షమటన్నచో నదియ దే హంబొందు సద్యోగమా?!
    ధర నీ బంధములన్ త్యజించి విలస
    త్కాం తాత్ముడౌటంగదా!
    మరియేలా సిరిసంపదల్? బ్రతుకనే!
    స్మారంబునన్ జ్ఞానమన్
    సిరియే మోక్షము నంద సాధనమగున్! జింతించి సాధింపుమా!

    స్మారము=అనుబోధము, తలపు

    రిప్లయితొలగించండి
  23. భక్తిశ్రద్ధల తోడను రక్తితోడ
    దైవనామంబు బలుకుచు దినముదినము
    భజన జేయుచు మెలగెడు భక్తవరుని
    సిరియెమోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  24. వరరాజన్యులచందమైనెలమికావ్యంబుల్సిరుల్దెచ్చెగా

    సరిమత్తేభముబోలుచున్కవియుతాసాంగత్యముల్జేసెనే
    సిరితాబోయెనుజీవితంబుననుదోసంబుల్దగన్ఁజూపెనే
    సిరియేమోక్షమునందసాధనమగున్చింతించిసాధింపుమా

    రిప్లయితొలగించండి
  25. ~~~~~~~~~~~~~~~~~
    అరయన్ సంపద లేని మానవు
    లు నానానేక యింబందులున్
    ధరలో బొందుట జూచుచుందు
    ము కదా దారిద్ర దౌర్భాగ్యముల్
    తరుగున్ వేదన లన్నియున్ సుఖ
    ములుం దక్కున్ నిజంబిద్దియే
    సిరియే మోక్షము నంద సాధన
    మగున్ చింతించి సాధించుమా!
    ~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  26. దురితమ్ముల్ పొనరింపకుండ, ఖలులన్ దూరమ్ముగా నుంచుచున్
    ధరపై జన్మకు సార్థకమ్ముకలుగన్ దైత్యారి పూజించుచున్
    నిరతమ్మున్ కడుఁ బ్రేమతోడ కనినన్ నిర్భాగ్యులన్ వచ్చు నా
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా

    రిప్లయితొలగించండి
  27. జీవగఱ్ఱ వ్యాకరణము చేత నెంత
    సత్య వాక్యమొ యంతియ సత్య మగును
    దలఁచి చూడ నీ వాక్కులు ధరణిలోన
    “సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ”


    సిరు లీ నేరవు మోక్ష మెన్నఁడును సంసేవింపు పీతాంబరున్
    గురు సంఘమ్మును వేడి కాంచుమ గతిన్ ఘోరంబుగా నిట్లు పం
    దిరి శోకింపఁ దరింతె వెన్నుని పయిన్ నీ సత్తెపుం బత్తి నా
    సిరియే మోక్షము నంద సాధన మగున్ జింతించి సాధింపుమా

    రిప్లయితొలగించండి
  28. ధనమార్జిత కాకుత్స ధనమూలమిదం జగత్I
    అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్యచII

    గురువుల్ నేర్పరువిద్య నాలయములో గోవింద!గోపాల! నీ
    దరి పూజారులు చేరనీయరకటా ద్రవ్యమ్మె సర్వమ్ము భా
    సురుడా రాముడు, *"నిర్ధనుండు మృతుడంచున్"* నేర్చెనానాడె తాన్
    *సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  29. వరమౌ భక్తిని బూజజేయగను నాబాబాకటాక్షంబనే
    సిరియే మోక్షము నందసాధనమగున్ జింతించి సాధింపుమా
    పరముంబొందగ నేర్చుచో సతముగుర్వాదేశ మూలంబునన్
    బరగంవచ్చును రాధికా!వినుమయాఫాలాక్షునాశీసులన్

    రిప్లయితొలగించండి
  30. నిరతంబైహిక వాంఛలందు మనికిన్ నిస్సారమున్ జేయకన్
    వరమౌ మానవ జన్మ లక్ష్యమును సాఫల్యంబు గావింపగా
    స్థిర చిత్తంబున నీశ్వరున్ గొలువగా సిద్ధించు నాధ్యాత్మమౌ
    సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా

    రిప్లయితొలగించండి
  31. ధనము మనవెంటెపుడురాదు ధరణియందు
    మనము చేయుచు నున్నట్టి మంచి చెడులె
    వచ్చు ననుచును నెంచుచు వెచ్చచేయు
    సిరియె మోక్షోప లబ్ధికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  32. ధర్మ సంపాదన
    ************

    నీచ కార్యాల కొడిగట్టి నీతి లేని
    కుటిల బుద్ధితో వేలాది కోట్ల కొరకు
    తస్కరించు ధనముకన్న,ధర్మమైన
    సిరియె మోక్షోపలబ్దికి జీవగర్ర !

    రిప్లయితొలగించండి