31, అక్టోబర్ 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 85

1-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
అంశం - కాశీ ప్రాశస్త్యం
ఛందం - ఉత్పలమాల
న్యస్తాక్షరాలు - 1వ పాదం 1వ అక్షరం 'వా'; 2వ పాదం 2వ అక్షరం 'ర'; 

3వ పాదం 10వ అక్షరం 'ణా'; 4వ పాదం 19వ అక్షరం 'సి'
(లేదా...)
'వా-ర-ణా-సి' అనే అక్షరాలు పాదాదిలో ఉండే విధంగా ఆటవెలది వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. వాంఛ లన్ని దీర్చు ప్రసిద్ధ క్షేత్రమై
    రహిని గాంచె మిగుల రమ్య పు సుగు
    ణా ల రాశి యగుచు చాల పవిత్రంపు
    సిద్ధ పురుషుల కది శివము గూర్చు

    రిప్లయితొలగించండి
  2. వారణసేయజాలమదిభావనయందునముక్తిమార్గమే
    కారణమౌనుగాశివుడుకాయగపారమునంటుకైనరుం
    డారయమోక్షమెంచియుగణాధిపుసన్నిథిహాసమందుచున్
    చేరియునన్నపూర్ణనటచిత్తముగొల్వగ వచ్చువాసియున్

    రిప్లయితొలగించండి
  3. ఉ.

    వారధి సంసృతిన్ దఱియు పట్టణ శైవము ముక్తిమార్గమున్
    పారగ గంగయే పతిత పావని యుత్తర దిక్కునన్ వడిన్
    నారక బాధ నివ్వని ప్రణాళిక సమ్మతి కాలభైరవున్
    ధారణి బుణ్యకర్మలకు దర్శనయోగ్యము వారణాసియే.

    రిప్లయితొలగించండి
  4. వాడ వాడ లందు వర్ధిల్లెడి గుడుల
    రహిని సంతరించు రచ్చ వార
    ణాసి , నాగ భూషణ పరమాత్ముని కృప
    సిద్ధికయి యచటకు చేరనగును

    రిప్లయితొలగించండి
  5. ఉత్పలమాల:
    (వా)రణమొందు పాపములు బాయక తూలము బుగ్గియౌ విధిన్
    కా(ర)ణకారణమ్ముఁ గన కాశిపురమ్మునకేగి భక్తితో
    నారక బాధబాపు శర(ణా)గతిఁ జొచ్చిన విశ్వనాథునిన్
    పారము జేర్చు భక్తులను పావన క్షేత్రము వారణా(సి)యే

    రిప్లయితొలగించండి
  6. వాసిగల పురమిట పావనమగు కుమా
    రసువు పరువులెత్తు రయమున శర
    ణార్థులకిది జూడ నపర కైలాసమై
    సింధునేమిలో ప్రసిద్ధ మయ్యె



    విరిజ యాలకించు శివ భక్తులు మెచ్చెడి పుణ్యతీర్థమై
    ధారణమందు నిల్చెను త్రిధారయె పారగ నందు మున్గగన్
    నారకమే హరించు శరణార్థులు వేడిన విశ్వనాథుడే
    పేరిమితోడ బ్రోచునని విజ్ఞులు చెప్పిన వారణాసిదే

    రిప్లయితొలగించండి
  7. వారుడుకదశివుడు‌ పరమార్ధమొసగును‌
    రక్షకుండు మనకు రవణము సుగు
    ణాల దాత‌ హరుడు‌ నారాయణసఖుడు‌
    సిరము‌ వంచి‌ వేడు శివుని‌ సతము




    రిప్లయితొలగించండి
  8. వానిశరణువేడ వాంఛలునెరవేరు
    రక్ష కల్గునెల్లరకును వార
    ణాసిలో వసించు నటరాజు కరుణతో
    సిద్ధి కలుగజేయు చిన్మయముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. [వా]రుడు విశ్వనాథునిగ ప్రాభవమొందిన వీటిపట్టుగా
      పా[ర]గ నొప్పు శైవలిని పావన గంగకు తీరభూమిగా
      నారమునందజేయగ ప్ర[ణా]ళిక గల్గిన విశ్వపీఠిగా
      సారము నిచ్చుపట్నమని సంశ్రవమొందెను వారణా[సి]యే

