30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

దత్తపది - 186

1-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
'పాపి - తులువ - పలువ - పంద'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ధర్మరాజు సుగుణాలను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
(ఈరోజు ఉదయమే 'ఎవ్వాని వాకిట నిభమదపంకంబు' పద్యం విన్నాను)

13 కామెంట్‌లు:

కరణం రాజే శ్వర రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
seethadevi gurram చెప్పారు...

అధిపా! పిత్రార్జితమును
మదగర్వితులు వరియింప మత్సరుడవకే
విధియని పలు వర్షములను
వ్యధలను మదిని నిలుపందయాళు డతండే

ధృతరాష్ట్రునితో విదురుడు

Rama Murthy Duvvuri చెప్పారు...

ఆటవెలది
'పాపి 'జనుల లేమి భాగ్యవంతులఁజేయు
పండి'తులు వ'రల సభాంగణముల
పాలనంబు సేయు 'పలువ'న్నెలుగ, పాండ
వాగ్రజు గుణముఁదెలు'పంద'రంబె.

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

దైవకృపా పితామహుని ధర్మ యశోగుణ లక్షణంబులున్
సేవిక కృష్ణ, పంతులు వసిష్ఠ సమానుడు ధౌమ్యుడున్ సభన్
రేవతిఁ బోలు దీపలు వరిష్ఠ సహోదరులున్ మురారిచే
పావన యుద్ధభూమిఁ బిలుపందగ జెట్టి, యుధిష్ఠిరాఖ్యుడే.

sitharamayya solasa చెప్పారు...

ధర్మ రూ’పా పి’పాసియౌ ధర్మజుండు
రిపులపయి శాంతము ‘పలువ’రించువాడు
రాజ్యమున పాప గ’తులు వ’లదనె
నతడు
కో’పం ద’రికి రానీయని గుణి య తండు

విరించి చెప్పారు...



నీతులు వచియించునెపుడు నియతి తప్ప
బోడు పలువత్సరమ్ములు కాడునందు
పాపియాదన గడిపినన్ బాధపడక
దాయకును కీడు దలపందగదటంచు
పలుకు సత్యవ్రతు డతడు పాండు సుతుడు.


(పాపియాద= కాలినడక )

M.B.G.TILAK చెప్పారు...

ధర్మజ!కృ'పాపి'పాసివై ధర్మబద్ధ
మైన నీ'తులు వ'ల్లించి మంచితనము
పంచు నీయశోకాంతులు 'పలువ'రసుల
నిగుడ తెలు'పంద'లంచితి నిశ్చయముగ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
రూపా పిన పెద లొప్పగ
నా పలువరుస గన మాటలాడు మృదువుగా
నో పంతులు వలెఁ దోచున్
ప్రాపంద నజాతశత్రువౌ ధర్మజుఁడున్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సదయుడు కృపా పి పాసియు
ముదమున జాతులు వలసిన పోకడ తోడన్
పొదలుచు పలు వక్ర మతుల
బెదురును బాపం దగు నరి భీకరు డత డే!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

చూపాపి నుతులు వఱలెడు
నా పలు వలుకులఁ ద్రపం దహతహ నొసంగన్
భూపాలుఁడు ధర్మసుతుఁడు
కాపాడును బ్రజలఁ దండ్రి కరణిం గరుణన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ధర్మరూ*పా! పి*లుకుమారు ధర్మమిలను
నిలిపి నావుగ న*తులు, వ*ర్ణింప నీదు
ఘనత *పలువ*గల నలువ కగునుగాని
రమ్యగుణధామ తెలు*పం ద*రమ్మె నాకు?

పిలుకుమారు= నాశమొందు
పలువగల= పలు విధాలుగా (in many ways)

Koninty Ramesh చెప్పారు...

ధర్మ రూ'పా ! పి'లువ గనేతమ్ములాట
లాడవెళ్ళి ' పంద' తనము వీడి సర్వ
సంపదల్‌ 'పలువ'స్తువుల్‌ సాటిలేని
దొడ్డ సుమ'తులు వ'శ్యుల నొడ్డి తీవు

A.Satyanarayana Reddy చెప్పారు...

భీమునక్కసు పెం *పాపి* సామమునను
నీ *తులు వ* చించి సరియగు నియతి తెల్పి
*పలువ* రసలలోన సహోదరులను కాచి
చూపు ని *ష్పంద* మార్గము నోపిక గొని