12, ఏప్రిల్ 2024, శుక్రవారం

సమస్య - 4734

13-4-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్”
(లేదా...)
“సూర్యుని లోని మచ్చలను చూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

24 కామెంట్‌లు:

  1. కందం
    జవరాలు గురుసతిన్ గొని
    యవమానము మచ్చగాగ నలిగిన వాడై
    నవలామణిఁ బృథఁ గలిసిన
    రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్!

    ఉత్పలమాల
    ఆర్య బృహస్పతిన్ గనక యా గురుపత్నినిఁ గూడనొప్ప నాం
    తర్యము మచ్చయై మిగులు నంతరమందున మచ్చగాగ నా
    శ్చర్యము గొల్పుచున్ బృథకు సంతునొసంగగ మంత్రముగ్ధుఁడై
    సూర్యుని లోని మచ్చలను చూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్!

    రిప్లయితొలగించండి
  2. భువిలోప్రాణమునిచ్చెడి
    సవితాబింబము నలుగడ శాంతమువీడెన్

    పవనాంథముతామ్రింగగ
    రవిలోమచ్చలనుగాంచిరాజుహసించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సవితృబింబము' అనడం సాధు వనుకుంటాను. "సవితృని బింబము..." అనండి.

      తొలగించండి
  3. కం:
    అవనీ ప్రదక్షిణములో
    నవనీ చాలిత గ్రహముల నల్లని ఛాయా
    దవనతములు సూక్ష్మములౌ
    “రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్”

    రిప్లయితొలగించండి
  4. సవిత శశుల బొమ్మల నట
    సవరించెడు సమయమందు సత్వరమచటన్
    యవశే షములంటగ నా
    రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్

    రిప్లయితొలగించండి

  5. అవనీపతి జేరుచు నొక
    కవి చంద్రుని యందముపయి కైతను చెప్పన్
    దివిలో వెలిగెడి యా కై
    రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్.


    శౌర్యము జూపు భాస్కరుడు శబ్దగుణమ్మును చేరు నత్తరిన్
    ధైర్యము లేక పారెడు సుధాకరు డెప్పుడు గాంచెనోయి యా
    సూర్యుని నీదుమాటలవి చోద్యమె కాదుటె చెప్పు మెప్పుడా
    సూర్యుని లోని మచ్చలను చూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్.

    రిప్లయితొలగించండి
  6. చవిగొనె నన్యుని భార్యను
    జవరాలి నెపమున తాను శాపము గొనియెన్
    ధవళ కరుడు దుశ్చరితుడు
    రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్

    భార్యలు పెక్కురైన తన ప్రక్కన నుంచెను రోహిణిన్ సదా
    ధైర్యముపూని వారు తమ తండ్రికి చెప్పిరి శాపమీయగా
    పర్యవసానమౌ చరిత వారిజవృత్రుని మచ్చలేగదా
    సూర్యుని లోని మచ్చలను చూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్

    రిప్లయితొలగించండి
  7. కం॥ భువిలో నితరుల తప్పులఁ
    జవిగ గణింతురు మనుజులు సతతము విధిగా
    వివిరించి తెలుప నిటులను
    రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్

    ఉ॥ భార్యయె భర్త తప్పులను వాసిగఁ గాంచుచు నెంచినట్లుగన్
    శౌర్యము లేని దుర్బలుఁడు సాహసి తప్పుల నెంచినట్లుగన్
    ధైర్యము లేని భీరువటు దక్షుని తప్పుల నెంచినట్లుగన్
    సూర్యుని లోని మచ్చలను చూచిన చంద్రుఁడు నవ్వె గొల్లునన్

    రిప్లయితొలగించండి
  8. కవియై యవ ధా నమ్మున
    నవత గ నీయగ దలంచి నవ్యపు రీతిగా
    జవమున దా నొస గె నిటుల
    "రవిలో మచ్చ లను గాంచి రాజు హసించె న్

    రిప్లయితొలగించండి
  9. కం:కవి "వీరభద్రు తాపుకు
    రవి కూడెను పన్నటంచు రసికత బలుకన్"
    కవులు నిరంకుశు లనుకొని
    రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్”
    (ఆ రవి వీరభద్రు చరణాహతి ద్రుల్లిన బోసి నోటికిన్ అనే పూరణను విని ,రవికి మచ్చ పెట్టిన పూరణను విని శ్రీకృష్ణదేవరాయలు నవ్వాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:సూర్యుని గుర్తు పెట్టుకొని, చూడుము మామయు,నీవు నోడరే
    ధైర్యము నాకు నున్నదని ,దైన్యత బొందుచు నోడ నట్టిదౌ
    కార్యము బాబు రోసె ,నిక కష్టము భాస్కర రావు కంచు నా
    సూర్యుని లోని మచ్చలను చూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్”
    (నాదెండ్ల భాస్కర రావు సూర్యుడి గుర్తు తో పోటీ చేశాడు.ఆయన పేరు సూర్యుడి పేరే.ఆయన ఓటమికి,పొందిన మచ్చకి చంద్రబాబు నవ్వాడు. )

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. భువి నేఁ బాలింపంగన్
      రవి తుల్యుఁడ నెట్టు లితఁడు రాజగు నంచున్
      దివి లోనఁ దిరిగెడు నిశా
      రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్


      ధైర్యము డుల్ల నాలమున ధన్వి స లక్ష్మణుఁ డట్లు గూల దు
      ర్వార్య ఫణీంద్ర పాశమున వాఁతలు రేఁగ శరీ రమం దహో
      కార్య చయైక దక్షు సిరికాంతుని యిద్ధ రమా సరోజ హృ
      త్సూర్యుని లోని మచ్చలను జూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్

      తొలగించండి
  12. అవనీ తలమ్మునతెలుగు
    కవులాసూర్యుడు కననివి కనుచున్వడిగా
    కవనములందునచూపగ
    రవిలోమచ్చలనుగాంచిరాజుహసించెన్

    రిప్లయితొలగించండి