22, మే 2021, శనివారం

సమస్య - 3730

23-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్”
(లేదా...)
“విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్”

63 కామెంట్‌లు:

  1. కుటిలమునుగాగబుద్ధులు
    అటకెక్కెనుచదువులన్నిహంగులువచ్చెన్
    నటనలునేర్చిరిగురువులు
    విటులకుదావలములయ్యెవిద్యాశాలల్

    రిప్లయితొలగించండి
  2. నటనము చూపు గృహములున్

    విటులకుఁ దావలములయ్యె ; విద్యాశాలల్

    బటువుగ రుధిరము పిండెడి

    కటువగు దావలములు కద కలి కాలమ్మున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  3. విటునిగ తామార్చె విదుని
    చిటపట లాడుచు పడతియె చిలిపితనముతో
    నటవ్రాయ చదివిరిట్టుల
    విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్.

    రిప్లయితొలగించండి
  4. అటనటయాచకుండువలెయానముసేయుగురుండునక్కటా
    పటుతరసంపదల్గనగభావితరంబులజాడఁజూపగా
    జటిలమునయ్యెజీవితముచాలగదుర్భరమయ్యెబోధయే
    విటులకుతావలంబులుగణబేర్మిగనెన్బడులెల్లతావులన్
    విటులనగబోధనముచేయుటకుకాలికిబలపముకట్టుకునితిరుగాడెమధ్యతరగతిబతకలే, నిబడిపంతులు

    రిప్లయితొలగించండి
  5. చంద్రుని మోహంలో చిక్కి విచక్షణ కోల్పోయిన తార తాను గన్న కలను చంద్రునితో....

    కందం
    కిటుకులతో నేమారిచి
    దిటవుగ నీ సరసమందుఁ దేల్చితివౌరా!
    నటకుడ! కలలో తారా
    విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్!

    చంపకమాల
    కిటుకుల నెన్నొ పన్ని రతి కేళికి దించుచు చాటుమాటుగన్
    దిటవుగ సంతునే గనిన ధీర! సుధాకర! తేరకానివౌ
    నటకుడు! నీదు మోహమున నైచ్యమునౌ కలలోన తారకా
    విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కాని చంద్రుడొక్కడే కదా? 'విటులకు' అన్న బహువచనం అన్వయించదేమో?

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు. ధన్యవాదములు. గౌరవ సూచకమైన బహువచనంగా లేక చంద్రుని బోలిన వారలకు అని నా భావన గురువుగారూ!

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు.
      సవరించిన పూరణలు పరిశీలించ ప్రార్థన

      చంద్రుని మోహంలో చిక్కి విచక్షణ కోల్పోయిన తార తాను గన్న కలను చంద్రునితో....

      కందం
      "కిటుకులతో నేమారిచి
      దిటవుగ నీ సరసమందుఁ దేల్చితివౌరా!
      నటకుడ! కలలో నీ గతి
      విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్!"

      చంపకమాల
      "కిటుకుల నెన్నొ పన్ని రతి కేళికి దించుచు చాటుమాటుగన్
      దిటవుగ సంతునే గనిన ధీర! సుధాకర! తేరకానివౌ
      నటకుడ! కంటి స్వప్నమును నవ్వకు నీ గతి మేలుబంతిగన్
      విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్!"

      తొలగించండి
  6. నటనాలయములె నిశినిన్
    విటులకు దావలములయ్యె ,విద్యాశాలల్
    కటువగు శిక్షణతోడను
    పటుతర బుద్ధిని గఱపును బాలల కెపుడున్

    రిప్లయితొలగించండి
  7. నటనము చూపి మేనకయె నాట్యము చేయగ , విష్ణు భక్తుడున్

    విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్; బడు లెల్ల తావులన్”

    కటినపు విద్య నేర్పునయ కాలము చెల్లిన మ్లేఛ్ఛు గాధలన్

    బటువుగ చూపి , కానరుగ భారత వీరుల మేటి గాధలున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కటినము' - 'కఠినము'నకు వికృతి కాదు.

