20, మే 2021, గురువారం

సమస్య - 3728

21-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
(లేదా...)
“సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో”

71 కామెంట్‌లు:

  1. జీవమాయుధంబునుగాగచేటుగలుగు
    మందిమార్బలంబునుగూడమాటుగాను
    శత్రుపక్షంబుతలపడసంకటమ్ము
    సమరమునుమానికురురాజుశాంతిఁగోరె

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    [దుర్యోధనుఁడు సంధిఁగూర్చుకొనుమను తండ్రితోఁ బలికిన సందర్భము]

    "విమతుల మాటలన్ వినియు, వేగమె సంధినిఁ గూర్చుకొన్నచో,
    సమరము చేతఁగాక, విరసమ్మున రాజ్యము నాససేయకే
    స్థిమితముఁ గోలుపోయిరని తిట్టెదరో పిత! లోకు లండ్రిలన్
    సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో!"

    రిప్లయితొలగించండి
  3. అమలినభావు డందరకు హర్షము గూర్చగ ధర్మరాజటన్
    సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహో
    క్రమమును దప్పి పాండవుల కాంక్షలనొప్పక క్రూరచిత్తుడై
    భ్రమపడి పోరి చచ్చె తనవారలతోడ రణాంగణంబునన్.

    రిప్లయితొలగించండి
  4. అమరినగీతబోధలనునర్జునుడంతటపోరుసల్పగా
    చమరినకన్నుతోడుతనుచాలగవేదనఁజెందెరాజునున్
    విమలముగాగమానసమువింతకరోనకువెన్నుఁజూపుచున్
    సమరముమానిశాంతినెలకోల్పగఁగోరెసుయోధనుండహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. కాని దుర్యోధనునకు, కరోనాకు సంబంధం? 'చమరిన కన్ను'?

      తొలగించండి
    2. చమరినసుకుమారమైనయనునర్ధమునవాడితిని
      సరదాగాదుర్యోధనునికికరోనాభయమునంటగట్టితిని

      తొలగించండి
  5. తేటగీతి
    వంశనాశముఁ దప్పెడు వరుస దెలిపి
    దేవ దేవుడే సంధికిఁ ద్రోవఁజూప
    దురభిమానుడై బంధింపఁ దొడఁగె, నెపుడు
    సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె?

    చంపకమాల
    దమనము నోపలేక మును ధర్మజుఁడెంచుచు శాంతిమంత్రమున్
    విమల యశోగుణున్ హరిని విజ్ఞత సంధికి బంపినంత ధ
    ర్మమయుని సైచకే దురభిమానుడు ఖైదిగఁ బట్ట జూచె! నే
    సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధిక్షేపాత్మకమైన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. కర్ణుని విలు విద్యను నమ్మక శకుని కర

    తంత్ర మును నమ్మి రాజ్యము పొందె విహిత

    సమరమును మాని కురురాజు ; శాంతిఁ గోరె

    ఐదుగురికినైదూళ్ళను హరియె కోరి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. యుద్ధ తంత్రములను గూర్చి యోచన మును
    జేయు చలసి యు పవళించి చిత్ర మైన
    కలను గాంచిన వీరుఁడు కనుగొని యెను
    సమరమును మాని కురు రాజు శాంతి గోరె

    రిప్లయితొలగించండి
  8. సమస్య :

    సమరము మాని రాజ్యమున
    శాంతిని గోరె సుయోధనుం డహో

    ( ఉపప్లావ్యనగరంలో అందరూ తనవంటి వారే అని భావించే ధర్మరాజు తనకు వచ్చిన కలను శ్రీకృష్ణునికి ,
    తమ్ములకు , ద్రౌపదికి తెలుపుతున్న దృశ్యం )

    “ కమలదళాక్ష ! తమ్ములు ! వి
    కంపితదేహ ! వినుండు ; చిత్రమే !
    అమలినమానసుండు మన
    మంతయు గోరు విధాన సౌమ్యుడై
    సమరము మాని రాజ్యమున
    శాంతిని గోరె సుయోధనుం డహో !
    చెమరిన కన్నుదోయి బిల
    చెన్ నను ; వందనమస్తకుండుగా . “

