12, మే 2021, బుధవారం

సమస్య - 3721

13-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
(లేదా...)
“రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”

54 కామెంట్‌లు:

  1. వివరముపుట్టుకతెలియగ
    కవియగనాత్మనుపదిలముగాగనుభక్తిన్
    వివశుడవైరాగ్యంబున
    రవయుతమౌనమునశంకరప్రభుగోల్తున్

    రిప్లయితొలగించండి
  2. భవ జలధిం దరించఁగఁ దపం బొనరింపఁగ బూని నే నను
    శ్రవమగు దీక్షఁ గైకొని చిరంబగు యోగము నంది లోని శా
    త్రవుల నెదిర్చి నిర్మల పథంబున సాగుచు శాంతినిచ్చు గౌ
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్,

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    "భవహర నీవె దిక్క"నుచు భర్గుని వేడ, దయాంతరంగుఁడై,
    యవనిని సర్వ భక్తులకు హర్షమునన్ వరమిచ్చిదీవనల్
    జవమున నిచ్చుదైవమని, సత్వర మేను నుతింపఁ బూని, నీ
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్!

    రిప్లయితొలగించండి
  4. జవమునుసత్వమున్గలిగిజారనియౌవ్వనమందునాత్మనే
    నవిరళభక్తిభావముననజ్ఞుడగాకనుసాధనంబునన్
    సవనముగాగజీవనముశంభునిసన్నిధిగోరువాడనై
    రవయుతమౌనమూనిత్రిపురదివిషుశంకరుఁబ్రీతిగోల్చెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      పేరేమో 'మహాలక్ష్మి' పూరణ చూస్తే పురుషుడు చేసినట్లుంది. "భావమున నజ్ఞత వీడియు... సన్నిధి గోరుదాననై" అనవచ్చు కదా!

      తొలగించండి
    2. ఏకశేషవ్రుత్తినిభావమునుగ్రహింపవచ్చునుగదా,, మీఅభిప్రాయమునుశిరసావహించుచున్నాను

      తొలగించండి
    3. మహాలక్ష్మిపేరుపురుషులకుగూగవాడుకలోగలదు, తూర్పుగోదావరిలో

      తొలగించండి
  5. కందం
    సవరించ సర్వ సృష్టిని
    మివుల పరబ్రహ్మ తానె మేల్కొని జగతిన్
    శివమొసఁగ భక్తిమై నీ
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    చంపకమాల
    రవి సుతుఁ డాగడమ్ము విడ రయ్యున వచ్చి మృకండు సూతి కా
    యువొసఁగి మేటి మౌనిగ మహోన్నతి గూర్చిన భక్తరక్షకున్
    నవయుగ మందు కోవిడను నాశక కారిని మట్టుఁబెట్ట నీ
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్

    రిప్లయితొలగించండి
  6. భవ బంధములను బాపగ
    నవవిధ మగు భక్తి తోడ నైజపు రీతిన్
    సువిధపు జపతప మను గా
    రవ యుత మౌనమున శంకర ప్రభు గొల్తున్

    రిప్లయితొలగించండి
  7. ~~~~~~~~~~~~~~~~~~~~~~
    వరముల నిచ్చి భక్తతతి బాధ
    లు దీర్చును దుర్జనాదులన్
    నరకము కంపుచుండు, ఘన నా
    ట్య దురంధరు డద్రి వాసునిన్
    నిరతము బ్రోవుమంచుమది ని
    క్కము మిక్కిలి యాత్మలోన నీ
    రవ యుత మౌనమూని త్రిపుర
    ద్విషు శంకరు బ్రీతిగొల్చెదన్.
    ~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  8. భవహర! శంకర! శంభో!
    తవ నామస్మరణ వీడి తరియించుటయా!
    ప్రవిమల చిత్తంబున, నీ
    రవ యుత మౌనమున, శంకరప్రభుఁ గొల్తున్!

