29, మే 2021, శనివారం

సమస్య - 3736

30-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”
(లేదా...)
“రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై”

68 కామెంట్‌లు:

  1. సమస్య :
    రోహిణి వచ్చినంత గని
    రోసె శశాంకుడు భీతచిత్తుడై

    (తారాశశాంకము - రోహిణి ఆగమనము )

    ఊహకు నందనట్లు హృది
    యూగుచునుండగ నాశ్రమమ్ములో
    దేహము విస్మరించి ; తన
    దివ్యపు జన్మను నెంచకుండగన్
    మోహపు బుద్ధి దారకయి
    మున్గుచు దేలుచు నున్నవేళలో
    రోహిణి వచ్చినంత ; గని ;
    రోసె శశాంకుడు భీతచిత్తుడై .

    రిప్లయితొలగించండి
  2. పాహియని జనులు రోసిరి

    రోహిణి వచ్చుటను గాంచి , రోసెను శశియే

    దేహములు కమిలిన జనుల

    హాహాకారములను విని హరుని శిరముపై

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  3. ఆహా! బృహస్పతి సతియె
    మోహముతో చెంతజేరు బుక్కమునందున్
    వాహనముపైన నటుగా
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.

    రిప్లయితొలగించండి
  4. సాహసమేగాచూడగ
    గ్రాహముగాగనుతనువునుగ్రమ్మెనుమబ్బుల్
    ఏహ్యమునయ్యెనుబతుకే
    రోహిణివచ్చుటనుగాంచిరోసెనుశశియే

    రిప్లయితొలగించండి
  5. దాహము పెరిగెను జనులకు
    తాహతు గల వారి కైన తాపము హెచ్చె న్
    పాహి యనె జీవ తతియును
    రోహిణి వచ్ఛు టను గాంచి రోసెను శశి యే !

    రిప్లయితొలగించండి
  6. కందం
    మోహ వివశుడై తారను
    దాహమ్మున పొంద బుధుఁడుఁ దనయుండాయెన్
    యూహల వారలు నిండఁగ
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే!

    ఉత్పలమాల
    మోహమె? సప్తవింశతిగ మోదము గూర్చెడు భార్యలుండినన్!
    దాహము తీరలేదనుచు తారను సద్గురు పత్నిఁగూడెనే
    యూహల దేలు వేళ మది నుంపుడు గత్తె, బుధాను లుండఁగన్
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆయెన్+ఊహల' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. 🙏 ధన్యోస్మి గురుదేవా🙏
      సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన;

      కందం
      మోహ వివశుడై తారను
      దాహమ్మునఁ గూడ బుధుఁడొదవె! మధురమ్మౌ
      యూహల వారలు నిండఁగ
      రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే!

      తొలగించండి
    3. సవరణతో...

      ఉత్పలమాల
      మోహమె? సప్తవింశతిగ మోదము గూర్చెడు భార్యలుండినన్!
      దాహము దీరినన్ గతము తారనుఁ గూడియు సంతు గొన్నవౌ
      యూహల దేలు వేళ మది నుంపుడు గత్తె, బుధాను లుండఁగన్
      రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. దాహము తోడ నోట తడి తగ్గగ దప్పిక తీరకుండచున్,

    దేహము స్వేదమున్‌ గలిగి తీగలువారగ పూతిగంథితోన్

    మోహము‌వీడుచు జనులు‌ ముద్దియలన్ దరి చేర్చ కుండగన్

    దోహద మివ్వగన్ రవి,ఉదూ ఖలమున్ పగులంగ చేయు నా

    రోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీత చిత్తుడై

    రిప్లయితొలగించండి

  9. దేహహొరంగుగాంచి గురు దీదిచి గేహిని చంచలాక్షియే
    మోహము తోడ జేరె నట ముద్దుల నాడు నెపమ్ము నత్తరిన్
    వాహమునెక్కి పారుషుని వాసము జేరగ దండ్రితో వడిన్
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుడు భీతచిత్తుడై.

    రిప్లయితొలగించండి
  10. రోహిణి కర్తరి గాడ్పున
    మోహముతో పతినిగూడి ముచ్చటలాడన్
    యూహల దేలుచు వడిగా
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆడన్+ఊహల' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  11. రోహిణి మరదలు "శశి"యే
    వాహనమెక్కిచనుదెంచ,వదిననుజూచెన్
    దేహమునంతటకారము
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.

    రిప్లయితొలగించండి
  12. ఆహా! రోహిణి గాంచెను
    సాహో! అని తారతోటి సరసములాడన్
    ద్రోహీ! చంద్రా! నిలువని
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.

