21, సెప్టెంబర్ 2022, బుధవారం

సమస్య - 4197

22-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్”
(లేదా...)
“తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్”

26 కామెంట్‌లు:

  1. కందం
    వినతుల తిరుమలకేగియు
    ప్రణతుల భక్తిప్రపత్తి భజనగ సంకీ
    ర్తనలాలపించి భగవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్

    రిప్లయితొలగించండి
  2. అనుదిన మచటనె భగవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్
    వినుతింజేయుదుఁ జరితను
    గనుచున్నట స్వామి నెపుఁడు గనులారంగన్

    రిప్లయితొలగించండి
  3. మనమున నిండిన ఖేదము
    దినదినమతిశయమునొంద దీనుడనైతిన్
    కనికరమునకై భగవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్

    రిప్లయితొలగించండి
  4. మత్తేభవిక్రీడితము
    వినతుల్ జేయఁగ నేడుకొండలకునే వేవేలదండాలతో
    బ్రణుతిన్ జేరియు శ్రీనివాసునట నారాధించెడున్ భక్తిమై
    కనువిందయ్యెడు రూపమున్ గొలుచుచున్ గన్నీరులేరై యనం
    తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్

    రిప్లయితొలగించండి
  5. మనసుకు నెమ్మది వలెనన
    చనవలె వడిగా ననయము స్వామిని గనగన్
    ధనమును కోరని భగవం
    తుని దర్శించెదనునాదు దుఃఖముదొలగన్

    రిప్లయితొలగించండి
  6. వినుమా సోదర! నాదుపల్కు శ్రవణోపేతంబుగా మాల్య వం
    తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్
    గనుమా దేవునిఁ జూడముచ్చటగు నాకారంబుఁదో వెల్గెడిన్
    వినతుల్జేయుము, శంకరున్నతుల నీవేమాకు దిక్కంచు సూ

    రిప్లయితొలగించండి

  7. అనుబంధములను కూపం
    బున చిక్కిన మానవుడను ముడుపులకై క్లే
    శనమందితి నిక భగవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్.

    రిప్లయితొలగించండి
  8. జనకజ శోకవిదూరుడు
    శనిదోషముల దొలగించు సంకటహారిన్
    ఘనుడౌ పావని హనుమం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలగన్

    కుచేలుని అంతరంగము

    ఘనుడా నందకుమారుడౌ హరిని ప్రజ్ఞానంపు నిక్షేపమున్
    మనమున్ సంతతభక్తితో సమ్మానింప సంతృప్తితో
    ధనమున్నీయక యుండునే చెలిమిఁ సంధానించి
    నిత్యుండనం
    తుని దర్శించెద జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము
    దూరమ్ముగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదమున సంతత భక్తితో గొలిచి సమ్మానింప గా చదువ ప్రార్ధన! 🙏🙏

      తొలగించండి
  9. ఘనముగ పూజలు సల్పుచు
    వినయముతో జప తపములు విడువక సతమున్
    మనమున వేడుచు భగవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొ లగన్

    రిప్లయితొలగించండి


  10. అనుబంధాలన పాపకూపమది నిత్యంబందు పోరాడగన్
    ధనమే సాధన మంచునెంచికద సంతాపంబునే పొంది, య
    య్యనుశోకమ్మును తీర్చువాడనుచు నాయవ్యక్తుడౌ నిత్యము
    క్తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్.

    రిప్లయితొలగించండి
  11. కందము
    ఘనబలవంతుని, దాంతుని,
    యనిలసుతున్,ధైర్యవంతు,నవనిజ జాడన్
    గనుగొని వచ్చిన హనుమం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభము
      కని శ్రీకూర్మము నర్సవిల్లి, వరభక్తశ్రేణితోనొప్పు ప
      త్తనమా యన్నవరంబుఁజేరుకొనిసందర్శించి నారాయణున్ "
      "తుని"యన్ పట్టణమేగి యన్నగరియందున్ దైవమౌ యేకదం
      తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ముగాన్.

