18, మే 2021, మంగళవారం

సమస్య - 3726

19-5-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గానమొనరించు పికమ నిన్గాన నగునె”
(లేదా...)
“గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ”

66 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    కోనలు కొండలున్ నదులు గుల్మములున్ గుహలందు మ్రోయఁగన్
    వీనుల విందుగా మనసు వేదనలన్ మఱపించునట్లుగా
    మౌనములన్ వడిన్ బఱచ, మాధురులన్ దగఁ బంచఁ, జెట్లపై
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే? పికమా! కలధ్వనీ!

    రిప్లయితొలగించండి
  2. మధుర మంజుల రాగాలు మహికి పంచ
    తరువు లందున కొమ్మలన్ దాగి నీవు
    గాన మొనరించు పికమ ని న్గాన నగునె
    అనుభవింతురు మనసార హ్లాద ముగను

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తేటగీతి
      హాయిఁ గొల్పెడు నామని యంకురించ
      పల్లవమ్ముల చవిగొని పాడినంత
      కమ్మనగు, కరోన చెలఁగ గద్గదమగు
      గానమొనరించు పికమ నిన్గాన నగునె?

      ఉత్పలమాల
      మేనులు పుల్కరించ యనిమేషులు సైతము మెచ్చు మంజుల
      స్వానము వారసత్వముగ పంచుచు మైమరపించ మీకు నా
      హ్వానము, లీ కరోన దగు హానికి గద్గద ఖిన్నకంఠమై
      గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా! కలధ్వనీ!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి
  4. నే నొక బాటసారి మరి
    నీవు చరించు వసంతవేళ నీ
    ధ్వాన మరందము న్గొనెడి
    భాగ్యముకై తపియించి యీ వనీ
    యానము జేయుదున్ మిగుల
    హాయినొనర్చెడి మావితోపులో
    గానము సేయు నిన్నుఁ గనఁ
    గా నగునే పికమా! కలధ్వనీ!

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    గానము సేయు నిన్ను గన
    గా నగునే పికమా కలధ్వనీ

    ( " భారతకోకిల " కవయిత్రి సరోజనీనాయుడు )

    ఉత్పలమాల
    ..................

    ఆ నగుమోములో తొణుకు
    లాడినవమ్మ! స్వతంత్రతామహా
    మానవతామనోజ్ఞగుణ
    మండితసాహితికాంతిరేఖలే !
    ధ్యానము భారతాంబ యెడ
    దప్పక నిల్పి సరోజనీ ! కళా
    గానము సేయు నిన్ను గన
    గా నగునే పికమా ! కలధ్వనీ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారత కోకిలను ప్రస్తావించిన మీ పూరణ మనోహరంగా ఉన్నది.

      తొలగించండి

  6. కోవిడనుచు లాక్డౌనుతో కొంపలందు
    బంధియై మధురమగు నీ పాట వినుటె
    కాని కనులార కాంచని కాల మిదియె
    గాన మొనరించు పికమ నిన్గాన నగునె.



    ప్రాణములన్ హరించుచు ప్రపంచము నందు కరోనయే సము
    త్థానము చెందుచుండ గని త్రాసము నందుచు లాకు డౌనుతో
    కాననమందె నిల్చితిమి కాదె వసంతము నందు మోదమున్
    గానము సేయు నిన్నుఁ గనగా నగునే పికమా కలధ్వనీ.

    రిప్లయితొలగించండి
  7. సహజమాధుర్యరసరమ్యశాంతగుణము
    పరిమళించినకవితలభావమెంచి
    భక్తకోటికివినిపింపభాగవతము
    గానమోనరించుపికమనిన్గాననగునె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం మనోహరంగా ఉన్నది. కాని భాగవతం గానం చేసే పికం ఎవరు?

      తొలగించండి
    2. తెలుగుభాగవతగానముచేసినదిపోతనగారు

      తొలగించండి
  8. వేనకువేలుగాకవితవేల్పులుఁజెప్పినసౌరభంబునన్
    కోనలకోమ్మచాటుగనుకోకిలకంఠముసాటిరాదుగా
    జానుగబుద్ధినిర్మలతజానపదమ్ములజాలువారునీ
    గానముసేయునిన్నుఁగనగానగునేపికమాకలధ్వనీ
    గానముసేయు

    రిప్లయితొలగించండి
  9. నూర్గురు సుతుల తల్లికేను పతినమ్మ

    నీతి కోవిదు విదురుకేనె ప్రభువమ్మ

    అంధుడ నయితినాలకించగలనమ్మ

    గానమొనరించు పికమ , నిన్గాన నగునె”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోకిల గానం వినబడుతుంది గాని చెట్లగుబురులో దానిని కనిపెట్టడం కష్టమే!