    రిప్లయితొలగించండి
  9. ప్రమదము నెన్నికన్ గెలిచి పన్నుగ గద్దెను నెక్కినంతనే
    యమితపు కక్షసాధనము నంతము జేయక పాతపద్ధతుల్
    విమల మనంబునన్ తగవెంచక ద్రావిడ దేశమందునన్
    సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో

    సుయోధనుండు = మంచి యోధుడు ( స్టాలిన్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విమల మనంబునందు తగ వెంచక..' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను.🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో

      ప్రమదము నెన్నికన్ గెలిచి పన్నుగ గద్దెను నెక్కినంతనే
      యమితపు కక్షసాధనము నంతము జేయక పాతపద్ధతుల్
      విమల మనంబుతోడ తగవెంచక ద్రావిడ దేశమందునన్
      సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో

      సుయోధనుండు = మంచి యోధుడు ( స్టాలిన్)

      తొలగించండి

  10. శాంతిదూతగ కృష్ణుండు చనునటంచు
    తెలియ వచ్చిన యారోజు కలికి కృష్ణ
    నిదురలో స్వప్న మునుగాంచె నిశిని, యందు
    సమరమును మాని కురురాజు శాంతి గోరె.



    ప్రమదయె చక్రితో పలికె స్వప్నము గంటిని రాత్రి యందునన్
    సుమతిని పాండుపుత్రు లట జూదము నొడ్డిరటంచు వంకతో
    నమతులు తూలపుచ్చుతరి యానిలి బాసయె చేయ భీతిచే
    సమలము మాని శాంతినెలకొల్పగఁ గోరె సుయోధనుండహో.

    రిప్లయితొలగించండి
  11. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
    గాంధారి పుత్రులను కోల్పోయి , కలలో ఇలా చూసింది యని

    మాత గాంధారి సుతులటు మాటు పడగ
    కన్నులందున నీరిడి, కలిమి యేల ?
    కన్నపుత్రులు లేరని, కలల లోన
    “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”


    - రాంబాబు కైప
    20-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  12. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”

    లక్ష్మణ కుమారుడు సుతుడై , "లక్ష్మణా"యె
    సుతగ, భానుమతిని పొందె సుదతి గాను,
    యింటి పోరునీశుడికైన నెంత బాధ
    “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”


    - రాంబాబు కైప
    20-05-202

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుదతిగాను+ఇంటి' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  13. ~~~~~~~~~~~~~~~~~~
    అమలచరిత్రు ధర్మజు డహమ్మి
    సుమంతయు లేనివాడు తా
    సమరము మాని రాజ్యమున
    శాంతిని గోరె, సుయోధనుండహో
    సుమతుల మాట గాదనియు
    సూతుని పుత్రుని యండతోడ భీ
    రములును బల్కి చచ్చె గద
    మాన్యుని మాటల నాలకించకన్.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి

  14. విమల మనస్కుడైన కఱి వేల్పును గోరె యుధిష్ఠిరుండటన్
    శమనము గూర్చమంచు కులసాదము నాపుమటంచు, కృష్ణుడే
    సమరము మాని శాంతి నెలకొల్పగ గోరె, సుయోధనుండహో
    కుమతుల మెప్పుకోసమని కూడదటంచును కాలుదువ్వెనే.

    రిప్లయితొలగించండి
  15. ఉషపుఁ డస్తాద్రి నుదయించి యుండనోపు
    జలధిలో నీరమింకుట జరుగవచ్చు
    సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె
    ననుట మాత్రము కలనైన కల్లయగును

    రిప్లయితొలగించండి
  16. సమసెను భీష్ముడున్ సమసె శత్రుభయంకరుడౌ దృశానుడే
    సమసెను సూతపుత్రుడను జన్ములు జావగ యుద్ధమందు తా
    నమిత విరాగియై మడుగు నందున జేరి వివేకహీనుడై
    సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో

    రిప్లయితొలగించండి
  17. సమయము వచ్చెనేమొమరి, సాచెనుమృత్యువుకైకరంబులే
    అమలినవర్తనుండుగగ యైదుపురంబులనేను, కాదనే
    తమకముగాతనీయననె, తప్పదునిప్పుడు, నాకుగావలెన్
    సమరము, మానిరాజ్యమునశాంతినిఁ, గోరె సుయోధనుండహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మృత్యువునకై' అనడం సాధువు. '...వర్తనుండుగగ'? 'కాదనే' అనడం వ్యావహారికం. 'తను+ఈయననె'... 'తాను'ను 'తను' అనరాదు.