      తొలగించండి
  8. పటుతర మగు బోధలతో
    దిట వగు విజ్ఞాన మొసగు దేవళ ములు గా
    నెటుల పలు కంగ వచ్చు ను
    విటులకు దావలము లయ్యె విద్యా శాలల్?

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. చిటపట లాడు భర్తకిక చేసెద శాస్తి యటంచు నెంచి పె
    న్మిటి వచియింపు వాక్యమును నేర్పును జూపి 'దు' చోట తా 'టు' తో
    విటులుగ మార్చెనే విదుల భీరువు, భర్త పఠించె నిట్టులన్
    విటులకు తావులంబులుగ బేర్మిగనెన్ బడులెల్ల తావులన్.

    రిప్లయితొలగించండి
  11. దయచేసి ఈ పద్యన్ని పరిగణలోకి తీసుకోండి

    అటనిట నన్ని చోట్లనిపు డాంగ్ల
    బడుల్ కడు విస్తరించె న
    క్కటకట! తగ్గి పోయినవి కామి
    త తెల్గు బడుల్ క్రమంబుగా
    కుటిల విహీన మానవులకున్
    జెడు కర్జము చేయువారికిన్
    విటులకు తావలంబులుగ పేర్మి
    గనెన్ బడులెల్ల తావులన్.
    ~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆంగ్ల బడుల్' సమాసం సాధువు కాదనుకుంటాను.

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. పటుతరమున బోధించగ
    కటువుగమారిన గురువును కళాశాలలనూ
    ఎటులనునిందించగలను
    విటులకు దావలములయ్యె విద్యాశాలల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం, 'కళాశాలలనూ' అని దీర్ఘాంతం సాధువు కాదు.

      తొలగించండి
  14. నటనల వేశ్యా శాలలు
    విటులకుఁ దావలములయ్యె ; విద్యాశాలల్
    వటువుల కాలంబన నిడి
    దిటవగు నిర్ణయపరులుగ తీర్చుచునుండున్

    రిప్లయితొలగించండి
  15. న🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరా భరణం వారి సమస్య : “విటులకుఁ దావలములయ్యె, విద్యాశాలల్”

    అటునిటు జూడగ మేడలు
    “విటులకుఁ దావలములయ్యె, విద్యాశాలల్”
    జటిలపు చదువుల జదువను
    కటువగు గురువులు దొరికిన కాదా మేలున్

    - రాంబాబు కైప
    22-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  16. కటు విది పలుకగ, నిజమే!
    పటు తరమౌ కాపు లేక, ప్రహరీ గోడల్
    అటునిటు పడగా, రాత్రుల్
    విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్.

    కటకట ఏమి చెప్పనగు కావలి కాచెడు వారులేక, చీ
    కటి నలుదిక్కులన్ ముసర కాంతులు జల్లు కరెంటు లేక, ప్రా
    కటముగ చెడ్డ పేరిటుల గల్గెను, గోడలు కూలగా, నిశిన్
    విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. చం:

      కటుతరమైన మాటలివి గౌలును చాచెడు దుష్ట భావనల్
      కుటరము వోలె చిమ్ముచును కూడని బల్కులు వ్యాప్తి నొందగన్
      దిటవుగ బుద్దిచెప్పవలె దీనుడి కిన్ పలుకంగ నిట్టలన్
      విటులకు తావలంబులుగ బేర్మి గనెన్ బడు లెల్ల తావులన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. నిట్టలన్ ను నిట్టులన్ గా చదువగలరు

      తొలగించండి
    3. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. కటుతరవాక్కు లియ్యవి వికారము గొల్పును విన్న, నైననున్
    కట కట! వాస్తవమ్ము లయి కానగ గుండె తరుక్కపోవు నీ
    వటుల వచించ, నేడు భ్రమరాళిమరందవిలుబ్ధసంచర
    ద్విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. కటకట యేమి చెప్పెదను కావ్యుడు భోగపిపాసియై సదా
    పిటపిట లాడు జవ్వనువ వెన్ను జరించుచు నాస్తినెల్ల తా
    నటగల భండహాసినికి యర్పణ చేయగ గాంచి చెప్పిరే
    విటులకు తావులంబులుగ బేర్మి గనెన్ బడులెల్ల తావులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జవ్వనుల.. నర్పణ చేయగ..." అనండి.