      తేనియలూరు కంఠమున దేల్చదవీవు జనాళిమత్తులో
      మేనుకు కృష్ణవర్ణమును మెత్తగ బ్రహ్మకు నెట్లుదోచెనో
      మ్రానుల పల్లవంబులను మాటువడంగను నీదురూపమే
      గానము జేయునిన్ను గనగా నగునే ?పికమా !కలధ్వనీ!

      తొలగించండి
    2. ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
  11. మానవులెల్ల సంతసిలి మైమరి
    చే మధురంపు గొంతుతో
    వీనుల విందుగా సతము విజ్ఞు
    లు మెచ్చు విధంబుగాను నీ
    గానము యుండు, నీ విటుల
    గర్కష కంఠముతోడ నియ్యెడన్
    గానము సేయు నిన్ను గనగా
    నగునే పికమా కలధ్వనీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'మైమరిచే' అనడం వ్యావహారికం. 'గానము + ఉండు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  12. వీనుల విందొసంగు పృథివీ హరితద్యుతి కానరాదు ప్రా
    చీనపు పిచ్చుకల్గనము చిల్కలు హంస చకోరపక్షులున్
    కానగ రావు నేడు మరి కాలపు మార భవిష్యమందునన్
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'కాలపు మార -> కాలము మార' టైపాటనుకుంటాను.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  13. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    తే. గీ .
    ఆమని విరయగ, వసంత మవత రించె
    కోకిలసుగాన మాధురి కుహు కుహు యన
    మధుర మంజుల గానము మదిని తాక,
    “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    - రాంబాబు కైప
    18-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  14. కానజాలము తరువులు కానలందు
    ధరణి వేడెక్కి పరచెను మరణశయ్య
    చైత్రమే కనుమరుగాయె చిత్రముగను
    గానమొనరించు పికమ నిన్గాన నగునె?

    రిప్లయితొలగించండి
  15. వీనుల విందుగా పలికి, వేడుక మావి చివుళ్ళు మేయు సం
    ధానత లేత కొమ్మ పరదాలను తీయవు!నవ్య రాగ, శో
    భా, నినదంబులన్ చెలగి,పాయని హాయిని గూర్చు నేస్తమా!
    గానము సేయు నిన్ను కనగానగునే!పికమా!కలధ్వనీ!!

    రిప్లయితొలగించండి
  16. కానము తర్వులన్ హరిత కాననమిప్పుడు కాష్టమాయె నే
    మానులులేని ఱాతివనమందున నామని కానరాదు నీ
    మౌనము తాళజాలమిక మాకగుపించవదేమి శాపమో
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ?

    రిప్లయితొలగించండి
  17. బాము నొంది పెరిగితివి పరుల యింట
    గాన లేకబోయె నపుడు గాకము నిను
    గళము విప్పి దొరకి పోయి కదలి , యిపుడు
    గానమొనరించు పికమ , నిన్గాన నగునె

    బాము = జన్మము

    రిప్లయితొలగించండి
  18. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    ఉ. మా .
    వీణియ వాణి మీటగనె, వేడుక తోడను హంస యాడగా
    ప్రాణుల ప్రాణమున్నొసగు బ్రహ్మకు ప్రాణము పుల్కరించగా
    వేణువు నూద కృష్ణుడటు, వీనుల విందుగ చెట్టు కొమ్ములన్
    “గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ”

    - రాంబాబు కైప
    18-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  19. శోకరసము క్షమించాలి:

    జతగ నావెంట నడువగ సతిగ వచ్చి
    ఒలికిమిట్టను దాగిన కలికి నీవు
    మగువ నిను నేను మరువను, మదిని వలపు
    గానమొనరించు పికమ, నిన్గాన నగునె.

    నా భార్య పద్మప్రియ కు కన్నీటితో....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాధాతప్త హృదయంతో ఆత్మాశ్రయంగా వ్రాసిన మీ పూరణ బాగుంది. పద్యంలో మీ అనుబంధమెంత గాఢమైందో ప్రస్ఫుటమౌతున్నది.

      తొలగించండి
    2. మీ బాధా తప్త హృదయ గీతి , ఈ పద్యంలో , మీ ఆవిడ ఆత్మను తాకుతుందండీ . బాగుంది

      తొలగించండి
  20. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    తే. గీ .