    రిప్లయితొలగించండి
  13. ఆహా! నాభాగ్యమనియె
    రోహిణి వచ్చుటను గాంచి; రోసెను శశియే
    సాహసమున వెంట బడెడు
    రాహువు గని పూర్ణమాసి రాతిరి వేళన్

    మోహము నాపలేక తనముద్దుల భార్యను గౌగలించెనే
    రోహిణి వచ్చినంత గని; రోసె శశాంకుడు భీతచిత్తుడై
    ఈహను దీర్చలేదనుచు నింతులు మోపగ నేరమొక్కటై
    స్నేహమువీడి దక్షుడు విచింతన లేకయె శాపమీయగా

    రిప్లయితొలగించండి
  14. తుహిన మనంబుతోడ గడు
    దోరపు సుందర దివ్య తారతో
    విహితపు ప్రేమ వాక్యములు
    వెన్నెల రేడొనరించుచుండగా
    మహిత శుభాంగి ప్రేమమయి మా
    న్యులు మెచ్చిన ధర్మపత్ని యా
    రోహిని వచ్చినంత గని రోసె
    శశాంకుడు భీతచిత్తుడై.

    రిప్లయితొలగించండి
  15. రోహిణికార్తి యెండలకు లోకములెల్లను తల్లడిల్లికో
    లాహలమొందువేళ వలరాజు శరంబులు కాక బెట్టగన్
    మోహము తాళజాలక విమోహితయై తన భర్త చెంతకున్
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. సమస్య:
    *రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై.*

    ప్రయత్నం:
    ఉ.
    ఆ హిముఁ, డత్రినందనుడునై, యుచితానుచితంబువీడి, యు
    ద్వాహము నయ్యియుండి, గురుదారను తారను సంశ్రయించుచున్
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై,
    మోహము గూడదయ్య! మరి బుద్ధి మెలంగిన మచ్చరాదుగా!

    హిముడు-చంద్రుడు
    ఉద్వాహము-పెళ్లి
    సంశ్రయించు-ఆశ్రయించు

    రిప్లయితొలగించండి
  18. ఇరువది యేడుగురు భార్యలలో రోహిణి రూపవతి. చంద్రుడు ఆమె యందు ఆసక్తుడై యుండేవాడని, మిగిలిన వారు కోపముతో తండ్రి దక్షప్రజాపతికి తెలిపినపుడు అతడు క్షయ రోగము కలుగునని శపిస్తాడు. ఆసమయంలో రోహిణి పేరు వినగానే భయపడుతాడనే భావనగా నా ప్రయత్నము;

    ఉ:

    మోహము మీర ప్రేమగొని ముద్దుల రోహిణి యంచు గూడగన్
    ద్రోహము జేతువా యనుచు తోడగు భార్యలు తండ్రి జేరగన్
    దేహము యక్ష్మమై నిలుచు తీరగు శాపము బొంద ఖిన్నుడై
    రోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీతచిత్తుడై

    యక్ష్మము =క్షయ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. ఊహల దేలుచున్ ముదము వూయల లూగగ పుష్పగుఛ్ఛసం
    దోహము లున్ సువాసనలు తూరపుబట్టగ రంగుపొంగగా
    మోహము పెంచులేమనవ మోహిని రోహిణి వచ్చె ; క్షీణుడై(రోగియై)
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై.

    రిప్లయితొలగించండి
  20. మోహమతిశయించగ ప్రియ
    రోహిణితో సంచరించి రోజులు గడిపెన్
    ఆహా! శాపము తదుపరి
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే

    రిప్లయితొలగించండి
  21. లోహము వాడి మానవుడు లోకము జూడ యుపగ్రహమ్ములన్
    వాహనముల్గొనర్చెగద, వాయువె త్రక్కువ వాటి ధీటికిన్
    రాహువు వచ్చెనా మరల రక్కసుడై యని బ్రాంతి నొందుచున్
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...జూడ నుపగ్రహమ్ములన్" అనండి. 'గొనర్చె, త్రక్కువ, ధీటికిన్'?

