8, ఏప్రిల్ 2024, సోమవారం

సమస్య - 4730

9-4-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అమ్మనుఁ బెండ్లాడి మోద మందెఁ దనయుఁడే”

(లేదా...)

“అమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్”

19 కామెంట్‌లు:

  1. సమ్మతిబ్రహ్మచారియటసాధనతోడుతపారమంటగన్
    కొమ్మనుశక్తిరూపమునుకోరివరించెనుమానసంబునన్
    నమ్ముచుమంత్రరాజముననాహతసంధ్యజపించుచోవడిన్
    అమ్మనుపెండ్లియాడిముదమందెనుపుత్రుడుతండ్రిమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  2. నమ్మికశివుడంబికయను
    నమ్మనుఁబెండ్లాడిమోదమందె, తనయుడు
    నెమ్మదిబుద్ధినిసిద్ధిని
    సమ్మతిగొనిపెండ్లియాడెశాంతముతోడన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    తమ్ములు వరులై రాముం
    డిమ్ముగ నుండఁ దలిదండ్రులెల్లరు మురియన్
    సమ్మతినిడ గురువులు సీ
    తమ్మను బెండ్లాడి మోద మందెఁ దనయుఁడే!

    ఉత్పలమాల
    తమ్ములు వేదిపై మెరయ తారకరాముని గూడి పెండ్లికై
    యిమ్ముగ గాంచుచున్ వధువు లెల్లరిఁ దల్లులు దండ్రి ప్రీతిమై
    కమ్మని దీవనల్ గురియఁ గార్ముకమెత్తిన వీరుఁడౌచు సీ
    తమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  4. కొమ్మ కడందగత్తెయగు గోమలి
    గాంచియు బ్రేమలోబడెన్
    అమ్మకు చెప్పెగా వినియు
    క్రోధముచేసి తిరస్కరించగా
    సమ్మతి దెల్పె జేసుకొన
    సజ్జనుడైతన తండ్రితెల్పు రం
    గమ్మను పెండ్లియాడి ముద
    మందెను పుత్రుడు, తండ్రమెచ్చగన్

    రిప్లయితొలగించండి

  5. చెమ్మగిలు కండ్లతోడను
    సమ్మతి తెలుపుమని కోరి సద్వినయముతో
    ముమ్మారులు బ్రతిమాలుచు
    నమ్మనుఁ , బెండ్లాడి మోద మందెఁ దనయుడే.


    నమ్ముము నాదు మాటలను నారి కులాంతర మైననేమి యా
    కొమ్ముయె సద్గుణాంబుధియె కూరిమి జూపుచు గౌరవించు నిన్
    సమ్మతి తెల్పు క్రోధమిక చాలని యూకొను నట్లు జేసి తా
    నమ్మను , పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  6. సమ్మతిని శంత నుడు గం
    గమ్మను బెండ్లి యాడి మోద మందె :: తన యు డే
    యమ్మను మను వాడక సే
    మమ్ముగ భీ ష్ము డు గ దాను మాన్యు o డ య్యె న్

    రిప్లయితొలగించండి
  7. పొమ్మనకు వారి నిప్పుడు
    నెమ్మదిగ జరిగిన దాని నేను దెలిపెదన్
    నమ్ముమిక నీ మనుమని
    యమ్మనుఁ బెండ్లాడి మోద మందెఁ దనయుఁడే

    రిప్లయితొలగించండి
  8. ఇమ్ముగ తండ్రిని తనయుని
    రమ్మని యాతిధ్యమొసగె రమణీయముగా
    పిమ్మట సంప్రీతిని నా
    యమ్మనుఁ బెండ్లాడి మోద మందెఁ దనయుండే

    చిమ్మిన దీపకాంతివలె చిన్నది తోచెను వారి దృష్టికిన్
    రమ్మని చేరబిల్చి కడు రమ్యత తోడ మృగీవిలోకనే
    కమ్మని భోజనమ్మునిడి క్రన్నన వారి బుబుక్షు తీర్చ నా
    యమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  9. బొమ్మలపెండ్లి సేయ తలపోసిరి బాలలు పర్వమందు సీ
    తమ్మకు రామచంద్రునకు నాటగ బొమ్మలఁ గూర్చి పందిరిన్
    సమ్మతినొంది తండ్రికడ సత్వరమెల్లరు సంతసించ సీ
    తమ్మను పెండ్లియాడి ముదమందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  10. బొమ్మల పెండిలి యందున
    సమ్మతినిడ పంక్తిరథుడు సంతోషముగా
    నెమ్మనమున నర్మిలిఁ సీ
    తమ్మనుఁ బెండ్లాడి మోదమందెఁ దనయుఁడే

    రిప్లయితొలగించండి
  11. అమ్మఁ దలంచు రాముడు పరాంగనలన్ గురువాజ్ఞయన్న తాఁ
    గిమ్మనకుండి దాల్చు తలఁ గీరమెఱుంగని రాజుపట్టి వి
    ల్లంమ్ములు లేక త్రుంచె హరునస్త్రము నానక నేలపట్టి సీ
    తమ్మను పెండ్లి యాడి ముదమందెను పుత్రుడు తండ్రి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  12. కం॥ ఇమ్ముగ ప్రేమించ సుతుఁడు
    సమ్మతి మాతాపితలు నొసంగఁగ రహిన్
    గమ్మగఁ బెద్దలుఁ గన రా
    ధమ్మనుఁ బెండ్లాడి మోదమందెఁ దనయుఁడే

    ఉ॥ ఇమ్ముగ ప్రేమ పుట్టెనని యేర్పడ చెప్పఁగఁ దల్లిదండ్రులున్
    సమ్మతి గాంచిరంట తమ సంతస భావముఁ జూపి గొప్పగాఁ
    గమ్మగ నింతి యొప్పఁగను గారవ మొంది జనాళి చూడ రా
    ధమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  13. కం:అమ్మయె వద్దనగా మరి
    యమ్మను బెండ్లాడి మోద మందె దనయు , డే
    యమ్మకు నీ మతసంకర
    మిమ్ముగ గనిపించు గాని యె ట్లెదిరించున్?
    (మరియమ్మ అనే క్రైస్తవ అమ్మాయిని చేసుకున్నాడు.ఏ తల్లికి మాత్రం నచ్చుతుంది?కానీ ఏం చేస్తుంది?)

    రిప్లయితొలగించండి
  14. ఉ:"ఇ మ్మహిలోన నర్చకులకే తమ బిడ్డల నీయ" మంచు నై
    చ్యమ్ము వహించ విప్రతతి యాలయ మందె వితంతు భామ క
    ష్టమ్మును బాప,నామె సుతు జక్కగ ముద్దిడి, బిడ్డ యున్న యా
    అమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్”
    (పూజారులకి పిల్లల నివ్వటానికి ముందుకి రాకుంటే ఒక పూజారి ఒక బిడ్డ తల్లి ఐన వితంతువుని వివాహ మాడాడు. )

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. నెమ్మనమునఁ దాఁ గోరిన
      యమ్మాయినె తండ్రి నింక నతి కష్టమునన్
      నెమ్మిని నొప్పించి తివిరి
      యమ్మనుఁ బెండ్లాడి మోద మందెఁ దనయుఁడే


      అమ్మ కనిష్ట మన్నది నిజాత్మ నెఱుంగక సుంత యేని స
      త్యమ్ము వచింపఁ బ్రేమ వితతమ్ము జనింప నెడంద నత్త సూ
      రమ్మకు ముద్దు బిడ్డ నకలంక చరిత్రఁ గరమ్ము గోరి వెం
      కమ్మను బెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్

      తొలగించండి