      తొలగించండి
  9. వారకవచ్చు భక్తజనవాహిని ఘాటుల నిండియుండగన్
    హారతిలిచ్చువేళ హరుడంభరధారుడు భక్తవత్సలున్
    నారము చేతులెత్తి కరుణాకర శంకరయంచు వేడుచున్
    గోరుశివైక్యమన్యమును కోరగనేలర వారణాసినన్

    వారక = సంతతము, ఎడతెగక
    నారము = జన సమూహము

    రిప్లయితొలగించండి
  10. వారణాసిలో గంగాహారతి దృశ్య వర్ణనము 👆

    రిప్లయితొలగించండి
  11. వాసిగా భువిని నివాసియై భక్తుల
    రక్షణ సలుపంగ రహిని వార
    ణాసి యందు విశ్వనాథునిగా వెల
    సిన హరునకు భక్తిఁ సేతు నతులు

    రిప్లయితొలగించండి
  12. ఉ.మా.
    వారధివౌచు భక్తులకు వార్నిధి దాటగ దారి జూపుచున్
    నీరము చిల్కరించగనె నెమ్మిని బ్రీతిగ స్నానమాడుచున్
    భారము స్వీకరించి కరుణామృతమున్ గురిపించి యీశుడా!
    తీరము జేర్చ గాచెదవు తేజము నిండగ వారణాసిలో!

    రిప్లయితొలగించండి
  13. ఆ॥ వరము లొసఁగు శివుఁడు వాసిగ వెలయఁగ
    రయముగ చని మ్రొక్క రయ్య వార
    ణాసి క్షేత్ర మహిమ నమ్మి భక్తినిలిపి
    సిరము వంచి యచట సిద్ధిఁ బడయ

    రిప్లయితొలగించండి
  14. వారణాసి యందు పరమేశ్వరుండుతా
    రక్షణయొనరించ ప్రజల, కంక
    ణాలుదాల్చినట్టినగజాతయనువెల
    సికొలుచుహరునెపుడుచిత్తమందు


    రిప్లయితొలగించండి
  15. ఉ॥ వారక మ్రొక్కరో శివుని భక్తిని నిల్పుచు వారణాసిలో
    పారముఁ జేర్చు నీశ్వరుఁడు భాసిలుచు ప్రభవించె నచ్చటన్
    నారక బాధలన్ని కరుణామయ మూర్తియె తీర్చుఁ గొల్చినన్
    ధారుణిలోన గొప్ప శివ ధార్మిక క్షేత్రము వారణాసియే!

    రిప్లయితొలగించండి
  16. *వా*రిజనేత్రియైనసతిపార్వతినిల్చెనునన్నపూర్ణగా
    మా*ర*హరుండుతావెలసెమానినిచెంతనువిశ్వనాథుడై
    నారకబాధబాపుకరు*ణా*మయుడీతడటంచు మ్రొక్కగన్
    వారకతానొసంగు సిరిభక్తులకెల్లయువారణా*సి*లో

    రిప్లయితొలగించండి
  17. వారణాసి మిగుల వాసికెక్కినయట్టి
    రమ్య దేవళముల ప్రాంతము, కరు
    ణాకరుండు భవుడు నాకధునియు విల
    సిల్లెడు ఘన పుణ్య క్షేత్ర మిదియు

    రిప్లయితొలగించండి
  18. ఉత్పలమాల
    వారుని సృష్టియై, వరుణ పారుచు తా నసి సంగమింప, నిం
    పారగ పారు గంగ ప్రజ పాపము వాపెడు మాత కాగ తా
    యారన నన్న పూర్ణ. కరుణామృత దృక్కులఁ గావ భక్తులన్
    మారుని వైరి శంకరుని మాన్య నివాసము వారణాసియౌ


    ఆటవెలది
    వామదేవ సృజన భక్తకోటి మయము
    రమ్యమైన గంగ ప్రజలను కరు
    ణాలవాల పాపమడగ జేయంగ వా
    సిఁ గనె కాశి భువిని సేమమొసఁగ

    రిప్లయితొలగించండి