17, మే 2023, బుధవారం

సమస్య - 4423

18-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలిన నేత్రములె కనెను గద సర్వమ్మున్”
(లేదా...)
“కాలిన కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

  1. చాలినవిజ్ఞతమంత్రియు
    కూలినజీవితమునుగనికోరెనుసుఖమే
    పాలకుడారాయలుకును
    కాలిననేత్రములెగనెనుగదసర్వమ్మున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    శీలవతిఁ గుజఁ గలిసెనని
    పౌలస్త్యుడు మంటఁ జుట్ట వాతాత్మజుడున్
    వాలము ద్రిప్పియు లంకయె
    కాలిన, నేత్రములె కనెను గద సర్వమ్మున్

    ఉత్పలమాల
    శీలవతిన్ గుజన్ గలిసి చింతను బాపఁగ రాము సేమమున్
    లీలగ దెల్ప, సందియము రేగిన వైరులు సుట్ట నగ్నినిన్
    వాలము త్రిప్పుచున్ హనుమ, వాటున గాల్చియు లంక కీలలన్
    గాలిన, కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్!

    రిప్లయితొలగించండి
  3. ఏలిక రాయల మంత్రి గ
    పాలన మొనరించి మించె ప్రాజ్నుo డగు నా
    మేలిమి తిమ్మరు సొక పరి
    కాలిన నేత్రములె కనెను గద సర్వ మ్మున్

    రిప్లయితొలగించండి
  4. (ధృతరాష్ట్రుడు విశ్వరూప దర్శనానంతరం)

    కేలుల మోడ్చి పలికె గో
    పాలుని కనులార గాంచి పరవశుడగుచున్
    చాలిక కృష్ణా యిక నా
    కాలిన నేత్రములె కనెను గద సర్వమ్మున్.


    చాలును జన్మధన్యమయె సత్కృతి నందితి గాదె నేడు గో
    పాలుని దివ్యదర్శనము పాపహరంబుగదా యటంచు తా
    గేలుల మోడ్చి మ్రొక్కుచును కృష్ణుని తోననె చీకురాజు నా
    కాలిన కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఆలి దృశ మందగించగ
    వీలుగ క్రుత్రిమ పరనిడ , విడివడి యయ్యో
    జ్వాలన పడె , యింత దనుక
    కాలిన నేత్రములె కనెను గద సర్వమ్మున్

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    శూలము పొట్టలో నగిని చొక్కము గోరెను ఖాండవమ్మునన్
    మూలము నూరు యజ్ఞములు మ్రొక్కెను కృష్ణుని నర్జునిన్ బడన్
    గీలిచిరాయుధంబులను గెల్చిరి, ప్రాపుగ శార్ఙ్గికుల్ తలిన్
    *గాలిన, కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్.*

    రిప్లయితొలగించండి
  8. పోలికలేనిమయసభను
    కాలినకన్నుల కనుగొని కౌరవవిభుడే
    హేలాంతరంగుడాయెను
    కాలిన నేత్రములె కనెను గద సర్వమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాలిన కళ్ళతో కనెను కౌరవ భూపతి వాస్తుశిల్పిచే
      వాలుగ నిర్మితంబయిన వాంఛితసౌధము విస్తుబోవుచున్
      గాలము దొర్లగా కడకుఁ గాంచెను ద్రౌపది చీరలొల్చుటన్
      గాలిన కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్

      తొలగించండి
  9. వాలము కొఱకంచయ్యెను
    గాలియుతన తోడునీడగా  నడయాడన్
    గోలగ లంకా నగరము
    కాలిన, నేత్రములె కనెను గద సర్వమ్మున్

    వాలముఁబట్టి రక్కసులు పాచనముం గదియించ చెచ్చెరన్
    హేలగ నంజనాసుతుఁడు హృత్కమలంబున రాము నిల్పియా
    వాలముతోడ లంక పురిఁ వాసములెల్ల దహింప మంటలన్
    కాలిన, కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్

    రిప్లయితొలగించండి
  10. ఉ॥ జ్వాలను చూపుఁబోవఁగ రసాయన శాస్త్ర ప్రయోగశాలలో
    వీలును గాంచి వైద్యుఁడును వేగిర శస్త్ర చికిత్సఁ జేయఁగన్
    మేలగు చూపు వచ్చెనట మేటిగ శోధన నిర్వహించఁగన్
    కాలిన కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్

    (సమాసములో రేఫమునకు గురు లఘున్యాయముంది గనుక శాస్త్ర ప్రయోగశాలలో గణదోష ముండదనుకుంటాను, నా పేరు రామబ్రహ్మ ను రెండు హగణాలుగా తీసుకోవచ్చని అన్నారండి)

    రిప్లయితొలగించండి
  11. గేలిని రావణ సేనలు‌
    వాలము‌ ముట్టించి‌నంత‌ పవనాత్ముజుడున్
    కీలలు జిమ్మగ‌ లంకయె‌
    కాలిన, నేత్రములె‌ కనెను గద‌ సర్వమున్‌.

    రిప్లయితొలగించండి
  12. ఆలముచేసినకరితా
    బేలగమొరలిడచుకావవేగమె రారా
    జాలము వలదని యహమది
    కాలిన;నేత్రములె కనెనుగదసర్వమ్మున్.

    రిప్లయితొలగించండి