    రిప్లయితొలగించండి

  9. శివుడా మినుసిగ దేవర
    భవభయ హరుడౌ కురంఘ పాణి వృషపతిన్
    శివరుని సతమ్ము నే నీ
    రవయుత మౌనమున శంకర ప్రభుఁ గొల్తున్.



    భవభయ హారి వాడని శుభంబుల గూర్చెడు దేవదేవుడా
    శివరుడటంచు నమ్మి శశిశేఖరు డైన పినాక పాణి నా
    గువుగళమందు దాల్చెడి యఘోరుని చిచ్చర కంటి వేల్పుఁ నీ
    రవయుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతి గొల్చెదన్.

    రిప్లయితొలగించండి
  10. జవముల దీసెడు తెవులును
    సవరింపగ వేడుకొనుచు శర్వుని, సాంబన్,
    భవుడి, ననంతుని, నే గౌ
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్.

    రిప్లయితొలగించండి
  11. పవలును రేయి గాఢతరభక్తిహృదంతరభాసమానునిన్
    శివుని పరాత్పరున్, కరము శీర్షము నెన్నుదురున్ శిరమ్ము లీ
    యవనిని సోకుభంగిమల ధ్యానసమంచితచిత్తపూర్తి నీ
    రవయుతమౌన మూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  12. పవనము కుంభించి హృదిని
    బవరంబొనరించియారు పరిపంథులతో
    భవభయహరమునకై గా
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    రిప్లయితొలగించండి
  13. సమస్య :

    రవ యుత మౌనమూని త్రిపు
    రద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్

    ( శివపూజకై తెల్లకలువలతో అరుదెంచిన అర్ధాంగితో భర్త )

    నవమగు భక్తిమార్గముల
    నా కెరిగించిన ధర్మవర్తినీ !
    శివమయమైన జీవితము
    జెన్నుగ జూపినయట్టి ప్రేయసీ !
    నవనవలాడు పుష్పముల
    నర్మిలి దోసిట నుంపు నింక కై
    రవయుత ! మౌనమూని త్రిపు
    రద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్ .

    ( కైరవయుత = తెల్లకలువలను తెచ్చినదానా )

    రిప్లయితొలగించండి
  14. శివమయ దేహమునందున
    భవనాశుని గన్గొనంగ స్వాత్మస్థితిలో
    పవనక్రియ నిగ్రహ నీ
    రవయుత మౌనమున శంకరప్రభు గొల్తున్

    శివమయ దేహమందునను చిన్మయరూపున దాగియుండెడిన్
    భవభయహారినిన్ దెలియ భావనలన్నిటి నిల్పివేయగన్
    పవనము నిగ్రహించి నిజస్వాంతము నందున
    తన్మయత్వమున్
    రవయుత మౌనమూని త్రిపురద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్

    రవయుత = సున్నితమైన (ఆం.భా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవయుత అంతే శ్రీయుత లా అనుకున్నా.. శ్రీతో కూడిన అనగ ఆ లక్ష్మీ దేవి కృపా కటాక్షము కలుగగా.. ఐతే నేనింక ఏ రవ్వ కేసరి లేద రవ్వ లడ్డు ను నైవేద్యముగా పెట్టి మౌనం దాల్చి త్రిపురాసురాంతకుడైన శివుని ఆప్యాయత కూడిన భక్తి యుక్తి ప్రపత్తులతో కొలుస్తున్నా అనే అర్థమనుకుంటేను..

      ఈ ఆంధ్ర భారతి నిఘంటువా.. బ్రౌనీయం అనగ బ్రౌన్ బ్రెడ్డా.. ఏమోలే.. బ్రిటీషర్ కాలం నాటి తెలైగూ లైపి తైపో ఎర్రఱ్

      తొలగించండి
  15. భవహర! యేమి కాలమిది భారమయెన్ బ్రతుకీడ్చుటెట్టులో,
    జవముల దీయురోగము, సజావుగ సాగెడి జీవితమ్ము, భై
    రవమయి నొప్పె, దేవ! దిగి రమ్మిటు! వేగమె గావ మమ్ము, గా
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్.

