24, మే 2023, బుధవారం

సమస్య - 4429

25-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా”
(లేదా...)
“శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా”
(ఛందోగోపనం)

19 కామెంట్‌లు:

  1. మర్దనజేయుమధర్మము
    సర్దగసంఘముతలకొనిశాంతినిబొందన్
    అర్థముబొందగనలజడి
    శార్దూలముపైననెక్కి ాగుమువిబుధా

    రిప్లయితొలగించండి
  2. కందం
    మర్దన జేసియు మహిషుని
    దుర్దశ లోకమునఁ బాపె దుర్గయె! పొగడన్
    నిర్దిష్ట ఛందమనగన్
    శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      వాలాయమ్ముగ లోకులన్ మహిషుఁడున్ బాధింప క్రూరుండుగన్
      జాలిన్జూపియు దుర్గయే దునిమినన్ సాక్షాత్ జగన్మాతవౌ
      లీలల్ స్తోత్రము సేయ ఛందమొదవన్ ప్రీతిన్ మహాభక్తి శా
      ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా

      తొలగించండి
  3. జాలంబేలను సాగు మెల్ల కవులున్ సంప్రీతి
    జెందన్ వడిన్
    వాలాయంబుగ వ్రాయుచున్ నిరతమున్
    ప్రజ్ఞానమేపారగా
    నేలీలన్ నడిపింతువో వృత్తమునునిన్నేజూ
    చుచున్నారు శా
    ర్దూలంబెక్కి భయంబు వీడి చనుమా
    రూఢింగవీంద్రోత్తమా

    రిప్లయితొలగించండి

  4. మార్దవమే యది కాదది
    యార్దితమని ఖరహరప్రియ యటంచు కవీ
    గార్దభ మేలా? పద్యము
    శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా.



    కాలంబయ్యది జారుచుండె రవి యాకాశమ్ము నే వీడెడిన్
    వైళమ్మిప్పుడు జేరవచ్చెగద నీ పాండిత్యమున్ జూపుచున్
    లీలామానస మూర్తియైన గిరధారిన్ గూర్చి వర్ణింప శా
    ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా.

    రిప్లయితొలగించండి
  5. నిర్దిష్టమైన భావము
    నిర్దారితమైన చోట నిండుగ తోచన్
    మార్దవ పదముల పూనిక
    శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్వాలాపూర్ణిమ నాటి వెన్నెల వలెన్ సౌఖ్యంబు చేకూర్చగా
      లీలావంతుడవై లిఖించితివిగా లెక్కింపగన్ శ్రేష్టమై
      కాలాతీతముగా వసించు విధమున్ గాంక్షించి పద్యాలు శా
      ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా

      తొలగించండి
  6. వర్ధిల్లగ నీ పాండితి
    నిర్దిష్టములౌ ఛందములను నేర్వగ వలెరా
    మార్దవమువీడి జవమున
    శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా

    రిప్లయితొలగించండి
  7. శా.

    మూలాధారము మంత్ర శాస్త్రము సుధీ ! మ్రొక్కంగ దివ్యంబుగన్
    శూలాద్యాయుధముల్ త్రిమూర్తుల వరాల్, శోకాల బోగొట్టెడిన్
    సాలగ్రామము లింగ శక్తి మహిమల్ సౌఖ్యంబు జేకూర్చు, *శా*
    *ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా!*

    రిప్లయితొలగించండి
  8. వర్ధన మౌ గద కీర్తియు
    మార్థవమగు పద ముల o దు మధుర పు టూహ ల్
    నిర్థిష్ట ము గాపద్య ము
    శార్దూ లము పైన నెక్కి సాగుము విభు దా!

    రిప్లయితొలగించండి
  9. ఆలమ్మందున తమ్మిమొగ్గరమునం దత్యంత ధీరోద్ధతిన్
    నేలంగూల్చెను శత్రుసంచయము దానిక్కంపు శౌర్యంబుతో
    బాలుండౌ అభిమన్యు శౌర్యగుణమున్ వర్ణింప పద్యమ్ము శా
    ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా

    రిప్లయితొలగించండి
  10. నిర్ధిష్టమైన పగిదిని
    దుర్దాంతంబౌ విజయుని దోర్బలమునునీ
    మార్దవ పదగుంఫనమున
    శార్దూలముపైన నెక్కిసాగుము విబుధా

    రిప్లయితొలగించండి
  11. వాలంబేమియులేనివానరముగావాగన్సభాకోవిదుల్
    ప్రేలన్మాటలధీరుగానిలువుమీపెంపేదగావెందునున్
    పోలంజాలినవాక్కుపుత్రుడవునీభోగంబుజూపంగశా
    ర్దూలంబెక్కిభ
    మ్మువీడిచనుమారూఢిన్కవీంద్రోత్తమా

    రిప్లయితొలగించండి
  12. కం॥ మార్దవము లేని నడవడి
    శార్దూలము లేని పద్య సంహితముఁ గనన్
    నిర్దయ జనులకు పొసఁగున
    శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా

    శా॥ లీలా మానుష సూత్ర ధారి ఘనమౌ లీలల్ వచించంగ శా
    ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
    మేలైనట్టి కవిత్వ రీతియు నిదే మేధావి వర్గంబుకౌ
    కాలమ్మేదియు నైన ఖ్యాతి వెలయున్ గావ్యమ్ము నుచ్చిష్టమై

    అనుకోకుండా గణదోషాలు వచ్చినందున రెండు మార్లు సవరించాల్సి వచ్చింది. మన్నించాలి

    రిప్లయితొలగించండి
  13. వర్ధితమగు భావంబును‌
    నిర్ధిష్టంబగు‌ భాషా‌ ప్రయోగ‌ నెప్పెరి గుణముల్‌
    నిర్ధారిత పద్య మదియె‌
    శార్దూలము పైన‌‌ నెక్కి‌ సాగుము‌ విబుధా‌.

    రిప్లయితొలగించండి
  14. అర్ధాంతరముగనాపక
    వ్యర్థపదంబులనువీడి పద్యములల్లన్
    స్పర్ధనుగెలుచుటతథ్యము
    శార్దూలము పైననెక్కి సాగుము విబుధా

    రిప్లయితొలగించండి