      తొలగించండి
    2. లోహము వాడి మానవుడు లోకము జూచు, నుపగ్రహమ్ములే
      వాహనముల్, జగత్తునవి వైనము గాగని చుట్టి వచ్చుగా ,
      రాహువు వచ్చెనా మరల రక్కసుడై యని బ్రాంతి నొందుచున్
      రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

      తొలగించండి
  22. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”

    రోహిణి కానక చంద్రుడు
    రాహిత్యమున రమణియగు రంభను జేరన్
    లోహిత నయనమ్ములతో
    “రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”

    - రాంబాబు కైప
    28-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  23. ఆహా! యీదినమున నా
    తాహతు మించిన సమస్య దయజే సితిరే
    మోహప డక నే ల యిటుల
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే

    రిప్లయితొలగించండి
  24. నిన్నటి పూరణ

    నుడివిన గాని జోస్యులు వినోదము చూతమటంచు పూని యా
    ఘడియల తిందురట్లు ఘనకార్యమొ! వద్దని చెప్పు వాటినిన్
    తడయక జేతు రట్లయిన తద్వ్యతిరిక్తఫలప్రదమ్మునన్
    కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. ఆహా ! యీ సందియములు
    ఐహికమేయని తలచితి నహరహ మందున్
    రోహిత సూర్యుని వద్దకు
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే

    రిప్లయితొలగించండి
  26. రోహిణి రంజిలిన రోజున బుట్టి యదూద్వహుండు వ్యా
    మోహితుడైన మామ యగు మూర్ఖుని జంపె, దహించు కార్తెయై
    రోహిణి మండు టెండ నిడి రోలను ముక్కలు జేసె నంచు దా
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      మొదటి పాదంలో టైపు దోషం వల్ల గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. అవునండీ

      రోహిణి తార రంజిలిన
      అని ఉండాలి టైపు మరపు.

      తొలగించండి
  27. కె.వి.యస్. లక్ష్మి:

    ఊహల తేలెను చంద్రుడు
    రోహిణి వచ్చుటను గాంచి; రోసెను శశియే
    ఊహాతీతపు వేడికి
    రోహిణి తాపార్భటమున రోళ్ళే పగలన్.

    రిప్లయితొలగించండి
  28. మోహితుడై నిరతము దా
    రోహిణితో గడుపుననుచు రోసిన సవతుల్
    బాహాటముగా దెగడగ
    రోహిణి వచ్చుటను గాంచి, రోసెను శశియే

    మోహితుడై నిరతము దా
    రోహిణితో గడుపుననుచు రోసిరె సవతుల్
    ఊహాగానమె గానెట
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే

    రిప్లయితొలగించండి
  29. ఊహలలోన చేరి పతి యూయల లూగుచు చెంగలింప, సం
    దేహముతోడ భర్త పనితీరును భార్యలు గాంచు చుండ స
    మ్మోహముతోడ తార గని మోదము నొందుచు మించ, దాపుకున్
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  30. మోహము మీర సంతతము ముద్దుల రాణివటంచు మెచ్చినన్
    దోహదమౌ గదా జగతి ద్యోతము హెచ్చగ సూర్యు జెంతకున్
    రోహిణి వచ్చినంతఁ, గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
    దేహము క్షీణమాయెనరుదెంచనమావస దాగె వేగమున్

    రిప్లయితొలగించండి
  31. ఆహా! యేమని జెప్పుదు
    నూహకు నందకను వచ్చె నుస్సురు గొలుపన్
    బాహాటమ్ముగ వెంటనె
    రోహిణి వచ్చుటను గాంచిరోసెను శశియే

    రిప్లయితొలగించండి
  32. ఆహా విరహము తొలఁగఁగ
    నీ హాయి లభింప భాగ్యమే కద యనుచున్
    మోహముతో విరి దండను
    రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే

    [రోయు = వెదకు]


    దోహద ముండ సంతతము తోరము రోహిణి పైన నన్యులన్
    గేహము లందుఁ గాంచఁ డని కిట్టఁగ నశ్విని చంద్రు నంతటన్
    స్నేహము మీఱ డెందమున జ్యేష్ఠ వరాశ్విని చెంత నుండఁగా
    రోహిణి వచ్చి నంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  33. రోహిణినా బరంగినిట రోతజనించు విధంబు నుండగా
    దేహమునందు వెంట్రుకలు తీగెలవోలెను నల్లుకుంటతో
    గేహమునందుహ్లాదమున గీతము బాడెడు చంద్రుడంతటన్
    రోహిణి వచ్చినంతగని రోసె శశాంకుడు భీతచిత్తుడై


    రిప్లయితొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    దాహము తీరదాయె; ఘనతాపము హెచ్చుచునుండె; భాస్కరుం
    డీహముతోడ మండుచును నీ భువి యందలి లోకులందఱన్
    బాహిర మందకుండఁగను బాదుచునుండు కతంపు కార్తెయౌ
    రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై!

    రిప్లయితొలగించండి
  35. మోహనముగ నవ్వె విధుడు
    రోహిణి వచ్చుటను గాంచి, రోసెను శశియే
    హాహాకారము చేయుచు
    స్నేహముతో చెంతరాగచింతించిమదిన్

    రిప్లయితొలగించండి