    కిలకిల రవములు వినుచు, కలలు కనగ
    గలగల సెలయేరు ధ్వనుల కనులు తెరచ ,
    కుహుకుహు స్వరములు చెవులకు వినపడగ
    “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    - రాంబాబు కైప
    18-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  21. నలుపు తెలుపుల గోలలు నరులకేను
    సరిగమలమరి మురిపించు స్వరము నీది
    అందచందముల్ లేవని యలుకతగదు
    గానమొనరించు పికమ నిన్గాన నగునె

    రిప్లయితొలగించండి

  22. శ్రీ గురుభ్యోనమః

    తేనెల గానమాధురిలు తీయుచు నిండుగ నీదు గాత్రమున్
    వీనుల హాయి గొల్పుచును విందులు జేయుచు నిద్ర లేపగన్
    మానుల దాగి యుండి తిను మామిడి లేత చిగుళ్ళ గుంపులన్
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ!

    రిప్లయితొలగించండి
  23. వీనుల విందు గాంచితిని పిన్నతనమ్మున పల్లెటూరిలో
    కానము నీదు దర్శనము క్ష్మాజములన్ నఱుకాడు చుండగా
    మానవ తప్పిదమ్మునను మాయుచు నుండెను నీదు జాతి స
    ద్గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ?

    రిప్లయితొలగించండి
  24. తానము రాగపల్లవవితానరసాభ్యుదయమ్ము చాలు ము
    ద్ధూనకరోనకీటక మధోగతిఁ జేసెను మానవాళినిన్
    కానము తన్నివారణము కాలము కాదు మహద్విపత్తులో
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. మూగబోయెనురవములుమొన్ననిన్న
    రాగమందిరినారోగ్యరక్షకులటు
    మాధవంబుననేడిటమధురమగుచు
    గానమొనరించు పికమ నిన్గాన నగునె

    కొరుప్రోలురాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  26. గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా! కలధ్వనీ”
    నీ నయగారమున్ గనుచు నీసొరమున్ దలపోయ శక్యమే!
    మానవు డేలనో స్వరము, మన్నిక గొల్పెడి రూపు రేఖలున్
    గానగ స్వార్థ చింతనయు గర్కశ బుద్ధియు నందె నీధరన్!
    (కలధ్వని = నెమలి)

    రిప్లయితొలగించండి
  27. మధుర మోహన రీతిని బధిరులకును
    హృదయ ముప్పొంగ జేయునీ హ్లాద గొంతు
    తీయ తీయని రాగాలు దీయు చుండి
    గాన మొనరించు పికమ!నిన్గాన నగునె

    రిప్లయితొలగించండి
  28. కానగరాని పుర్వదపకారిగ మారి జగంబునంతటన్
    మానని వ్యాధియై దగిలి మారణహోమము జేయుచుండగా
    కానక దారి దాగితి నికాయమునందు విముక్తికెన్నడో
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ

    రిప్లయితొలగించండి
  29. తేనెల తీపిబో లుచును దీయటి రాగము లాలపించుమో
    గానశి ఖామణీ! యునికి కానగ నిమ్ముమ,చెట్ల చాటులన్ గానము సేయు నిన్ను గనగానగునే పికమా!కలధ్వనీ!
    వీనుల విందుజే యుమము బ్రీతిగ గానము నాలపించుచున్

    రిప్లయితొలగించండి
  30. కంటి కగపడ కుండగ నుంటి వేల
    మెచ్చుకొందు నిచ్చను నిన్ను నిచ్చ లేను
    మూర నింక నీ కాకుల మూఁక లోన
    గాన మొనరించు పికమ నిన్గాన నగునె


    ఈ నర కాయ మివ్విధము హీన కరోన కరాళ నృత్యముం
    గానఁగఁ దల్లడిల్లుచును గాఱియ లందుచు నుండఁ జేయచున్
    నీ నుతి విశ్వమం దకట నిండఁగ నెల్లెడ రోదనమ్ములే
    గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ

    [కర +ఊన = కరోన = చేతులు తక్కు వైన కృమి]

    రిప్లయితొలగించండి
  31. కె.వి.యస్. లక్ష్మి:

    మావి గుబురుల చాటున మాటు వేసి
    తీయ తీయగ కూయుచు తేనె లూర
    తెలుపు నామని రాకను తెగువ మీర
    గాన మొనరించు పికమ నిన్గాన నగునె?

    రిప్లయితొలగించండి
  32. గడప దాటక గృహమున గడుపుచుంటి
    పగలు రేయిను భయమున బతుకు చుంటి
    మరణ వార్తలు నిరతము మదిన చేర
    గాన మొనరించు పికమ నిన్గాన నగునే

    రిప్లయితొలగించండి
  33. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    తే. గీ .

    వహల జలజల, గలగల పరుగు కనుచు
    వనిన కిలకిల, కిచకిచ పలుకు వినుచు
    శిఖిన పంచమ స్వరమున చిత్రముగను
    “గానమొనరించు పికమ నిన్గాన నగునె”

    - రాంబాబు కైప
    18-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి