18, జులై 2022, సోమవారం

సమస్య - 4138

19-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ యనిన బూతురా పలుకకు”
(లేదా...)
“రామా యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్”

34 కామెంట్‌లు:

  1. నీమం దోడ చరించ నెంచి సతమున్ నిక్కంబు మాటాడుమా,
    క్షేమంబెంచని సత్యమైనను సరే క్లేశమ్ము చేకూర్చుగా
    నీ మాయన్ గడు మోహబద్ధులగుచున్ యింద్రాదులే మున్గ, నౌ
    రా! మాయన్నది బూతుమాట, పలుకన్ రాదయ్య పాపంబగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీమంబొప్ప చరించ... బద్ధులుగ నా యింద్రాదులే...' అనండి.

      తొలగించండి
  2. దుష్టుడైన రాజు దుష్పరి పాలనన్
    రాజు ననుసరించు రాష్ట్ర జనులు
    రసికు లైన నేమి రావణ రాజ్యాన
    రామ యనిన బూతురా పలుకకు

    రిప్లయితొలగించండి
  3. అనువు కాని చోట నాప్యాయతను జూప
    రామ యనిన బూతురా !పలుకకు
    మట్టి వారి తోడ నక్కరలేకుండ
    మితపు పలుకులెపుడు మేలు గూర్చు

    రిప్లయితొలగించండి
  4. రామ యనిన బూతు రాపలు కకుమన
    న్యాయ మౌనె మీకు నరయ, రాము
    డనగ నెఱుగు మార్య యవతార మెత్తెను
    సంహ రింప రాక్ష సగణ ములను

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజు+అన' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'దేశ నేటి' అన్నది దుష్ట సమాసం. "రాజనగ.. దేశ మిపుడు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు.
      ఆటవెలది
      రాజ్యమన్న రామ రాజ్యమట వినగ
      రాజనగ దశరధ రాము డేను
      భరత దేశ మిపుడు భారతమును జూడ
      రామ యనిన బూతురా పలుకకు.
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      తొలగించండి
  6. తేటగీతి
    రమ్ము పుణ్యంబు నోరార "రామ యనిన
    బూతురాపలుక?కు"జ,పూత సీతఁగూర్చి
    చదువు రామాయణంబును శ్రద్ధతోడ
    నైహికాముష్మిక సుఖంబులబ్బు నీకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు
      రెండవ పాదము గణభంగము సవరణ
      బూతురాపలుక?కుమతి!సీతఁగూర్చి

      తొలగించండి
  7. మామా! వేఱిమి లేదులేదనెడి సన్మైత్రంబు లిద్ధారుణిన్,
    భామామోహమునన్మునుంగ జెడదే భారంబుగా దోచు, త
    త్ప్రేమల్ దూరము గాకయుండునె మదిన్ తీక్ష్ణంబుగా మార, నౌ
    రా! 'మా' యన్నది బూతుమాట, పలుకన్ రాదయ్య పాపంబగున్.

    రిప్లయితొలగించండి

  8. మిత్రుడనుచు బిలువ మ్లేచ్ఛుడొకడువచ్చి
    పిచ్చిమాటలెల్ల హెచ్చుగాను
    పలుకుచున్ వచించె పాపి వాడిట్టుల
    రామ యనిన బూతురా పలుకకు.



    నేమమ్మున్ విడకుండ సాధకుడు తానిత్యమ్ము శీలించినన్
    క్షేమంబిచ్చును సిద్ధిగూర్చునిది ముక్తిన్ గోరు మోక్షార్థులే
    భామమ్మున్ విడి సంస్మరించుటకు దివ్యంబైన మంత్రంబదే
    రామా యన్నది , బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. రామా యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్”
    ఏమా మాటలు బల్కు చుంటిరి ప్రభో యేమాయె మీకిప్పు డున్
    రాముం డెప్పుడుఁ దండ్రి మాటను వెసన్ హ్రాదంబు గాఁ జూచు చున్
    సేమం బీయగ మౌని సంతతి కిదా శీఘ్రంబు గా నేగెన్సుమా

    రిప్లయితొలగించండి
  12. ఏమందున్ కపివర్య!యో హనుమ!లంకేశుండు శాసించెగా
    *రామాయన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్*
    ఏమాత్రంబును జాలిఁజూపరకటా!హింసింతురీరక్కసుల్
    క్షేమంబెక్కడ?నాకటంచుఁబలికెన్ సీతమ్మ దుఃఖార్తయై.

