30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

దత్తపది - 186

1-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
'పాపి - తులువ - పలువ - పంద'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ధర్మరాజు సుగుణాలను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
(ఈరోజు ఉదయమే 'ఎవ్వాని వాకిట నిభమదపంకంబు' పద్యం విన్నాను)

13 కామెంట్‌లు:

  1. అధిపా! పిత్రార్జితమును
    మదగర్వితులు వరియింప మత్సరుడవకే
    విధియని పలు వర్షములను
    వ్యధలను మదిని నిలుపందయాళు డతండే

    ధృతరాష్ట్రునితో విదురుడు

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    'పాపి 'జనుల లేమి భాగ్యవంతులఁజేయు
    పండి'తులు వ'రల సభాంగణముల
    పాలనంబు సేయు 'పలువ'న్నెలుగ, పాండ
    వాగ్రజు గుణముఁదెలు'పంద'రంబె.

    రిప్లయితొలగించండి
  3. ఉ.

    దైవకృపా పితామహుని ధర్మ యశోగుణ లక్షణంబులున్
    సేవిక కృష్ణ, పంతులు వసిష్ఠ సమానుడు ధౌమ్యుడున్ సభన్
    రేవతిఁ బోలు దీపలు వరిష్ఠ సహోదరులున్ మురారిచే
    పావన యుద్ధభూమిఁ బిలుపందగ జెట్టి, యుధిష్ఠిరాఖ్యుడే.

    రిప్లయితొలగించండి
  4. ధర్మ రూ’పా పి’పాసియౌ ధర్మజుండు
    రిపులపయి శాంతము ‘పలువ’రించువాడు
    రాజ్యమున పాప గ’తులు వ’లదనె
    నతడు
    కో’పం ద’రికి రానీయని గుణి య తండు

    రిప్లయితొలగించండి


  5. నీతులు వచియించునెపుడు నియతి తప్ప
    బోడు పలువత్సరమ్ములు కాడునందు
    పాపియాదన గడిపినన్ బాధపడక
    దాయకును కీడు దలపందగదటంచు
    పలుకు సత్యవ్రతు డతడు పాండు సుతుడు.


    (పాపియాద= కాలినడక )

    రిప్లయితొలగించండి
  6. ధర్మజ!కృ'పాపి'పాసివై ధర్మబద్ధ
    మైన నీ'తులు వ'ల్లించి మంచితనము
    పంచు నీయశోకాంతులు 'పలువ'రసుల
    నిగుడ తెలు'పంద'లంచితి నిశ్చయముగ

    రిప్లయితొలగించండి
  7. కందం
    రూపా పిన పెద లొప్పగ
    నా పలువరుస గన మాటలాడు మృదువుగా
    నో పంతులు వలెఁ దోచున్
    ప్రాపంద నజాతశత్రువౌ ధర్మజుఁడున్

    రిప్లయితొలగించండి
  8. సదయుడు కృపా పి పాసియు
    ముదమున జాతులు వలసిన పోకడ తోడన్
    పొదలుచు పలు వక్ర మతుల
    బెదురును బాపం దగు నరి భీకరు డత డే!

    రిప్లయితొలగించండి
  9. చూపాపి నుతులు వఱలెడు
    నా పలు వలుకులఁ ద్రపం దహతహ నొసంగన్
    భూపాలుఁడు ధర్మసుతుఁడు
    కాపాడును బ్రజలఁ దండ్రి కరణిం గరుణన్

    రిప్లయితొలగించండి
  10. ధర్మరూ*పా! పి*లుకుమారు ధర్మమిలను
    నిలిపి నావుగ న*తులు, వ*ర్ణింప నీదు
    ఘనత *పలువ*గల నలువ కగునుగాని
    రమ్యగుణధామ తెలు*పం ద*రమ్మె నాకు?

    పిలుకుమారు= నాశమొందు
    పలువగల= పలు విధాలుగా (in many ways)

    రిప్లయితొలగించండి
  11. ధర్మ రూ'పా ! పి'లువ గనేతమ్ములాట
    లాడవెళ్ళి ' పంద' తనము వీడి సర్వ
    సంపదల్‌ 'పలువ'స్తువుల్‌ సాటిలేని
    దొడ్డ సుమ'తులు వ'శ్యుల నొడ్డి తీవు

    రిప్లయితొలగించండి
  12. భీమునక్కసు పెం *పాపి* సామమునను
    నీ *తులు వ* చించి సరియగు నియతి తెల్పి
    *పలువ* రసలలోన సహోదరులను కాచి
    చూపు ని *ష్పంద* మార్గము నోపిక గొని

    రిప్లయితొలగించండి