      తొలగించండి
  20. కుటిలపు టొజ్జలు గలుగుత
    విటులకు దావలము లయ్యె విద్యాశాలల్
    నటియించి ప్రేమ తోడుత
    దిటముగ దావలపు రేపి తీయగ పలికిన్

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    నటవిటగాణికామణులు నవ్యకరోన దురాగతమ్ముచే
    నటమటలంబడన్, బడుల నాగతి మూయఁగఁ, ద్రాగుఁబోరులున్
    బొటబొటమంచుఁ గాలిడఁగ, బోరన మూసియు నున్న సాకుచే
    విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్!

    రిప్లయితొలగించండి
  22. విటులకు తావళంబులుగ బేర్మి గనెన్ బడులెల్ల తావులన్
    నటనట యుండవచ్చు నెమొ,యంతట యుండవు నిశ్చయంబుగా
    కుటిలపు టొజ్జలుందురుగ గొందఱు వారలు గారణంబుగా
    నిటులుగ జర్గుచున్నవని యెంతయొ నమ్మకముండె గాద?భో!

    రిప్లయితొలగించండి
  23. అటు నిటు పోకుండ సతము
    వటువులు వల్లించుచుండఁ బాఠ్యాంశములం
    బటువుగ మఱి జదు వనెడు న
    వి టులకుఁ దావలము లయ్యె విద్యాశాలల్

    [అవి +ఇటు + ఉలకు = అ వి టులకు; ఇటు = ఇట్లు; ఉల = కండూతి / దురద; అవి = ఆ విద్యా శాలలు]


    కటువుగ నుండుఁ బల్కఁగను గాని నిజం బిది యెంచి చూడ గ్రా
    మటికల యందు నిక్కముగ మంత్రి వరేణ్యుఁడ! యొక్కటేని లే
    దట వినుమా పటుత్వమున నా శిథిలంబులు తార కోర్వశీ
    విటులకుఁ దావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్

    [తారకా విటుఁడు = చంద్రుఁడు; ఊర్వశీ విటులు = మిత్రావరుణులు (ఊర్వశి వలన వసి ష్ఠాగస్త్యుల జన్మకారకులు); చంద్రి కాతప వర్షములకుఁ దావలము లైనవి.]

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. పటలము నాశమయ్యె కన ప్రాత తరమ్మగు పాఠశాలలన్
    పటుతరమైన చక్కనగు వాసములన్ సృజియింపకుండిరే
    కుటిలమనస్కులౌ పతులు, గోపతి జ్యోతికి, రేయి తారకా
    విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్

    రిప్లయితొలగించండి
  26. కటకట గన మధుశాలలె
    విటులకుఁ దావలములయ్యె; విద్యాశాలల్
    వటుకులకున్ దావలములు
    పటుతరముగ దీర్చు వారి భవితవ్యంబున్

    రిప్లయితొలగించండి
  27. కటువగు రోగమెల్లెడల గ్రమ్మగ పిల్లల బాగునెంచుచున్
    చటుకున మూసివేయగను చక్కని విద్యల నాలయమ్ములన్
    నటునిటు బోవువారలకు నడ్డపుదారుల ద్రొక్కువారికిన్
    విటులకు తావలంబులుగ బేర్మిగనెన్ బడులెల్ల తావులన్

    రిప్లయితొలగించండి
  28. ఇటుల వచింతురేమి? ఫల
    మిచ్చెడి విద్య నొసంగు నొజ్జలున్
    పటుతరమైన సత్కృతుల
    పాండితి వైభవమిచ్చు విజ్ఞులున్
    పొటమెడి పాఠశాలలను
    బోల్చుచు నిట్లు వచింప బాడియే?
    "విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్"!

    రిప్లయితొలగించండి
  29. ఇటువంటి మాటలాడగ
    కటకట నో రెట్లు వచ్చె కాఠిన్యముతో
    చిటపటలాడక చెపుమెట
    విటులకుదావలములయ్యె విద్యాశాలల్

    రిప్లయితొలగించండి