22, జులై 2022, శుక్రవారం

దత్తపది - 185

23-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
'పేపరు - పెన్ను - టైపు - మెమో'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కీచకుడు సైరంధ్రితో...

కందం
తలపే పరుగులు దీసెను
వలపులు సొంపెన్నుచు ముడివడ సైరంధ్రీ!
నెలవున నొకటై పులకలఁ
దులతూగమె మోదమనినఁ తోయజనేత్రా!

pks kumar చెప్పారు...

ఆ(మె మో)ము‌నుచూడ ప్రేమ‌ పొంగి పొరలు చుండును‌ సతతము,‌గుండె లోన

నాట్యమాడు చునుండు నాకామె‌ తల(పే,పరు)గులె
త్తుచుండుగా గగన మునకు


మోహంపు కోరికల్ , పూలతో
(టై పు)డమి వికసించునుగదా మించు బోడి

నడయాడ, , రంభకు (పెన్ను)ది గాదె తలచ యీ‌‌ కన్నె,యీమె



తోడ రతి‌సుఖములు‌ను పొందుటయె నాకు

భాగ్యమనుచు నా‌హృ దయము పలుకు చుండె

నీ దినమున కూడగ వలె‌ నెట్టు లైన

యనుచు కీచకుడు తలచె వనితను గని

subbarao చెప్పారు...

వలపే పరువకు వచ్చెను
దలపులు సొంపెన్ను చుండి దరములు వోవన్
గలలో నొకటై పులకలు
దులతూగమె మోదమలర తొయ్యలి కృష్ణా!

విరించి చెప్పారు...


చంద్రబింబమె మోమది సఖియనీది
మరులు గొలిపే పరువమంటి, పెరిమి తోడ
నిద్దరమొకటై పుష్కరమేలవచ్చు
సింహ బలుని తప్పెన్ను వజీరు డెవడు.

sitharamayya solasa చెప్పారు...

జూదమున తననోడి నట్లు తెలిసిన ద్రౌపది

తే॥గీ.॥

వలువలూడ్చుటకు మునుపే పరువు పోయె
నిపుడు పతులొకటై పుడమీశు నందు
కింక నంత జూపెన్నుఱికి యతనిపయి ,
దాని గాంచగ నామె మోదమును బొందె

M.B.G.TILAK చెప్పారు...

భామ వల(పే పరు)వులెత్తె పార్థునిగని
నారి (పెన్ను)రముప్పొంగె వారిరువురి
తనువు లొక్క(టై పు)లకలు తమకపడగ
సత్వర(మె మో)హ వివశులై సంతసిలిరి

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

రేపే పరుల వధించియు
జూపగ నన్ బెన్నుతి యింత్రు శూరుం డ నుచున్
పాపులు చేటై పుట్టిన
శాపమున సమర మె మోక్ష సాధన మ గు తన్
( భీముని మనో గతం )

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆ(మె మో)మును గాంచగ నర్జునుండు
పూల తో(టై పు)లకరించి పోయె మనము
చెలిసుభద్ర సొం(పెన్ను)ట నలువ తరమ?
యనుతలం(పేపరు)గుదీసె మనమునందు.

sarada చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...

దత్తపది : పేపరు - పెన్ను - టైపు - మెమో - అన్యార్థంలో భారతార్థంలో
విదురుడు ధృతరాష్ట్రునితో
కలుగును చెరపే పరులను కలతపెట్ట
సతము మొప్పెన్నుతించు నీ సుతుడు, దుష్టు
లొక్కటై పురుషోత్తము ప్రక్కకేగి
పట్టసాధ్యమా మోహముఁ బడిన మదిని
అసనారె

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ సమూహంలో నా సూచనను గమనించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చంపే' అనడం సాధువు కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

రెండవ పాదంలో బెన్నుతి o త్రు అని సవరణ చేయడమైనది

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

వల*పేపరు"గిడ తీయని
తలపులు మది*పెన్ను*బుకగ తరుణిని గనుచున్
పరవశ*మెమోమునిండగ
కరమ్ములొక*టైపు*లకలుకవ్వడికయ్యెన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వగ పే పరు దయ్యె నెద వి
నఁగఁ బెన్నుడులు వెగటై పునర్వచనములం
దగ నేర దామె మో మె
త్తి గరిమ బదు లిడఁగఁ గృష్ణ దీనత్వమునన్

[వగపు ఏపు అరుదయ్యె;
వగపు యొక్క ఏపు(ఆధిక్యము) వగపేపు, షష్ఠీతత్పురుష సమాసము, టు గాగమమునకుఁ దావు లేదు]

sarada చెప్పారు...

ధన్యవాదాలు గురువు గారు
తేటగీతి
ఆమె మోహ పరవశ, సింహబలుడంత
రూపుసెడ, భీము డంపేపరుని, పరుగున
తలపడిరి పొరపాటై పుతపుత పోయి
కీచకానుజుల్ పెన్నుద్దు గిట్టి రపుడు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఆమె-ద్రౌపది, పెన్నుద్దు-సరిసమానులు

A.Satyanarayana Reddy చెప్పారు...

సాధ్యమా - సాధ్యమె - టైపో