5, మే 2023, శుక్రవారం

సమస్య - 4413

6-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె”
(లేదా...)
“కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

21 కామెంట్‌లు:

  1. నేలను కూడు పెట్టదని నేర్పమటంచును పాఠశాలలే
    బాలల చేర్చుకొంచు బలవంతము గా పర భాష నేర్పగా
    నేల తెనుంగు నిల్చునిల నెవ్వడు కైతల నాదరించు నీ
    కాలము కాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్.

    రిప్లయితొలగించండి
  2. పరుగులెత్తుచునుండెగాభారతంబు
    నెట్టినింటనురంగులునేర్పుజూపె
    మెదడుమేతకుమాయలుమెండునయ్యె
    కవివరులనయ్యొకాలమ్ముకాటువేసె

    రిప్లయితొలగించండి
  3. పాలకులైరిగాదెపరభాషనునేర్చినబుద్ధిమంతులున్
    చాలరుమాధురీమహిమసైచుటకీధరరాయలన్వలెన్
    గోలనుగాగజూచిరటగొప్పగకావ్యముజెప్పినన్తుదిన్
    కాలముకాటువేసినదికబ్బములల్లెడిసత్కవీశులన్

    రిప్లయితొలగించండి

  4. ఆంగ్ల భాషపై మోజేమొ యధక మగుచు
    నమ్మ భాషకాదరణయె యంతమవగ
    కైతలను కించ పరచెడు కాలమగుచు
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె.

    రిప్లయితొలగించండి
  5. శాస్త్ర సాంకేతికమ్ముల సౌరు పెరిగి
    యాధు నిక మైన పరి క రా లధి క మగుచు
    మాన వాళిని మార్చగా మహిని నేడు
    కవి వరుల నయ్యొ కాలమ్ము గాటు వేసె

    రిప్లయితొలగించండి
  6. కాలము మారిపోయినది కాసుల
    పంటకు నాంగ్ల భాషయే
    మేలని యెల్లరున్ మిగుల మెచ్చుచు
    శ్రద్ధ వహించుచుండ్రి యీ
    మేలిమి జ్ఞానసంపదలు మిక్కిలి
    కల్గిన భాష తెల్గుకున్
    కాలమ గాటు వేసినది కబ్బము
    లల్లెడు సత్కవీశులన్.

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    వాణి కృపతోడ వాగ్ఝరి పరిఢవిల్ల
    మధుర కవనాలఁ దేలుచు మైమరువఁగ
    చూచి యోర్వని వారల సొల్లనంగ
    "కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె!"

    ఉత్పలమాల
    చేలము గౌరవంబిడఁగఁ జిన్మయరూప కవీశ్వరాళియే
    మాలికలన్ గవిత్వమున మాధురులొల్కి పరస్పరమ్ముగన్
    దేలుచు పారవశ్యమునఁ దీరఁగ, నోర్వగలేని మాటలన్
    "కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్"

    రిప్లయితొలగించండి
  8. నాణ్యమౌకృతులనిడిన నన్నయకవి
    తియ్యదనపు సృజనలతో తిక్కనకవి
    పృథ్విన సరిసాటియెలేని పెద్దనకవి
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె

    నాలుక పైన వాణియనఁ నన్నయ సల్పెను కావ్య సృష్టినే
    బాలరసాలనిచ్చెగద బమ్మెర పోతన భక్తిభావమున్
    పోలిక లేనిరీతి రస పోషణ చేసెను పెద్దనార్యుడే
    కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్

    రిప్లయితొలగించండి
  9. కాలము గొనసాగగ యాంత్రి కము బెరుగగ
    దినదినము బాలకుల లోన దెలుగు పయిన
    మమత తగ్గగ భాషాభిమానులయిన
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె

    రిప్లయితొలగించండి
  10. కాలము చెల్లె కావ్యములు కానగరావిక కావ్య సంపదన్
    కూళలు కొల్లగొట్టి రతి ఘోరముగా పరభాష తిక్తమున్
    వేలమువెర్రిగా మరపి వీడిరి తీయని తెన్గు పద్దెముల్
    కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్

    రిప్లయితొలగించండి
  11. అన్యభాషల మోజులో నమ్మభాష
    మరుగునపడుచు నవమతిన్ మరుగుచుండె
    కావ్యములు మెచ్చు రాయలు కానరారు
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె

    రిప్లయితొలగించండి
  12. శంకరాభరణము లో ఇంత తక్కువైనదేమి వ్యాఖ్యా పూరణలు ! అయ్యొ!