    రిప్లయితొలగించండి
  13. మంచితనము మదిని మచ్చుకైనను లేని
    దొరల కొలువు చేయ దుష్కరమ్ము
    మూర్ఖులైన వారి ముందర నెన్నఁడు
    రామ యనిన బూతురా పలుకకు

    రిప్లయితొలగించండి
  14. ఏమాదౌష్ట్యము మూర్ఖ రావణుఁడు తానీ తీరుగా లంకలో
    నీమంబున్ ప్రకటించె! రామయనగా నేరంబుగా నెంచెదన్,
    రామా యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్,
    నామాటన్ జవదాటు రక్కసులకున్ నా క్రౌర్యమున్ జూపెదన్.

    రిప్లయితొలగించండి
  15. నాస్తికులగు వారు నైజము గా నంద్రు
    రామ యనిన బూ తు రా పలుక కు
    మనెడు మాట నిజమ దబ్బుర మే గాదు
    సాజ మగును గాదె సర్వ వేళ

    రిప్లయితొలగించండి
  16. ఆటవెలది
    మోహమంది కలిసె మునిపత్ని సైయన్న
    జారుఁడనఁగనొప్పు జంభభేదిఁ
    పుడమి రాము గుణము వోల్చుచునెపుడు సు
    త్రామ! యనిన బూతురా పలుకకు

    శార్దూలవిక్రీడితము
    కామోద్దీపితుడౌచు గౌతముసతిన్ గవ్వించి మీరంగనే!
    నీమంబుల్ గలవానిగన్ గులిశినే నెవ్వారు కీర్తింతురే?
    రామున్ బోలినఁ బుణ్యమూర్తి గుణమున్ రంజిల్లగన్ బోల్చి సు
    త్రామా! యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్

    రిప్లయితొలగించండి
  17. భార్యతోడ పలుకు భగ్గుమనుటకును
    చూచి జెప్పె కతము జోస్యుడొకడు
    శత్రువులె సహజ, కళత్ర భావపతులు
    రామ యనిన బూతురా పలుకకు

    రిప్లయితొలగించండి
  18. మాట లందుఁ గాంచ మార్దవం బెట్లుండు
    మగువ తనము నెడఁద మఱచి నిలువ
    వెక్కసముగ నగుచు వేశ్యా లలామ యా
    రామ యనిన బూతురా పలుకకు


    తా ముగ్రమ్ముగఁ బల్క బూతులను మిత్రత్వమ్మునం బ్రీతియౌఁ
    దా మాన్యమ్ముగఁ బిల్వ నామమున బాంధవ్యమ్ము నూహించి యా
    హా మాత్సర్యము తోడ భీకరముగా వ్యాపింప శత్రుత్వమే
    రామా యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపం బగున్

    రిప్లయితొలగించండి
  19. పుడమి యందు నీకు పుణ్యము వచ్చును
    *రామ యనిన, బూతురా పలుకకు”*
    పరుల గూర్చి సతము బాధ కలుగ చేయు
    ననెడి బుధుల మాట లాలకించు .

    జన్మ ధన్య మౌను సతతము భక్తితో
    *రామయనిన,బూతురాపలుకకు*
    దైవ మసలు లేడు ధరణిలో ననుమాట
    నదియు పాప కార్య మనుట నిజము



    రిప్లయితొలగించండి