2-10-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె”(లేదా...)“కామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో”
ఆటవెలదిఅరరె!మనిషిలోన స్థిరముగా నున్నట్టి క్రోధ మరియు పరమ లోభ మోహమత్సరములు* కామ మదముల రిపులుగా కాంచనగు, నె*రింగి త్రుంచ వలయు.
శార్దూలము ధీమంతుల్ గురువుల్ జితేంద్రియులు ఖ్యాతింగాంచరే సజ్జనుల్ *కామక్రోధ మదాదులన్ రిపులుగా గాంచంగ;న్యాయంబొకో*కామాంధత్వముతో చరించుటలహో!కారుణ్యముంజూపకే నీమంబుల్ విడనాడి యక్కటకటా!నీచాత్ములై పోవుటల్.
మోక్ష మార్గమున్ బయనించి ముక్తి నొందకామి కానివాడిటమోక్ష కామి కాడుబాధ్యతగలసంసారికి బాటలైనకామ మదముల రిపులుగాఁ గాంచ నగునె
*(రావణుడు సీతతో పలికిన మాటలుగా)*దాన వాగ్రజుడను గాదె తన్వి నన్నుధర్మ భ్రష్టుడ ననుచును తలచ నేలభోగముల్ గోరు వారెల్ల భూటులేనుకామ మదముల, రిపులుగాఁ గాంచ నగునె.
శ్రీకృష్ణుడు రాయబారఘట్టంలో దుర్యోధనునితోనీమంబెంచక వారి భాగమును దుర్నీతిన్ గ్రహింపంగ నాధీమంతుండగు ధర్మజుండు తనయుద్రేకంబుద్రోపాడుచున్గ్రామంబుల్ కడకైదు గోర పెను సంగ్రామంబువారింపగానేమాత్రంబును జాలిలేక మదిలో నీచుండవై వారలన్,కామక్రోధ మదాదులన్, రిపులుగా గాంచంగ న్యాయంబొకో
సాత్వికంబుగ చరియించు సజ్జనుండుతలచ వలె తాను సతతంబు ధరణి యందుకామ మదముల రిపులుగా :గాంచ నగునెవాటి నత్యంత ముఖ్యమై వసుధ యందు?
ఖలుడనుచు సమాజమునందు ఖ్యాతినొందకామ మదముల రిపులుగాఁ గాంచ నగునెవానికవియె భూషణములు పద్ధతిగనువిడిచిపెట్ట నతని వాసి వీగిపోవు
శా.సోమమ్మున్ బడయంగ నీశ్వరునిచే శూరుండు పౌలస్త్యుడున్బోమున్ జేసెను పుంజికస్థల నటన్ భూతాత్ము శాపమ్ముగామీమాంసించక సీతఁ గొల్లగొనగా మృత్యున్ బ్రసంగమ్ముగన్*కామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో.*
*(రావణుడు సీతతో పలికిన మాటలుగా)* కోమా! నేనిల ధర్మశాస్త్రముల సాంగోపాంగమున్ నేర్చితిన్ గామంబన్నది చూడ శాస్త్రమది సత్కార్యమ్మదే వీరు లీభూమిన్ భూషణమంచు నెంచెదరుగా భోగార్థులై పొందుగన్ కామక్రోధమదాదులన్ , రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో.
అంతరంగమ్ము నెలవుగా నాశ్రయించియారడినిబెట్ట మనజులం దణగియుండుకామ మదముల రిపులుగాఁ గాంచ నగు, నెవరికయిన నివియె వినాశకరము గాన
తేటగీతికోరి తినకూడనివి తిని కుక్షినింపిదుష్టసంగతి నొనగూడ నష్టములునుక్రోధ లోభ మాత్సర్య మోహాధిపతులుకామ మదముల రిపులుగాఁ గాంచ నగునె?శార్దూలవిక్రీడితమునీమంబెంచక మెక్కి కూడనివి యెంతేన్ దుష్టసంఘమ్మునన్బ్రాముఖ్యమ్మును గోలుపోవు కతనన్ బాయంగ సర్వార్థముల్సేమమ్ముల్ గడుదూరమై కడపటన్ జింతించి దుష్కర్మకున్గామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో?
