20, ఏప్రిల్ 2024, శనివారం

దత్తపది - 207

21-4-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
అమ్మ - అయ్య - అక్క - అన్న
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో చంపకమాల కాని, తేటగీతి కాని వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. తలపడియమ్మహీసురునిదారుణశాపమునాలకించియున్
    తొలగకకర్ణుడాతఱినిద్రోహమునయ్యడచూడడేగదా
    నలువకుదక్కనెవ్వరికినైజముబోధపడంగజాలదే
    మెలకువనన్నమాటగనిమిన్నువిఱింగెగయుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'అయ్యడ' ? 'నలువకు దక్క' అన్నచోట అక్క లేదు.

      తొలగించండి
    2. తలపడియమ్మహీసురునిదారుణశాపమునాలకించియున్
      తొలగకకర్ణుడాతఱినిద్రోహమునాయెడకానడయ్యరో
      నలువకుదక్కనెవ్వరికినైజమునక్కడకానరాదహో
      మెలకువనన్నమాటగనిమిన్నువిఱింగెగయుద్ధభూమిలో

      తొలగించండి
  2. మామకీన హృదయము (నమ్మ)గువ దోచె
    (నయ్య)తివ పొందుఁ గోరుచు నరుగుదెంచ
    (నక్క)టా ఛద్మవేషివైనట్టి వలల!
    నన్నుఁ గికురించినాఁడ (వన్న)న్న యిటుల

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    అమ్మరుని పూశరమ్ముల నార్తి లేక
    యూర్వశిన్ వీడుదేమయ్య యొగ్గకుండ
    నక్కజమగు నరులు వాయ నప్సరసను!
    మగతనమ్మన్నఁ గవ్వడి మగువ విడుటె?

    చంపకమాల
    సొగసుల నూర్వశీ లలన చూపుల నమ్మరు డావహింపడే?
    బిగువులఁ జిక్కుమయ్య కురువీర! పసందగు రాసకేళిలో!
    నగణిత సుందరీమణుల నందగఁజూడవె? యక్కజమ్మనన్!
    మగతనమన్ననీ వగల మాలతి శయ్యను జేర్చకుండుటే?

    రిప్లయితొలగించండి
  4. ఎరుగని వారలక్కరని యిక్కటు పాలయె నన్నఁ గర్ణుడా
    భరణములన్ మనోహరపు వస్తువులయ్యవి యేవియైన నా
    దరణగ దానమిచ్చుఁ గొను దాన గ్రహీతలు నమ్మకంబుచే
    నరమర లేకనమ్మక తమాస్తుల నేగిరి కర్ణు పాలికిన్

    రిప్లయితొలగించండి
  5. తే.గీ.
    ఎవతె యన్నవలామణి యెదురుగ నట
    నయ్యవనిక మాటున దాగె నక్కజమ్మె
    యమ్మగువయె సైరంధ్రియా? యద్భుతమని
    కీచకుడు దలచె మదిని కృష్ణను గని.

    (ఆ+నవలామణి= అన్నవలామణి...యన్నవలా...
    ఆ+ యవనిక= అయ్యవనిక ,,,,యయ్యవనిక
    దాగెను+ అక్కజమ్మె దాగెనక్కజమ్మె
    ఆ+ మగువ= అమ్మగువ....యమ్మగువ)


    చం.
    వినుమిది నాదు మాటలను వీరులె యమ్మహ నీయు లేవురున్
    పెనుకువ యేల, యన్నరుడు భీకరరూపము దాల్చునాడు నీ
    యనుసరు డంగరాజచట యక్కర రాడిది వాస్తవమ్ము నీ
    యనుజులు నయ్యభిగ్రహము నంతము చెందుట తథ్యమందునే.

    రిప్లయితొలగించండి
  6. బకాసుర కథ

    "అమ్మ"రుసటి పూట పురమునందు యింటి
    కొకరుగా "నయ్య"సురు కడకొక శకటము
    నిండుగా "నన్న"మును పంపు నియమముండ,
    "నక్క"రను దీర్చుటకు భీముడచటకేగె

    రిప్లయితొలగించండి
  7. (అమ్మ)నోహరరూపుడు యాదవుండు
    మొగపడెఁ గిరీటి (నయ్య)యో మొట్టమొదట!
    (అక్క)జముగ నరుడు కోరె నహిరిపువును!
    (అన్న)గధరుని సేననా కమరుగాదె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణుని సహాయ మర్థించు సుయోధనుని స్వగతము.....