    శంకరాభరణములోన చాన తక్కు
    వయ్యి రయొ కైత లల్లెడు పండితులు! జి
    లేబి యెచటనాటి విదురు లెచట! సుదతి!
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. కాలముచెల్లెనంచకటగౌరవమించుకయైనచూపకే
    గేలినిచేయుచున్సతముకిమ్మననీకనునేటివారలున్
    తాలిమి వీడి పల్కగను తాపము హెచ్చగ డెందమందునన్
    కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్”*


    *

    అమ్మ భాషను వీడుచు నన్యభాష
    లాదరించుచుపద్యములల్లుచున్న
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె.
    ననెడి భావన మది హెచ్చె నార్తితోడ


    రిప్లయితొలగించండి
  14. హేలగ కైతలన్ జదివి యింపును గూర్చుచు నుండ, ముగ్దులై
    పాలకులీయ దీమసము, పన్నుగ వ్రాసిరి కైత లెందరో
    కూళులపాలనమ్ము సమకూడక యాదర మిప్పుడీ యనా
    కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్

    రిప్లయితొలగించండి
  15. కాల‌ హరణవ్యసనములు కమ్మి‌నాయి
    కథలు పద్యచదువరులు‌ కానరాక‌
    పుస్తకంబులు‌ వెలవెల‌ బోయినాయి‌
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె”

    రిప్లయితొలగించండి
  16. తే॥ భువిని సంపదలఁ బడయ మోదమైనఁ
    జవియు నరయక కవితల జనులు చాల
    ని విలువ నొసఁగకఁ జనఁగ నిక్కమిదియె
    కవివరుల నయ్యొ కాలము గాటు వేసె

    ఉ॥కాలము మారెనయ్య నవ కాలపు రీతులఁ దెల్పమన్నచో
    చాలన నేఁడు సంపదలు సౌఖ్యము స్వార్థము ప్రాభవమ్ములన్
    మేలని కావ్యమే పగిది మెప్పును సన్నుతిఁ బొందనేర్చునో
    కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మాతృభాషపై ప్రేమయె మంట గలసి
    ఆంగ్లమందున మమకార మంకురించి
    మాయ గప్పిన వేళలో మాన్య తెలుగు
    కవివరులనయ్యొ కాలమ్ము కాటువేసె.

    రాలినవాంధ్రమందిపుడు రక్తినిగూర్చు విశాలభావముల్
    మాలిమిహెచ్చి యాంగ్లమున మాటలు వ్యాపనమయ్యె నెల్లెడన్
    మ్రోలగృహంపు పాచనమె మూరెను తీయగ, చెప్ప తెల్గుకున్
    కాలము గాటువేసినది కబ్బములల్లెడి సత్కవీశులన్.

    రిప్లయితొలగించండి
  18. కె.వి.యస్. లక్ష్మి:

    చదువనంగనె యాంగ్లమ్మె జనుల కిపుడు
    వినగ నెల్లెడ పలుకుల విష్ణుశర్మ
    లె గద, విశ్వనాధు లవని లేరు జూడ
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె.

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.

    ఆంగ్ల మాధ్యమమునె పల్వురనుసరించ
    మాతృభాషకు ప్రాధాన్య మంతరించి
    కాలగమనాన పద్యముల్ కవిత లనిన
    చులకనగ నందరును చూచుచుండ,తెలుగు
    కవివరుల నయ్యొ కాలము గాటు వేసె.

    రిప్లయితొలగించండి
  20. కాలముచెల్లెనంచకటగౌరవమించుకయైనచూప
    గేలినిచేయుచున్సతముకిమ్మననీకనునేటివారలున్
    తాలిమి వీడి పల్కగను తాపము హెచ్చగ డెందమందునన్
    కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్”*


    అమ్మ భాషను వీడుచు నన్యభాష
    లాదరించుచుపద్యములల్లుచున్న
    కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె.
    ననెడి భావన మది హెచ్చె నార్తితోడ

    రిప్లయితొలగించండి