హయ ఖరమ్ము లొక్క విధము లగునె యెన్నఁ గరము దుఃఖ దాయకములు గాక నిత్య మానదమ్ములు ధర్మ సమ్మతము లైనకామ మదముల రిపులుగాఁ గాంచ నగునె భీ మాకారము నూనఁ జిత్తముల నుద్వేగమ్ము ఘోరమ్ము కానీ మర్త్యాలినిఁ జేయు మూర్ఖులుగ లే రెవ్వారు నాపంగ నీవీ మాటల్ కడుఁ జక్కఁగా నుడివితే యీరీతి నిక్కంబుగాఁగామ క్రోధ మదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయం బొకో
కోమలీవినునామాటకూర్మి తోడప్రకృతి పురుషుల కలయిక వసుధ యందు మూల మీసృష్టికండ్రువిబుధులు గానకామ మదముల రిపులుగా గాంచ నగునె
గొప్పవాడుగ వెలుగొందు కోర్కె గలిగిసాధననుజేసి సాధించు శౌర్యముగలకార్యశూరుని కూతమౌ గాననట్టి" కామ మదముల రిపులుగా గాంచనగునె"
ధీమంతుండగుచున్ స్వశక్తి నెదుగన్ ధ్యేయమ్ము నూహించియున్శ్రీమంతంబునుపొందగోరి శ్రమచే జీవించు కర్మిష్ఠునిన్యేమాత్రమ్మును సంశయించ కతనిన్ యీరీతి నిందించి యా" కామక్రోధమదాదులన్ రిపులుగా గాంచంగన్యాయంబొకో "
ఆటవెలది
రిప్లయితొలగించండిఅరరె!మనిషిలోన స్థిరముగా నున్నట్టి
క్రోధ మరియు పరమ లోభ మోహ
మత్సరములు* కామ మదముల రిపులుగా
కాంచనగు, నె*రింగి త్రుంచ వలయు.
శార్దూలము
తొలగించండిధీమంతుల్ గురువుల్ జితేంద్రియులు ఖ్యాతింగాంచరే సజ్జనుల్
*కామక్రోధ మదాదులన్ రిపులుగా గాంచంగ;న్యాయంబొకో*
కామాంధత్వముతో చరించుటలహో!కారుణ్యముంజూపకే
నీమంబుల్ విడనాడి యక్కటకటా!నీచాత్ములై పోవుటల్.
మోక్ష మార్గమున్ బయనించి ముక్తి నొంద
రిప్లయితొలగించండికామి కానివాడిటమోక్ష కామి కాడు
బాధ్యతగలసంసారికి బాటలైన
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె
రిప్లయితొలగించండి*(రావణుడు సీతతో పలికిన మాటలుగా)*
దాన వాగ్రజుడను గాదె తన్వి నన్ను
ధర్మ భ్రష్టుడ ననుచును తలచ నేల
భోగముల్ గోరు వారెల్ల భూటులేను
కామ మదముల, రిపులుగాఁ గాంచ నగునె.
శ్రీకృష్ణుడు రాయబారఘట్టంలో దుర్యోధనునితో
రిప్లయితొలగించండినీమంబెంచక వారి భాగమును దుర్నీతిన్ గ్రహింపంగ నా
ధీమంతుండగు ధర్మజుండు తనయుద్రేకంబు
ద్రోపాడుచున్
గ్రామంబుల్ కడకైదు గోర పెను సంగ్రామంబు
వారింపగా
నేమాత్రంబును జాలిలేక మదిలో నీచుండవై వారలన్,
కామక్రోధ మదాదులన్, రిపులుగా గాంచంగ న్యాయంబొకో
సాత్వికంబుగ చరియించు సజ్జనుండు
రిప్లయితొలగించండితలచ వలె తాను సతతంబు ధరణి యందు
కామ మదముల రిపులుగా :గాంచ నగునె
వాటి నత్యంత ముఖ్యమై వసుధ యందు?