      అమరనృపాల పుత్రునికి (నమ్మ)హితాత్ముని వీక్షణంబుతో
      సమకుఱె తొల్తకోరుకొను సత్తువ కృష్ణునిచెంత (నయ్య)యో
      సమరము చేయగా వలయు సైన్యము చొక్కిల (డక్క)జంబుగా
      నమరును సైన్యమే తనకు (నన్న)రుడే వరియించకుండినన్

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. సుయోధననుకు కర్ణుని వలన తుదకు కలిగిన సాయము

      తే॥ అక్కరకు రాని పలుకుల ననవరతము
      నమ్మనుజుఁడు కర్ణుఁడటుల నాశ నింప
      నయ్యయో సుయోధనునకు నధిక హాని
      జరిగె నన్నన్న మిన్నగ నరయఁ గాను

      పాండవుల వనవాసములోని కొన్ని సంఘటనలు

      చం॥ కుదురుగ నన్నపానములఁ గూర్చఁగ నక్షయ పాత్ర భానుఁడే
      యొదవిసె పొంది యమ్మనుజు లొందఁగ సౌఖ్యముఁ గాన లందునన్
      గదనమునందు నక్కరను గాంచెడి యస్త్రముఁ గూర్చె పార్థుఁడే
      ముదముగ నయ్యవారుగను బోధను జేసెను ధౌమ్యుఁడచ్చటన్

      తొలగించండి
  9. అమ్మను జ వరే ణ్యు కొలువు నాశ్ర యించి
    వేష ములు దాల్చి యక్క డ విధుల యందు
    నయ్యవసరము నను వారల ర్హ మైన
    వృత్తులను జేర నన్న రు పేడి య య్యె

    రిప్లయితొలగించండి
  10. అమ్మహానుభావుని వేడ నార్తితోడ
    నమరె వసనముల్ ద్రౌపది కక్కజముగ
    నయ్యతివ మానమును గాచి యాదుకొనిన
    యన్నగధరుఁడు శౌరియే యండ నాకు

    రిప్లయితొలగించండి
  11. దయఁగొని యాదుకొమ్మనుచు ద్రౌపది యమ్మహితాత్ముఁ వేడగా
    రయమున శౌరిగూర్చె తగు రక్షణ యక్కజమొంద నెల్లరున్
    భయమును బాపి యయ్యబల ప్రాణము మానము గాచినట్టియ
    వ్యయుడు ననంతుడౌహరిని యన్నగధారిని భక్తిఁ గొల్చెదన్

    రిప్లయితొలగించండి
  12. కానడమ్మనుపసిబిడ్డకర్ణుడంత
    కూడడయ్యనువునగూర్చుతండ్రి
    అక్కటావిధియింతగానాటలాడె
    చూడుమాయన్నసృష్టిలోసోద్యమిదియ

    రిప్లయితొలగించండి
  13. అడరి సుయోధనుండొసఁగ నాజ్ఞను దమ్ములఁ గూడి యేఁగి యా
    యడవినిఁ గూడి యమ్మగువ నయ్యమ నందనుఁ డోడి పందెముం
    గడపి నరాధిపుం గొలిచి కట్టకడం గదనమ్ము లోన వా
    రడిచిరి యాజి నక్కపటి నన్నగ ధారి దయా రసమ్మునన్

    రిప్లయితొలగించండి


  14. తే.గీ.

    అక్కట! పరీక్ష ! దుర్వాసుడరిగె నదికి
    నన్నపు మెతుకుల్ కానక వెన్నునడిగె
    నయ్యరే! కృష్ణమాయచే నాకలి విడె
    నమ్మగువ ద్రౌపది తనియ, వమ్ము కుట్ర.

    ...

    రిప్లయితొలగించండి