      తొలగించండి
    2. సమయము వచ్చెనేమొమరి సర్వమునాశనమవ్వ గానిలన్
      అమలినవర్తనుండడుగ నైదుపురంబులనేను, కాదనే
      తమకముగానతండు, "నిక తప్పదునిప్పుడు, నాకుగావలెన్
      సమరము", మానిరాజ్యమునశాంతినిఁ, గోరె సుయోధనుండహో -- thanks andi for corrections

      తొలగించండి
  18. చం:

    సమయము జూసి పాండవుల జంపగ నిశ్చయమెంచి యుద్ధమున్
    తమదగు మాట నెగ్గుటకు తామరకంటి సయోధ్య నొప్పకై
    భ్రమ గొనుటన్న తప్పిదము , పల్కగ నిట్టులటన్న భావ్యమే ?
    సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో!!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  19. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : “సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో
    సుయోధనుడు = గొప్ప యోధుడు, రాజు రక్త పాతము చూడలేక శాంతి మార్గమును కోరెనని
    3)
    ఉ . మా

    చెమరిన కళ్ళతో, రణము జేసిన సైనికు బాధలన్నియూ
    తమతమ రీతిలో తెలుప, తండ్రిగ రాజుగ, రక్షకుండుగా
    సమతను పెంచు వాడిగ , చాలని చెప్పెను రక్త పాతమున్
    “సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో

    - రాంబాబు కైప
    20-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  20. విమలుడుఁబాండుమధ్యముడువీడగధర్మమునేమిజేసెనో?
    క్రమమునధర్మనందనుడురాజసయాగమునేమిగోరెనో?
    స్థిమితమువీడగానెవడుచిత్తమునిల్పెనునాత్మహత్యకై?
    సమరము మాని ,రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహో

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      రాజసూయాన్ని రాజస మనవచ్చునా అని సందేహం!

      తొలగించండి
    2. విమలుడుఁబాండుమధ్యముడువీడగధర్మమునేమిజేసెనో?
      క్రమమునరాజ్యభారమునరాజగుధర్మజుడేమిగోరెనో?
      స్థిమితమువీడగానెవడుచిత్తమునిల్పెనునాత్మహత్యకై?
      సమరము మాని ,రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహో

      కొరుప్రోలు రాధాకృష్ణరావు

      తొలగించండి
  21. ఏమి చేసి పరుగు బెట్టె భూమి పైన

    యుత్తరుండు, కుంతి సుతుల కొక్క గ్రామ

    మైన యివ్వజాల ననుచు మాట లాడె

    నెవరు,ధర్మ సుతు డనుజు నేమి కోరె

    సమరమును మాని, కురు రాజు,శాంతి కోరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూమిపైన నుత్తరుండు... గ్రామమైన నివ్వజాల...' అనండి.

      తొలగించండి
  22. సమరము ను మాని కురురాజు శాంతి కోరె
    వార్త విన్న టి ద్రౌపది వగచె మిగుల
    పగలు తీరుట నెట్ల ని పతులనడిగె
    చింత వలదిది కలయన సంతసించె

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. సమరము ను మాని కురురాజు శాంతి కోరె
      వార్త విన్నట్టి ద్రౌపది వగచె మిగుల
      పగలు తీరుట యెట్ల ని పతులనడిగె
      చింత వలదిది కలయన సంతసించె