    రిప్లయితొలగించండి
  16. కం//
    శివతత్వము నెరుగుటకై
    భవసాగర మీదలేక భక్తిగనేడే !
    నవనీతపు హృదిలోపల
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్ !!

    రిప్లయితొలగించండి
  17. హమ్ లకే జకో పూరణ కూఁ ఛ కేన్ తోన కూణి పూఁచ్రేచ కేన్
    ఆచో ఛగ బల్లా ఛగ కేన కో నితేర్ ఏమా కాఁయి తప్పు చగ కేన్ కూణి పూఁచతో కేణు లపణ్..!

    సారి జగతేమా ప్యాల్రోచ కత్తేరికో రోగ్
    సే డర్రేచ ఓతి పేనా కన్నాయి ఛేని జత్రా
    కేన కన్న కూఁరచకో కాఁయి కేర్వేరో కోన్తి కేని
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    రిప్లయితొలగించండి
  18. అవసరము లేదు మనకు అ
    భవు పూజకు చాల తంతు, భావన మెండై
    శివునే ధ్యానించిన గౌ
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    రిప్లయితొలగించండి
  19. శంకరాభరణం వారి సమస్య : “రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
    1)
    కం.
    శివుడిని కొలుతును మరిమరి,
    పవిత్ర గంగా జలమున పదములు కడుగన్ |
    నవవిధ పుష్పంబులఁ , గౌ
    “రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్” ||

    - రాంబాబు కైప
    12-05-2021

    శంకరాభరణం వారి సమస్య : “రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”

    2)
    శివశివమంత్రమున్ జపము జేయుచు భక్తిగ పూజ చెయ్యగన్
    నవనవ రీతులన్ ప్రణవ నాదము బల్కుచు ధ్యాన మార్గమున్
    భవజలధిన్ తరించి భవు పాదములే ప్రణతిల్ల గోరి ,గౌ
    “రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”

    3)
    కం.
    కువకువ లాడగ పక్షులు,
    రవములు వినుచును కవితలు వ్రాయగ నీకై
    యవిరళ రచనల కై, నీ
    “రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్” ||

    - రాంబాబు కైప
    12-05-2021

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. ( మా గురువు గారి పేరు శంకరయ్య)

    నవ కవులు జేయు తప్పుల
    సవరించుచు సూచనలిడి చక్కగ వారిన్
    ప్రవర కవుల జేయగ, గౌ
    రవయుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    రిప్లయితొలగించండి
  22. యవనిక మూతికిన్ దొడిగి యాతన బొందుచు దూరదర్శినిన్
    శవములు గాల్చుటన్ గనుచు, శక్యము గాని కరోన, కౄరమౌ
    దవముగ రేగగా, జనులు తాళరు, శాంతిని గోరి నేను నిర్
    “రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”


    కవితలు వ్రాయగ తెలుగున
    చవి గల మాటల నొసగుము జంగమ దేవా!
    నవ ఆలోచనకై ధీ
    “రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”


    రిప్లయితొలగించండి
  23. శివమనియెంచిరాగమునశీఘ్రములాదిగసేకరించి,నా
    శివునికిసేచనంబుననుజిమ్ముచుగంగనుమేలుమేలుగన్,
    స్తవమునమల్లెమొల్లలునుజల్లనిదెల్లనిశుద్దమైనకై
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  24. నివసనమందునన్ పరుల నీడను చూచి భయమ్ము నొందుచున్
    బవరము చేయు చుంటి పరిపంథుల సృష్టి కరోన తోడుతన్
    ప్రవిమల భక్తియుక్తముగ, రమ్మని కావగ, చిత్తమందు నీ
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్