ఖలుడనుచు సమాజమునందు ఖ్యాతినొంద
రిప్లయితొలగించండికామ మదముల రిపులుగాఁ గాంచ నగునె
వానికవియె భూషణములు పద్ధతిగను
విడిచిపెట్ట నతని వాసి వీగిపోవు
శా.
రిప్లయితొలగించండిసోమమ్మున్ బడయంగ నీశ్వరునిచే శూరుండు పౌలస్త్యుడున్
బోమున్ జేసెను పుంజికస్థల నటన్ భూతాత్ము శాపమ్ముగా
మీమాంసించక సీతఁ గొల్లగొనగా మృత్యున్ బ్రసంగమ్ముగన్
*కామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో.*
రిప్లయితొలగించండి*(రావణుడు సీతతో పలికిన మాటలుగా)*
కోమా! నేనిల ధర్మశాస్త్రముల సాంగోపాంగమున్ నేర్చితిన్
గామంబన్నది చూడ శాస్త్రమది సత్కార్యమ్మదే వీరు లీ
భూమిన్ భూషణమంచు నెంచెదరుగా భోగార్థులై పొందుగన్
కామక్రోధమదాదులన్ , రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో.
అంతరంగమ్ము నెలవుగా నాశ్రయించి
రిప్లయితొలగించండియారడినిబెట్ట మనజులం దణగియుండు
కామ మదముల రిపులుగాఁ గాంచ నగు, నె
వరికయిన నివియె వినాశకరము గాన
తేటగీతి
రిప్లయితొలగించండికోరి తినకూడనివి తిని కుక్షినింపి
దుష్టసంగతి నొనగూడ నష్టములును
క్రోధ లోభ మాత్సర్య మోహాధిపతులు
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె?
శార్దూలవిక్రీడితము
నీమంబెంచక మెక్కి కూడనివి యెంతేన్ దుష్టసంఘమ్మునన్
బ్రాముఖ్యమ్మును గోలుపోవు కతనన్ బాయంగ సర్వార్థముల్
సేమమ్ముల్ గడుదూరమై కడపటన్ జింతించి దుష్కర్మకున్
గామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో?
హయ ఖరమ్ము లొక్క విధము లగునె యెన్నఁ
రిప్లయితొలగించండిగరము దుఃఖ దాయకములు గాక నిత్య
మానదమ్ములు ధర్మ సమ్మతము లైన
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె
భీ మాకారము నూనఁ జిత్తముల నుద్వేగమ్ము ఘోరమ్ము కా
నీ మర్త్యాలినిఁ జేయు మూర్ఖులుగ లే రెవ్వారు నాపంగ నీ
వీ మాటల్ కడుఁ జక్కఁగా నుడివితే యీరీతి నిక్కంబుగాఁ
గామ క్రోధ మదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయం బొకో
కోమలీవినునామాటకూర్మి తోడ
రిప్లయితొలగించండిప్రకృతి పురుషుల కలయిక వసుధ యందు
మూల మీసృష్టికండ్రువిబుధులు గాన
కామ మదముల రిపులుగా గాంచ నగునె
గొప్పవాడుగ వెలుగొందు కోర్కె గలిగి
రిప్లయితొలగించండిసాధననుజేసి సాధించు శౌర్యముగల
కార్యశూరుని కూతమౌ గాననట్టి
" కామ మదముల రిపులుగా గాంచనగునె"
ధీమంతుండగుచున్ స్వశక్తి నెదుగన్ ధ్యేయమ్ము నూహించియున్
రిప్లయితొలగించండిశ్రీమంతంబునుపొందగోరి శ్రమచే జీవించు కర్మిష్ఠునిన్
యేమాత్రమ్మును సంశయించ కతనిన్ యీరీతి నిందించి యా
" కామక్రోధమదాదులన్ రిపులుగా గాంచంగన్యాయంబొకో "