      తొలగించండి
  24. రిప్లయిలు
    1. సమయము కాదు కాదనుచు సాధువచస్సుల బోధఁ జేసినన్
      క్రమముగ వృద్ధి జెందె నురగమ్ములు పాలను ద్రావి చిందు న
      ట్లమితవిషమ్ము, నేలుబడికై తపియించుచు
      దుష్టబుద్ధితో
      సమరము,... మాని రాజ్యమున శాంతినిఁ, గోరె సుయోధనుండహో.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  25. విమల తరంబునైన పృథివీస్థలి ధర్మజు డోర్మి నిల్చి, వే
    సమరము మాని రాజ్యమున శాంతిని గోరె; సుయోధనుండహో
    సమర కుతూహలుండయి కషాయిత నేతృడునై చరించె;ధీ
    సముపేతు,కృష్ణు,పరుషంబుగ రోయుచు తూలనాడుచున్.

    రిప్లయితొలగించండి
  26. మాత గాంధారి మనమున మదనపడుచు
    పుత్ర శోకపు కన్నీటినొడిసిపట్టి
    తలచె ఉద్వేగ భరితమై తనయుగూర్చి
    సమరమును మాని కురు రాజు శాంతి కోరె

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. సమరమును మాని కురురాజు శాంతి గోరె
    ననుట చిత్రము దుర్బుద్ధి యైన వారు
    శాంతి గోరరు గోరు నశాంతి నెపుడు
    వంశ నాశమ్ము జరుగును వారి వలన

    రిప్లయితొలగించండి
  29. సమయును నీదుపుత్రుడని శౌరి వచింపగ కొల్వులోన సం
    యమనము చూపమంచునన నార్యులు వంశము నిల్ప నెంచుచున్
    గమనము మార్చెపుత్రుడని కాంచెను స్వప్నము నాంబి కేయుడే
    “సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో”

    రిప్లయితొలగించండి
  30. విమల మనస్కుడై మరచి వేదనలన్నియు ధర్మజుండు దా
    సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె; సుయోధనుండహో
    సమరమె గోరి బంధుజన సంక్షయకారకుడై జనెన్ గదా
    తమ నిజలక్షణంబుల లతాంత శితాగ్రములజ్జగించునే

    రిప్లయితొలగించండి
  31. విప్రవరుఁ డుదంకుని మాట విని యొనర్ప
    నధిపుఁ డిష్టిని నాస్తీకుఁడు ధరణీ సు
    రోత్తముఁడు వేఁడ జనమేజయుఁ డహుల పయి
    సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె


    అమరుఁడు నయ్యె నింపుగ మహాత్ముఁడు మౌర్య కులస్థుఁ డిద్ధరం
    గమలఁగ నంతరంగము ప్రగాఢముగా విజయుండు నయ్యుఁ దా
    విమలుఁ డశోక భూధవుఁడు వేదన నీయ కళింగ యుద్ధమే
    సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుం డహో

    [సుయోధనుఁడు = మంచి యుద్ధము చేయువాఁడు, ఇక్కడ అశోక చక్రవర్తి]

    రిప్లయితొలగించండి
  32. సముపగమంబుగోరు నొక సత్పురుషుండు దలంచె నిద్రలో
    విమల యశో విభూషణులు వీరులు వేవురు పాండునందనుల్
    సమరము సల్పిరేని యరి సంఘములన్ సమయింత్రు గావునన్
    సమరము మాని రాజ్యమున శాంతినిఁగోరె సుయోధనుండహో

    రిప్లయితొలగించండి
  33. ప్రమద మనంబు నొందుచును బార్ధునితోడ ను
    ధర్మరాజనెన్
    విమలపు మానసంబున నబేర్మిని నాదగు మాట చెప్పుమా
    సమరముమాని రాజ్యమున శాంతిని గోరె, సుయోధనుండహో
    కుమతిని నీచ్చగించడెమొ కూర్మిని నచ్చువిధంబు జేయుమా

    రిప్లయితొలగించండి
  34. పాండు సుతుల పై పగ నుంచి బాల్యమందె
    శకుని మరియును కర్ణుడు సాయమంది
    వారలను చంపి నెంచిన వాడదెటుల
    సమరమును మాని కురురాజు శాంతి కోరె.

    రిప్లయితొలగించండి