    రిప్లయితొలగించండి
  25. పవనము గుండెయందుబిగబట్టుచు కుంభక రేచకంబులన్
    భవహరుడైనయీశ్వరుని భవ్యపదంబుల దృష్టి నిల్పుచున్
    శివశివయంచు ధ్యానమున చిన్మయరూపుని దల్చుకొంచు నీ
    రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్

    రిప్లయితొలగించండి
  26. కం//
    భవభూతై జన్మించితి
    సవరించుము నుదిటి వ్రాత సర్వము నీవై !
    నివసించగ కినుకేలర
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్ !!

    రిప్లయితొలగించండి
  27. భవ బంధనములు దెంచగ
    శివ నామమె శరణటంచు స్థిరచిత్తమునన్
    ధ్రువముగ కామారిని గౌ
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    రిప్లయితొలగించండి
  28. కె.వి.యస్. లక్ష్మి:

    భవపాశమ్ముల జిక్కితి
    శివనామస్మరణె నాకు శ్రీకరమయ్యెన్
    భవహర దయజూడగ గౌ
    రవయుత మౌనమున శంకరప్రభు గొల్తున్.

    రిప్లయితొలగించండి
  29. జవసత్వములున్నవరకు
    న్నవరాత్రుల పూజ శివాని నయజయమొసగున్
    శివరాతిరి జాగరణన్
    రవయుత మౌనమున శంకర ప్రభుగొల్తున్. 🙏

    రిప్లయితొలగించండి
  30. కవితల రచనకు నేగౌ
    రవయుత మౌనమున శంకరు ప్రభు గొల్తున్
    శివనామ జపము వలననె
    భవబంధము లుడిగి మనకు పరముంగలుగున్

    రిప్లయితొలగించండి
  31. కవనము లెస్స వచ్చుట కుగాగల కార్యము బొందగోరి గౌ
    రవయుత మౌనమూని త్రిపుర ద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్
    ప్రవిమల భక్తి తోడనిల భవ్యుని పూజను జేయుచో దయన్
    నవిరళ భోగభాగ్యములు నాయువు,గీర్తిని గల్గజేయుగా

    రిప్లయితొలగించండి
  32. భవ పారావారమ్మును
    శివ నామము దాఁటఁ జేయు శీఘ్రమ్ముగ భ
    క్తి వశుండనై ముని గణా
    శ్రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్

    [ఆశ్రవము = అంగీకారము]

    భవ చయ నాశకుం డజుఁడు పంచ వరాస్యుఁడు నిత్య సద్దయా
    ద్రవ పరిపూరి తాత్ముఁడు నుదారుఁడు సాంబుఁడు స్వీయ మానస
    స్రవ శివ నామ సంస్మరణ సక్త సమంచిత పూర్వ భా గను
    శ్రవ యుత మౌన మూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్

    [అనుశ్రవము = సంప్రదాయము]

    రిప్లయితొలగించండి
  33. భోజనము వేళ అయినందు వల్ల , తినుబండారాల నుపయోగించి పూరణ
    4)
    రవ కేసరి, రవ లడ్డులు
    రవ పాయసమునటు నీకు లావుగ పెట్టన్
    శివు సాదము గతియని నీ
    “రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్” ||

    - రాంబాబు కైప
    13-05-2021

    రిప్లయితొలగించండి
  34. కె.వి.యస్. లక్ష్మి:

    భవపాశంబుల జిక్కితి
    శివనామ స్మరణజేయ చిత్తము నందున్
    అవశుడ బ్రోవ నను నీ
    రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్.

    రిప్లయితొలగించండి

  35. నవవిధ భక్తుల గొలుచుచు
    జవముగ పూజలనుచేసి సవ్యపురీతిన్
    దివమునురాత్రియునేగౌ
    రవయుత మౌనమున శంకరప్రభుగొల్తున్

    రిప్లయితొలగించండి