      తొలగించండి
  12. జనులను పీడించితిగద
    ననవరతము , నీ దినముల నటమట పడితిన్
    కనికరమిడ నిక భగవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్

    రిప్లయితొలగించండి
  13. మ.

    తనువున్ భక్తిగ నర్పణంబనెను సీతారామ సేవల్ సదా
    ధనమౌ నల్బది పద్యమాల తులసీదాసార్య గీతమ్ములన్
    వనసంచారిగ రామదూత హనుమాన్ వాతాత్మజున్ బుద్ధిమం
    *“తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్”*

    రిప్లయితొలగించండి
  14. అనిశము భవబంధమ్ముల
    ధునిలో నెదురీదలేక దుఃఖించెడునా
    మనమూరటకై శ్రీకాం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్

    రిప్లయితొలగించండి
  15. అనయమ్మున్ పలు చిక్కులన్ బడుచు నాహ్లాదమ్ము గోల్పోయి జీ
    వనమీడేర్చుచు నుంటి నీ పుడమి, దావంతమ్ము పోనాడగా
    వినయమ్మొప్పగ నేగి కోవెలకు నే విశ్వంభరున్ శక్తి మం
    తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్

    రిప్లయితొలగించండి
  16. కందం
    తన పేదరికమును దలచు
    కొని యొకపరి మనములోన కోరిక మొలకె
    త్తెను, తన మిత్రుడు ధనవం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  17. మనమున రామునితలచుచు
    వననిధిదాటుచు సులువుగవసుధిజ జాడన్
    కనిపెట్టిన యాహనుమం
    తునిదర్ళించెదను నాదుదుఃఖముతొలగున్

    రిప్లయితొలగించండి
  18. అనిశంబీ భవబంధముల్ ప్రబలమై యారాట పెట్టంగ నే
    మనజాలన్ క్షణమైన శాంతముగ నేమర్త్యుండనో దైవమా
    గననీవే ననుఁగాచు దిక్కనెడు యాకాంక్షన్ దయామూర్త్యనం
    తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్

    రిప్లయితొలగించండి
  19. మనమున తలచిన చాలును
    వినుచును మొరలనుసతతము వేగమె తీర్చున్
    ధనువును దాల్చిన భగవం
    తునిదర్శించెదనునాదుదుఃఖము తొలగన్

    రిప్లయితొలగించండి
  20. వనరిన లాభం బెయ్యది
    మనమున నిజధర్మ సక్త మానసుని మహా
    త్ముని సత్యవ్రతు భూకాం
    తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్

    వనజాక్షుం బరమాత్ము నవ్యయుని శ్రీవత్సాంకు వైకుంఠ ధా
    మునిఁ బీతాంబరధారుఁ దామరస నాభున్ దీన మత్తేభుఁ గా
    చిన నారాయణుఁ గౌస్తుభాభరణు లక్ష్మీకాంతు భక్తవ్రజా
    ప్తుని దర్శింతును జిక్కు లన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్

    రిప్లయితొలగించండి
  21. వినుమా భూతలమందునన్ మిగుల
    సంప్రీతిన్ సదాభక్తితో
    జనులెల్లన్ గుడులంగనన్ దరుచుగా
    సంచారమున్ జేతురే
    కనగన్నాకు జనించె నాశ వడిగా
    గన్గొందు శ్రీ దేవి కాం
    తుని దర్శింతును జిక్కలన్నియు విడన్
    దు:ఖంబు దూరంబుగాన్

    రిప్లయితొలగించండి
  22. పనులను జేసిన ఫలితము
    కనుచూపుకు కానరాక కష్టమె మిగిలెన్
    వినునా మొరయని శ్రీమం
    తుని దర్శించెదను నాదు దు:ఖముదొలగన్

    రిప్లయితొలగించండి